బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్‌కు ఊరట
Date : 28-09-2015
Published: Mon,September 28, 2015 04:15 PM
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఊరట లభించింది. మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో మన్మోహన్ పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది. మధుకోడా, దాసరి నారాయణరావుతో పాటు పలువురు ఈ కేసుతో మన్మోహన్‌కు సంబంధాలున్నాయని, బొగ్గు కేటాయింపులు చేసిందే ఆయనే అని ఆరోపించిన విషయం విదితమే.
బొగ్గు కుంభకోణం కేసులో ఇరుక్కొన్న సహాయమంత్రులు ఈ రోజు మాజీ ప్రధాన మంత్రిని కూడా ఇరకించాలని చూశారు . కాని ఈ కేసులో మన్మోహన్ పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది.
సహాయమంత్రులు మన్మోహన్ గారి ప్రభుత్వం లో మంత్రులుగా హోదాను అనుభవించి ఈ రోజు పదవులు ఇచ్చిన ఆనాటి ప్రధాన మంత్రినే ఇరికించాలనుకోవడం ఎంత వివేక వంతులో ఈ ఘటనతో తెలుస్తుంది . పదవులు , హోదా ఆయన దయా దాక్షిణ్యాల తో అనుభవించి తీరా కేసులో ఇరుక్కొని మేమే ఎందుకు బలి కావాలని ఆయనను కూడా ఇరికించాలనుకోవడం చూస్తుంటే సుఖాల్లో కలసి ఉంటాం , కష్టాలను పంచుకోం అంటే ఎలాగా ? మనమొక్కరే ఎందుకు ఆయనను కూడా లాగి సంతోషిస్తామనుకోన్నారు .
నమ్మి పదవులు కట్టబెడితే ఆయనకే బొగ్గు కుంభకోణం కేసులో లాగుతారా ? నమ్మి నానబోస్తే పుచ్చి బుర్ర లైనట్లు ఉంది .
ఇంకా కొందరైతే మంచిగా అర్ధరాత్రి వరకు మంత్రి పదవులు అనుభవించి తెల్లారగానే ప్రతి పక్షంలో చేరి పోయారు . కాని వారు ప్రతిపక్షం లో చేరకుండా సొంత పార్టి పెట్టుకొని లేదా ఇండిపెండెంట్ గా ఉండి ఉంటే ప్రజలు ఇంకా వారినే నమ్ముకోనేవారు.
ఈ కాలం లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదో తెలుసుకోవలసిన అవసరం వీరిని చూసి ప్రతి ఒక్కరు నేర్చు కొనవలసింది మరి మీరేమంటారు ?
yours ,
www.seaflowdiary.blogspot.in
No comments:
Post a Comment