విద్యార్థుల ఫీజు రీ యింబర్స్ మెంట్
01-08-2014
మన తెలంగాణ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 నుండి సాహాస పోరాటం చేశారు, వందల మంది విద్యార్థులు తమ ప్రాణాన్ని బలిదానం చేశారు, అప్పుడు తెలంగాణా ప్రజలందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. తెలంగాణా అని కూడా అసెంబ్లీ లో ఉచ్చరించ నివ్వలేదు , తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఎం చేసుకుంటావో చేసికో అని తోటి యం ఎల్ ఎ కు అసెంబ్లీ లో సవాల్ విసిరి నప్పుడు కొందరు తెలంగాణా నాయకులు గాని మరియు ఆంధ్రా నాయకులు గాని ఒక్క మాట నైనా మాట్లాడలేదు కనీసం విద్యార్థుల ప్రాణ త్యాగం పట్ల సానుభూతి కూడా తెలుపలేదు .
విద్యార్థులు, ఉద్యోగులు ,ఉపాధ్యాయులు, లాయర్లు మరియు తెలంగాణా ప్రజలందరు కె సి ఆర్ గారి నాయకత్వం లో సుధీర్గ తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్నారు. కె సి ఆర్ గారి మొక్కవోని అకుంటిత దీక్ష మరియు ఆయన ప్రాణాన్నికూడా లెక్క చేయకుండా కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం,విద్యార్థుల బలిదానం తో మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల ఆంధ్రా పాలన నుండి తమ బంగారు భవిషత్తు కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఐనా వారు మనకు ఇంకా లేని పోనీ సమస్యలు కల్పిస్తున్నారు అందులో ఒకటి "విద్యార్థుల ఫీజు రీ యింబర్స్ మెంట్"
ఫీస్ కట్టలేని ఆర్ధిక స్థితి లో ఉండి ఉన్నత విద్య చదువుకోలేని పేద విద్యార్థులకు ప్రభుత్వం చేయూత నిచ్చి ఫీజు రీ యింబర్స్ మెంట్ క్రింద ప్రభుత్వమే వారి ట్యూషన్ ఫీస్ చెల్లిస్తుంది .
ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి డిస్ ప్యూట్ రాలేదని మన అందరికి తెలుసు, కాని మనం విడిపోయినా వారి విద్యార్థుల ఫీజు రీ యింబర్స్ మెంట్ మనమే చెల్లించాలని మొండిగా వాదిచడం విచిత్రం. అంత డబ్బు ఎక్కడి నుండి మనం తెస్తాం! విడి పోయినంక ఎవరి పిల్లలకు వారే ఫీజు చెల్లిస్దామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి అనుగుణం గానే క్యాబినెట్ సమావేశములో తీర్మానించారు. ఒక్క తెలంగాణా విధ్యార్థి కూడా నష్ట పోకుండా చూసే భాద్యత తమదని ముఖ్యమంత్రి గారు చెప్పారు .
మరియు తెలంగాణా స్థానికత ను కూడా ఆలోచించి 1956 నవంబర్ 1 కంటే ముందు నిర్ణయించారు . కాని నిజమైన స్థానికత 1948 సెప్టెంబర్ 17 తీసుకోలేదు కదా! ఎందుకంటే ఆ రోజె మనకు తెలంగాణా ప్రజలకు నిజాం పాలన నుండి స్వేచ్చా లభించింది . అప్పుడు ఇక్కడ ఉన్నవారే నిజమైన తెలంగాణా వారు కదా!, ఐ నా ఆ తేది ని మన ప్రభుత్వం నిర్ణయించ లేదు చాల సంతోషమే .
మరియు తెలంగాణా స్థానికత ను కూడా ఆలోచించి 1956 నవంబర్ 1 కంటే ముందు నిర్ణయించారు . కాని నిజమైన స్థానికత 1948 సెప్టెంబర్ 17 తీసుకోలేదు కదా! ఎందుకంటే ఆ రోజె మనకు తెలంగాణా ప్రజలకు నిజాం పాలన నుండి స్వేచ్చా లభించింది . అప్పుడు ఇక్కడ ఉన్నవారే నిజమైన తెలంగాణా వారు కదా!, ఐ నా ఆ తేది ని మన ప్రభుత్వం నిర్ణయించ లేదు చాల సంతోషమే .
ఎదుటి వారు మన స్థానికత ను కూడా పెడ త్రోవ పట్టిస్తున్నారు . స్థానికత నిర్ణయించే అధికారం మనకు లేదట . కాని ఈరోజు పత్రికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఫీజు లో 58% భరించ గలమని తెలిపారు . అలాంటప్పుడు ఎవరి పిల్లలకు వారి ప్రభుత్వమే చెల్లిస్తే 58% కంటే కొంచం తక్కువే గావచ్చు లేదా కొంచం ఎక్కువే గావచ్చు . మరి అలాంటప్పుడు ఎందు కీ రాద్ధాంతం .
నిన్న శ్రీ . హరీష్ రావు గారు గౌరవనీయ భారి నీటిపారుదల శాఖ మంత్రి ప్రెస్ మీట్ లో చాలా బాగా చెప్పారు . ఎన్నో తెలియని విషయాలను ఆయన చెప్పిన దాంట్లో మనం తెలిసికోవచ్చు . అందులో 2000 జనవరి 16 న ఐ టి డి ఎ ఉద్యోగ నియామకాల సందర్భంగా .. 1956 ముందు తెలంగాణా లో నివాస మున్నవారే స్థానికులని చంద్రబాబు ప్రభుత్వం జి వో ఇచ్చిన దని చెప్పారు . స్థానికత నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందని చెప్పారు . మరి ఇప్పుడెందుకు వ్యతిరేకముగా వారు మాట్లాడు తున్నారు, ఇక స్థానికత మీద ఇంత గడ బిడ అనవసరం కదా.
దయ చేసి మీరు శ్రీ . హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను ఒకసారి చదివితే ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీకు తెలుస్తాయి , నిజమేమిటో తెలుస్తుంది .మనం జవాబు కూడా చెప్పొచ్చు .
దయ చేసి మీరు శ్రీ . హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను ఒకసారి చదివితే ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీకు తెలుస్తాయి , నిజమేమిటో తెలుస్తుంది .మనం జవాబు కూడా చెప్పొచ్చు .
ఏది ఎ మైనా శ్రీ . కే . సి . ఆర్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వం 1956 నవంబర్ 1 నే స్థానికత ను ధృడమైన పట్టుదలతో ఇంప్లిమెంట్ చేయడాని కి నిర్ణయించడము తో తెలంగాణా ప్రజలందరూ సంతోషం తో ఉన్నారు .
- www.seaflowdiary.blogspot.com
- www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment