Friday, August 29, 2014

Public Transport System n Traffic in Our Hyderabad

                                   మన హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు నకు శ్రీకారం

                                                       Initiation to modification of 
                                  Public Transport System  n Traffic  in Our Hyderabad            
                                                                                                                               29-08-2014
                                               
మన హైదరాబాద్ ( Hyderabad )  లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు ( change of public transport system ) నకు మన ముఖ్యమంత్రి  కె సి  ఆర్  గారు శ్రీకారం చుట్టడం చాల సంతోషం . నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చేసేందుకు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు  Hon"ble CM  KCR టాప్ ప్రియారిటి ఇచ్చినందుకు హైదరాబాద్ నగర ప్రజలందరు ధన్యవాదములు తెలుపు తున్నారు . ఇందుకు ఇప్పటికే పలు దఫాలు పోలీస్ ,రవాణా శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు అందులోని భాగంగానే ముంబాయి తరహా ప్రజా రవాణా విధానాన్ని పరిశీలించి అమలు చేయడానికి ఇద్దరు మంత్రుల నేతృత్వం లో ప్రత్యెక బృందాన్ని ముంబై పంపించారు. ప్రత్యెక బృందం లో మంత్రులు శ్రీ . నాయిని నరసింహారెడ్డి గారు గౌ. నీ హోం మంత్రి గారు Hon'ble Home Minister , శ్రీ . పట్నం మహేందర్ రెడ్డి గౌ. నీ రవాణా శాఖ మంత్రి గారు  Hon'ble Transport Minister ,  వీరితో పాటు  గౌ.  నీ . అధికారులు Hon'ble Officers రవాణా శాఖ ప్రిన్సిపాల్  సెక్రెటరి గారు , నగర పోలీస్ కమీషనర్ గారు ,  రవాణా శాఖ  కమీషనర్ గారు , ఆర్ టి సి జె ఎం డి గారు , జి హెచ్ ఎం సి కమీషనర్ గారు , ఎడిషనల్ పోలీస్ కమీషనర్ గారు, సైబరాబాద్ ట్రాఫిక్ ఎడిషనల్  కమీషనర్ గారు,   హైదరాబాద్ జె టి సి తదితరులు వెళ్ళారు.

ఈ బృందం ముంబాయి వెళ్లి అక్కడి ముంబాయి రవాణా వ్యవస్థ కు తలమానికంగా నిలచిన " ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ ట్రాన్స్పోర్ట్  విధానం బెస్ట్ ( BEST ) ను అధ్యయనం చేశారు .  బెస్ట్ జి యం  ఓం ప్రకాష్ గుప్త  డిప్యూటి జి యం  దేశ్ పాండే లతో పని తీరుని తెలుసు కున్నారు . ముందుగా ముంబాయి లోని మెట్రో స్టేషన్ , ఆర్టిసి , రైల్వే స్టేషన్ల కలయికగా ఉన్న " అంధేరీ "  జంక్షన్ ను పరిశీలించారు . అక్కడి ఆర్ టి సి బస్సు  రూట్లు , బస్సు షెల్టర్లు , బస్ బే లలో ప్రయాణికులు పాటిస్తున్న  "క్యూ "  " Q "  system  విధానాన్ని నిశితంగా పరిశీలించారు . కేవలం ముగ్గురు అధికారులు మెట్రో వ్యవస్థ తో పాటు ట్రాఫిక్ ,రోడ్డు భద్రతను జి  పి  ఆర్  స్ ( GPRS ) విధానం ద్వారా నియంత్రించే తీరును ఆసక్తి గా పరిశీలించారు  జి  పి  ఆర్  స్ విధానం ద్వారా కంట్రోల్ రూం తో ముంబై కి చెందిన  9 వేల ఆర్టిసి బస్సులు , 12 వేల మంది కండక్టర్లు , 10 వేలమంది డ్రైవర్ల పని తీరును అనుక్షణం తెలుసుకొని అవసరమైన సూచనలు అందిస్తూ నియంత్రణ చేస్తున్న తీరును పరిశీలించారు . అక్కడి ట్రాఫిక్  పోలీసులు కేవలం తొమ్మిది కేంద్రాల నుంచి యావత్తు ముంబాయి నగరం లోని ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించే పరిస్థితులను  పరిశీలించారు. స్కై వాక్  వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటున్న విషయాన్ని వారు పరిశీలించారు . ఈ అధ్యయనం మరియు పరిశీలన కార్యక్రమాన్ని రెండు రోజులు గావించి హైదరాబాదు కు తిరిగి వచ్చారు కూడా .  ఇక ఈ బృందం అధ్యయన రిపోర్ట్ ను తొందరగా సి యం గారికి అందించనున్నారు . సి యం గారు రిపోర్ట్ ను చదివి  హైదరాబాద్ ను రవాణా ఇబ్బందులు లేని నగరముగా తీర్చి దిద్దాలని , బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచాలని ధృడ నిశ్చయం తో  ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు సి యం  గారికి ఎంతో రుణ పడి యుంటారు .

