జన భవన్ - ప్రజాభవన్
30-07-2014
మన దేశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నది కదా . మరి అలాగే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది . మొత్తం దేశానికి సార్వభౌమాధికారి రాష్ట్రపతి గారే .
ప్రజలచేత ఎన్ను కోన బడిన యం .పి లు తమ నాయకుడి ని ఎన్ను కుంటారు. ఆయనే ప్రధాన మంత్రి గారు, అతను కేంద్ర మంత్రులను రాష్ట్రపతి ఆమోదం తో నియమించు కొని ప్రభుత్వం ఏర్పాటు చేసి పరిపాలిస్తారు . .
రాష్ట్రపతి గారి ఆఫీసు మరియు రెసిడెన్సి ఒకే దగ్గర ఉంటాయి దానిని "రాష్ట్రపతి భవన్" అని పిలుస్తారు . రాష్ట్రపతి గారు హైదరాబాద్ లో విడది కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే విడది ని "రాష్ట్రపతి నిలయం" అంటారు .
ఇక ప్రధానమంత్రి ఆఫీస్ నార్త్ బ్లాక్ లో ఉంటుంది దానిని " పి . యం. వో ". అని పిలుస్తారు . కాని ఆయన రెసిడెన్సి కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు లేదు ఆయన ఎక్కడ నివాసం ఉంటె అక్కడే . అందుకే ఒక ప్రత్యేక శాశ్విత భవనాన్ని దేశ రాజధాని లో నిర్మించి ప్రధాన మంత్రి గా ఎవరు వచ్చిన అందులోనే నివాసం ఉండేటట్లు చెయాలి .
అలాగే రాష్ట్రం లో ప్రజలు ఎన్నుకొన్న యం.ఎల్.ఎ లు తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు . ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, ఆయన రాష్ట్ర గవర్నర్ ఆమోదం తో రాష్ట్ర మంత్రులను నియమించుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తారు .
ఇక్కడ రాష్ట్రం లో గవర్నర్ గారి రెసిడెన్సి మరియు ఆఫీసు ఒకే దగ్గర ఉంటాయి దానిని " రాజ్ భవన్ " అని పిలుస్తారు .
. మరి ముఖ్యమంత్రి గారి ఆఫీసు సెక్రటేరియట్ లో ఉంటుంది , దానికి స్పెషల్ పేరు ఏమిలేదు దానిని " సి . యం చాంబర్ " అంటారు . ముఖ్యమంత్రి గారి నివాస భవనాన్ని " సి . యం . క్యాంప్ ఆఫీస్ " అని పిలుస్తున్నారు .
ఇక్కడ చేప్పేదేమిటంటే ప్రధాన మంత్రి నివాస భవనమును మరియు ముఖ్య మంత్రి నివాస భవనమును ప్రత్యేక పేర్లతో పిలిస్తే చాల బాగుంటుంది . వీరిద్దరూ ప్రజలచేత ఎన్నుకోన బడినవారు కదా ! అందుకే
ప్రధాన మంత్రి గారి నివాస భవనానికి " జన భవన్ " అని ముఖ్య మంత్రి గారి నివాస భవనమును క్యాంప్ ఆఫీస్ బదులుగా "ప్రజా భవన్" అని పేరు పెట్టి పిలిస్తే చాలా బాగుంటుంది, ప్రజలందరు కూడా సంతోషిస్తారు .
కావున ప్రభుత్వము ఒక సారి ఆలోచించి వీటికి ఆ పేర్లు పెట్టాలని కోరుచున్నాను.
కావున ప్రభుత్వము ఒక సారి ఆలోచించి వీటికి ఆ పేర్లు పెట్టాలని కోరుచున్నాను.
- www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment