నీళ్లను కూడా బాబు అడ్డుకుంటున్నారు
Date: 16-09-2015
up dated: 18-09-2016
Date: 16-09-2015
up dated: 18-09-2016
గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణకు 1200 టీఎంసీల నీరు రావాలి. తెలంగాణకు చట్టపరంగా రావాల్సిన నీటిని కూడా రానివ్వకుండా బాబు అడ్డుకుంటున్నారని మంత్రి కేటీఆర్ నిజం చెప్పారు కదా . తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు, కృష్ణా నుంచి 300 టీఎంసీలు అధికారికంగా కేటాయించారు. ఇందులో 120 టీఎంసీలు తాగునీటికి వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది. కానీ 120 టీఎంసీలలో 40 టీఎంసీలు మాత్రమే తాగునీటికి వాడుకుంటున్నాం. ఈ 40 టీఎంసీల నీటిని కూడా అడ్డుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు కదా !
నిజమే మరి మనం ఒక సంవత్సరం నుండి మన వాట నీటిని ఎందుకు వాడుకోవడం లేదు ? చట్టరీత్యా మనకు హక్కు ఉందికదా. ఎవ్వరికి భయ పడేది లేదు, ఎవ్వరు అడ్డు వచ్చినా మన వాటా మనం చట్టప్రకారం వాడుకొందాం . మనం మన వాటా ఎందుకు వదలు కోవాలి ? మన దిగువ రాష్ట్రానికి మన రాష్ట్రం నుండి గోదావరి, కృష్ణా నీరు వెళుతుంది. మనం ఈ రెండు నదుల నీటిని పూర్తిగా దిగువకు ఆపేస్తే ఆటో మేటిక్ గా అదే సెటిల్ అవుతుంది. అప్పుడే వారికి తెలుస్తుంది . అందరికి నిజమైన వాటా వస్తుంది.
మరి రెండు కళ్ళ సిద్ధాంతం గాని రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఏమైనట్లు ? ఈ రెండు సిద్ధాంతాలను మరిచి ఇప్పుడు రెండు నాల్కల సిద్ధాంత మేమిటి ? ఇదేనా న్యాయం ?
ఇప్పుడు గోదావరి అంటే రాజమండ్రి కాదు. కృష్ణా అంటే విజయవాడ కాదు.
గోదావరి అంటే ఆదిలాబాద్ ,నిజామాబాద్ , కరీంనగర్ ,వరంగల్ మరియు ఖమ్మం .
కృష్ణా అంటే మహబుబ్నగర్, నల్గొండ మాత్రమే .
Date:18-09-2016
-అపెక్స్ కౌన్సిల్ వేదికగా ఎండగట్టుడే..
-పాలమూరు, డిండి లిఫ్టులపై ఉమ్మడి ప్రభుత్వంలోనే జీవోలు..
-అవి కొత్త ప్రాజెక్టులంటూ ఇప్పుడు ఏపీ తప్పుడు ప్రచారం
-పట్టిసీమ, పోలవరంవల్ల మనకు 90 టీఎంసీలు రావాల్సిందే
-అపెక్స్ కౌన్సిల్ భేటీ పై అత్యున్నతస్థాయి సమావేశం
-అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ చర్చ
-హాజరైన మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తొండాటను ఎండగట్టేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతున్నది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలతో ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం క్యాంపు కార్యాలయంలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ అర్థరహిత ఆరోపణలను అపెక్స్ కౌన్సిల్ వేదికగా తిప్పికొట్టాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశం దాదాపు ఐదున్నర గంటలపాటు సాగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అనవసరపు ఆరోపణలు.. వాటిని ఎలా తిప్పికొట్టాలి? తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలతోపాటు కృష్ణానది యాజమాన్య బోర్డు తీరు.. తదితర అంశాలు సమావేశంలో చర్చించారని తెలిసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండాపై ఇప్పటివరకు స్పష్టత రానప్పటికీ.. అందులో ఏయే అంశాలుండే అవకాశముందనే దానిపై సమావేశంలో చర్చించారు. బహుశా సోమవారం ఎజెండా ఖరారై.. ఆ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి లేఖ వస్తుందని భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రమే హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు జలసౌధలో శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంత్రితోపాటు అధికారులు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయప్రకాశ్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ విభాగం చీఫ్ ఇంజినీర్ నర్సింహారావు తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. ముందుగా కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదులపై చర్చించారని తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవంటూ ఏపీ సర్కారు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిసింది. ఉమ్మడి ప్రభుత్వంలోనే సమైక్య ముఖ్యమంత్రులు జీవోలు ఇచ్చిన ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంటే.. అవి కొత్త ప్రాజెక్టులంటూ ఏపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలోనే కేంద్రానికి ఆధారాలతో వివరించామని, అపెక్స్ కౌన్సిల్ వేదికగా మరోసారి కేంద్రానికి స్పష్టంచేస్తానని సీఎం పేర్కొన్నారని తెలిసింది.
మన వాటా మనకు దక్కాల్సిందే..
పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు ఏపీ సర్కారు 80 టీఎంసీల గోదావరిజలాల్ని మళ్లిస్తున్న దరిమిలా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అందులో తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాల్సి ఉంది. అదేవిధంగా ట్రిబ్యునల్‌లో పేర్కొన్నట్లు పోలవరంద్వారా మరో 45 టీఎంసీలు రావాలి. ఇలా మొత్తం 90 టీఎంసీలు తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ వాటాపై కేంద్ర జలవనరుల మంత్రిని అడిగేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలిసింది. ఇక.. పోతిరెడ్డిపాడుద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా అక్రమంగా కృష్ణాజలాల్ని మళ్లించడం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై పూర్తి వివరాల్ని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఏపీ అక్రమంగా జలాలు మళ్లించడాన్ని అడ్డుకునేందుకు రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులపై ఇరు రాష్ర్టాల ఇంజినీర్ల అజమాయిషీ ఉండాల్సిందేనని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారని తెలిసింది. ఇదే విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌లో ప్రస్తావించి.. జాయింట్ కమిటీని ఏర్పాటుచేయాలని కోరతానని అన్నట్లు సమాచారం. కృష్ణా నది యాజమాన్య బోర్డు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేస్తున్న టెలిమెట్రీపైనా సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ మేరకు అధికారులకు కొన్ని సూచనలు చేశారని తెలిసింది.
పోయినేడు వాటానే రాలేదు..
సమావేశంలో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డు పనితీరుపైనా సీఎం కేసీఆర్ చర్చించారు. కృష్ణాజలాల పంపిణీలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాకు కూడా గండికొట్టిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గతేడాది 15 టీఎంసీలు రావాల్సిఉందని, ఇప్పటివరకు వాటిని సర్దుబాటు చేయలేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఏపీకి వాటాకంటే ఎక్కువ నీటిని ఇవ్వడం, తెలంగాణకు లోటు చేయడంవంటి అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్ ఎజెండా ఖరారు కాలేదని, ఆ అంశాలు వస్తే తదనుగుణంగా అడుగులు వేద్దామని సీఎం కేసీఆర్ అన్నారని తెలిసింది. ఎజెండా ఖరారై.. కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఆ మేరకు సమాచారం వస్తే వెళదాం, లేకుంటే లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమైందని సమాచారం. మొత్తంగా ఈ సమావేశం ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుందనే కోణంలో నిర్వహించినట్లుగా అధికారులు చెప్తున్నారు.
-www.seaflowdiary.blogspot.in
No comments:
Post a Comment