మన ప్రియతమ కెసిఆర్ గారు వీటన్నిటిని అమలు చేసే ముందు ఒకసారి దయతో ఈ క్రింది సూచనలను పరిగణన లో కి తీసుకొన గలరని  కోరుచున్నాను .

మన నగరం లో చాలా వరకు  రోడ్ లన్ని సన్నగా   ఇరుకుగా ( narrow ) ఉన్నవి , ట్రాఫిక్ ఎక్కువై రోడ్లు ఇరుకుగా మారినవి . కావున అవకాశం ఉన్న చోట్ల అత్యవసరం గా రోడ్ లను వెడల్పు చెయాలి . పెద్ద పెద్ద ఇళ్లనే కూలగొట్టి వెడల్పు చేస్తున్నప్పుడు కాంపౌండ్ వాల్ ఉన్న చోట్ల వాటన్నింటిని తొలగించి  రోడ్ ను విశాలం చేయాలి  , లేదా వీలున్నంత వెనుకకు జరపాలి .  బాటిల్ నెక్ ( bottle neck )  లన్నింటిని పూర్తిగా తొలగించాలి . చౌరస్తాలను ( cross roads ) విశాలంగా చేయాలి , మలపులను ( directions ) 90 ( degree ) డిగ్రీలలో కాకుండా 110-120 డిగ్రీలలో ఏర్పాటు చేయాలి ,ఇప్పుడున్న మలుపులో  బస్సులు మరల డానికి చాల కష్టంగా ఉంది .

ట్యాంక్ బండ్ ( tank band ) ను   ఎన్ టి అర్ ( NTR ) గారు వెడల్పు చేసి బాగు చేశారు ఐనా అది ప్రస్తుత ట్రాఫిక్ కు సరిపోవడం లేదు కావున ఇప్పుడు ఉన్నట్యాంక్ బండ్  రోడ్ కు ప్యారేలేల్ గా మరొకటి ట్యాంక్ సైడ్ రోడ్ నిర్మించినట్లు అయితే , ఒకటి పోవడానికి మరొకటి రావడానికి ఉపయోగించవచ్చు  . ట్యాంక్ బండ్ పై రాత్రుల్లో లైటింగ్ సరిగా లేక మినుకు మినుకు మంటు చీకటి గా ఉంటుంది  .  వినాయక చవితి కి లైట్లు ఎలా జిగేలు మంటాయో  అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి, అప్పుడే హైదరాబాద్ అందం గా కనిపిస్తుంది .  అదే కాకుండా మరొక రోడ్ సికింద్రాబాద్ సైడ్ నుండి ట్యాంక్ బండ్ మధ్య( జలాశయం )  ( middle of the tank band ) నుండి ఒకటి సెక్రెటేరియట్ ( secretariat )కు ఇంకొకటి ఖైరతాబాద్ కు "వై " షేప్ ( Y shape ) లో వేస్తె  ఎంతో ట్రాఫిక్ తొందరగా క్లియర్ అవుతుంది దానికి ప్రజలు ఎంతో సంతోషిస్తారు, ట్రాఫిక్ , టైం,మరియు ఫ్యూయల్ కలసి వస్తుంది . ఇంకొక విషయం బేగంపేట్ విమానాశ్రయం ( air port )సిటి మధ్యలో ఉంది , ఇటు నుండి అటుప్రక్క వెళ్ళాలంటే కనీసం  9-10 కి మీ చుట్టూ ప్రయాణించి వెళ్ళాలి . కావున ఎయిర్ పోర్ట్ బౌండరీ చుట్టూ ఒక రహ దారి నిర్మించినచో ఎంతో సౌలభ్యం అవుతుంది . ప్రియతమ ముఖ్యమంత్రి  కె సి అర్ గారు ఈ విషయాన్ని ఒక సారి పరిశీలించి తగిన చర్య తీసుకొనగలరని  కోరుచున్నాను . 

