రిజిస్ట్రేషన్ - Registration
Date: 11-06-2017
రిజిస్ట్రేషన్ చేయడమంటే ఒక వస్తువు గాని ఆస్తి గాని భూమి గాని ఇల్లు గాని ఫలానా వ్యక్తికి సంభందించినది అని తెలియజేయడానికి ఒక authorised సర్టిఫికెట్ మాత్రమే. ఒకతని ఆస్తి ఇంకొకతను కొనడానికి ప్రభుత్వానికివిలువని బట్టి డబ్బు చెల్లించాలి. దీని వలన ప్రభుత్వానికి డబ్బు ఉచితం గా వస్తుంది ఇది మామూలు డబ్బు కాదు వేల కోట్లలో వచ్చి చేరుతుంది ,ప్రభుత్వం డబ్బు సంపాదించడానికి ఈ ఉపాయం కనిపెట్టింది .డబ్బు లేకుండా మామూలు అయ్యే ఖర్చు తీసికొని రిజిస్ట్రేషన్ చేయవచ్చు కదా .
సరే ఎదో కష్టపడి కొన్నవారు డబ్బు చెల్లిస్తారు,రిజిస్ట్రేషన్ చేసికొంటారు . రిజిస్ట్రేషన్ చేసుకున్నతరువాత అది ఇతరుల పేరు మీదికి ఎలా మారుతుంది ?
అమాయకులు , మిడిల్ క్లాస్ వారు జీవితమంతా కష్టపడి మిగిల్చిన డబ్బుతో ల్యాండ్ కొని అలాగే ఉంచినా లేదా ఇల్లు కట్టుకొని నివసించినా కొన్ని రోజులకు ఎవరో ఒకరు వచ్చి ఇది నాదని భయపెట్టి వెడలగొట్టిన లేదా ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని కట్టుకొన్న ఇంటిని కూలగొడితే ఆ మనిషి ఎక్కడకు పోవాలి ? ప్రభుత్వమే కూల గొడితే ఏం చేయాలి ? ఒక వైపు ప్రభుత్వమే BRS అంటుంది మరొక వైపు కూలగొడుతుంది, ఏమిటీ ద్వంద వైఖరి. ప్రజలకు మేలు చేయాలి కానీ బ్రతుకులని బజారుకు ఈడ్చడం ప్రభుత్వ విధానమా? ఇల్లు కట్టడం అంటే ఒక రోజులో జరిగే పనా లేదా రాత్రికి రాత్రికి జరిగే పనా , ఇల్లు కట్టాలంటే నెలలు పడుతుంది ఈ కాలం లో ప్రభుత్వనికి కనిపించదా ? ఏది ఏమైనా ఇల్లు కూలగొట్టడం వలన దానికి అయినా వ్యయం బూడిదలో పోసిన పన్నీరేనా ? లేదా ఏటిలో పచ్చిపులు పిసికినట్లు కాదా ? దీనిని ప్రభుత్వం ఎందుకు ఆలోచన చెయ్యదు , కావాలంటే కూలగొట్టకుండా స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్ రూమ్ కట్టించే వారికి allot చేయవచ్చు,సామాన్యులను ఆదుకొనదా ? అరణ్య రోదనయేనా.
ఇక చార్మినార్ ను కూడా ఎవరి పేరు మీదనైనా రిజిస్ట్రేషన్ చేస్తారట, రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక పద్దతి లేదా? మరి ఉంటే ఎలా చేస్తారు ? రాజులు కట్టిన చార్మినార్ లాంటి వాటిని ను ధారా దత్తం చేస్తే అతను occupy చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ? ఇది కేవలం ఆటవిక పద్దతి మాత్రమే ! స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా మార్పు లేదు .
భూమి అమ్మేటప్పుడు దానిని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు verify చెయ్యరా ? రెవిన్యూ శాఖలో ఎవరి పేరు మీద ఉందో అతనే అమ్ముతున్నాడా verify లేకుండా కేవలం papers చూపితే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు . రెవెన్యూ లో కూడా గందరగోళం . చివరికి నష్టపోయేది సామాన్య మధ్య తరగతి ప్రజలే .
మన ప్రియతమ KCR గారు గౌ. నీ . ముఖ్యమంత్రి గారు ఈ రిజిస్ట్రేషన్ ,రెవెన్యూ, మరియు మునిసిపాలిటీ శాఖలను కూలంకషముగా ప్రక్షాళన మరియు కరప్షన్ ఒక్క పైసా కూడా లేకుండా చేసి సామాన్య మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని కోరుదాం .తప్పకుండా న్యాయం చేస్తారు - seaflowdiary
No comments:
Post a Comment