For Sale - అమ్మకానికి
Date : 03-09-2015
ప్రభుత్వరంగ ఇంధన సంస్థ లైన ONGC ఆయిల్ ఇండియా లకు చెందిన 69 చిన్న, మధ్య స్థాయి చమురు బావులను ప్రైవేటు సంస్థలకు కట్ట బెట్టేందుకు పావులు కదుపు తున్నట్లు వార్తలు వస్తున్నాయి . 89 మిలియన్ టన్నుల చమురు గ్యాస్ నిల్వలు కలిగిన 69 బావులను అమ్మడం ద్వారా 70 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రాథమిక అంచనా . ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు .
1999 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 254 చిన్న , మధ్య తరహా బ్లాక్ లను విక్రయించింది .
69 బావులను అమ్మడం ద్వారా 70 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు కదా ,1999 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 254 చిన్న , మధ్య తరహా బ్లాక్ లను విక్రయించింది కదా మరి వాటికి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి ఒక సారి మనం ఊహించు కోవాలి .
ఇదే పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఇంకా చాల ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మాలని లేదా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది . వాటి వలన లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడతాయి .
ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే , ఆ సొమ్ము తోనే మనం మన పరిశ్రమలను , I T రంగాన్ని స్థాపించి అభివృద్ధి చేసి నిరుద్యోగాన్ని నిర్మూలించ వచ్చు కదా !
మరి విదేశాలకు వెళ్లి అక్కడి పారిశ్రామిక వాళ్ళను బ్రతిమిలాడి మన దేశం లో పెట్టుబడి పెట్టమని , మేక్ ఇన్ ఇండియా ( make in India ) చెయ్యమని అని అడగడం ఎందుకు ?
ఇదే కాకుండా ఆదాయపు పన్ను ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో రూ . 7. 98 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూలు చేయాలని లక్షం గా పెట్టుకున్నది .
సర్వీస్ టాక్స్ ( Service Tax ) ద్వారా లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి . సేల్స్ టాక్స్ ( Sales Tax ) ,VAT ద్వారా అది స్టేట్ గాని సెంట్రల్ గాని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అది కాక రక రకాల టాక్స్ లు ,రిజిస్ట్రేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ! ఇన్ని కోట్ల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో కి నెట్టి వాటి వాటాలను అమ్మడం దేనికీ ? వాటిని పూర్తిగా అమ్మడం దేనికి సంకేతం ?
Home » National
- పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికే! : సిఐటియు హెచ్చరిక
ఇండియా న్యూస్ నెట్‌వర్క్, న్యూఢిల్లీ : కొత్తగా కనుగొన్న 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ క్షేత్రాలన్నీ మార్జినల్ ఫీల్డ్ (ఆర్ధికంగా అంత క్రియాశీలమైనవి కాదు)లని పేర్కొంది. ఈ క్షేత్రాలను వేలం వేయడమంటే జాతీయ ఆస్తులను ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలకు - దేశీయ, విదేశీయ సంస్థలకు - అప్పగించడం తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఈ క్షేత్రాల్లో అన్వేషణ జరపడానికే ప్రభుత్వ రంగ చమురుసంస్థలు వందల కోట్ల రూపాయిలు ఖర్చుపెడుతున్నాయని, కానీ వాటిపై లాభాలు మాత్రం రావడం లేదని విమర్శించింది. కాంట్రాక్టులో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏమిటంటే ఈ క్షేత్రాలను రెవిన్యూ పంచుకోవడం ప్రాతిపదికన 20ఏళ్ళపాటు యథేచ్ఛగా వాడుకోవడానికి లైసెన్స్ ఇవ్వడమని, అలాగే బహిరంగ మార్కెట్ ధరల విధానం, బహిరంగ మార్కెటింగ్ హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వడమేనని పేర్కొంది. పైగా కొత్త మోడల్ కింద ముడిచమురుపై సెస్‌ను ప్రభుత్వానికి చెల్లించనక్కరలేకుండా కాంట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వజూపుతున్నారని, దీనివల్ల కోట్లాది రూపాయిలు కాంట్రాక్టర్లకు బదిలీ అయిపోతాయని సిఐటియు కార్యదర్శివర్గం పేర్కొంది. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. చమురు, గ్యాస్ రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచేటపుడు ముందుగా 'ఉత్పత్తి భాగస్వామ్యం' అని పేర్కొన్నారని, తర్వాత 'లాభాలు పంచుకోవడానికి' అనే పద్ధతికి మారారని, ఇప్పుడు 'ఆదాయం పంచుకోవడమనే' పద్ధతికి వచ్చారని పేర్కొంది. పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించడానికి గానూ ప్రైవేటు ఆపరేటర్లు ఈ కొత్త మోడల్‌ను విపరీతంగా దోపిడీ చేయడానికి అవకాశాలు వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. అంతకన్నా విస్మయానికి గురి చేసే అంశం ఏమిటంటే ప్రైవేటు రంగానికి అనుకూలంగా వున్న ఈ కొత్త మోడల్ కేవలం చిన్న క్షేత్రాలకే పరిమితం కాలేదని, పెద్ద పెద్ద క్షేత్రాలకు కూడా విస్తరించనున్నారని సిఐటియు పేర్కొంది. ఈ కొత్త చర్య వల్ల ప్రభుత్వ రంగ ముడి చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం వుంటుందని, పర్యవసానంగా నిత్యావసరాల ధరలన్నీ కూడా ప్రభావితమవుతాయని పేర్కొంది. ప్రచారం, కార్యాచరణతో ఈ రంగానికి చెందిన కార్మికులను, ప్రజలను సమీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా సిఐటియు తన అనుబంధ సంఘాలన్నింటికీ పిలుపునిచ్చింది.