మన దగ్గర అసలు ఫుట్ పాత్ ( foot path )   లు  ఉన్నాయా?  ఉంటె వాటిని షాప్ వాళ్ళు  ఎప్పుడో ఆక్యుపై ( occupy )చేశారు .  వాటిని ఖాళీ చేయించి  నడిచే  వాళ్లకు   అది  ఫ్రీ  గా ఉంచాలి , లేకుంటే వారు రోడ్ ల పైనే నడవ వలసి వస్తుంది , ఫుట్ పాత్ లేని చోట్ల ఫుట్ పాత్ లను నిర్మించి దాని మీదుగానే  నడిచే టట్లు చేయాలి .  రోడ్  పై  "జీబ్రా " క్రాసింగ్  ( " Z " crossing ) వేసి అక్కడినుండే నడిచే వాళ్ళను  క్రాస్  చేయనీయాలి , ఇప్పుడు ఉన్నట్లు ఎక్కడబడితే అక్కడ రోడ్  క్రాసింగ్ ను నిరోధించాలి .

రోడ్ కు ఇటు ప్రక్క అటు ప్రక్క ఆక్రమించుకొని చిల్లర వ్యాపారం చేయనీయరాదు . ప్రస్తుత మున్న వాటిని తొలగించాలి, లేదా సాధ్యమైనంత వెనుకకు జరపాలి లేదా వారికి స్థలం కేటాయించాలి .

రోడ్ కు రెండు ప్రక్కల ( two sides of road )ఇష్టం వచ్చినట్లు వాహనాలను ,మోటార్ సైకిళ్ళను పార్కింగ్ ( parking )నిషేధించాలి , పార్కింగ్ కు ప్లేస్ అలాట్ చేసి అక్కడే పార్కింగ్ కు అనుమతి ఇవ్వాలి .

నగరం లో రోడ్ లన్నింటిని వన్ వే లు లేకుండా   ( no  one way )  చేయాలి ,   వన్ వే ఉన్నవి తీసి వేయాలి అంటే రోడ్లన్నీ విశాలం గా చేయాలి .  ఆల్టర్నేట్ రూట్ ( alternate route ) లను ఏర్పాటు చేసి  ట్రాఫిక్ ( traffic ) ను అనుమతించాలి, కనీసం చిన్న వాహనాల నైన అక్కడి నుండి పంపాలి, దీని వలన చాల వరకు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది .

సికింద్రాబాద్  నుండి  హైదరాబాద్  వెళ్ళాలంటే  4-5  చోట్ల లో  మాత్రమే  రోడ్  ఉంది  అది  కూడా  రైల్ ఓవర్ బ్రిడ్జి ( rail over bridge ) క్రింది నుండి వెళ్ళాలి , ఎక్కడయున్న చుట్టూ  తిరిగి  ఈ బ్రిడ్జి ల  వద్దకు  వచ్చి మాత్రమే  వెళ్ళాలి . ఈ బ్రిడ్జి లు కూడా  వెడల్పు  మరియు  ఎత్తు  తక్కువగా  యుండడం వలన  ట్రాఫిక్  చాల స్లో గా  వెళుతుంది , కొన్ని సార్లు ఎంతో సేపు ఆగిపోతుంది . కావున ఈ బ్రిడ్జి లను వెడల్పు , ఎత్తులను పెంచాలి . ఇంకా కొన్నిక్రొత్త  బ్రిడ్జి లను మధ్యలో అక్కడ అక్కడ  నిర్మించాలి .

