Friday, August 29, 2014

Public Transport System n Traffic in Our Hyderabad

                                   మన హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు నకు శ్రీకారం

                                                       Initiation to modification of 
                                  Public Transport System  n Traffic  in Our Hyderabad            
                                                                                                                               29-08-2014
                                               
మన హైదరాబాద్ ( Hyderabad )  లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు ( change of public transport system ) నకు మన ముఖ్యమంత్రి  కె సి  ఆర్  గారు శ్రీకారం చుట్టడం చాల సంతోషం . నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చేసేందుకు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు  Hon"ble CM  KCR టాప్ ప్రియారిటి ఇచ్చినందుకు హైదరాబాద్ నగర ప్రజలందరు ధన్యవాదములు తెలుపు తున్నారు . ఇందుకు ఇప్పటికే పలు దఫాలు పోలీస్ ,రవాణా శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు అందులోని భాగంగానే ముంబాయి తరహా ప్రజా రవాణా విధానాన్ని పరిశీలించి అమలు చేయడానికి ఇద్దరు మంత్రుల నేతృత్వం లో ప్రత్యెక బృందాన్ని ముంబై పంపించారు. ప్రత్యెక బృందం లో మంత్రులు శ్రీ . నాయిని నరసింహారెడ్డి గారు గౌ. నీ హోం మంత్రి గారు Hon'ble Home Minister , శ్రీ . పట్నం మహేందర్ రెడ్డి గౌ. నీ రవాణా శాఖ మంత్రి గారు  Hon'ble Transport Minister ,  వీరితో పాటు  గౌ.  నీ . అధికారులు Hon'ble Officers రవాణా శాఖ ప్రిన్సిపాల్  సెక్రెటరి గారు , నగర పోలీస్ కమీషనర్ గారు ,  రవాణా శాఖ  కమీషనర్ గారు , ఆర్ టి సి జె ఎం డి గారు , జి హెచ్ ఎం సి కమీషనర్ గారు , ఎడిషనల్ పోలీస్ కమీషనర్ గారు, సైబరాబాద్ ట్రాఫిక్ ఎడిషనల్  కమీషనర్ గారు,   హైదరాబాద్ జె టి సి తదితరులు వెళ్ళారు.

ఈ బృందం ముంబాయి వెళ్లి అక్కడి ముంబాయి రవాణా వ్యవస్థ కు తలమానికంగా నిలచిన " ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ ట్రాన్స్పోర్ట్  విధానం బెస్ట్ ( BEST ) ను అధ్యయనం చేశారు .  బెస్ట్ జి యం  ఓం ప్రకాష్ గుప్త  డిప్యూటి జి యం  దేశ్ పాండే లతో పని తీరుని తెలుసు కున్నారు . ముందుగా ముంబాయి లోని మెట్రో స్టేషన్ , ఆర్టిసి , రైల్వే స్టేషన్ల కలయికగా ఉన్న " అంధేరీ "  జంక్షన్ ను పరిశీలించారు . అక్కడి ఆర్ టి సి బస్సు  రూట్లు , బస్సు షెల్టర్లు , బస్ బే లలో ప్రయాణికులు పాటిస్తున్న  "క్యూ "  " Q "  system  విధానాన్ని నిశితంగా పరిశీలించారు . కేవలం ముగ్గురు అధికారులు మెట్రో వ్యవస్థ తో పాటు ట్రాఫిక్ ,రోడ్డు భద్రతను జి  పి  ఆర్  స్ ( GPRS ) విధానం ద్వారా నియంత్రించే తీరును ఆసక్తి గా పరిశీలించారు  జి  పి  ఆర్  స్ విధానం ద్వారా కంట్రోల్ రూం తో ముంబై కి చెందిన  9 వేల ఆర్టిసి బస్సులు , 12 వేల మంది కండక్టర్లు , 10 వేలమంది డ్రైవర్ల పని తీరును అనుక్షణం తెలుసుకొని అవసరమైన సూచనలు అందిస్తూ నియంత్రణ చేస్తున్న తీరును పరిశీలించారు . అక్కడి ట్రాఫిక్  పోలీసులు కేవలం తొమ్మిది కేంద్రాల నుంచి యావత్తు ముంబాయి నగరం లోని ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించే పరిస్థితులను  పరిశీలించారు. స్కై వాక్  వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటున్న విషయాన్ని వారు పరిశీలించారు . ఈ అధ్యయనం మరియు పరిశీలన కార్యక్రమాన్ని రెండు రోజులు గావించి హైదరాబాదు కు తిరిగి వచ్చారు కూడా .  ఇక ఈ బృందం అధ్యయన రిపోర్ట్ ను తొందరగా సి యం గారికి అందించనున్నారు . సి యం గారు రిపోర్ట్ ను చదివి  హైదరాబాద్ ను రవాణా ఇబ్బందులు లేని నగరముగా తీర్చి దిద్దాలని , బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచాలని ధృడ నిశ్చయం తో  ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు సి యం  గారికి ఎంతో రుణ పడి యుంటారు .

మన ప్రియతమ కెసిఆర్ గారు వీటన్నిటిని అమలు చేసే ముందు ఒకసారి దయతో ఈ క్రింది సూచనలను పరిగణన లో కి తీసుకొన గలరని  కోరుచున్నాను .

మన నగరం లో చాలా వరకు  రోడ్ లన్ని సన్నగా   ఇరుకుగా ( narrow ) ఉన్నవి , ట్రాఫిక్ ఎక్కువై రోడ్లు ఇరుకుగా మారినవి . కావున అవకాశం ఉన్న చోట్ల అత్యవసరం గా రోడ్ లను వెడల్పు చెయాలి . పెద్ద పెద్ద ఇళ్లనే కూలగొట్టి వెడల్పు చేస్తున్నప్పుడు కాంపౌండ్ వాల్ ఉన్న చోట్ల వాటన్నింటిని తొలగించి  రోడ్ ను విశాలం చేయాలి  , లేదా వీలున్నంత వెనుకకు జరపాలి .  బాటిల్ నెక్ ( bottle neck )  లన్నింటిని పూర్తిగా తొలగించాలి . చౌరస్తాలను ( cross roads ) విశాలంగా చేయాలి , మలపులను ( directions ) 90 ( degree ) డిగ్రీలలో కాకుండా 110-120 డిగ్రీలలో ఏర్పాటు చేయాలి ,ఇప్పుడున్న మలుపులో  బస్సులు మరల డానికి చాల కష్టంగా ఉంది .

ట్యాంక్ బండ్ ( tank band ) ను   ఎన్ టి అర్ ( NTR ) గారు వెడల్పు చేసి బాగు చేశారు ఐనా అది ప్రస్తుత ట్రాఫిక్ కు సరిపోవడం లేదు కావున ఇప్పుడు ఉన్నట్యాంక్ బండ్  రోడ్ కు ప్యారేలేల్ గా మరొకటి ట్యాంక్ సైడ్ రోడ్ నిర్మించినట్లు అయితే , ఒకటి పోవడానికి మరొకటి రావడానికి ఉపయోగించవచ్చు  . ట్యాంక్ బండ్ పై రాత్రుల్లో లైటింగ్ సరిగా లేక మినుకు మినుకు మంటు చీకటి గా ఉంటుంది  .  వినాయక చవితి కి లైట్లు ఎలా జిగేలు మంటాయో  అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి, అప్పుడే హైదరాబాద్ అందం గా కనిపిస్తుంది .  అదే కాకుండా మరొక రోడ్ సికింద్రాబాద్ సైడ్ నుండి ట్యాంక్ బండ్ మధ్య( జలాశయం )  ( middle of the tank band ) నుండి ఒకటి సెక్రెటేరియట్ ( secretariat )కు ఇంకొకటి ఖైరతాబాద్ కు "వై " షేప్ ( Y shape ) లో వేస్తె  ఎంతో ట్రాఫిక్ తొందరగా క్లియర్ అవుతుంది దానికి ప్రజలు ఎంతో సంతోషిస్తారు, ట్రాఫిక్ , టైం,మరియు ఫ్యూయల్ కలసి వస్తుంది . ఇంకొక విషయం బేగంపేట్ విమానాశ్రయం ( air port )సిటి మధ్యలో ఉంది , ఇటు నుండి అటుప్రక్క వెళ్ళాలంటే కనీసం  9-10 కి మీ చుట్టూ ప్రయాణించి వెళ్ళాలి . కావున ఎయిర్ పోర్ట్ బౌండరీ చుట్టూ ఒక రహ దారి నిర్మించినచో ఎంతో సౌలభ్యం అవుతుంది . ప్రియతమ ముఖ్యమంత్రి  కె సి అర్ గారు ఈ విషయాన్ని ఒక సారి పరిశీలించి తగిన చర్య తీసుకొనగలరని  కోరుచున్నాను . 

మన దగ్గర అసలు ఫుట్ పాత్ ( foot path )   లు  ఉన్నాయా?  ఉంటె వాటిని షాప్ వాళ్ళు  ఎప్పుడో ఆక్యుపై ( occupy )చేశారు .  వాటిని ఖాళీ చేయించి  నడిచే  వాళ్లకు   అది  ఫ్రీ  గా ఉంచాలి , లేకుంటే వారు రోడ్ ల పైనే నడవ వలసి వస్తుంది , ఫుట్ పాత్ లేని చోట్ల ఫుట్ పాత్ లను నిర్మించి దాని మీదుగానే  నడిచే టట్లు చేయాలి .  రోడ్  పై  "జీబ్రా " క్రాసింగ్  ( " Z " crossing ) వేసి అక్కడినుండే నడిచే వాళ్ళను  క్రాస్  చేయనీయాలి , ఇప్పుడు ఉన్నట్లు ఎక్కడబడితే అక్కడ రోడ్  క్రాసింగ్ ను నిరోధించాలి .

