మన హైదరాబాదు
17-08-2014
భాగమతి పేరుతో భాగ్యనగరం గా ఏర్పడి తరువాత హైదరాబాదు గా మారి నాలుగు వందల సంవత్సరాలు దాటినది . నాల్గు వందల సంవత్సరముల ఫంక్షన్ కూడా మనం ఘనంగా జరుపుకున్నాము కూడా . గోల్కొండ కోటను కాకతీయులు నిర్మించి తమ ఆధీనం లో పరిపాలించారు . కాలక్రమములోగోల్కొండ కుతుబ్ షాహి రాజుల పాలనలోనికి తరువాత మరియు అసఫ్ జాహి రాజుల పాలన లోకి వెళ్లి , వారు హైదరాబాదు ను రాజధాని గా పరిపాలించారు.
అప్పటి జనాభా చాల తక్కువ, ఐనా వారు ప్రజలకు అవసరాలకు మించి అభివృద్ధి చేశారు . తరువాత కొంత కాలానికి ఎంతో మంది దేశం నలుమూలల నుండి జీవనోపాధి కొరకు , వ్యాపారం కొరకు ఇక్కడకువచ్చి స్థిరపడ్డారు ఇక్కడ గోల్కొండ కోట అంగట్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట . కోహినూర్ వజ్రం కూడా ఇక్కడిదే .దేశ -విదేశాల వారు వచ్చి ఇక్కడ వ్యాపారం సాగించేవారు .
క్రమంగా జనాభా వృద్ధి చెంది మహానగరం అయినది .ఇప్పుడున్న రాజ భవనములు , విశ్వవిద్యాలయం ,పెద్ద పెద్ద జలాశయాలు, త్రాగునీరు సౌకర్యం , మురుగు నీటి వ్యవస్థ , రైల్వే లు , బస్సులు ,విద్యుత్తు మరియు విమానాశ్రయాలు అప్పటి నిజాం కాలం లో అభివృద్ధి చేసినవే . మనకు స్వాతంత్ర్యం రాకముందే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినది . అప్పుడే మన హైదరాబాదు నగరం దేశం లో ఐదవ పెద్ద నగరముగా పేరు గాంచినది . అప్పటి జనాభా కు ఇవన్ని సదుపాయాలూ సరిపోయినాయి .
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు జనాభా అనూహ్యంగా దిన దినాభి వృద్ధి జరిగి ప్రస్తుతం కోటి జనాభా వరకు పెరిగినది కాని జనాభా పెరిగిన నిష్పత్తి లో సరిపడా సౌకర్యాలు పెంచ బడ లేవు . అప్పటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికి మనం ఉపయోగించుచున్నాం. చిన్న వర్షం పడిన రోడులన్ని నీటి తో నిండి జలాశయాలు గా మారి రవాణా వ్యవస్థ నిలిచి పోయి గంటలకు గంటలు ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారు . లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్ళలోకి నీరు చేరి ప్రజలు సర్వం కోల్పోయి అష్ట కస్టాలు పాడుచున్నారు .