ప్రతి చౌరస్తా లలో నాల్గు దిక్కులా ( four sides of cross road )  వెళ్ళే రోడ్లకు అటు ఉండే ఏరియా లను బోర్డులపై  ( sign board ) తప్పకుండ వ్రాయాలి .  మరి యు రోడ్లలో అక్కడక్కడ రోడ్ల పేర్ల బోర్డులను ( name of the road )  వ్రాసి పెట్టాలి . దాని వలన ప్రయాణికుడు ఎక్కడ ఉన్నాడో ,ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది .



పాడైన రోడ్లను ( damaged roads ) ఎప్పటికప్పుడు రిపేర్ ( repair ) చేయాలి , ఎప్పటికప్పుడు  రిపేర్  చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది మరియు ట్రఫిక్ కు ఇబ్బంది ఉండదు .

ప్రస్తుతం మనదగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లు ( traffic signal )  ఒక్కొక్క క్రాస్ రోడ్ లో ఒక్కొక్క విధంగా వస్తాయి అలాకాకుండా అన్ని చోట్ల ఒకే పద్దతి లో ( uniform )  వస్తే ప్రయాణికులకు మంచి అవగాహన ఏర్పడుతుంది . సిగ్నల్  పై  టైం డిస్ప్లే ఏర్పాటు చేస్తే సిగ్నల్ ఎంత సేపట్లో వస్తుందో తెలిసి ఇంజన్ ను ఆపు కుంటారు దాని వల్ల కొంత ఫ్యూయల్ ( fuel )  ఆదా అవుతుంది .

మన నగరం లో ప్రజా రవాణ సరిగా  మరియు సరిపోయినంత లేనందువలన ప్రైవేటు ,పర్సనల్ ట్రాన్స్ పోర్ట్ అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు రోజు రోజుకు వందల సంఖ్యలో పెరగడం  మరియు ఫ్లోటింగ్ పాపులేషన్పె ( floating population )రగడం వలన  రోడ్ లన్ని ట్రాఫిక్ తో నిండి గమ్యం చేరడానికి గంటలకు గంటలకు పడుతుంది . ఒక్కో సారి అంబులెన్స్ లు కూడా ( ambulances also )  ట్రాఫిక్ లో చిక్కుకొని పేషంట్  ను హాస్పిటల్ కు సరియైన సమయం లో చేర్చే  పరిస్థితి కూడా లేదు . కావున యుద్ద ప్రాతి కన  ప్రజా రవాణ మెరుగు పరచాలి.



ప్రస్తుతము బస్సు లు ,యం యం టి ఎస్   ( MMTS )   రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు .  మెట్రో రైల్ ( Metro rail ) పనులు వేగం గా జరుగు చున్నవి , కాని అందులో యం యం టి ఎస్-2 మరియు మెట్రో పనులకు చాల ఖర్చు , సమయం పడుతుంది . ఈ రెండింటి వలన  అనగా యం యం టి ఎస్ మరియు మెట్రో రైల్  ద్వారా ఆ రూట్ లో ఉన్న ప్రజలకే ఉపయోగ పడుతుంది  కాని బస్సు ల వలన అలా కాకుండా  అతి తక్కువ ఖర్చు తో ఏర్పాటు చేయవచ్చు  , ఎక్కడికైనా, ఎప్పుడైనా బస్సు పోయే రోడ్  ఉంటె చాలు అక్కడికి బస్సులను నడపవచ్చు .

ఇక మనవద్ద బస్సుల సంఖ్య ( No.of Buses )  చాల తక్కువ ,ప్రయాణికులకు సరిపోవడం లేవు . గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు . ఏదో నామ్ కె వాస్తే బస్సులు నడుస్తున్నాయా అంటే నడుస్తున్నాయి తప్ప ప్రయాణికులు ,విద్యార్థులు ఎంత బాధ పడుతున్నారో కూడా తెలుకోలేక పోయారు . కొన్ని జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం  బస్సులు వేసి, కొన్ని బస్ షెల్టర్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు .




 చంద్రబాబు నాయుడు గారు సిటీ లో నడుస్తున్న సిటి పచ్చ బస్సులను ( green buses )   ఎర్ర రంగు బస్సులుగా ( red buses )  మరియు వై ఎస్ ఆర్ గారు  డిస్ట్రిక్ట్ లో నడుస్తున్న ఎర్ర రంగు  బస్సులకు ( red buses )   పచ్చ రంగు  ( green buses ) పూసి  వాటి పై " పల్లెవెలుగు" అని వ్రాసి  ఆ ఇద్దరు హాయిగా నిద్ర పోయారు . కాని ఇప్పుడు మన సి యం  కె సి ఆర్ గారు  వాటి దుమ్ము దులిపి  మళ్లి  "  ప్రజా సేవయే మన కర్తవ్యం" గా రూపు దిద్దుతున్నందుకు ధన్యవాదములు .

బస్సు ల సంఖ్యను తగినంత గా పెంచాలి , నగరం లోని మారు మూల ప్రాంతాలకు, క్రొత్త -క్రొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కలిగించాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం బస్సులు ఎక్కడికి వెళ్ళే వో ఇప్పుడు కూడ అక్కడికే వెళ్ళు చున్నాయి . క్రొత్త ప్రాంతాలకు ఇంత వరకు బస్సులు లేవు . బస్సులు ఉంటె సెవెన్ సీటర్  ఆటో లో క్రిక్కిరిసి ఎందుకు ప్రయాణం చేయవలసి వస్తుంది ? బస్సుల్లో వ్రేలాడి ప్రాణం అర చేతిలో పెట్టుకొని ఎందుకు ప్రయాణం చేస్తారు .?
ముంబాయి ( mumbai ) లాగ ,  బెంగుళూరు ( bengaluru ) లో కూడా ప్రజా రవాణా చాలా బాగుంది ,  అక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు లేవు , ప్రతి 2-3 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది , స్టాండింగ్ పాసింజర్లు చాల తక్కువ , అక్కడి బస్సులు  చాల వరకు క్రొత్తవి, వాటిని  నీట్ గా మెంటేన్ ( neat maintenance ) చేస్తారు. కాని మన దగ్గర రెండు బస్సులు చేసే పనిని ఒక్క బస్సు చేస్తుంది .  బెంగళూరు కు  కూడా ఒక బృందాన్ని పంపి స్టడి  చేయిస్తే  బాగుంటుంది .

బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు  ( destination boards ) నీట్ గా  ( neat ) అందరికి కనుపించేట్లు అందం గా ఒకే ఫాంట్ సైజు లో అన్ని డిపోలు ఒకే విధముగా వ్రాయాలి , బోర్డ్ ల దగ్గర రాత్రి పూట కనిపించేటట్లు లైట్లు పెట్టాలి . ఇప్పుడు కొన్నిటికి లైట్లు ఉన్నాయి కాని అవి వెలగకుంటే అలాగే వదలి పెడుతున్నారు . బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు ముందు వెనుక తప్పకుండ ఏర్పాటు చేయాలి .
ఈ బోర్డ్ లను  తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీ భాషలలో తప్పకుండా వ్రాయాలి . చాల రాష్ట్రాల్లో వారి వారి భాష నే వ్రాసుకొని అక్కడి వాళ్ళ కే  తెలియునట్లు  తమ ప్రాంతీయ ( regional )  అభిమానాన్ని చాటు కొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ? కాని మనం అలా కాకుండా మనం మూడు  తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీభాషలలో వ్రాసి (  in regional, national & international  languages )  దేశాభి మానాన్ని ( patratism ) చాటుదాం .  హైదరాబాద్ వచ్చే ఇతర రాష్ట్రాల  వాళ్ళందరూ ఎంతో సులభం గా తెలిసికొని ప్రయాణం చేయగలరు , వారందరికీ హైదరాబాద్ అంటే , హైదరాబాద్ ప్రజలంటే  ఒక అభిమానం కలుగుతుంది. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళిన మనను గౌరవిస్తారు .

 డెస్టినేషన్ బోర్డ్ లో నంబరింగ్ సిస్టం ను మనం ఫాలో అవుతున్నాం కదా ! ఒక సారి మన ప్రియతమ కె సి ఆర్ గారు ఈ విషయం పై దృష్టి పెట్టాలి  అదేమిటంటే  బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లో వెళ్ళే ప్రదేశం పేరు తో బాటు ఆ రూట్ నంబర్ వేస్తారు ,ఇక్కడే మనం ఈ నంబరింగ్ విధానాన్ని మార్చాలి .