రోడ్ కు ఇటు ప్రక్క అటు ప్రక్క ఆక్రమించుకొని చిల్లర వ్యాపారం చేయనీయరాదు . ప్రస్తుత మున్న వాటిని తొలగించాలి, లేదా సాధ్యమైనంత వెనుకకు జరపాలి లేదా వారికి స్థలం కేటాయించాలి .

రోడ్ కు రెండు ప్రక్కల ( two sides of road )ఇష్టం వచ్చినట్లు వాహనాలను ,మోటార్ సైకిళ్ళను పార్కింగ్ ( parking )నిషేధించాలి , పార్కింగ్ కు ప్లేస్ అలాట్ చేసి అక్కడే పార్కింగ్ కు అనుమతి ఇవ్వాలి .

నగరం లో రోడ్ లన్నింటిని వన్ వే లు లేకుండా   ( no  one way )  చేయాలి ,   వన్ వే ఉన్నవి తీసి వేయాలి అంటే రోడ్లన్నీ విశాలం గా చేయాలి .  ఆల్టర్నేట్ రూట్ ( alternate route ) లను ఏర్పాటు చేసి  ట్రాఫిక్ ( traffic ) ను అనుమతించాలి, కనీసం చిన్న వాహనాల నైన అక్కడి నుండి పంపాలి, దీని వలన చాల వరకు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది .

సికింద్రాబాద్  నుండి  హైదరాబాద్  వెళ్ళాలంటే  4-5  చోట్ల లో  మాత్రమే  రోడ్  ఉంది  అది  కూడా  రైల్ ఓవర్ బ్రిడ్జి ( rail over bridge ) క్రింది నుండి వెళ్ళాలి , ఎక్కడయున్న చుట్టూ  తిరిగి  ఈ బ్రిడ్జి ల  వద్దకు  వచ్చి మాత్రమే  వెళ్ళాలి . ఈ బ్రిడ్జి లు కూడా  వెడల్పు  మరియు  ఎత్తు  తక్కువగా  యుండడం వలన  ట్రాఫిక్  చాల స్లో గా  వెళుతుంది , కొన్ని సార్లు ఎంతో సేపు ఆగిపోతుంది . కావున ఈ బ్రిడ్జి లను వెడల్పు , ఎత్తులను పెంచాలి . ఇంకా కొన్నిక్రొత్త  బ్రిడ్జి లను మధ్యలో అక్కడ అక్కడ  నిర్మించాలి .

ప్రతి చౌరస్తా లలో నాల్గు దిక్కులా ( four sides of cross road )  వెళ్ళే రోడ్లకు అటు ఉండే ఏరియా లను బోర్డులపై  ( sign board ) తప్పకుండ వ్రాయాలి .  మరి యు రోడ్లలో అక్కడక్కడ రోడ్ల పేర్ల బోర్డులను ( name of the road )  వ్రాసి పెట్టాలి . దాని వలన ప్రయాణికుడు ఎక్కడ ఉన్నాడో ,ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది .



పాడైన రోడ్లను ( damaged roads ) ఎప్పటికప్పుడు రిపేర్ ( repair ) చేయాలి , ఎప్పటికప్పుడు  రిపేర్  చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది మరియు ట్రఫిక్ కు ఇబ్బంది ఉండదు .

ప్రస్తుతం మనదగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లు ( traffic signal )  ఒక్కొక్క క్రాస్ రోడ్ లో ఒక్కొక్క విధంగా వస్తాయి అలాకాకుండా అన్ని చోట్ల ఒకే పద్దతి లో ( uniform )  వస్తే ప్రయాణికులకు మంచి అవగాహన ఏర్పడుతుంది . సిగ్నల్  పై  టైం డిస్ప్లే ఏర్పాటు చేస్తే సిగ్నల్ ఎంత సేపట్లో వస్తుందో తెలిసి ఇంజన్ ను ఆపు కుంటారు దాని వల్ల కొంత ఫ్యూయల్ ( fuel )  ఆదా అవుతుంది .

మన నగరం లో ప్రజా రవాణ సరిగా  మరియు సరిపోయినంత లేనందువలన ప్రైవేటు ,పర్సనల్ ట్రాన్స్ పోర్ట్ అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు రోజు రోజుకు వందల సంఖ్యలో పెరగడం  మరియు ఫ్లోటింగ్ పాపులేషన్పె ( floating population )రగడం వలన  రోడ్ లన్ని ట్రాఫిక్ తో నిండి గమ్యం చేరడానికి గంటలకు గంటలకు పడుతుంది . ఒక్కో సారి అంబులెన్స్ లు కూడా ( ambulances also )  ట్రాఫిక్ లో చిక్కుకొని పేషంట్  ను హాస్పిటల్ కు సరియైన సమయం లో చేర్చే  పరిస్థితి కూడా లేదు . కావున యుద్ద ప్రాతి కన  ప్రజా రవాణ మెరుగు పరచాలి.



ప్రస్తుతము బస్సు లు ,యం యం టి ఎస్   ( MMTS )   రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు .  మెట్రో రైల్ ( Metro rail ) పనులు వేగం గా జరుగు చున్నవి , కాని అందులో యం యం టి ఎస్-2 మరియు మెట్రో పనులకు చాల ఖర్చు , సమయం పడుతుంది . ఈ రెండింటి వలన  అనగా యం యం టి ఎస్ మరియు మెట్రో రైల్  ద్వారా ఆ రూట్ లో ఉన్న ప్రజలకే ఉపయోగ పడుతుంది  కాని బస్సు ల వలన అలా కాకుండా  అతి తక్కువ ఖర్చు తో ఏర్పాటు చేయవచ్చు  , ఎక్కడికైనా, ఎప్పుడైనా బస్సు పోయే రోడ్  ఉంటె చాలు అక్కడికి బస్సులను నడపవచ్చు .

ఇక మనవద్ద బస్సుల సంఖ్య ( No.of Buses )  చాల తక్కువ ,ప్రయాణికులకు సరిపోవడం లేవు . గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు . ఏదో నామ్ కె వాస్తే బస్సులు నడుస్తున్నాయా అంటే నడుస్తున్నాయి తప్ప ప్రయాణికులు ,విద్యార్థులు ఎంత బాధ పడుతున్నారో కూడా తెలుకోలేక పోయారు . కొన్ని జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం  బస్సులు వేసి, కొన్ని బస్ షెల్టర్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు .




 చంద్రబాబు నాయుడు గారు సిటీ లో నడుస్తున్న సిటి పచ్చ బస్సులను ( green buses )   ఎర్ర రంగు బస్సులుగా ( red buses )  మరియు వై ఎస్ ఆర్ గారు  డిస్ట్రిక్ట్ లో నడుస్తున్న ఎర్ర రంగు  బస్సులకు ( red buses )   పచ్చ రంగు  ( green buses ) పూసి  వాటి పై " పల్లెవెలుగు" అని వ్రాసి  ఆ ఇద్దరు హాయిగా నిద్ర పోయారు . కాని ఇప్పుడు మన సి యం  కె సి ఆర్ గారు  వాటి దుమ్ము దులిపి  మళ్లి  "  ప్రజా సేవయే మన కర్తవ్యం" గా రూపు దిద్దుతున్నందుకు ధన్యవాదములు .

బస్సు ల సంఖ్యను తగినంత గా పెంచాలి , నగరం లోని మారు మూల ప్రాంతాలకు, క్రొత్త -క్రొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కలిగించాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం బస్సులు ఎక్కడికి వెళ్ళే వో ఇప్పుడు కూడ అక్కడికే వెళ్ళు చున్నాయి . క్రొత్త ప్రాంతాలకు ఇంత వరకు బస్సులు లేవు . బస్సులు ఉంటె సెవెన్ సీటర్  ఆటో లో క్రిక్కిరిసి ఎందుకు ప్రయాణం చేయవలసి వస్తుంది ? బస్సుల్లో వ్రేలాడి ప్రాణం అర చేతిలో పెట్టుకొని ఎందుకు ప్రయాణం చేస్తారు .?
ముంబాయి ( mumbai ) లాగ ,  బెంగుళూరు ( bengaluru ) లో కూడా ప్రజా రవాణా చాలా బాగుంది ,  అక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు లేవు , ప్రతి 2-3 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది , స్టాండింగ్ పాసింజర్లు చాల తక్కువ , అక్కడి బస్సులు  చాల వరకు క్రొత్తవి, వాటిని  నీట్ గా మెంటేన్ ( neat maintenance ) చేస్తారు. కాని మన దగ్గర రెండు బస్సులు చేసే పనిని ఒక్క బస్సు చేస్తుంది .  బెంగళూరు కు  కూడా ఒక బృందాన్ని పంపి స్టడి  చేయిస్తే  బాగుంటుంది .

బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు  ( destination boards ) నీట్ గా  ( neat ) అందరికి కనుపించేట్లు అందం గా ఒకే ఫాంట్ సైజు లో అన్ని డిపోలు ఒకే విధముగా వ్రాయాలి , బోర్డ్ ల దగ్గర రాత్రి పూట కనిపించేటట్లు లైట్లు పెట్టాలి . ఇప్పుడు కొన్నిటికి లైట్లు ఉన్నాయి కాని అవి వెలగకుంటే అలాగే వదలి పెడుతున్నారు . బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు ముందు వెనుక తప్పకుండ ఏర్పాటు చేయాలి .
ఈ బోర్డ్ లను  తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీ భాషలలో తప్పకుండా వ్రాయాలి . చాల రాష్ట్రాల్లో వారి వారి భాష నే వ్రాసుకొని అక్కడి వాళ్ళ కే  తెలియునట్లు  తమ ప్రాంతీయ ( regional )  అభిమానాన్ని చాటు కొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ? కాని మనం అలా కాకుండా మనం మూడు  తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీభాషలలో వ్రాసి (  in regional, national & international  languages )  దేశాభి మానాన్ని ( patratism ) చాటుదాం .  హైదరాబాద్ వచ్చే ఇతర రాష్ట్రాల  వాళ్ళందరూ ఎంతో సులభం గా తెలిసికొని ప్రయాణం చేయగలరు , వారందరికీ హైదరాబాద్ అంటే , హైదరాబాద్ ప్రజలంటే  ఒక అభిమానం కలుగుతుంది. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళిన మనను గౌరవిస్తారు .

 డెస్టినేషన్ బోర్డ్ లో నంబరింగ్ సిస్టం ను మనం ఫాలో అవుతున్నాం కదా ! ఒక సారి మన ప్రియతమ కె సి ఆర్ గారు ఈ విషయం పై దృష్టి పెట్టాలి  అదేమిటంటే  బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లో వెళ్ళే ప్రదేశం పేరు తో బాటు ఆ రూట్ నంబర్ వేస్తారు ,ఇక్కడే మనం ఈ నంబరింగ్ విధానాన్ని మార్చాలి .

ఉదా:-    సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ కు మొదటి నుండి నం ."1"   ( No. 1 ) రూట్ గా పరిగణిస్తున్నారు ,   అఫ్జల్ గంజ్  నుండి  సికింద్రాబాద్ కు కూడా ఇదే నంబర్ తో నే నడిపిస్తున్నారు,  అంటే రెండు దిక్కుల వెళ్ళ డానికి  ఒకే నంబర్ అన్నమాట , క్రొత్త వారు గాని చదువు లేదా ఇంగ్లిష్ రానివారు ఈ నంబర్ లనే  చూసి బస్సు ఎక్కుతారు కదా !  సరే నంబర్ అయితే కరక్టే  ( No. is correct ) కాని బస్సు ఎక్కడికి వెళ్ళుతుంది ?  సికింద్రాబాదా ? లేక   అఫ్జల్ గంజ్ ?  అందుకే   బస్సు ఎటు వైపు వెళ్ళు తుందో గమనించి ఎక్కాలన్నమాట . ఒక వేళ అది కామన్ పాయింట్ అనుకోండి అప్పుడు ఎలా ? బస్సు డ్రైవర్ ను గాని  బస్సు లోని ప్రయాణికుడి ని గాని అడిగి బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ రెండు వైపులా వెళ్ళాలంటే ఒకే నంబర్ ఉంటుంది .

 డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ వచ్చే బస్సులన్నింటికి "హైదరాబాద్"  అని మాత్రం వ్రాస్తారు. ఆదిలాబాద్ నుండి వచ్చినా , ఖమ్మం నుండి వచ్చినా ,తిరుపతి నుండి వచ్చినా  "హైదరాబాద్"  అని మాత్రం వ్రాస్తారు. అట్లాగే సిటి లో కూడా ఒక్కొక్క ఏరియాకు  ఒక   నంబర్  కేటాయించాలి, ఆ నంబర్ తో నే బస్సులను ఆపరేట్ చేయాలి .


కావున రూట్ నంబర్ కాకుండా డెస్టినేషన్  ( ఏరియా ) ( destination )     కు  ఒక నంబర్ అలాట్ ( allot one number )  చేయాలి ,

సికిందరాబాద్ కు ఒకటి (1) ,

చార్మినార్ కు రెండు (2)

అఫ్జల్ గంజ్ కు మూడు (3)

 ఉస్మానియా యునివర్సిటి  నాలుగు (4)

మెహదిపట్నం  ఐదు (5)  

 కోటి ఆరు (6) ,

సెక్రటేరియట్ ( 7 ),
 
 లక్డికాపూల్  ( 8 ) ,

 సనత్ నగర్ ( 9 ) ,

కుకట్ పల్లి ( 10 ) ,

 జె బి ఎస్ ( 11 ) ,

 ఇమ్లిబన్ ( 12 )  

ఇవే నంబర్లని కాదు మన కె సి ఆర్ గారి ఇష్ట ప్రకారం వేయాలి .

ఇలా బస్సు  టెర్మినేట్ ( terminate ) అయ్యే  ప్రతి ఏరియాకు ( area )  ఒక నంబర్ ను  అలాట్ చేసి ఆర్ టి సి  ( RTC ) వారు దీనినే ఫాలో ( follow )  చేయమనాలి .     నంబర్లు వేయడం లో కష్టం ఏమి లేదుకదా  ఎన్నైనా నంబర్లను ( infinity )   1  నుండి  2... 3.... 20.... 36.... 50... 101 ... 222....  ఇలాగా 1000 ........... ఇంకా ఎక్కువ  వరకు వేయాలి . ఈ నంబర్ల వలన   పర్టిక్యులర్ నం  బస్సు ( particular bus ) ఎక్కడి నుండైనా పర్టిక్యులర్ ఏరియా  ( అదే  ప్లేస్  )  ( to particular area ) కు వెళ్లుతుందని ప్రజలకు మరియు సిటి కి వచ్చే క్రొత్త వారికి    తెలిసి ప్రయాణించుటకు చాలా సౌకర్యం గా ఉంటుంది  .

సికింద్రాబాద్ కు సిటి లో ఎక్కడి నుండైన వచ్చే బస్సు లన్ని ఒకే నంబర్ తో ( one number only ) వస్తాయి . అట్లాగే సిటి లో ఎక్కడి కైనా  ఆ ఏరియా నంబర్ తో ఎక్కడి నుండైన  ఒకే నంబర్ తో వెళతాయి . ఒక వేళా ఒకే ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి రెండు లేదా మూడు రూట్లలో బస్సులు వేళ తాయి   అనుకొండి   అప్పుడు  ప్రయాణికులు  కన్ఫ్యూజ్ ( confuse ) కాకుండా నంబర్ అదే ఉంటుంది కాని ఆ నంబర్ ప్రక్కన ఒక ఆల్ఫా బెట్   (alphabet )   నంబర్ వేయాలి .

ఉదా:-  ఇప్పుడు    మెహదిపట్నం   నుండి    సికింద్రాబాద్  కు మూడు రూట్లలో బస్సులు వెళ్ళుతున్నాయి,  అవి నం . 5 ,  5 కె     మరియు 49
 
వీటిని ఎలా మార్చాలంటే    సిటి లో ఎక్కడి నుండైన  సికింద్రాబాద్  కు నం . " 1` " తో నే రావాలి

మెహదిపట్నం   1    సికింద్రాబాద్         (  రాణిగంజ్ ద్వారా  )
.
 మెహదిపట్నం   1 కె    సికింద్రాబాద్     (  కింగ్స్ వే ద్వారా )

మెహదిపట్నం   1  బి    సికింద్రాబాద్      ( బంజారా హిల్స్    ద్వారా )





అట్లాగే

 ఉస్మానియా యునివర్సిటి  -  "1" - సికింద్రాబాద్ ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )
           
 సికింద్రాబాద్ -  ' 4 '      ఉస్మానియా యునివర్సిటి.  ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

 అఫ్జల్ గంజ్  -  " 1 "     సికింద్రాబాద్ ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

 వనస్థలి పురం " 1 " -  సికింద్రాబాద్  ,   ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

   కుకట్ పల్లి    " 1 "     సికింద్రాబాద్          ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )

   సికింద్రాబాద్" 10 "    కుకట్ పల్లి          ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్  నంబర్ వేయాలి )                                      
     అంతా  క్రొత్త నంబరింగ్  పద్దతి మాత్రమే  ఇంప్లి మెంట్( implementation of new numbering system ) చేయాలి . భారత దేశం లోని ప్రజలకే కాక విదేశీ ప్రయాణికులకు ( international traversals )    కూడా హైదరాబాద్ లో ఎక్కడి నుంచైనా  చార్మినార్   నుంచైనా,  హై టెక్ సిటి  నుంచైనా  రిసాలా బజార్ నుంచైనా,   శంషాబాద్  నుంచైనా నం . 1 బస్సు  ఎక్కితే   తప్పకుండా   సికిందరాబాద్ స్టేషన్   చేరుతామని తెలుస్తుంది . హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు తమ-తమ పనులను  హైదరాబాద్ లో ఎక్కడెక్కడో  చేసుకొని  అక్కడి  నుండే  నం 1 బస్సు ఎక్కి తే   మేము తప్పకుండ   సికింద్రాబాద్ లో   తాము   వెళ్ళే  రైలు   అందుకొన గలమని ధీమాగా యుంటారు .


  .అట్లాగే   ఉస్మానియా యునివర్సిటి కి ( OU )   సిటి లో ఎక్కడి నుండైన   ' 4 ' తో నే   బస్సులు వెళ్ళాలి .

