Monday, July 10, 2017


                       పొట్టను కరిగించే పవర్ ఫుల్  పిప్పళ్లు 
                                                                Date :10-07-2017





పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. పిప్పళ్ల పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం, రాత్రి భోజనం చేసిన తరువాత గంటకు తినాలి. దీంతో బానపొట్ట కూడా తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు. 

2. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి రోజూ తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు పోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. 
3. పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె సమస్యలు రావు. పేగుల్లో ఉన్న పురుగులు నశిస్తాయి. 


4. పిప్పళ్ల పొడిని నిత్యం ఏదో ఒక విధంగా 500 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్నా చాలు. దాంతో చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు, లివర్ శుభ్రమవుతాయి. 





5. పిప్పళ్ల కషాయం తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు ఉండవు. 

6. పిప్పళ్ల పొడి 500 మిల్లీగ్రాములు, 1 టీస్పూన్ నెయ్యి కలిపి తింటే గ్యాస్ సమస్య పోతుంది. అజీర్తి తగ్గుతుంది. 

7. పిప్పళ్ల పొడిని రోజూ 500 మిల్లీగ్రాముల మోతాదులో రెండు సార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పైల్స్, హెమరాయిడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

                                                                                            - seaflowdiary 

No comments:

Post a Comment