కేజ్రీవాల్-నజీబ్ జంగ్ మధ్య మరో వివాదం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మరో వివాదం మొదలైంది. కేజ్రీవాల్ సర్కారు జారీ చేసే ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని, వాటిని పాటించొద్దని ఎల్జీ నజీబ్ జంగ్ ఢిల్లీ అధికారులకు సూచించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశమని, ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటే జీతాలు నిలిపివేయాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఎం కేజ్రీవాల్.. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఎల్జీ ఆదేశాలు అధికారులను గందరగోళానికి గురిచేసే విధంగా ఉన్నాయని, నగరంలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని పనిచేయనివ్వకుండా అడ్డుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.
తాను కేంద్ర ప్రభుత్వ సూచనలనే తెలుపుతున్నానంటూ ఎల్జీ పేర్కొన్నారని, అదే నిజమైతే ఈ విషయంలో ప్రధాని వెంటనే జోక్య చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల ప్రధానితో భేటీ అయిన సందర్భంగా అన్ని వివాదాలపైనా రెండునెలల తరువాత చర్చిద్దామన్నారని, ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వేలు పెట్టకుండా సహకరించాలని కోరారు. డెంగ్యూను అరికట్టాక.. పరస్పరం పోరాటం కొనసాగిద్దామని అన్నారు.
కేజ్రీవాల్-నజీబ్ జంగ్ మధ్య మరో వివాదం
19-09-2015
updated 21-09-2015
updated 21-09-2015
Published: Sat,September 19, 2015 01:20 AM
-అధికారులు ఢిల్లీ సర్కారు ఆదేశాలు పాటించొద్దన్న ఎల్జీ
-లెఫ్టినెంట్ గవర్నర్‌పై ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ
-లెఫ్టినెంట్ గవర్నర్‌పై ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మరో వివాదం మొదలైంది. కేజ్రీవాల్ సర్కారు జారీ చేసే ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని, వాటిని పాటించొద్దని ఎల్జీ నజీబ్ జంగ్ ఢిల్లీ అధికారులకు సూచించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశమని, ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటే జీతాలు నిలిపివేయాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఎం కేజ్రీవాల్.. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఎల్జీ ఆదేశాలు అధికారులను గందరగోళానికి గురిచేసే విధంగా ఉన్నాయని, నగరంలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని పనిచేయనివ్వకుండా అడ్డుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.
తాను కేంద్ర ప్రభుత్వ సూచనలనే తెలుపుతున్నానంటూ ఎల్జీ పేర్కొన్నారని, అదే నిజమైతే ఈ విషయంలో ప్రధాని వెంటనే జోక్య చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల ప్రధానితో భేటీ అయిన సందర్భంగా అన్ని వివాదాలపైనా రెండునెలల తరువాత చర్చిద్దామన్నారని, ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వేలు పెట్టకుండా సహకరించాలని కోరారు. డెంగ్యూను అరికట్టాక.. పరస్పరం పోరాటం కొనసాగిద్దామని అన్నారు.
ఢిల్లీ ఒకప్పుడు కేంద్ర పాలిత ప్రాంతము . దీనిని రాష్ట్రముగా చేశారు . ప్రజలు ఎన్నుకొన్న వారితో ప్రభుత్వం ఏర్పాటు చేశారు . ప్రతి రాష్ట్రానికి గవర్నర్ గారు రాష్ట్రానికి అధిపతి గా ఉంటారు కాని ఢిల్లీ కి మాత్రం ఇంతకు ముందు లాగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అధిపతి గా ఉంచారు .
ఇంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్ ,బిజెపి వారు ముఖ్యమంత్రులుగా పరిపాలించారు . ఎప్పుడు ముఖ్యమంత్రి కి మరియు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కి భేదాభిప్రాయాలు రాలేదు . ప్రజలు కాంగ్రెస్ మరియు బిజెపి ప్రభుత్వాలతో విసిగి వేసారి వారిని మార్చి AAP పార్టికి 70 సీట్లకు 67 సీట్లని గెలిపించి అధికారం ఇచ్చారు .
కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఉన్నా మహామహులు ప్రయత్నించినా ప్రజలు వారిని తిరస్కరించారు . AAP పార్టి అధికారం లోకి వచ్చింది . ప్రజలు తాము కోరుకున్న పార్టి వచ్చిందని సంతోష పడ్డారు కాని అక్కడ ప్రభుత్వం ఎలా ఉందంటే వారికి పూర్తి అధికారాలు లేవు . పోలీస్ వారి చేతిలో ఉండదు , భూమికి సంభందించిన విషయాలు కేంద్రం చేతిలో ఉంటాయి . ఎలాగంటే ఒక వాహనం లో స్టీరింగ్ , ఎక్ష్ లెటర్ ఒకరి కంట్రోల్ లో బ్రేకు ఇంకొకరి కంట్రోల్ లో ఉన్నట్లు , అలాంటప్పుడు బండి సాఫీగా ప్రయానిస్తుందా ?
రెండు చోట్ల ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే ఎలాంటి గొడవలు ఉండేవి కావు . కాని ప్రస్తుతం అక్కడ ఒక పార్టి కేంద్రములో మరొక పార్టి ఉందికదా ! అందులోను భారి మెజారిటీ తో కేంద్రములో ఉన్న పార్టిని ఓడించింది కదా ! అందుకే నెమో కేంద్రం లో ఉన్న పార్టి రాష్ట్రం లో ఉన్న పార్టిని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకుంటుంది .
రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వాన్ని కేంద్రం తమ అధికారి లెఫ్ట్ నెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను పనులను అడ్డుకోవడం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒకరు ఢిల్లీ కి పూర్తి స్థాయి రాష్ట్రం చేయాలని అడిగారు . కాని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలేదు .
ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి రాష్ట్రం చేయాలని డిమాండ్ చేయుచున్నది . పూర్తి స్థాయి రాష్ట్రం ఏర్పడితే గాని అక్కడ ద్వంద ప్రభుత్వ అధికారాలు పోయి ఏక ప్రభుత్వ అధికారం లోకి వస్తే గాని శాంతి లభించదు . అప్పుడే ప్రజలు సంతోషం గా ఉంటారు , మరి మీరు ఏమంటారు ?
yours ,
- www.seaflowdiary.blogspot.in