Friday, June 16, 2017



   Thyroid problems - ఈ ఆహారం తింటే థైరాయిడ్ సమస్య ఉండదు !
                                                           Date : 16-06-2017




ప్రపంచ వ్యాప్తంగా నేడు చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. హైపో, హైపర్ థైరాయిడిజం అని థైరాయిడ్ సమస్యలో 2 రకాలు ఉన్నాయి. వీటి వల్ల వేర్వేరు రకాలుగా మనకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ థైరాయిడ్ సమస్య అయినా కచ్చితమైన ఆహారం తీసుకుంటే తద్వారా దాన్నుంచి బయట పడవచ్చు. మనం తీసుకునే ఆహారం మెటబాలిజంను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటి ఆహారం తింటే తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. పెరుగు





పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. 


2. చేపలు



చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు. ఇవి శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. 


3. ఆలివ్ ఆయిల్


ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి కావల్సిన డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. 

4. గ్రీన్ టీ


గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అలా విడుదలయ్యే కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. దీంతో మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. అలా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. 

5. కోడిగుడ్లు


మన శరీర మెటబాలిజంను రెగ్యులరైజ్ చేసే ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు కోడిగుడ్లలో ఉంటాయి. కనుక కోడిగుడ్లను తరచూ తింటుండం వల్ల కూడా మెటబాలిజంను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది.

6. అయోడిన్ ఉన్న ఆహారం


అయోడిన్ ఎక్కువగా ఉన్న చేపలు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో శరీరానికి అయోడిన్ అందుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆ సమస్య దూరమవుతుంది. 

7. సెలీనియం, జింక్


పుట్ట గొడుగులు, మాంసం, పొద్దు తిరుగుడు విత్తనాలు, సోయా బీన్, పచ్చి బటానీలు, వాల్‌నట్స్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల సెలీనియం, జింక్ మన శరీరానికి అందుతాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో థైరాయిడ్ సమస్య పోతుంది. 

                                                                                                    --seaflowdiary 




No comments:

Post a Comment