ఈ అంకెలను రెడ్ కలర్ తో మెరిసే విధముగా పెద్ద ఫాంట్ ( font size )  రేడియం తో( with radium )  వ్రాయాలి .అప్పుడే బాగుగా కనిపిస్తాయి.

ఇక బస్సుల రంగు మార్చాల్సి ( change of bus co lours )   యుంది , సిటి బస్సు లకు ( to city bus )  పచ్చ రంగు కాంబినేషన్ లో ( combination of green color ) ఆర్దినరికి  ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు అదే పచ్చ రంగు   కాంబినేషన్ లో  వేరొక రంగు మొత్తం మీద పచ్చ రంగు కాంబినేషన్ లో ఒక ప్రత్యేక మైన కలర్ లో సిటి బస్సులు.

ఇక జిల్లా బస్సులకు   అని ఆర్దినరికి  ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు , డీలక్స్  లకు  ఎర్ర రంగు కాంబినేషన్ లో ( re color combination ) , ఇంటర్ స్టేట్ బస్సు లకు ఇకో రంగు  చూడ ముచ్చటగా , సింపుల్ గా  ఎక్కడ వేయని డిజైన్ లో   "తెలంగాణా  బస్సు"  అని చూడగానే చిన్న పిల్లలు కూడా గుర్తించే టట్లు వేయాలి .

బస్సులలో టికెట్ ఇష్యూ  పద్దతి ని ( system of ticketing )    కండక్టర్ చాలా సులువుగా  ఇచ్చే విధముగా చేయాలి. పేపర్ వేస్ట్ కాకుండా చూడాలి .  ముంబాయి లో లాగ కండక్టర్ ఒకే చోట కూర్చొని టికెట్ ఇష్యూ చేయాలి .  టిమ్స్  పద్దతి బావుంటుంది

బస్సు లో ఎక్కడానికి  " Q " ( system )  మరియు దిగడానికి వేరు వేరు డోర్ లు ఉపయోగించాలి , వెనుక నుండి ఎక్కడం , ముందు నుండి దిగడం అవుతే డ్రైవర్ కు దిగేవాళ్ళ అవగాహన ఉంటుంది .

ఇక బస్సు షెల్టర్ లు పాతవి తీసి క్రొత్త వాటిని నిర్మించాలి . అక్కడ రాత్రి  లైటింగ్  ఏర్పాటు చేయాలి . శుబ్రముగా ఉండునట్లు చర్యలు తీసికోవాలి . సరిగ్గా కూర్చుండు నట్లు ప్రతి ఒక్కరు చూడాలి .  ప్రతి  బస్సు షెల్టర్  పై అక్కడి ఏరియా పేరు తప్పకుండా వ్రాయాలి , దాని వలన ప్రయానికుడికి తాను దిగవలసిన చోటు తెలుస్తుంది .

. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ లకు ప్రోత్సాహకాలను పెంచ వలసిన అవసరం ఉన్నది , మనం ఒక సారి సికిందరాబాద్ నుండి హైదరాబాద్ కు బస్సులో వెళ్లి రావడానికే అలసి పోతాము , మరి బస్సు డ్రైవర్ మరియు కండక్టర్  ఎన్నో ట్రిప్పులు చేస్తారు , వారు కూడా చాల  అలసి పోతారు కావున ట్రిప్ - ట్రిప్ కు కొంత టైం ( time between each trip )  ఇవ్వాలి . వారికి ముంబాయి లో లాగ ప్రోత్సహించాలి . ఒక క్యాషియర్ కు రిస్క్ అలవెన్స్ ( risk allowance ) ఇస్తారు కదా ! మరి డ్రైవర్  ఇంత మంది ప్రయాణీకుల ప్రాణాల రిస్క్ తీసుకుంటాడు కదా .

ఇక బస్సు పాసులు విద్యార్థులకు గాని సామాన్యులకు గాని ప్రతి రోజు ఇస్ష్యు చేయాలి , అక్కడి నుండి ఒక నెల వ్యాల్యు  అయేటట్లు చూడాలి , రైల్వే లు ఇస్తున్నట్లు చేస్తే  బస్సు ప్రయాణికులకు టెన్షన్ ఉండదు , అందరు సంతోషిస్తారు .

ఈ పైన చెప్పినవన్నీ మన సి యం   కె సి ఆర్  గారు ఆచరణలో పెట్టిచ్చి ఎక్కడ లేని విధముగా తొందరగా ప్రజా రవాణా  కు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాము . 

Many many thanks to our beloved Hon'ble CM,  Sri. KCR gaaru 
for your restless efforts for very good public transport system and for traffic control in our capital city Hyderabad.

                                                                               - www.seaflowdiary.blogspot.com











Sunday, August 24, 2014

What to Eat to Sleep Better?

          What to Eat to Sleep Better?

Shivangana Vasudeva, NDTV, Modified: August 22, 2014 16:36 IST
Every one of us would like to believe that when we call it a day and our head hits the pillow, a sweet dream awaits us. In a world where our daily life moves faster than what we can catch up with, getting sound sleep is rather a nightly struggle. For most of us there's a lot of tossing and turning and for some it is a mere fantasy. While the best advice that anyone would give you is to ease out, the importance of our diet is often overlooked.

According to Dr Ashutosh Gautam, Clinical Operations and Coordination Manager at Baidyanath, "From an Ayurvedic perspective warm milk is the best remedy. Ideally one should have water at sunrise and milk at moonrise. Gastric discomfort is the most common cause of disrupted sleep and to avoid it one should opt for foods that are light and soothing. Foods like guava, asparagus and soups are preferred and medicinal plants like ashwaganda and bramhi work wonders in case of severe sleep disorders."

Load up on these foods that will leave you rested and restored.  6 foods that are every sleeper'sdream -

1.WarmMilk

You may call it an old wives' tale but here's the science. Milk is a great sleep supporter. It contains tryptophan, an amino acid which converts into serotonin. Serotonin is known to induce calming effects in the brain. Lack of calcium is also one of the most common causes of disturbed sleep patterns, so get your fill.

2.Cherries
Believe it or not a bowlful of cherries can send you off to sleep. Cherries are one of the few natural foods that contain melatonin. Melatonin is a hormone produced by the pineal gland in the brain. It is known to regulate your sleep and wake cycles and control the internalbodyclock.

3.Bananas
Bananas can help bring a satisfying sleep because they contain magnesium and potassium - both of which are natural muscle-relaxants. They are also packed with the good carbs that make you feel sleepy. Sweet potato is another great source of sleep inducing carbohydrates.

4.Flaxseeds
Flaxseeds are a good source of omega-3 acids, magnesium and tryptophan. Magnesium acts as a muscle relaxant. Tryptophan helps in releasing serotonin, the pleasure hormone and omega 3 acids are known to reduce instances of anxiety and depression.

5.Almonds
Instead of waking up to a handful of almonds, try sleeping over some. Just like bananas and flaxseeds, almonds are dense with magnesium that will help you catch more quality shut-eye. Besides this, they help in regulating your blood sugar levels while sleeping. Walnuts are great too as they contain tryptophan.

6.Honey
Experts recommend a tablespoon of honey for a good night's sleep. The natural sugars present in honey increase the insulin levels in our body and allow tryptophan to enter the brain which releases chemicals that relax the body. Your liver may run out of glycogen at night which may lead to the release of stress hormones. Consuming honey is great for storingglycogen.

"All said and done, one should eat at least 45 minutes to an hour before bedtime. Besides this, a head massage or soaking your feet in hot water for a couple of minutes helps to relax the muscles and nerves," says Dr Ashutosh Gautam.

                                                                                - www.seaflowdiary.blospot.com
 





Anantharaman Subbaraman




A  Indian guy named  " Anantharaman Subbaraman"   
arrived at the New York airport and ended up waiting  for his visa for about 2 hrs for the authorities to call his name,
he got  fed up and went to them and asked why they havent
called his name yet.


They said that they have been calling him  for last 2 hrs as

                         'Anotherman  Superman'

                                                                              www.seaflowdiary.blogspot.com

Friday, August 22, 2014

You could save a life

    You could save a life.


  STROKE: Remember The 1st Three Letters... 
S.T.R .
My friend sent this to me and encouraged me to post it and spread the word. I agree.  If everyone can remember something this simple, we could save some folks.

STROKE IDENTIFICATION:
During a
party, a friend stumbled and took a little fall - she assured everyone that she was fine and just tripped over a brick because of her new shoes.  (they offered to call ambulance)

They got her cleaned up and got her a new plate of food - while she appeared a bit shaken up, Rekha went about enjoying herself the rest of the evening. Rekha's husband called later telling everyone that his wife had been taken to the hospital - (at 6:00pm , Rekha passed away.)
She had suffered a stroke at the party. Had they known how to identify the signs of a stroke, perhaps Rekha would be with us today.
Some don't die. They end up in a helpless, hopeless condition instead. It only takes a minute to read this...

STROKE IDENTIFICATION:

A neurologist says that if he can get to a stroke victim within 3 hours he can totally reverse the effects of a stroke...totally.   He said the trick was getting a stroke recognized, diagnosed, and then getting the patient medically cared for within 3 hours, which is tough.