జంట నగరాలలో రోడ్లు చాలావరకు ఆనాడు వేసినవే, కొద్ది కొద్ది గా రోడ్ ను ఆక్రమించి కట్టడాలు కట్టినందువలన దారులు చాల సన్నగా ఇరుకిరుకుగా మారినవి . ఏవో కొన్ని రోడ్లు వెడల్పు చేసినా అవి ప్రస్తుతం సరిపోవడం లేదు . ఇంతమంది ప్రజలు , బయటి నుండి వచ్చినవారు ,సైకిళ్ళు ,రిక్షాలు ,ఆటోలు , కార్లు మరియు బస్సులు ఈ సన్నని రోడ్ ల పైనే వెళ్ళాలి . ముందే సన్నగా అందులో రోడు పై ఇష్టం వచ్చినట్లు అటు ఇటు వాహనాలు పార్క్ చేస్తారు . పళ్ళు అమ్మేవారు ,కూరగాయలు అమ్మేవారు ,ఇతర చిరు తిండ్లు అమ్మేవారు ,పూలు అమ్మేవారు ,తోపుడు బండ్లవారు , చిల్లర వస్తువులు అమ్మేవారు, చాట్ అమ్మేవారు-తినేవారు ఈ ఇరుకు రోడ్ల పైనే . ఇంకా ఎంతో మందికి ఈ ఇరుకు రోడ్లే ఉపాధి కల్పిస్తున్నాయి . ఇక ఫుట్ పాత్ లు అక్కడి షాపు వాళ్ళవే, వారు తమ సామానులన్ని ఫుట్ పాత్ పై వేసి ఫుట్ పాత్ నే మూసేస్తు ఆక్యుపై చేస్తున్నారు . ఇక ప్రయాణికులు రోడ్ పైనే నడవవలసి వస్తున్నది , దానివల్ల సన్నని రోడ్లు ఇంకా సన్నబడి ట్రాఫిక్ మొత్తం జామ్ అవుచున్నాది . ఈ రోడ్ పై అమ్మేవారు తమవెనుక ఇంకా స్థలం ఉన్న వెనుకకు జరగకుండా ముందుకే జరిగి రోడ్ పై పెట్టి అమ్ముతుంటారు . కొన్నిసార్లు అంబులెన్స్ లు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కోవలసి వస్తుంది , మరి అందులోని రోగి పరిస్థితి హాస్పిటల్ వెళ్ళేవరకు ఎలా ఉంటుందో ఊహించాలి .
ఇక్కడి రోడ్లు కూడా స్మూత్ గా సాఫ్ గా ఎం ఉండవు , గుంటలు గుంటలుగా ఏర్పడినా అలాగే వెళ్ళవలసి వస్తుంది . ఆ గుంత మరి పెద్దగ అయి ఎవరో ఒకరు అందులో పడినప్పుడే వాటికి మరమ్మతులు చేస్తారు , కొద్దిగా అయినప్పుడే చేస్తే కొద్ది సమయములో కొద్ది ఖర్చు తో బాగుచేయ వచ్చుకదా! కావున నిరంతర అబ్సర్వేషన్ పెట్టి ఎప్పటికప్పుడు రోడ్ రిపేర్ చేయాలి .
రోడ్ వెడల్పు చేసినప్పుడు అడ్డువచ్చే చెట్లు మరియు ఎలక్ట్రికల్ పోల్స్ ని రెండు లేదా మూడు అంగుళాలు భూమి పైకి వదలి కోస్తారు, అది అలాగే భూమి పై తేలి ఉంటుంది , దాని పై నుండి సైకిళ్ళు , కార్లు ,స్కూటర్లు వెళ్ళవలసి వస్తుంది ,దానివలన వాటి టైర్ లు పాడగుచున్నవి . కనీసం భూమి లెవెల్ కు కోయడం గాని భూమి లోనికిలోనికి కొట్టడం గాని చేయాలి, అది కూడా చేయలేరు . ఇక చౌరస్తా లలో 90 డిగ్రీల మలపులు ఉంటాయి , బస్సులు మరలడం చాల కష్టంగా ఉంటుంది . పోనీ ప్రక్కన ఖాళి స్థలం ఉన్నా వెడల్పు చేయరు . వాటిని కనీసం 120-130 డిగ్రీల మలుపు చేయాలి , అప్పుడే ఈజీ గా మలుపు తిరుగోచ్చు . ట్రాఫిక్ ను తొందరగా పంపొచ్చు .
ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా వస్తాయి, నగరం లోని అన్ని సిగ్నల్స్ ఒకే విధముగా వచ్చేటట్లు అన్ని చౌరస్తా లలోఏర్పాటు చేయాలి . ఇక కొన్ని చౌరస్తా లలో లెఫ్ట్ ఫ్రీ ఉంటుంది మరికొన్ని చోట్ల సిగ్నల్ వస్తేగాని వెళ్ళడానికి లేదు . అన్ని చోట్ల లెఫ్ట్ ఫ్రీ పెట్టాలి ,రైట్ వెళ్ళేవారు లెఫ్ట్ కు రాకుండా చేయాలి అప్పుడే ట్రాఫిక్ క్లియర్ గా మొవ్ అవుతుంది .
ట్యాంక్ బండ్ ను ఆ పుణ్యాత్ముడు ఎన్ టి అర్ గారు వెడల్పు చేసి బాగు చేశారు ఐనా అది ప్రస్తుత ట్రాఫిక్ కు సరిపోవడం లేదు కావున ఇప్పుడు ఉన్నట్యాంక్ బండ్ రోడ్ కు ప్యారేలేల్ గా మరొకటి ట్యాంక్ సైడ్ రోడ్ నిర్మించినట్లు అయితే , ఒకటి పోవడానికి మరొకటి రావడానికి ఉపయోగించవచ్చు . ట్యాంక్ బండ్ పై రాత్రుల్లో లైటింగ్ సరిగా లేక మినుకు మినుకు మంటు చీకటి గా ఉంటుంది . వినాయక చవితి కి లైట్లు ఎలా జిగేలు మంటాయో అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి . అదే కాకుండా మరొక రోడ్ సికింద్రాబాద్ సైడ్ నుండి ట్యాంక్ బండ్ మధ్య( జలాశయం ) నుండి ఒకటి సెక్రెటేరియట్ కు ఇంకొకటి ఖైరతాబాద్ కు వై షేప్ లో వేస్తె ప్రజలు ఎంతో సంతోషిస్తారు, ట్రాఫిక్ , టైం,మరియు ఫ్యూయల్ కలసి వస్తుంది . ఇంకొక విషయం బేగంపేట్ విమానాశ్రయం సిటి మధ్యలో ఉంది , ఇటు నుండి అటుప్రక్క వెళ్ళాలంటే కనీసం 9-10 కి మీ చుట్టూ ప్రయాణించి వెళ్ళాలి . కావున ఎయిర్ పోర్ట్ బౌండరీ చుట్టూ ఒక రహ దారి నిర్మించినచో ఎంతో సౌలభ్యం అవుతుంది . ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు ఈ విషయాన్ని ఒక సారి పరిశీలించి తగిన చర్య తీసుకొనగలరని కోరుచున్నాను .
హైదరాబాద్ లో చాలా రోడ్లు చాలా కాలనీలు ఉన్నాయి కదా , చాల పెద్ద నగరం కదా కాని మనం ఒక కాలని కో లేదా ఒక ముఖ్య ప్రదేశాని కో వెళ్ళాలను కోండి , రోడు పైకి వచ్చి చూస్తె ఎటు దిక్కు వెళ్ళాలో చూపెట్టే ఒక్క బోర్డ్ (డెస్టినేషన్ )కనిపించదు . చౌరస్తా లో కూడా నాల్గు దిక్కులలో ఎ దిక్కు కు వెళ్ళితే ఎం వస్తుందో కూడా బోర్డు లు ఉండవు . కాని చౌరస్తా లో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి అడ్వర్ టైస్ మెంట్ లు చేస్తారు . కనీసం ఆ హోర్డింగ్ క్రింద ఆ దిక్కు ఎటు పోతుందో కూడా వ్రాయవచ్చు కదా ! అక్కడ మనకు కనిపించినవారిని అడిగి మనం వెళ్ళవలసి వస్తుంది. సిటి కి క్రొత్త వారి సంగతేమిటి ? మరీ ఇంత అధ్వనమా ! ఎక్కడో ఒక చోట బోర్డ్ పెట్టారనుకోండి అది తెలుగు లోనే ఉంటుంది . కనీసం అక్కడ రీజినల్ ,నేషనల్ మరియు ఇంటర్నేషనల్ భాషలో వ్రాయాలి . మనం త్రిభాషా సూత్రం ను పాటిస్తున్నట్లు చేస్తే ప్రక్క నున్న రాష్ట్రాలు కూడా మనపద్దతిని అనుసరించ వచ్చు . మనం చెన్నై గాని బెంగళూరు గాని ముంబాయి గాని లేదా ఉత్తర భారత దేశం వెళితే అక్కడి భాష రాక ఉన్న భాష తెలియక ఎంత కష్ట పడతామో మనం ఆలోచించు కోవాలి .
ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల వద్ద తప్ప ఎక్కడ ఇలాంటి మూడు భాషలు ఉపయోగించరు ఎందుకు?. దానికి ఖర్చు అవుతుందా? మన దేశం లో మరియు పెద్ద నగరాలలో ఎన్నో భాషల వారు నివసిస్తున్నారు . అందరికి అన్ని భాషలు రావాలని ఎం లేదు . అందుకే త్రిభాష సూత్రాన్ని ఖచ్చితం గ వాడాలి . అందుకు మన తెలంగాణా రాష్ట్రం ముందుండాలి . అప్పుడే హైదరాబాద్ అంటే దేశ ప్రజలకు ఒక అభిమానం కలుగుతుంది . మన మధ్య ప్రేమ ఏర్పడుతుంది అప్పుడే సంకుచిత భావం పోతుంది . ఐకమత్యం పెంపొందుతుంది .
ఇక మన నగరం లో ఒక సారి సికిందరాబాదు ఒక చివరి నుండి హైదరాబాద్ కు పని మీద వెళ్లి తిరిగి బస్సులో రావాలంటే ఒక రోజు పడుతుంది, ఎందుకంటే బస్సులు సరిగా ఉండవు , ఎప్పుడు వస్తుందో తెలియదు , వచ్చిన బస్సును మిస్ చేస్తే ఇంకో బస్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు . అందుకే ప్రతి ఒక్కరు ఆ వచ్చిన బస్సు లోనే ప్రయాణం చేయడం వలన ఆ బస్సు లో పరిమితి కి మించి ఓవర్ లోడ్ అవుతున్నది, కావున వెనుక వచ్చే బస్సులు ఖాళీగా వెళ్లుచున్నవి. డైరెక్ట్ బస్సులు లేనందువలన రెండు లేక మూడు బస్సులు ఎక్కి గమ్య స్థానం చేరుకో వలసి వస్తుంది . పిల్లలతో కలసి ప్రయాణం ఇక నరకమే . ఆటో లో వెళ్ళాలంటే జేబులు ఖాళియే . పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేనందువల్ల ప్రతి ఒక్కరు స్వంత వాహనాలు కొనుక్కోనుచున్నారు .మోటారు సైకిళ్ళు ,కార్లు విపరీతంగా రోడు పై వచ్చి చేరుతున్నవి. ఇక బస్సు లో స్కూల్ కి గాని కాలేజ్ కు వెళ్ళే విద్యార్థుల సంగతి చెప్ప నలవి కాదు . బస్సులో మరియు బయట వ్రేలాడుతూ ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలి .ఎందుకంటే బస్సులు టైం కి ఉండవు ,ఎక్కువమంది విద్యార్థులు ఉంటారు . వారి ప్రాణాలకు ముప్పు పొంచి యున్న తప్పదు మరి, అసలు విద్యార్థులను పట్టించు కొనే వారు లేరు . గంటలకు గంటలు ప్రయాణం చేసి అలసి అలసి కాలేజ్ లో ఎలా చదువగలరు? మళ్ళి ఇంటికి ఎప్పుడు చేరగలరు , ఎప్పుడు హోం వర్క్ చేయగలరు ,ఎప్పుడు చదివి తిని పడుకోనగలరు? ఇక బస్సు స్టాప్ లలో బస్ స్టాప్ పై ఏరియా పేరు వ్రాయరు . క్రొత్త వారికి బస్ ఎక్కడ దిగాలో తెలియదు . అక్కడి ఏరియా పేరు కూడా వ్రాస్తే క్రొత్త వారికి ఆ ఏరియా సులభంగా తెలుస్తుంది . బస్సు దిగడానికి అనుకూలం గా యుంటుంది .
మన నగరం లో ఇక ఆటో ల గురించి చెప్పనలవి కాదు , ఎంత చెప్పినా తక్కువే , చాల ఆటో వారు మనం అడిగిన చోటు కు రారు , ఊరికె కూర్చుంటారు గాని రారు . ఒకవేళ వస్తే అతను అడిగినంత ఇవ్వాల్సిందే.
