Wheat plant juice -గోధుమ గడ్డి జ్యూస్
Date : 26-06-2017
గోధుమ గడ్డి. నేటి తరుణంలో ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ఇది. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది దీన్ని వాడడం మొదలు పెడుతున్నారు. అయితే గోధుమ గడ్డి మనకు పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి.
2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు.
3. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
4. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అలర్జీలు రావు.
5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
7. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించి మూడ్ మారుస్తాయి.
8. గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే రక్త కణాలు ఆక్సిజన్‌ను ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో శరీరానికి ఎల్లప్పుడూ శక్తి అందుతుంది. తద్వారా యాక్టివ్‌గా ఉంటారు.
9. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి గోధుమ గడ్డికి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

- seaflowdiary
No comments:
Post a Comment