RECOGNIZING A STROKE

Remember the '3' steps,
STR .     Read and Learn!
Sometimes symptoms of a stroke are difficult to identify.    Unfortunately, the lack of awareness spells disaster.  
The stroke victim may suffer severe brain damage when people nearby fail to recognize the symptoms of a stroke.
Now doctors say a bystander can recognize a stroke by asking three simple questions :

S * Ask the individual to SMILE .
T * = TALK. Ask the person to SPEAK A SIMPLE    SENTENCE (Coherently) (eg 'It is sunny out today').
R * Ask him or her to RAISE BOTH ARMS .

If he or she has trouble with ANY ONE of these tasks, call the ambulance and describe the symptoms to the dispatcher.

NOTE : Another 'sign' of a stroke is
1.    Ask the person to 'stick' out their tongue.
2.    If the tongue is 'crooked', if it goes to one side or the other that is also an indication of a stroke.

A prominent cardiologist says if everyone who gets this e-mail sends it to 10 people; you can bet that at least one life will be saved.
….and it could be your own…..

                                                                                                   -www.seaflowdiary.blogspot.com



Thursday, August 21, 2014

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే
                                                                                                                                      21-08-2014

ప్రపంచములో మొట్టమొదటి సారి కని విని ఎరుగనటువంటి విధముగా నిర్వహించిన కుటుంబ సమగ్ర సర్వే  కె సి ఆర్ పై తెలంగాణా ప్రజలు చూపిన అపూర్వ నమ్మకం, ఇది  ప్రపంచ రికార్డ్ సృష్టించింది . ఇదొక గొప్ప సంఘటన ,  దీని ద్వారా తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని చాటుకున్నారు . తమ బంగారు భవిష్యత్తు కు బాట వేసుకున్నారు .  కె సి ఆర్ ఇలా అనుకున్నారో లేదో అలా  సర్వే చేసి నిరూపించారు .

ప్రజలందరూ తమ తమ సొంత ఊ ళ్ల కు కష్టాలను కూడా లెక్క చేయకుండా పిల్లా పాపలతో బస్సు టాప్ ల పై కూడా ఎక్కి ప్రయాణించి తమ ఇంటికి చేరుకొని 19-08-2014 నాడు ఎన్యుమరేటర్లు ఎప్పుడు ఇంటికి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటారా అని ఎదురు చుశారు. ఇతర రాష్ట్రాల నుండి స్పెషల్ బస్సులు వేసికొని, ఇతర దేశాల నుండి స్పెషల్ ఫ్లైట్ లు వేసుకొని అక్కడ నివసించే తెలంగాణా ప్రజలు తమ ఊరికి వచ్చారంటే వారికి తెలంగాణా అంటే ఎంత  ప్రేమో తెలుస్తుంది, కె సి ఆర్ అంటే ఎంత అభిమానమో  .   అనుకున్నట్లుగానే ఎనుమరేటర్లు వచ్చారు అందరి పేర్లు  ఒక్క రోజులో నమోదు చేశారంటే ప్రపంచం లోనే ఒక అద్భుతం  తప్పకుండ గిన్నిస్ బుక్ లో ఎక్కుతుంది .

ఈ కార్యక్రమములో టాప్ టు బాటం వరకు పాల్గొన్నారు , గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు , మంత్రులు , కలెక్టర్లు , పోలీస్ అధికారులు ,సినిమా యాక్టర్లు ,మహామహులు , ఆఫీసర్లు , అధికారులు , విద్యార్థులు ,వ్యాపారులు మరియు సామాన్య ప్రజలు  ఒక్కరేమిటి అందరు పాల్గొని విజయవంతం చేశారు . ఎన్యుమరేటర్ల ను స్వయం గా ఇంట్లోకి ఆహ్వానించి  వివరాలను అందజేశారు .

ఈ సర్వే వలన తెలంగాణా కు  సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయుటకు ఆస్కారమేర్ప డు  తుంది .  ఎంత మంది బి సి లు ,యస్ సి లు ,యస్ టి లు వికలాంగులు ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది . సర్వే కంటే ముందు ఉన్న లెక్కలు ఎప్పుడో తీసినవి, అవి ఇప్పుడు పనికి రావు . ఎంతమంది పెన్షన్ కు అర్హులో , ఎంత మందికి ఇళ్ళు కట్టాల్సి ఉందో ,ఎంత మంది విద్యార్థులకు ఫీజు  చెల్లించాలొ , ఎందరు రైతులకు రుణ మాఫీ చేయాలో ,చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో  వారి సంక్షేమం గురించి,వితంతువుల పెన్షన్ ,వికలాంగుల పెన్షన్ గురించి  ఇప్పుడు చాల క్లియర్ గా తెలిసి పోయింది  మనకు ఎంత కరెంట్ అవసరమో ,త్రాగు నీరు ,సాగునీరు ఎంత కావాలో, ఎన్ని రేషన్ కార్డులు కావాలో , ఎంత మంది నిరుద్యోగులో  వారి వయసెంతో ఇంకా ఏమైనా పెంచాలో తెలసింది ,దీనిని బట్టి ప్లాన్ చేయడం చాల సులువు అప్పుడే అర్హులందరికీ  న్యాయం చేయవచ్చు . అసలు లబ్ది దారులకు అందకుండా అక్రమార్కుల బొక్కసాల్లోకి వెళ్తున్న ప్రభుత్వ నిధులను పేదల అభ్యున్నతికి మళ్ళించవచ్చు .  మన హైదరాబాద్ లో పాత లెక్కల ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉంటె  1లక్ష 10వేల రేషన్ కార్డులు ఉన్నాయి మరియు కార్డుల గురించి ఇంకా అప్లికేషన్ లు పెండింగ్ లో చాల  ఉన్నాయట .

ఈ సర్వే ఆధారం గా భవిషత్తు లో హైదరాబాద్ సమగ్ర ప్రణాలికను రూపొందించి విశ్వ నగరం  గా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు . ఈ సర్వే తో హైదరాబాద్ లో జనాభా తో బాటు ఇండ్ల సంఖ్య పెరిగింది , దీని కనుగుణంగా రోడ్లు ,సివేరేజ్ , పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , డ్రింకింగ్ వాటర్  ఫెసిలిటీ కల్పనకు అవకాశం ఏర్పడింది . ఈ సర్వే తో నిజమైన లబ్ది దారులకు ప్రభుత్వ పథకాల ఫలితాలందు తాయి . కొందరు ఆంధ్రా సోదరులు సైతం సంతోషంగా సర్వేకు సహకరించారు . ఎపి ముఖ్యమంత్రి గారు కూడా సర్వే లో పాల్గొని సహక రించారు . సర్వేకు ఎన్యుమరేటర్లె కాకుండా స్వచ్చంద  సంస్థలు , తెలంగాణా జర్నలిస్టుల ఫోరం , తెలంగాణా గజిటెడ్ అధికారుల సంఘం , కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు కూడా పాల్గొని విజయవంతం చేశారు .యావత్ తెలంగాణ ప్రజలు చూపిన ఈ స్పందన అపూర్వమని చెప్పిన సి ఎం , భవిష్యత్తులో ఇదే రీతిలో సహకరిస్తే బంగారు తెలంగాణా సాధించి తీరుతానని చెప్పారు . ఎలాంటి ప్రతి ఫలం ఆశించ కుండా అంకిత భావం తో సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అన్నారు . ఒకే రోజు నాలుగు లక్షల మంది ఎన్యుమరేటర్లు స్వచ్చందంగా 99 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించడం ప్రపంచం లో ఎక్కడ జరుగలేదు . ఈ సర్వే సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశం తో చేస్తున్నామని  ఎవరి పైన కక్ష్య సాధింపు చర్యల కోసం కాదని , గతం లో జరిగిన అక్రమాలు బయట పడేందుకు ఆస్కారం ఉందని హొమ్ మంత్రి గారు కూడా చెప్పారు . 

అయితే సర్వే చేస్తామన్న నాటి నుంచి కొందరు రాష్ట్రేతరులు , తెలంగాణా లోని సీమాంధ్ర పెత్తనం లోని పార్టీలవారు ,ఇతర పార్టిలవారు కూడా సర్వేకు వ్యతిరేకం గా అనేక అనుమానాలను ,భయాలను రేకెత్తించ డానికి ప్రయత్నాలు చేశారు . తెలంగాణా లోని కొన్ని పార్టీల వారు కూడా సర్వే కు రాద్దాంతం చేశారు . ఒక నాయకుడు పనికిమాలినదని ఇంకొకరు ఏకపక్షం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు . హైదరాబాద్ లో కొందరు సెటిలర్లు సర్వేకు సహకరించలేదు మరి కొందరు ఇళ్ళకు తాళాలు వేసికొని వెళ్ళిపోయారు . సర్వే ఫార్మ్ కూడా చాల సులభంగానే యున్నది . బ్యాంకు వివరాలు స్వచ్చంద మని గౌ . నీ  న్యాయస్థానం కూడా చెప్పింది, ప్రభుత్వం కూడా దానిని ఇచ్చికం చేసింది   కదా ఇక సందేహమెందుకు . అందులో ఒక కాలం ఈ ప్రాంతం లో ఎప్పటి నుండి నివసించు చున్నారో కూడా పెడితే  చాలా బాగుండేది .  సర్వే కు సహకరించని వారు తెలంగాణా లో టూరిస్టు ల్లా మిగిలిపోతారన్నారు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు , ఇలాంటి సర్వే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేపట్టడానికి వారితో మాట్లాడు తానని అన్నారు.   ఇంకా మిగిలిన వారికి కూడా సర్వే రెండవ రోజు పూర్తి చేశారు . 