ఇక సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ సైడ్ పోవాలంటే కనీసం 5-6 రైల్వే బ్రిడ్జి క్రింద నుండి వెళ్ళాలి , అంటె మనం ఎక్కడ ఉన్నా కంపల్సరీ ఈ బ్రిడ్జి క్రింది నుండే పోవాలి , కొన్ని చోట్ల అవి వెడల్పు లేవు ,ముఖ్యముగా రాణి గంజ్ ,బైబిల్ హౌస్ మరియు భోయిగూడ రైల్వే బ్రిడ్జి లు చాల సన్నగా ఉండడం వలన అక్కడ ట్రాఫిక్ నిలిచి పోతుంది . కావున వాటిని అత్యవసరముగా వెడల్పు చేయాలి .
మరికొన్ని రోడ్లు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించు కొనడం లేదు . ఉదా :- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్ బాలానగర్ నుండి బొయిన్ పల్లి వరకు ఖాళి గా ఉంటుంది , చాల కాలం క్రిందట ఈ రోడ్ నుండి డిస్ట్రిక్ట్ బస్సులు వెళ్ళేవి , సిటి బస్సులు ఏరో డ్రం గుండా విమానం రానప్పుడు వదిలేవారు ., ఇక్కడ ఒక గార్డ్ ఉండి కంట్రోల్ చేసేవాడు . ప్రస్తుతం విమానాలు లేవు కదా ఎప్పుడో ఒక సారి రెండు మూడు రోజుల కొకసారి వస్తాయి కదా , ఇప్పుడు కూడా గార్డ్ ను పెట్టి ఇంతకు ముందు లాగ ఏరో డ్రం ద్వారా ట్రాఫిక్ ను వదిలితే 10 కి మీ కలసి వస్తుంది . ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు ఈ విషయాన్ని కూడా ఒక సారి పరిశీలించి కేంద్రం తో చర్చించి తగిన చర్య తీసుకొనగలరని కోరుచున్నాను .
సికిందరాబాద్ లో రైల్వే ఆస్తులు , డిఫెన్సు వారి ఆస్తులు చాలాయున్నవి . వారు వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టినారు, ఈ స్థలము చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ ను వీలును బట్టి కనీసం 10-20 మీటర్లు వెనుకకు జరిపి చుట్టూ మల్గి లు కట్టి రెంట్ కు ఇస్తే ఎంతో డబ్బు సంపాదించవచ్చు మరియు రోడ్ విశాల మవుతుంది . ఈ విషయాన్ని రైల్వే వారు కూడా ఆలోచిస్తున్నారు . అలాగే సికింద్రాబాద్ లో మహబూబ్ కాలేజ్ చుట్టు ఉన్న ప్రహారి గోడను కూడా వెనుకకు జరిపి చుట్టూ మడిగేలు కట్టి కిరాయకు ఇస్తే ఆ డబ్బు తో కాలేజ్ బిల్డింగ్ లు మెయిన్ టెన్ చేయవచ్చు .
ఇక హుసేన్ సాగర్ లో పాసెంజర్ పడవలు ఈ కోన నుండి ఆ కోన వరకు నడిపి కొంత ట్రాఫిక్ ను క్లియర్ చేయవచ్చు, హైదరాబాద్ కు అందాన్ని కూడా ఇనుమడింప చేయవచ్చు .
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య గురించి గత ప్రభుత్వాలు అసలు పట్టించు కోలేదు.
కాని మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు హైదరాబాద్ ను సింగాపూర్ సిటి గా మారుస్తామంటున్నారు ,ప్రజలందరికి ముఖ్యమంత్రి పై చాల నమ్మకము ఉంది. ప్రస్తుతం మేనిఫెస్టో లో చెప్పిన వాటి నన్నింటిని అమలు పరుస్తున్నారు , చాల సతోషం, జంట నగరాల మరియు తెలంగాణా ప్రజలందరు ఆయనకు ఎంతో రుణ పడి యుంటారు . కావున దయ చేసి పై న చెప్పిన విషయాలన్నింటి ని ముఖ్యమంత్రి గారు ఒకసారి ఓపికతో చూసి అమలు చేయిస్తారని ఆశించుచున్నాను .
- www.seaflowdiary.blogspot.com
Excellent sir
ReplyDeleteExplained very well a good vision over our city yes sir certainly tank bund projects would help us solve many traffic problems and thinking has has a lot of vision which would make our city much more better really great thoughts shared by you sir m
ReplyDelete