EAT CASHEWNUT - జీడిపప్పు తింటే !
Date : 18-06-2017
జీడిపప్పును చాలా మంది వంటల్లో ఎక్కువగా వాడుతారు. దీంతో వంటలు రుచికరంగా ఉంటాయి. మంచి వాసన వస్తుంది. అయితే వంటల్లోనే కాక జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పోతాయి. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు రోజూ జీడిపప్పు తినాలి. దీంతో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరంలో మూడ్‌ను నియంత్రిస్తుంది. మంచి మూడ్‌లోకి వస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
2. రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు పోతాయి. దృష్టి బాగా ఉంటుంది. గ్లకోమా, శుక్లాల సమస్య రాదు.
3. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
4. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. రోజూ జీడిపప్పును తింటుంటే నెల రోజుల్లో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
5. గుండె జబ్బులు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
6. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను రాకుండా చూస్తుంది.
7. మన శరీరానికి అవసరం అయ్యే చాలా విటిమన్లు, మినరల్స్ జీడిపప్పు ద్వారా లభిస్తాయి. దీంతో హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.
- seaflowdiary
No comments:
Post a Comment