సమగ్ర కుటుంబ సర్వే ఒక సూపర్ హిట్ ,  గినిస్ రికార్డ్ , తెలంగాణా ప్రజలందరు కె సి ఆర్ పై పూర్తి నమ్మకం ఉంచారు . 

                                                            www.seaflowdiary.blogspot.com

  











Wednesday, August 20, 2014

The Hare and the tortoise....The New Version

The Hare and the tortoise....The New Version
=============================================
Once upon a time a tortoise and a hare had an argument about who was faster. They decided to settle the argument with a race. They agreed on a route and started off the race. The hare shot ahead and ran briskly for some time. Then seeing that he was far ahead of the tortoise, he thought he'd sit under a tree for some time and relax before continuing the race.
He sat under the tree and soon fell asleep. The tortoise plodding on overtook him and soon finished the race, emerging as the undisputed champ.
The hare woke up and realized that he'd lost the race. The moral of the story is that slow and steady wins the race.
This is the version of the story that we've all grown up with. !
But then, a more interesting version of this story. It continues.....
The hare was disappointed at losing the race and he did some soul-searching. He realized that he'd lost the race only because he had been overconfident, careless and lax. If he had not taken things for granted, there's no way the tortoise could have beaten him. So he challenged the tortoise to another race. The tortoise agreed.
This time, the hare went all out and ran without stopping from start to finish. He won by several miles.
The moral of the story?
Fast and consistent will always beat the slow and steady. If you have two people in your organization, one slow, methodical and reliable, and the other fast and still reliable at what he does, the fast and reliable chap will consistently climb the organizational ladder faster than the slow, methodical chap.
It's good to be slow and steady; but it's better to be fast and reliable !
But the story doesn't end here. The tortoise did some thinking this time and realized that there's no way he can beat the  hare in a race the way it was currently formatted. He thought for a while, and then challenged the hare to another race, but on a slightly different route.
The hare agreed. They started off. In keeping with his self-made commitment to be consistently fast, the hare took off and ran at top speed until he came to a broad river. The finishing line was a couple of kilometers on the other side of the river.
The hare sat there wondering what to do. In the meantime the tortoise trundled long, got into the river, swam to the opposite bank, continued walking and finished the race.
The moral of the story?
First identify your core competency and then change the playing field to suit your core competency.
In an organization, if you are a good speaker, make sure you create opportunities to give presentations that enable the senior management to notice you.
If your strength is analysis, make sure you do some sort of research, make a report and send it upstairs. Working to your strengths will not only get you notice d, but will also create opportunities for growth and advancement.
The story still hasn't ended !!!.
The hare and the tortoise, by this time, had become pretty good friends and they did some thinking together. Both realized that the last race could have been run much better.
So they decided to do the last race again, but to run as a team this time.
They started off and this time the hare carried the tortoise till the riverbank. There, the tortoise took over and swam across with the hare on his back. On the opposite bank, the hare again carried the tortoise and they reached the finishing line together. They both felt a greater sense of satisfaction than they'd felt earlier.
The moral of the story?
It's good to be individually brilliant and to have strong core competencies; but unless you're able to work in a team and harness each other's core competencies, you'll always perform below par because there will always be situat! ions at which yo u'll do poorly and someone else does well.
Tea mwork is mainly about situational leadership, letting the person with the relevant core competency for a situation take leadership.
There are more lessons to be learnt from this story.
Note that neither the hare nor the tortoise gave up after failures. The hare decided to work harder and put in more effort after his failure.
The tortoise changed his strategy because he was already working as hard as he could. In life, when faced with failure, sometimes it is appropriate to work harder and put in more effort. Sometimes it is appropriate to change strategy and try something different. And sometimes it is appropriate to do both.
The hare and the tortoise also learnt another vital lesson. When we stop competing against a rival and instead start competing against the situation, we perform far better.

When Roberto Goizueta took over as CEO of Coca-Cola in the 1980s, he was faced with intense competition from Pepsi that was eating into Coke 's growth. His executives were Pepsi-focused and intent on increasing market share 0.1 per cent a time.
Goizueta decided to stop competing against Pepsi and instead compete against the situation of 0.1 per cent growth. He asked his executives what was the average fluid intake of an American per day? The answer was 14 ounces. What was Coke's share of that? Two ounces. Goizueta said Coke needed a larger share of that market. The competition wasn't Pepsi. It was the water, tea, coffee, milk and fruit juices that went into the remaining 12 ounces. The public should reach for a Coke whenever they felt like drinking something.
To this end, Coke put up vending machines at every street corner. Sales took a quantum jump and Pepsi has never quite caught up since.
To sum up, the story of the hare and tortoise teaches us many things. Chief among them are that fast and consistent will always beat slow and steady; work to your competencies; pooling resources and working as a team will always beat individual performers; never give up when faced with failure; and finally, compete against the situation - not against a rival.

                                                                                                       - www.seaflowdiary.blogspot.com


Sunday, August 17, 2014

Know more about your mobile phone

        Know more about your mobile phone

There are a few things that can be done in times of grave emergencies.  
Your mobile phone can actually be a life saver or an  emergency tool for survival. Check out the things that you can do with it

 The Emergency Number worldwide for Mobile is 112. If you find
 yourself out of coverage area of your mobile network and there is an emergency, dial 112 and the mobile will search any existing network to establish the emergency number for you, and interestingly this number 112 can be dialed even if the keypad is locked. Try it out. 

 Have you locked your keys in the car? Does you car have remote keys?
 This may come in handy someday. Good reason to own a cell phone:
 If you lock your keys in the car and the spare keys are at home, call someone at home on their cell phone from your cell phone.
 Hold your cell phone about a   foot from your car door and have the person at your home press the unlock button, holding it near the mobile phone on their end. Your car will unlock. Saves someone from having to drive yourkeys to you. Distance is no object. You could be hundreds of miles away, and if you can reach someone who has the other "remote" for your car, you can unlock the doors (or the trunk).


Hidden Battery power

Imagine your cell battery is very low , you are expecting an important call and you don't have a charger. Nokia instrument comes with a reserve battery. To activate, press the keys *3370# Your cell will restart with this reserve and the instrument will show a 50% increase in battery. This reserve will get charged when you charge your cell next time.

How to disable a STOLEN mobile phone?
  
To check your Mobile phone's serial number, key in the following digits on your phone:
  
* # 0 6 #
  
A 15 digit code will appear on the screen. This number is unique to your handset. Write it down and keep somewhere safe. when your phone get stolen, you can phone your service provider and give them this code. They will then be able to block your handset so even if the thief changes the SIM card, your phone will be totally useless.
 You probably won't get your phone back, but at least you know that whoever stole it can't use/sell it either.

 If everybody does this, there would be no point in people stealing mobile phones.

                                                                                www.seaflowdiary.blogspot.com

మన హైదరాబాదు

       మన హైదరాబాదు 
                                                                                                                        17-08-2014
  భాగమతి పేరుతో భాగ్యనగరం గా  ఏర్పడి తరువాత  హైదరాబాదు గా  మారి నాలుగు వందల సంవత్సరాలు దాటినది . నాల్గు వందల సంవత్సరముల ఫంక్షన్ కూడా మనం ఘనంగా జరుపుకున్నాము కూడా . గోల్కొండ కోటను  కాకతీయులు  నిర్మించి తమ ఆధీనం లో పరిపాలించారు . కాలక్రమములోగోల్కొండ కుతుబ్ షాహి రాజుల పాలనలోనికి  తరువాత మరియు అసఫ్ జాహి రాజుల పాలన లోకి వెళ్లి , వారు   హైదరాబాదు ను  రాజధాని గా పరిపాలించారు.  

అప్పటి జనాభా చాల తక్కువ, ఐనా వారు ప్రజలకు అవసరాలకు మించి   అభివృద్ధి చేశారు .  తరువాత కొంత కాలానికి ఎంతో మంది దేశం నలుమూలల నుండి  జీవనోపాధి కొరకు , వ్యాపారం కొరకు ఇక్కడకువచ్చి స్థిరపడ్డారు ఇక్కడ  గోల్కొండ కోట అంగట్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట . కోహినూర్ వజ్రం కూడా ఇక్కడిదే .దేశ -విదేశాల వారు వచ్చి ఇక్కడ వ్యాపారం సాగించేవారు . 

క్రమంగా జనాభా వృద్ధి చెంది మహానగరం అయినది .ఇప్పుడున్న రాజ భవనములు , విశ్వవిద్యాలయం ,పెద్ద పెద్ద జలాశయాలు, త్రాగునీరు సౌకర్యం , మురుగు నీటి వ్యవస్థ , రైల్వే లు , బస్సులు ,విద్యుత్తు మరియు విమానాశ్రయాలు అప్పటి నిజాం కాలం లో అభివృద్ధి చేసినవే . మనకు స్వాతంత్ర్యం  రాకముందే హైదరాబాద్  ఎంతో అభివృద్ధి చెందినది . అప్పుడే మన   హైదరాబాదు  నగరం దేశం లో ఐదవ పెద్ద నగరముగా పేరు గాంచినది . అప్పటి జనాభా కు ఇవన్ని సదుపాయాలూ సరిపోయినాయి .