ఉదా:-    సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ కు మొదటి నుండి నం ."1"   ( No. 1 ) రూట్ గా పరిగణిస్తున్నారు ,   అఫ్జల్ గంజ్  నుండి  సికింద్రాబాద్ కు కూడా ఇదే నంబర్ తో నే నడిపిస్తున్నారు,  అంటే రెండు దిక్కుల వెళ్ళ డానికి  ఒకే నంబర్ అన్నమాట , క్రొత్త వారు గాని చదువు లేదా ఇంగ్లిష్ రానివారు ఈ నంబర్ లనే  చూసి బస్సు ఎక్కుతారు కదా !  సరే నంబర్ అయితే కరక్టే  ( No. is correct ) కాని బస్సు ఎక్కడికి వెళ్ళుతుంది ?  సికింద్రాబాదా ? లేక   అఫ్జల్ గంజ్ ?  అందుకే   బస్సు ఎటు వైపు వెళ్ళు తుందో గమనించి ఎక్కాలన్నమాట . ఒక వేళ అది కామన్ పాయింట్ అనుకోండి అప్పుడు ఎలా ? బస్సు డ్రైవర్ ను గాని  బస్సు లోని ప్రయాణికుడి ని గాని అడిగి బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ రెండు వైపులా వెళ్ళాలంటే ఒకే నంబర్ ఉంటుంది .

 డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ వచ్చే బస్సులన్నింటికి "హైదరాబాద్"  అని మాత్రం వ్రాస్తారు. ఆదిలాబాద్ నుండి వచ్చినా , ఖమ్మం నుండి వచ్చినా ,తిరుపతి నుండి వచ్చినా  "హైదరాబాద్"  అని మాత్రం వ్రాస్తారు. అట్లాగే సిటి లో కూడా ఒక్కొక్క ఏరియాకు  ఒక   నంబర్  కేటాయించాలి, ఆ నంబర్ తో నే బస్సులను ఆపరేట్ చేయాలి .


కావున రూట్ నంబర్ కాకుండా డెస్టినేషన్  ( ఏరియా ) ( destination )     కు  ఒక నంబర్ అలాట్ ( allot one number )  చేయాలి ,

సికిందరాబాద్ కు ఒకటి (1) ,

చార్మినార్ కు రెండు (2)

అఫ్జల్ గంజ్ కు మూడు (3)

 ఉస్మానియా యునివర్సిటి  నాలుగు (4)

మెహదిపట్నం  ఐదు (5)  

 కోటి ఆరు (6) ,

సెక్రటేరియట్ ( 7 ),
 
 లక్డికాపూల్  ( 8 ) ,

 సనత్ నగర్ ( 9 ) ,

కుకట్ పల్లి ( 10 ) ,

 జె బి ఎస్ ( 11 ) ,

 ఇమ్లిబన్ ( 12 )  

ఇవే నంబర్లని కాదు మన కె సి ఆర్ గారి ఇష్ట ప్రకారం వేయాలి .

ఇలా బస్సు  టెర్మినేట్ ( terminate ) అయ్యే  ప్రతి ఏరియాకు ( area )  ఒక నంబర్ ను  అలాట్ చేసి ఆర్ టి సి  ( RTC ) వారు దీనినే ఫాలో ( follow )  చేయమనాలి .     నంబర్లు వేయడం లో కష్టం ఏమి లేదుకదా  ఎన్నైనా నంబర్లను ( infinity )   1  నుండి  2... 3.... 20.... 36.... 50... 101 ... 222....  ఇలాగా 1000 ........... ఇంకా ఎక్కువ  వరకు వేయాలి . ఈ నంబర్ల వలన   పర్టిక్యులర్ నం  బస్సు ( particular bus ) ఎక్కడి నుండైనా పర్టిక్యులర్ ఏరియా  ( అదే  ప్లేస్  )  ( to particular area ) కు వెళ్లుతుందని ప్రజలకు మరియు సిటి కి వచ్చే క్రొత్త వారికి    తెలిసి ప్రయాణించుటకు చాలా సౌకర్యం గా ఉంటుంది  .

