టాప్ 10 భారత టెక్ బిలియనీర్లు
Date :29-09-2015
భారత్‌లో అత్యంత ధనవంతులైన టెక్ బిలియనీర్ల టాప్-10 జాబితాను ఫోర్స్ మ్యాగ్‌జైన్ ఇటీవల విడుదల చేసింది.
ఈ జాబితాను చూసి దేశం ధనవంత దేశం అయినట్లా ? 125 కోట్ల ప్రజలలో ఎంత మంది ధనవంతులు ఉన్నారు . ధనవంతుడు అనేదానికి ఒకప్పుడు T V ఉంటే , FAN ఉంటే ధనవంతుడి క్రింద లెక్కలు వేశారు కాని నేడు ఒక చిన్న కారు ఉన్నా ధనవంతుడు కాలేడు , అతడు ఒక సామాన్యుడి క్రిందే లెక్క . ఎందుకంటే నెల నెల వచ్చే జీతంలో కొంత మిగిల్చుకొని లేదా E M I ద్వారా కొంటున్నాడు . అయినా అతడు ఒక విధంగా అదృష్టవంతుడే . ఇలాంటి వారు కేవలం కొంతమందే ఉంటారు .
కాని బిలియనీర్ల ను వేళ్ళ పై లెక్కించవచ్చు . ఇలాంటి వారి జాబితాను ఫోర్స్ మ్యాగ్‌జైన్ విడుదలచేస్తుంది ,దానికి ఇంకా వేరే పనులు లేవా ? దేశం లో అసలు ఎంతమంది బీద వారు ఉన్నారు లెక్కలు ఎందుకు వేయదు ? కనీసం వారికి రోజు తిండి దొరుకుతున్నదా ? ఉండడానికి ఇల్లు ఉందా ? ఉద్యోగం ఉందా ? ఈరోజు ఉద్యోగం ఉంటే రేపు కూడా ఈ ఉద్యోగం ఉంటుందనే గ్యారంటి ఉందా ? వచ్చిన జీతం కుటుంబమంతటికి సరిపోతుందా ! పండగకు క్రొత్త బట్టలు కొనే స్తోమత కూడా చాలా మందికి లేదు, ఆ స్తోమత ఉంటే మార్కెట్ లో పాత బట్టల షాప్ లు ఎందుకు ఉంటాయీ ?
అందరికి అన్నం పెట్టె రైతుకు వేసిన పంట చేతికి వస్తుందా అనే నమ్మకం లేదు. వచ్చినా ఆ పంట అమ్ముటకు పండించిన రైతుకు ధరను ఖరారు చేసే అధికారం లేదు . ఖచ్చితముగా ఇంత ఆదాయం వస్తుందని రైతుకు భరోసా లేదు . కాని మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి . ఉల్లిగడ్డ ధర ఆకాశాన్ని అంటింది కదా మరి ఉల్లి పండించిన రైతు కోటీశ్వరుడు కావాలి .
రాత్రింబవల్లు కష్టపడి పండించిన ధాన్యం ధర ను బడా బాబులు నిర్ణయిస్తున్నారు . ఉద్యోగులను ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగం నుంచి తీసివేయడం వీరి పనే . చేనేత కార్మికుల బ్రతుకు కూడా ఇంతే !
బడా బాబులకు పెద్ద పెద్ద కంపనీలు ఉంటాయి కదా , వారి ఉత్పత్తి ధరలను ముందే నిర్ణయించి ఈ సంవత్సరం ఇంత వస్తుందని ముందే తెలుస్తుంది , వారికి గ్యారంటి గా ఇంత సంపాదిస్తామని ఖచ్చితం గా చెప్పగలరు . అదే రైతు చెప్పలేడు . ప్రభుత్వం కూడా ఈ బడా బాబులకే సహకరిస్తుంది . బడా బాబులు బిలియనీర్లు అయితే మనదేశం లోని ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా ? వారి జీవితాలు ఏమైనా బాగుపడతాయా ?
ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రజలను ప్రభుత్వం పై వదలి వేసి చేతులు దులుపు కోవడం కాదు , ఆ ప్రజల ద్వారానే ఇంత వారము అయ్యామని వీరు అనుకుంటున్న దాఖలాలు ఎక్కడా కన్పించడం లేదు .
ఈ మధ్యనే ప్రభుత్వ కోరికపై ఊళ్ళను దత్తత తీసుకొంటామని కొందరు ముందుకు వస్తున్నారు . గ్యాస్ సబ్సిడీ వదలు కొంటున్నట్లు జోరుగా ప్రచారం చేసికుంటున్నారు . గ్యాస్ సబ్సిడీ ఎంత ,కేవలం రూ . 300 లు మాత్రమే ! అది వారి ఆదాయం లో ఇది ఎంతో ఒక్కసారి మనం ఆలోచించాలి, మరి మీరేమంటారు ?
http://seaflowdiary.blogspot.com/2015/02/why-so-much-of-towards-private-04-02.html
yours ,
www.seaflowdiary.blogspot.in