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు జనాభా అనూహ్యంగా దిన దినాభి వృద్ధి జరిగి ప్రస్తుతం కోటి జనాభా వరకు పెరిగినది కాని జనాభా పెరిగిన నిష్పత్తి లో సరిపడా సౌకర్యాలు పెంచ బడ లేవు . అప్పటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికి మనం ఉపయోగించుచున్నాం.  చిన్న వర్షం పడిన రోడులన్ని నీటి తో నిండి జలాశయాలు గా  మారి రవాణా వ్యవస్థ నిలిచి పోయి గంటలకు గంటలు ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారు .  లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్ళలోకి నీరు చేరి ప్రజలు సర్వం కోల్పోయి అష్ట కస్టాలు పాడుచున్నారు .  

జంట నగరాలలో రోడ్లు చాలావరకు ఆనాడు వేసినవే,  కొద్ది కొద్ది గా రోడ్ ను ఆక్రమించి కట్టడాలు కట్టినందువలన దారులు చాల సన్నగా ఇరుకిరుకుగా మారినవి . ఏవో కొన్ని రోడ్లు వెడల్పు చేసినా  అవి ప్రస్తుతం సరిపోవడం లేదు .  ఇంతమంది ప్రజలు , బయటి నుండి వచ్చినవారు ,సైకిళ్ళు ,రిక్షాలు ,ఆటోలు , కార్లు మరియు బస్సులు ఈ సన్నని రోడ్ ల పైనే వెళ్ళాలి . ముందే సన్నగా అందులో రోడు పై ఇష్టం వచ్చినట్లు అటు ఇటు వాహనాలు పార్క్ చేస్తారు . పళ్ళు అమ్మేవారు ,కూరగాయలు అమ్మేవారు ,ఇతర చిరు తిండ్లు అమ్మేవారు ,పూలు అమ్మేవారు ,తోపుడు బండ్లవారు , చిల్లర వస్తువులు అమ్మేవారు, చాట్ అమ్మేవారు-తినేవారు ఈ ఇరుకు రోడ్ల పైనే . ఇంకా ఎంతో మందికి ఈ ఇరుకు రోడ్లే ఉపాధి కల్పిస్తున్నాయి . ఇక ఫుట్ పాత్ లు అక్కడి షాపు వాళ్ళవే, వారు తమ సామానులన్ని ఫుట్ పాత్ పై వేసి ఫుట్ పాత్ నే మూసేస్తు ఆక్యుపై చేస్తున్నారు . ఇక ప్రయాణికులు రోడ్ పైనే నడవవలసి వస్తున్నది , దానివల్ల సన్నని రోడ్లు ఇంకా సన్నబడి ట్రాఫిక్ మొత్తం జామ్ అవుచున్నాది . ఈ రోడ్ పై అమ్మేవారు తమవెనుక ఇంకా స్థలం ఉన్న వెనుకకు జరగకుండా ముందుకే  జరిగి రోడ్ పై పెట్టి అమ్ముతుంటారు . కొన్నిసార్లు అంబులెన్స్ లు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కోవలసి వస్తుంది , మరి అందులోని రోగి పరిస్థితి హాస్పిటల్ వెళ్ళేవరకు ఎలా ఉంటుందో ఊహించాలి .

ఇక్కడి రోడ్లు కూడా స్మూత్ గా సాఫ్ గా ఎం ఉండవు , గుంటలు గుంటలుగా ఏర్పడినా  అలాగే వెళ్ళవలసి వస్తుంది . ఆ గుంత మరి పెద్దగ అయి ఎవరో ఒకరు అందులో పడినప్పుడే వాటికి మరమ్మతులు  చేస్తారు , కొద్దిగా అయినప్పుడే చేస్తే కొద్ది సమయములో కొద్ది ఖర్చు తో బాగుచేయ వచ్చుకదా!  కావున నిరంతర అబ్సర్వేషన్ పెట్టి ఎప్పటికప్పుడు రోడ్ రిపేర్ చేయాలి .

రోడ్ వెడల్పు చేసినప్పుడు అడ్డువచ్చే  చెట్లు మరియు ఎలక్ట్రికల్ పోల్స్ ని రెండు లేదా మూడు అంగుళాలు భూమి పైకి వదలి కోస్తారు, అది అలాగే భూమి పై తేలి  ఉంటుంది , దాని పై నుండి సైకిళ్ళు , కార్లు ,స్కూటర్లు వెళ్ళవలసి వస్తుంది ,దానివలన వాటి టైర్ లు పాడగుచున్నవి . కనీసం భూమి లెవెల్ కు కోయడం గాని భూమి లోనికిలోనికి కొట్టడం గాని చేయాలి, అది కూడా చేయలేరు . ఇక చౌరస్తా లలో 90 డిగ్రీల మలపులు ఉంటాయి , బస్సులు మరలడం చాల కష్టంగా ఉంటుంది . పోనీ ప్రక్కన ఖాళి స్థలం ఉన్నా వెడల్పు చేయరు . వాటిని కనీసం 120-130 డిగ్రీల మలుపు చేయాలి , అప్పుడే ఈజీ గా మలుపు తిరుగోచ్చు . ట్రాఫిక్ ను తొందరగా పంపొచ్చు . 

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా వస్తాయి, నగరం లోని అన్ని సిగ్నల్స్ ఒకే విధముగా వచ్చేటట్లు  అన్ని చౌరస్తా లలోఏర్పాటు చేయాలి . ఇక కొన్ని చౌరస్తా లలో లెఫ్ట్ ఫ్రీ ఉంటుంది మరికొన్ని చోట్ల సిగ్నల్ వస్తేగాని వెళ్ళడానికి లేదు . అన్ని చోట్ల లెఫ్ట్ ఫ్రీ పెట్టాలి ,రైట్ వెళ్ళేవారు లెఫ్ట్ కు రాకుండా చేయాలి అప్పుడే ట్రాఫిక్ క్లియర్ గా మొవ్ అవుతుంది . 

ట్యాంక్ బండ్  ను ఆ పుణ్యాత్ముడు  ఎన్ టి అర్ గారు వెడల్పు చేసి బాగు చేశారు ఐనా అది ప్రస్తుత ట్రాఫిక్ కు సరిపోవడం లేదు కావున ఇప్పుడు ఉన్నట్యాంక్ బండ్  రోడ్ కు ప్యారేలేల్ గా మరొకటి ట్యాంక్ సైడ్ రోడ్ నిర్మించినట్లు అయితే , ఒకటి పోవడానికి మరొకటి రావడానికి ఉపయోగించవచ్చు  . ట్యాంక్ బండ్ పై రాత్రుల్లో లైటింగ్ సరిగా లేక మినుకు మినుకు మంటు చీకటి గా ఉంటుంది  .  వినాయక చవితి కి లైట్లు ఎలా జిగేలు మంటాయో  అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి .  అదే కాకుండా మరొక రోడ్ సికింద్రాబాద్ సైడ్ నుండి ట్యాంక్ బండ్ మధ్య( జలాశయం ) నుండి ఒకటి సెక్రెటేరియట్ కు ఇంకొకటి ఖైరతాబాద్ కు వై షేప్ లో వేస్తె ప్రజలు ఎంతో సంతోషిస్తారు, ట్రాఫిక్ , టైం,మరియు ఫ్యూయల్ కలసి వస్తుంది . ఇంకొక విషయం బేగంపేట్ విమానాశ్రయం సిటి మధ్యలో ఉంది , ఇటు నుండి అటుప్రక్క వెళ్ళాలంటే కనీసం  9-10 కి మీ చుట్టూ ప్రయాణించి వెళ్ళాలి . కావున ఎయిర్ పోర్ట్ బౌండరీ చుట్టూ ఒక రహ దారి నిర్మించినచో ఎంతో సౌలభ్యం అవుతుంది . ప్రియతమ ముఖ్యమంత్రి  కె సి అర్ గారు ఈ విషయాన్ని ఒక సారి పరిశీలించి తగిన చర్య తీసుకొనగలరని  కోరుచున్నాను . 

హైదరాబాద్ లో చాలా రోడ్లు చాలా కాలనీలు ఉన్నాయి కదా , చాల పెద్ద నగరం కదా కాని మనం ఒక కాలని కో లేదా ఒక ముఖ్య ప్రదేశాని కో వెళ్ళాలను కోండి , రోడు పైకి వచ్చి చూస్తె ఎటు దిక్కు వెళ్ళాలో చూపెట్టే ఒక్క బోర్డ్ (డెస్టినేషన్ )కనిపించదు .  చౌరస్తా లో కూడా నాల్గు దిక్కులలో ఎ దిక్కు కు వెళ్ళితే ఎం వస్తుందో కూడా బోర్డు లు ఉండవు . కాని చౌరస్తా లో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి అడ్వర్ టైస్ మెంట్ లు చేస్తారు . కనీసం ఆ హోర్డింగ్ క్రింద ఆ దిక్కు ఎటు పోతుందో కూడా వ్రాయవచ్చు కదా ! అక్కడ మనకు కనిపించినవారిని అడిగి మనం వెళ్ళవలసి వస్తుంది. సిటి కి క్రొత్త వారి సంగతేమిటి ? మరీ ఇంత అధ్వనమా !  ఎక్కడో ఒక చోట బోర్డ్ పెట్టారనుకోండి అది తెలుగు లోనే ఉంటుంది . కనీసం అక్కడ రీజినల్ ,నేషనల్ మరియు ఇంటర్నేషనల్ భాషలో వ్రాయాలి .  మనం త్రిభాషా సూత్రం ను పాటిస్తున్నట్లు చేస్తే ప్రక్క నున్న రాష్ట్రాలు కూడా మనపద్దతిని అనుసరించ వచ్చు .  మనం చెన్నై గాని  బెంగళూరు గాని ముంబాయి గాని లేదా ఉత్తర భారత దేశం వెళితే అక్కడి భాష రాక ఉన్న భాష తెలియక ఎంత కష్ట పడతామో మనం ఆలోచించు కోవాలి . 

ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల వద్ద తప్ప ఎక్కడ ఇలాంటి మూడు భాషలు ఉపయోగించరు  ఎందుకు?. దానికి ఖర్చు అవుతుందా?  మన దేశం లో మరియు పెద్ద నగరాలలో  ఎన్నో భాషల వారు నివసిస్తున్నారు . అందరికి అన్ని భాషలు రావాలని ఎం లేదు . అందుకే త్రిభాష సూత్రాన్ని ఖచ్చితం గ వాడాలి . అందుకు మన తెలంగాణా రాష్ట్రం ముందుండాలి . అప్పుడే హైదరాబాద్ అంటే దేశ ప్రజలకు ఒక అభిమానం కలుగుతుంది . మన మధ్య   ప్రేమ ఏర్పడుతుంది అప్పుడే సంకుచిత భావం పోతుంది . ఐకమత్యం పెంపొందుతుంది .

ఇక మన నగరం లో ఒక సారి సికిందరాబాదు ఒక చివరి  నుండి హైదరాబాద్ కు పని మీద వెళ్లి తిరిగి బస్సులో రావాలంటే ఒక రోజు పడుతుంది, ఎందుకంటే బస్సులు సరిగా ఉండవు , ఎప్పుడు వస్తుందో తెలియదు , వచ్చిన బస్సును మిస్ చేస్తే ఇంకో బస్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు . అందుకే ప్రతి ఒక్కరు ఆ వచ్చిన బస్సు లోనే ప్రయాణం చేయడం వలన  ఆ బస్సు లో పరిమితి కి మించి ఓవర్ లోడ్ అవుతున్నది, కావున వెనుక వచ్చే బస్సులు ఖాళీగా వెళ్లుచున్నవి.   డైరెక్ట్ బస్సులు లేనందువలన రెండు లేక మూడు బస్సులు ఎక్కి గమ్య స్థానం చేరుకో వలసి వస్తుంది .  పిల్లలతో కలసి ప్రయాణం  ఇక నరకమే . ఆటో లో వెళ్ళాలంటే జేబులు ఖాళియే . పబ్లిక్ ట్రాన్స్పోర్ట్  సరిగ్గా లేనందువల్ల ప్రతి ఒక్కరు స్వంత వాహనాలు కొనుక్కోనుచున్నారు .మోటారు సైకిళ్ళు ,కార్లు విపరీతంగా రోడు పై వచ్చి చేరుతున్నవి. ఇక బస్సు లో స్కూల్ కి గాని కాలేజ్ కు వెళ్ళే విద్యార్థుల సంగతి చెప్ప నలవి కాదు . బస్సులో మరియు బయట వ్రేలాడుతూ ప్రాణం అరచేతిలో పెట్టుకొని  ప్రయాణించాలి .ఎందుకంటే బస్సులు టైం కి ఉండవు ,ఎక్కువమంది విద్యార్థులు ఉంటారు . వారి ప్రాణాలకు ముప్పు పొంచి యున్న తప్పదు మరి,  అసలు విద్యార్థులను పట్టించు కొనే వారు లేరు .  గంటలకు గంటలు  ప్రయాణం చేసి అలసి  అలసి  కాలేజ్ లో ఎలా  చదువగలరు? మళ్ళి  ఇంటికి ఎప్పుడు చేరగలరు , ఎప్పుడు హోం వర్క్ చేయగలరు ,ఎప్పుడు చదివి  తిని పడుకోనగలరు? ఇక బస్సు స్టాప్ లలో బస్ స్టాప్ పై ఏరియా పేరు వ్రాయరు . క్రొత్త వారికి బస్ ఎక్కడ దిగాలో తెలియదు .  అక్కడి ఏరియా పేరు కూడా వ్రాస్తే క్రొత్త వారికి ఆ ఏరియా సులభంగా తెలుస్తుంది . బస్సు దిగడానికి అనుకూలం గా యుంటుంది . 

మన నగరం లో ఇక ఆటో ల గురించి చెప్పనలవి కాదు , ఎంత చెప్పినా తక్కువే , చాల ఆటో వారు మనం అడిగిన చోటు కు రారు , ఊరికె కూర్చుంటారు గాని రారు .  ఒకవేళ వస్తే అతను అడిగినంత ఇవ్వాల్సిందే.

ఇక సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ సైడ్ పోవాలంటే కనీసం 5-6 రైల్వే బ్రిడ్జి క్రింద నుండి వెళ్ళాలి , అంటె  మనం ఎక్కడ ఉన్నా కంపల్సరీ ఈ బ్రిడ్జి క్రింది నుండే పోవాలి , కొన్ని చోట్ల అవి వెడల్పు లేవు ,ముఖ్యముగా రాణి గంజ్ ,బైబిల్ హౌస్ మరియు భోయిగూడ రైల్వే బ్రిడ్జి లు చాల సన్నగా ఉండడం వలన అక్కడ ట్రాఫిక్ నిలిచి పోతుంది . కావున వాటిని అత్యవసరముగా వెడల్పు చేయాలి .

మరికొన్ని రోడ్లు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించు కొనడం లేదు . ఉదా :- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్ బాలానగర్ నుండి బొయిన్ పల్లి వరకు ఖాళి గా ఉంటుంది , చాల కాలం క్రిందట ఈ రోడ్ నుండి డిస్ట్రిక్ట్ బస్సులు వెళ్ళేవి , సిటి బస్సులు  ఏరో డ్రం  గుండా విమానం రానప్పుడు వదిలేవారు ., ఇక్కడ ఒక గార్డ్ ఉండి కంట్రోల్ చేసేవాడు . ప్రస్తుతం విమానాలు లేవు కదా ఎప్పుడో ఒక సారి రెండు మూడు రోజుల కొకసారి వస్తాయి కదా , ఇప్పుడు కూడా గార్డ్ ను పెట్టి ఇంతకు ముందు లాగ ఏరో డ్రం  ద్వారా ట్రాఫిక్ ను వదిలితే 10 కి మీ కలసి వస్తుంది . ప్రియతమ ముఖ్యమంత్రి  కె సి అర్ గారు ఈ విషయాన్ని కూడా ఒక సారి పరిశీలించి  కేంద్రం తో చర్చించి తగిన చర్య తీసుకొనగలరని  కోరుచున్నాను .

సికిందరాబాద్ లో రైల్వే ఆస్తులు , డిఫెన్సు వారి ఆస్తులు చాలాయున్నవి . వారు వాటి  చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టినారు, ఈ స్థలము చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ ను వీలును బట్టి కనీసం 10-20 మీటర్లు వెనుకకు జరిపి చుట్టూ మల్గి లు కట్టి రెంట్ కు ఇస్తే ఎంతో డబ్బు సంపాదించవచ్చు  మరియు రోడ్ విశాల మవుతుంది .  ఈ విషయాన్ని రైల్వే వారు కూడా  ఆలోచిస్తున్నారు . అలాగే సికింద్రాబాద్ లో మహబూబ్ కాలేజ్ చుట్టు ఉన్న ప్రహారి గోడను కూడా వెనుకకు జరిపి చుట్టూ మడిగేలు కట్టి కిరాయకు ఇస్తే ఆ డబ్బు తో కాలేజ్ బిల్డింగ్ లు మెయిన్ టెన్ చేయవచ్చు . 

ఇక హుసేన్ సాగర్ లో పాసెంజర్ పడవలు ఈ కోన నుండి ఆ కోన వరకు నడిపి కొంత ట్రాఫిక్ ను క్లియర్ చేయవచ్చు,  హైదరాబాద్ కు అందాన్ని కూడా ఇనుమడింప చేయవచ్చు . 

ఇక్కడ మన హైదరాబాద్ లో షాపుల బోర్డ్ ల పై కూడ పూర్తిగా వ్రాస్తే ఇంగ్లిష్ లో వ్రాస్తారు , కాని త్రి భాష లో వ్రాసి వాటి క్రింద అక్కడి ఏరియా పేరు కూడా వ్రాస్తే క్రొత్త వారికి ఆ ఏరియా సులభంగా తెలుస్తుంది . క్రొత్త వారికి వారు ఒక మేలు చేసిన వారు అవుతారు .

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య గురించి గత ప్రభుత్వాలు అసలు పట్టించు కోలేదు.

కాని మన ప్రియతమ ముఖ్యమంత్రి    కె సి అర్   గారు హైదరాబాద్ ను సింగాపూర్ సిటి గా మారుస్తామంటున్నారు ,ప్రజలందరికి ముఖ్యమంత్రి పై చాల నమ్మకము ఉంది. ప్రస్తుతం మేనిఫెస్టో లో చెప్పిన వాటి నన్నింటిని అమలు పరుస్తున్నారు , చాల సతోషం,  జంట నగరాల మరియు తెలంగాణా   ప్రజలందరు  ఆయనకు ఎంతో రుణ పడి యుంటారు .  కావున దయ చేసి పై న చెప్పిన విషయాలన్నింటి ని ముఖ్యమంత్రి గారు  ఒకసారి ఓపికతో చూసి అమలు చేయిస్తారని ఆశించుచున్నాను .  

                                                                                 -  www.seaflowdiary.blogspot.com