చమురు, గ్యాస్ క్షేత్రాల వేలం వద్దు
Posted On
1 day 21 hours 44 mins ago

ఇంత డబ్బు వచ్చినా , మనకు స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయినా మన దేశం వెనుకబడిన వారు చాలా మంది ఉన్నారు .
మన జనాభాలో సగం కంటే ఎక్కువ మంది నిరు పేదలు గానే బ్రతుకు తున్నారు . శ్రీ కృష్ణుడి కాలం లో ఆయన మిత్రుడు కుచేలుడు కూడా దుర్భర దారిద్ర్యం తో బ్రతికాడని సరిపెట్టు కుందామా ?
నిత్యావసర సరకుల ధరలు విపరీతం గా పెరుగు తున్నాయి . పండించిన రైతులకు లాభం లేదు ,కొనేవాడికి లాభం లేదు మరి ఎందుకింత ధరలు విపరీతం గా పెరుగు తున్నాయి?
రైతు సంతోషముగా లేడు , పంటలు పండించడానికి రైతు రాత్రింబవళ్ళు కష్ట పడాలి . వర్షం సకాలం లో కురవాలి , విత్తనాలు , ఎరువులు , కూలి రేట్లు పెరిగాయి . చివరకు అతివృష్టి , అనావృష్టి కి తట్టుకోవాలి . మార్కెట్ కు వెళితే గిట్టుబాటు ధర రాదు . కాని కొనుగోలు దారునికి చుక్కలు కనిపిస్తాయి .
చేతి వృత్తుల వారికి పని లేకుండా పోయి జీవితం దుర్భరం గా మారింది . చేనేత కార్మికుల జీవితం మరీ అధ్వాన్హం, కుటుంబం లోని వారందరూ రాత్రిం బవాళ్ళు కష్ట పడితే గాని వారికి 200 - 300 రావు .
చాల మందికి ఉండడానికి ఇళ్లు ఉండవు , తిండి ఉండదు , కొలవులు దొరకవు , సరైన మందులు దొరకవు . ఏదో విధముగా బ్రతుకుతున్నారు .
ధనవంతులు వారి కుక్కకు పెట్టే తిండి ఖర్చు కూడా చేతి వృత్తుల వారు సంపాదించు కోలేక పోవుచున్నారు .
ధనవంతులకు అన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రోత్సాహం సులభంగా లభిస్తుంది . అందరికి సమాన హక్కులు ఉన్నాయి , సమాన అవకాశాలు ఉన్నాయి . కాని పేదవారు అలాగే ఉన్నారు . ఎంతో ముందుకు పోయిన వారిని వీరు అందుకోవడం అసంభవం .
కావున ప్రభుత్వం చిత్త శుద్ధితో ఆలోచించాలి , వారికి కల్పించే సౌకర్యాలు ఇంకా చాల పెంచాలి ఇప్పుడు ఉన్నవి వారికి సరి పోవడం లేదు లేదా వారికి అందడం లేదు . వారు తమ స్వంత కాళ్ళ పై నిలబడునట్లు చేయాలి , దీనికి సరైన మార్గాన్ని కనుగొనాలి .
Yours ,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment