Thursday, August 21, 2014

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే
                                                                                                                                      21-08-2014

ప్రపంచములో మొట్టమొదటి సారి కని విని ఎరుగనటువంటి విధముగా నిర్వహించిన కుటుంబ సమగ్ర సర్వే  కె సి ఆర్ పై తెలంగాణా ప్రజలు చూపిన అపూర్వ నమ్మకం, ఇది  ప్రపంచ రికార్డ్ సృష్టించింది . ఇదొక గొప్ప సంఘటన ,  దీని ద్వారా తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని చాటుకున్నారు . తమ బంగారు భవిష్యత్తు కు బాట వేసుకున్నారు .  కె సి ఆర్ ఇలా అనుకున్నారో లేదో అలా  సర్వే చేసి నిరూపించారు .

ప్రజలందరూ తమ తమ సొంత ఊ ళ్ల కు కష్టాలను కూడా లెక్క చేయకుండా పిల్లా పాపలతో బస్సు టాప్ ల పై కూడా ఎక్కి ప్రయాణించి తమ ఇంటికి చేరుకొని 19-08-2014 నాడు ఎన్యుమరేటర్లు ఎప్పుడు ఇంటికి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటారా అని ఎదురు చుశారు. ఇతర రాష్ట్రాల నుండి స్పెషల్ బస్సులు వేసికొని, ఇతర దేశాల నుండి స్పెషల్ ఫ్లైట్ లు వేసుకొని అక్కడ నివసించే తెలంగాణా ప్రజలు తమ ఊరికి వచ్చారంటే వారికి తెలంగాణా అంటే ఎంత  ప్రేమో తెలుస్తుంది, కె సి ఆర్ అంటే ఎంత అభిమానమో  .   అనుకున్నట్లుగానే ఎనుమరేటర్లు వచ్చారు అందరి పేర్లు  ఒక్క రోజులో నమోదు చేశారంటే ప్రపంచం లోనే ఒక అద్భుతం  తప్పకుండ గిన్నిస్ బుక్ లో ఎక్కుతుంది .

ఈ కార్యక్రమములో టాప్ టు బాటం వరకు పాల్గొన్నారు , గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు , మంత్రులు , కలెక్టర్లు , పోలీస్ అధికారులు ,సినిమా యాక్టర్లు ,మహామహులు , ఆఫీసర్లు , అధికారులు , విద్యార్థులు ,వ్యాపారులు మరియు సామాన్య ప్రజలు  ఒక్కరేమిటి అందరు పాల్గొని విజయవంతం చేశారు . ఎన్యుమరేటర్ల ను స్వయం గా ఇంట్లోకి ఆహ్వానించి  వివరాలను అందజేశారు .

ఈ సర్వే వలన తెలంగాణా కు  సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయుటకు ఆస్కారమేర్ప డు  తుంది .  ఎంత మంది బి సి లు ,యస్ సి లు ,యస్ టి లు వికలాంగులు ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది . సర్వే కంటే ముందు ఉన్న లెక్కలు ఎప్పుడో తీసినవి, అవి ఇప్పుడు పనికి రావు . ఎంతమంది పెన్షన్ కు అర్హులో , ఎంత మందికి ఇళ్ళు కట్టాల్సి ఉందో ,ఎంత మంది విద్యార్థులకు ఫీజు  చెల్లించాలొ , ఎందరు రైతులకు రుణ మాఫీ చేయాలో ,చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో  వారి సంక్షేమం గురించి,వితంతువుల పెన్షన్ ,వికలాంగుల పెన్షన్ గురించి  ఇప్పుడు చాల క్లియర్ గా తెలిసి పోయింది  మనకు ఎంత కరెంట్ అవసరమో ,త్రాగు నీరు ,సాగునీరు ఎంత కావాలో, ఎన్ని రేషన్ కార్డులు కావాలో , ఎంత మంది నిరుద్యోగులో  వారి వయసెంతో ఇంకా ఏమైనా పెంచాలో తెలసింది ,దీనిని బట్టి ప్లాన్ చేయడం చాల సులువు అప్పుడే అర్హులందరికీ  న్యాయం చేయవచ్చు . అసలు లబ్ది దారులకు అందకుండా అక్రమార్కుల బొక్కసాల్లోకి వెళ్తున్న ప్రభుత్వ నిధులను పేదల అభ్యున్నతికి మళ్ళించవచ్చు .  మన హైదరాబాద్ లో పాత లెక్కల ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉంటె  1లక్ష 10వేల రేషన్ కార్డులు ఉన్నాయి మరియు కార్డుల గురించి ఇంకా అప్లికేషన్ లు పెండింగ్ లో చాల  ఉన్నాయట .

ఈ సర్వే ఆధారం గా భవిషత్తు లో హైదరాబాద్ సమగ్ర ప్రణాలికను రూపొందించి విశ్వ నగరం  గా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు . ఈ సర్వే తో హైదరాబాద్ లో జనాభా తో బాటు ఇండ్ల సంఖ్య పెరిగింది , దీని కనుగుణంగా రోడ్లు ,సివేరేజ్ , పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , డ్రింకింగ్ వాటర్  ఫెసిలిటీ కల్పనకు అవకాశం ఏర్పడింది . ఈ సర్వే తో నిజమైన లబ్ది దారులకు ప్రభుత్వ పథకాల ఫలితాలందు తాయి . కొందరు ఆంధ్రా సోదరులు సైతం సంతోషంగా సర్వేకు సహకరించారు . ఎపి ముఖ్యమంత్రి గారు కూడా సర్వే లో పాల్గొని సహక రించారు . సర్వేకు ఎన్యుమరేటర్లె కాకుండా స్వచ్చంద  సంస్థలు , తెలంగాణా జర్నలిస్టుల ఫోరం , తెలంగాణా గజిటెడ్ అధికారుల సంఘం , కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు కూడా పాల్గొని విజయవంతం చేశారు .యావత్ తెలంగాణ ప్రజలు చూపిన ఈ స్పందన అపూర్వమని చెప్పిన సి ఎం , భవిష్యత్తులో ఇదే రీతిలో సహకరిస్తే బంగారు తెలంగాణా సాధించి తీరుతానని చెప్పారు . ఎలాంటి ప్రతి ఫలం ఆశించ కుండా అంకిత భావం తో సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అన్నారు . ఒకే రోజు నాలుగు లక్షల మంది ఎన్యుమరేటర్లు స్వచ్చందంగా 99 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించడం ప్రపంచం లో ఎక్కడ జరుగలేదు . ఈ సర్వే సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశం తో చేస్తున్నామని  ఎవరి పైన కక్ష్య సాధింపు చర్యల కోసం కాదని , గతం లో జరిగిన అక్రమాలు బయట పడేందుకు ఆస్కారం ఉందని హొమ్ మంత్రి గారు కూడా చెప్పారు . 

అయితే సర్వే చేస్తామన్న నాటి నుంచి కొందరు రాష్ట్రేతరులు , తెలంగాణా లోని సీమాంధ్ర పెత్తనం లోని పార్టీలవారు ,ఇతర పార్టిలవారు కూడా సర్వేకు వ్యతిరేకం గా అనేక అనుమానాలను ,భయాలను రేకెత్తించ డానికి ప్రయత్నాలు చేశారు . తెలంగాణా లోని కొన్ని పార్టీల వారు కూడా సర్వే కు రాద్దాంతం చేశారు . ఒక నాయకుడు పనికిమాలినదని ఇంకొకరు ఏకపక్షం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు . హైదరాబాద్ లో కొందరు సెటిలర్లు సర్వేకు సహకరించలేదు మరి కొందరు ఇళ్ళకు తాళాలు వేసికొని వెళ్ళిపోయారు . సర్వే ఫార్మ్ కూడా చాల సులభంగానే యున్నది . బ్యాంకు వివరాలు స్వచ్చంద మని గౌ . నీ  న్యాయస్థానం కూడా చెప్పింది, ప్రభుత్వం కూడా దానిని ఇచ్చికం చేసింది   కదా ఇక సందేహమెందుకు . అందులో ఒక కాలం ఈ ప్రాంతం లో ఎప్పటి నుండి నివసించు చున్నారో కూడా పెడితే  చాలా బాగుండేది .  సర్వే కు సహకరించని వారు తెలంగాణా లో టూరిస్టు ల్లా మిగిలిపోతారన్నారు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు , ఇలాంటి సర్వే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేపట్టడానికి వారితో మాట్లాడు తానని అన్నారు.   ఇంకా మిగిలిన వారికి కూడా సర్వే రెండవ రోజు పూర్తి చేశారు . 

సమగ్ర కుటుంబ సర్వే ఒక సూపర్ హిట్ ,  గినిస్ రికార్డ్ , తెలంగాణా ప్రజలందరు కె సి ఆర్ పై పూర్తి నమ్మకం ఉంచారు . 

                                                            www.seaflowdiary.blogspot.com

  











No comments:

Post a Comment