Monday, September 7, 2015

పెరిగిన బీఎస్‌ఎన్‌ఎల్ డేటా కనీస వేగం

పెరిగిన బీఎస్‌ఎన్‌ఎల్ డేటా కనీస వేగం



బీఎస్‌ఎన్‌ఎల్ కనీస డేటా వేగాన్ని ఇంకా పెంచొచ్చు కాని అది ఇండిపెండెంట్ సంస్థ కాదు. అది ప్రభుత్వ రంగ సంస్థ . ప్రభుత్వ అజిమాయిషి లో పని చేస్తుంది . ప్రభుత్వానికి మాత్రం ప్రైవేటు వాళ్ళ పైనే ప్రేమ. 
వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ,రాయితీలు ఇస్తుంది. కేబుల్ నెట్ వర్క్ లేకున్నా , సెల్ టవర్లు లేకున్నా అసలు ఏది లేకున్నా వాళ్లకు లైసెన్స్ లు ఇస్తుంది . 

అదే BSNL కు ఎలాంటి సహాయ సహాకారాలు అందించదు . క్రొత్త ఎక్విప్మెంట్ కొనాలన్నా సవాలక్ష కోర్రిలు వేస్తారు , సకాలం లో ఎక్విప్మెంట్ రాదు . ఇప్పుడు మొదలు పెడితే అది వచ్చేవరకు అవుట్ డేటెడ్ అవుతుంది . అది ఎందుకు పనికి రాదు. 
దేశం లో మూల మూల కు BSNL నెట్వర్క్ విస్తరించి ఉన్నది. గ్రామ గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ ఇవ్వడానికి ఎలాంటి అవరోధం లేదు కాని దానిని ప్రైవేటు ఆపరేటర్ లకు ఇవ్వాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు . 
BSNL ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి పర్మిషన్ ఇస్తే జేబులోనికి ఏమిరాదు ,అదే ప్రైవేటు వానికి  పర్మిషన్ ఇస్తే జేబు నిండుతుంది. 2G స్కాం ఎందుకు జరిగింది ? 

BSNL ప్రభుత్వ రంగ సంస్థ కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము పెట్టి దేశమంతా OF కేబుల్ వేస్తె దానిని ప్రైవేటు వాడు OF కేబుల్ వేయడానికి  పైసా  ఖర్చు పెట్టకుండా  అతి తక్కువ ధరకు BSNL నుండి తక్కువ ధరకు ప్రభుత్వమే ప్రైవేటు వానికి లీజు కు ఇప్పిస్తుంది . అతడు  లీజు కు పెట్టిన డబ్బు 2-3 నెలలలో సంపాదిస్తాడు , ఇక మిగిలిన 9-10 నెలలు లాభం సంపాదిస్తాడు . 

ప్రైవేటు వాడు కొన్ని చోట్ల సెల్ టవర్ కూడా పెట్టడు, అది షేరింగే . ప్రైవేటు వానికి కోపం వస్తే వాడిని బుజ్జగించ దానికి మొత్తం దేశం లోని సెల్ టవర్ లను షేరింగ్ చేసుకోమంటారు . 

ప్రైవేటు వాడు equipment కొనడు , కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు . Equipment తయారు దారుతో ఒప్పందం చేసికొని అతనిచే  Equipment పెట్టించి వచ్చేలాభం ను షేరింగ్ చేసుకోమంటారు ఎందుకంటే లైసెన్స్ ఇతని పేరు మీద ఉంటుంది కాబట్టి . కేవలం లైసెన్స్ సంపాదిస్తే చాలు కోట్ల రూపాయలు సంపాదించ వచ్చు . 

ఇప్పుడు కాల్ డ్రాపింగ్ గురించి మాట్లాడు తున్నారు , కాల్ డ్రాపింగ్ వల్ల పబ్లిక్ కు బాధ కలుగు తుంది . కవరేజ్ ప్రైవేటు వారిది బాగుంటుందని అందరు అనుకుంటారు  ఎందుకంటే ప్రైవేటు వాని ట్రాన్స్ మిషన్ పవర్ నిర్ధారిత  లిమిట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని ఇప్పటి వరకు ఎవ్వరు ఎందుకు చెక్ చెయ్యలేదు ? ఎందుకు అడగడం లేదు ? TRAI అనేది  టెలికాం రేగులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది , అది ఎవరిని రెగ్యులేట్ చేస్తుందో మనకు బాగా తెలుసు.   T  అంటే  TATA ,   R అంటే  Reliance ,   A  అంటే  AI R TEL ,   I  అంటే  IDEA  అని అనుకోవాల్సి వస్తుంది . 

 DOT గా ఉన్న దానిని PSU గా BSNL చేసి దానికి సరైన అవకాశాలు కల్పించకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఎలా ?

                                                                                                                             yours ,
                                                                                                      www.seaflowdiary.blogspot.com 

 

No comments:

Post a Comment