పేదరికానికి బలై... అత్యాచారానికి గురై...
Date:31-08-2015
Date:31-08-2015
భగవంతుడా రోజు రోజు కు దేశం లో ఇదేమిటి ఘోరమ్ . ఆడ పిల్లలు ఉండాలా వద్దా ?
ఆడ పిల్లలుగా పుట్టడం తప్పా ?
ప్రభుత్వం కఠిన చర్యలు తీసికోవాలి . తొందరగా చర్యలు చేపట్టాలి . ఎంత మంది రేపిస్టు లకు ఇంతవరకు శిక్షలు పడ్డాయి ?
అన్ని న్యూస్ పేపర్లలో వార్నింగ్ advertise డైలీ ఇవ్వాలి . చర్యలు ఏమిటో కూడా వ్రాయాలి , మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలి అప్పుడు కాని భయపడుతారు .
ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి .
తప్పు చేసినవాడికి అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని సంఘటనలు జరిగేవి కావు. అత్యాచారం జరిపి ఆడ వారిని చంపేసి ఆనవాళ్ళు కూడా దొరక కుండ కాల్చేస్తున్నారు . ఏది ఏమైనా మొత్తం మీద ఆడవాళ్ళూ తమ జీవితాన్ని బలి చేయ వలసి వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా? మన దేశం లో ఆడ వాళ్ళు గా పుట్ట వద్దు .
బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ లో అడిగే విపరీత తల వంచుకునే ప్రశ్నల కు జవాబు చెప్పలేని స్థితి కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువే అన్నమాట .
ఇలాంటి తప్పు చేసినవాడికి కఠిన మరియు సరైన శిక్షలు ఎక్కడ ఉన్నవి , ఏదో నిర్భయ చట్టం చేసి చేతులు దులుపుకోవడం కాదు . రేప్ చేసిన వాడికి దేశద్రోహం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేయాలి . నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి తగినంత సిబ్బంది లేరని అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం. ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి ఉన్నాయి కాని వారు శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు . నేరం చేసిన తరువాత వాడిని పట్టుకోవడం , వాడికి ఎలాంటి శిక్ష విధించడం కాదు . అసలు జరగకుండా చూడాలి , మన ముఖ్యమంత్రి KCR గారు ఇలాంటి వారి కనుగుడ్లు పీకేయాలన్నారు చాలా బాగుంది అప్పుడు రేప్ లనేవి ఉండవు .
ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా చూస్తున్నారు , కీలు బొమ్మ గా చేసి డబ్బులు సంపాదించే యంత్రం గా గూండాలు , రౌడీలు తుదకు ధనవంతులు కూడా ఆడవారిని గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నారు .
చాలా మంది ఇది చూస్తూ కూడా నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ? మగ వారి బనియన్ లకు ఆడవారితో ఎందుకు అడ్వర్ టైస్ advertise ఎందుకు చేస్తున్నారు ?
స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే . మరి పురుషుడు చేసే ఇలాంటి నీచ పని చేయకుండ ఎం చేయాలో కూడా చెప్పాలి కదా! రేప్ చేసిన వారు బెయిల్ తెచ్చుకొని బాధితుల ముందు దర్జాగా తిరుగుతుంటే రేప్ లు ఎలా నిరోధించ బడతాయి ?
మన దేశం లో గూండాయిజం , రౌడిఇజం రాను రాను ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి ఎదురుగా కనబడిన ఒంటరి స్త్రీ ల పై అత్యాచారం చేయుచున్నాడరు. ఈ మధ్యనే హైదరాబాద్ లో స్నేక్ గ్యాంగ్ అనే రౌడీలు ఎన్నో రేప్ లు చేశారు . పెళ్లి చేసుకోబోయే వాడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారంటే ఇంతకు తెగబడ్డారు ! మనం రేప్ జరిగిన దాని గురించే మాట్లాడు తున్నాము . అసలు రేప్ లు జరుగ కుండా ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్ మీడియా , మరియు మాస్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి .
పురుషుని లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా పశువు లాగ మారి అతను ఎదురుగా కనబడిన ఒంటరి స్త్రీ ల పై అత్యాచారం చేయుచున్నాడు . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి ఉంది .
సమాజములో మార్పుతేవడానికి సినిమాలు మంచిమార్గాలు . ఒకప్పటి సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు కుటుంబమంత ఒక చోట కూర్చుని సినిమా ను చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని ద్వందార్ధాలు గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు . ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు పాటు పడినారు.
ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు , ఇంటర్ నెట్ లోని ఆస్లీల దృశ్యాలు,నీలి చిత్రాలు , సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి . నూటికి ఎనభై శాతం ఇవే అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి .
అసలు రేప్ లు జరుగ కుండా ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్ మీడియా , మరియు మాస్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి .
అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .
చెత్త సినిమాలను ,చెత్త T V సీరియల్స్ బ్యాన్ ban చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్ , డైరెక్టర్ , నటి నటులను కఠి నంగా శిక్షించాలి .
టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్ చెయ్యాలి.
నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .
సెల్ ఫోన్ లలో పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .
ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .
పైన చెప్పిన వాటి నన్నిటి ని ప్రభుత్వం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలి .
ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు సఫలమై స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు . -seaflowdiary
http://seaflowdiary.blogspot.com/2015/01/beti-bachaavo-beti-padavo-and-beti.html
No comments:
Post a Comment