Kaloji 101 Jayanthi -- కాళోజీ 101 జయంతి
09-09-2015
ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి ని " తెలంగాణా భాషా దినోత్సవం " గా ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ప్రకటించారు . ఆయన చేసిన సేవలకు గుర్తింపు గా ఆయన జయంతి 9 సెప్టెంబర్ తెలంగాణా భాషా దినోత్సవం ను అధికారికం గా నిర్వహిస్తున్నారు . తెలంగాణా భాషా చైతన్య కార్యక్రమాలు స్కూల్ లలో తెలంగాణా భాషా పై చర్చా గోష్ఠులు , వ్యాస రచన పోటీలు , ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు .
తెలంగాణా భాష , సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారం ఇస్తారు . ఈ పురకారానికి ఈ సారి అమ్మంగి వేణుగోపాల్ గారు ఎన్నికయ్యారు .
అమ్మంగి వేణుగోపాల్ గారు మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంత వాసులు . హైస్కూల్ చదివేటప్పుడే ప్రేమచంద్,జైనేంద్ర కుమార్ ,విశ్వనాధ నవలలు చదివారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ లో MA చదువు తున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు ఆయనను స్మరిస్తూ పద్యాలు వ్రాశారు . కాళోజీ ప్రసంగం విని ప్రభావితమై తెలంగాణా సమస్యలపై మూడు కవితలు వ్రాశారు . 2002 నుంచి తెలంగాణా కోసం కవిత్వం ప్రారంభించారు .
కాళోజీ గారు ఒక విశిష్టమైన వ్యక్తి . కాళోజీ తండ్రి మరాటి , తల్లి కన్నడ. ( నిజాం పరిపాలనలో తెలంగాణా, మహారాష్ట్ర లోని భీడ్ ,ఉస్మానాబాద్ ,ఔరంగాబాద్ , పర్భని జిల్లాలు , కర్నాటక లోని బీదర్ ,రాయచూర్ ,గుల్బర్గా జిల్లాలు ఉండేవి ) . ఆయన పుట్టింది వరంగల్ , చదివింది ఉర్దూ మీడియం , కవిత్వం తెలుగు . భాషా , సాహిత్యం , సంస్కృతి రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన మహానుభావుడు .
తెలంగాణా మొదటి ఉద్యమం చల్లారిపోయినా కాళోజీ మాత్రం తెలంగాణా ను వదలి పెట్టలేదు . 1973 లో హుజురాబాద్ సభలో " రాష్ట్రం ఒకడిచ్చేదేంది ? పోరాడి సాధించుకుందాం " అని స్ఫూర్తి నిచ్చిన మహానుభావుడు .
కాళోజీ కవిత్వం లో సరళ మైన భాష , ధిక్కార స్వరం మరియు మానవతావాదం కనిపిస్తాయి .
కాళోజీ గారు తెలంగాణా భాష యాస లను ఎవరు కించపరచినా సహించేవారు కాదు . ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి గా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావు గారు తరచుగా తెలంగాణా భాష యాసలను కించ పరుస్తూ మాట్లాడుతుండేవారు . ఇతను గైర్ ముల్కీ . గైర్ ముల్కీ అయిన సుబ్బారావు గారు తెలంగాణా భాషను కించ పరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ గారు ఈ క్రింది విధముగా స్పందించారు .
లేమావి చిగురులను లెస్సగా మేసేవు
ఋతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ
మావి కొమ్మల మీద మై మరచి పాడేవు
తిన్న తిండేవ్వారిదే కోకిలా
పాడు పాటేవ్వారిదే ?
అని సుతి మెత్తగా చురకలు అంటించారు.
కాళోజీ కి మాత్రు భాష పట్ల ఎనలేని గౌరవం .మాతృ భాషను ఆదరించక పర భాష ల పై మోజు పెంచుకొని స్వ భాషను నిరాదరణ కు గురిచేయడాన్ని తీవ్రముగా పరిగణించి ఇలా స్పందించారు .
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా ?
అన్య భాషలు నేర్చి ఆధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా ! చావవేటికిరా ?
శ్రీ శ్రీ గారిచే తెలంగాణా లూయీ అరగాన్ గా స్తుతించబడ్డ కాళోజీ ఆలోచనల్లో ఆచరణలో అసలు సిసలైన మానవతా వాది . ప్రపంచం బాధంతా శ్రీ శ్రీ బాధ అయితే కాళోజీ గొడవంతా సగటు మనిషి గొడవ . కాళోజీ కి మానవత్వం పరమావధి . అతని దృష్టి లో సంఘాలు ,నియమాలు , సాంప్రదాయాలు మనిషి లోని కుళ్ళుకు మారు రూపాలు . అతను ఆశించిన సమాజం " మానవుని మానవుడు మాదిరిగా చూడగలిగే సమాజం " అందుకే అతడు ప్రజాస్వామ్య విలువలకు గాని పౌర హక్కులకు గాని భంగం వాటిల్లితే సహించేవాడు కాదు .
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి . అన్యాయాన్ని ఎదురించినవాడే నాకు ఆరాధ్యుడు అని అన్నారు . "పుటక నీది , చావు నీది , బతుకంతా దేశానిది" అని జయప్రకాష్ నారాయణ మరణించిన సందర్భం లో కాళోజీ అన్నారు . కాళోజీ తన కవిత్వం లో తెలంగాణా భాషను సహజ సుందరం గా ప్రయోగించారు .
Kaloji Narayana Rao (9 September 1914 – 13 November 2002) more popularly known as Kaloji or Kalanna was an Indian poet, freedom fighter, Anti-fascist and political activist of Telangana. He was awarded the Padma Vibhushan in 1992.
Born | 9 September 1914 Madikonda, Warangal,Hyderabad State (nowTelangana State), India |
---|---|
Died | 13 November 2002 (aged 88) Warangal, Telangana StateIndia |
Other names | Kaloji, Kalanna, Praja Kavi |
Known for | Political activist, poet |
Spouse(s) | Rukmini Bai Kaloji |
Childrenతినలేక/ తినలేక –కాళోజి
ఒకడు కుతికెలదాక
మెక్కినోడు మరొకడు మింగు మెతుకు లేనోడు ఇద్దరికీ గొంతు పెకలదు ఇద్దరికీ ఊపిరాడదు ఇద్దరి అవస్థకు ఒకే కారణం - తినలేక
–కాళోజి
| Ravi Kumar Kaloji |
http://seaflowdiary.blogspot.com/2014/09/kaloji-narayana-rao-kaloji-narayana-rao.html
yours ,
www.seaflowdiary.blogspot.in
No comments:
Post a Comment