సికింద్రాబాద్ కు సిటి లో ఎక్కడి నుండైన వచ్చే బస్సు లన్ని ఒకే నంబర్ తో ( one number only ) వస్తాయి . అట్లాగే సిటి లో ఎక్కడి కైనా  ఆ ఏరియా నంబర్ తో ఎక్కడి నుండైన  ఒకే నంబర్ తో వెళతాయి . ఒక వేళా ఒకే ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి రెండు లేదా మూడు రూట్లలో బస్సులు వేళ తాయి   అనుకొండి   అప్పుడు  ప్రయాణికులు  కన్ఫ్యూజ్ ( confuse ) కాకుండా నంబర్ అదే ఉంటుంది కాని ఆ నంబర్ ప్రక్కన ఒక ఆల్ఫా బెట్   (alphabet )   నంబర్ వేయాలి .

ఉదా:-  ఇప్పుడు    మెహదిపట్నం   నుండి    సికింద్రాబాద్  కు మూడు రూట్లలో బస్సులు వెళ్ళుతున్నాయి,  అవి నం . 5 ,  5 కె     మరియు 49
 
వీటిని ఎలా మార్చాలంటే    సిటి లో ఎక్కడి నుండైన  సికింద్రాబాద్  కు నం . " 1` " తో నే రావాలి

మెహదిపట్నం   1    సికింద్రాబాద్         (  రాణిగంజ్ ద్వారా  )
.
 మెహదిపట్నం   1 కె    సికింద్రాబాద్     (  కింగ్స్ వే ద్వారా )

మెహదిపట్నం   1  బి    సికింద్రాబాద్      ( బంజారా హిల్స్    ద్వారా )





అట్లాగే

 ఉస్మానియా యునివర్సిటి  -  "1" - సికింద్రాబాద్ ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )
           
 సికింద్రాబాద్ -  ' 4 '      ఉస్మానియా యునివర్సిటి.  ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

 అఫ్జల్ గంజ్  -  " 1 "     సికింద్రాబాద్ ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

 వనస్థలి పురం " 1 " -  సికింద్రాబాద్  ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

   కుకట్ పల్లి    " 1 "     సికింద్రాబాద్          ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

   సికింద్రాబాద్" 10 "    కుకట్ పల్లి          ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )                                      
     అంతా  క్రొత్త నంబరింగ్  పద్దతి మాత్రమే  ఇంప్లి మెంట్( implementation of new numbering system ) చేయాలి . భారత దేశం లోని ప్రజలకే కాక విదేశీ ప్రయాణికులకు ( international traversals )    కూడా హైదరాబాద్ లో ఎక్కడి నుంచైనా  చార్మినార్   నుంచైనా,  హై టెక్ సిటి  నుంచైనా  రిసాలా బజార్ నుంచైనా,   శంషాబాద్  నుంచైనా నం . 1 బస్సు  ఎక్కితే   తప్పకుండా   సికిందరాబాద్ స్టేషన్   చేరుతామని తెలుస్తుంది . హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు తమ-తమ పనులను  హైదరాబాద్ లో ఎక్కడెక్కడో  చేసుకొని  అక్కడి  నుండే  నం 1 బస్సు ఎక్కి తే   మేము తప్పకుండ   సికింద్రాబాద్ లో   తాము   వెళ్ళే  రైలు   అందుకొన గలమని ధీమాగా యుంటారు .


  .అట్లాగే   ఉస్మానియా యునివర్సిటి కి ( OU )   సిటి లో ఎక్కడి నుండైన   ' 4 ' తో నే   బస్సులు వెళ్ళాలి .

ఈ అంకెలను రెడ్ కలర్ తో మెరిసే విధముగా పెద్ద ఫాంట్ ( font size )  రేడియం తో( with radium )  వ్రాయాలి .అప్పుడే బాగుగా కనిపిస్తాయి.

ఇక బస్సుల రంగు మార్చాల్సి ( change of bus co lours )   యుంది , సిటి బస్సు లకు ( to city bus )  పచ్చ రంగు కాంబినేషన్ లో ( combination of green color ) ఆర్దినరికి  ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు అదే పచ్చ రంగు   కాంబినేషన్ లో  వేరొక రంగు మొత్తం మీద పచ్చ రంగు కాంబినేషన్ లో ఒక ప్రత్యేక మైన కలర్ లో సిటి బస్సులు.

ఇక జిల్లా బస్సులకు   అని ఆర్దినరికి  ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు , డీలక్స్  లకు  ఎర్ర రంగు కాంబినేషన్ లో ( re color combination ) , ఇంటర్ స్టేట్ బస్సు లకు ఇకో రంగు  చూడ ముచ్చటగా , సింపుల్ గా  ఎక్కడ వేయని డిజైన్ లో   "తెలంగాణా  బస్సు"  అని చూడగానే చిన్న పిల్లలు కూడా గుర్తించే టట్లు వేయాలి .

బస్సులలో టికెట్ ఇష్యూ  పద్దతి ని ( system of ticketing )    కండక్టర్ చాలా సులువుగా  ఇచ్చే విధముగా చేయాలి. పేపర్ వేస్ట్ కాకుండా చూడాలి .  ముంబాయి లో లాగ కండక్టర్ ఒకే చోట కూర్చొని టికెట్ ఇష్యూ చేయాలి .  టిమ్స్  పద్దతి బావుంటుంది

బస్సు లో ఎక్కడానికి  " Q " ( system )  మరియు దిగడానికి వేరు వేరు డోర్ లు ఉపయోగించాలి , వెనుక నుండి ఎక్కడం , ముందు నుండి దిగడం అవుతే డ్రైవర్ కు దిగేవాళ్ళ అవగాహన ఉంటుంది .

ఇక బస్సు షెల్టర్ లు పాతవి తీసి క్రొత్త వాటిని నిర్మించాలి . అక్కడ రాత్రి  లైటింగ్  ఏర్పాటు చేయాలి . శుబ్రముగా ఉండునట్లు చర్యలు తీసికోవాలి . సరిగ్గా కూర్చుండు నట్లు ప్రతి ఒక్కరు చూడాలి .  ప్రతి  బస్సు షెల్టర్  పై అక్కడి ఏరియా పేరు తప్పకుండా వ్రాయాలి , దాని వలన ప్రయానికుడికి తాను దిగవలసిన చోటు తెలుస్తుంది .

. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ లకు ప్రోత్సాహకాలను పెంచ వలసిన అవసరం ఉన్నది , మనం ఒక సారి సికిందరాబాద్ నుండి హైదరాబాద్ కు బస్సులో వెళ్లి రావడానికే అలసి పోతాము , మరి బస్సు డ్రైవర్ మరియు కండక్టర్  ఎన్నో ట్రిప్పులు చేస్తారు , వారు కూడా చాల  అలసి పోతారు కావున ట్రిప్ - ట్రిప్ కు కొంత టైం ( time between each trip )  ఇవ్వాలి . వారికి ముంబాయి లో లాగ ప్రోత్సహించాలి . ఒక క్యాషియర్ కు రిస్క్ అలవెన్స్ ( risk allowance ) ఇస్తారు కదా ! మరి డ్రైవర్  ఇంత మంది ప్రయాణీకుల ప్రాణాల రిస్క్ తీసుకుంటాడు కదా .

ఇక బస్సు పాసులు విద్యార్థులకు గాని సామాన్యులకు గాని ప్రతి రోజు ఇస్ష్యు చేయాలి , అక్కడి నుండి ఒక నెల వ్యాల్యు  అయేటట్లు చూడాలి , రైల్వే లు ఇస్తున్నట్లు చేస్తే  బస్సు ప్రయాణికులకు టెన్షన్ ఉండదు , అందరు సంతోషిస్తారు .

ఈ పైన చెప్పినవన్నీ మన సి యం   కె సి ఆర్  గారు ఆచరణలో పెట్టిచ్చి ఎక్కడ లేని విధముగా తొందరగా ప్రజా రవాణా  కు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాము . 

Many many thanks to our beloved Hon'ble CM,  Sri. KCR gaaru 
for your restless efforts for very good public transport system and for traffic control in our capital city Hyderabad.

                                                                               - www.seaflowdiary.blogspot.com











No comments:

Post a Comment