అక్రమంగా ఏపీ ఉద్యోగుల కేటాయింపు
అక్రమంగా ఏపీ ఉద్యోగుల కేటాయింపు
Date : 28-08-2015
ఉద్యోగుల విభజనలో అడ్వయిజరీ కమిటీ చైర్మన్ కమలనాథన్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే, టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. గురువారం శ్రీనివాస్‌గౌడ్ సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ అక్రమపద్ధతిలో ఏపీ ఉద్యోగులందరినీ తెలంగాణకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మినహాయింపులన్నింటినీ ఉపయోగించుకొని సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వచ్చి పడుతున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు.
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వచ్చిపడితే తెలంగాణా కు వారు తెలంగాణా కు ఎలా నష్ట పరుచాలనే చూస్తారు గాని అనుకూలంగా వారు పనిచేస్తారా ? ఉద్యోగుల విభజన ఇంకెంత కాలం పడుతుంది ? రాష్ట్రం ఏర్పడి సంవత్సరం దాటినా విభజన ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ? ఇదంతా కావాలని చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది, లేకుంటే ఏమిటీ ? అక్రమపద్ధతిలో ఏపీ ఉద్యోగులందరినీ తెలంగాణకు కేటాయిస్తున్నారని టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు కదా !
ఎక్కడి ప్రాంతం వారిని అక్కడకు కేటాయించాలి . తెలంగాణా ప్రాంతములో ఖాళీలు ఏర్పడితే క్రొత్త వారిని నియమించుకుంటాం కదా , ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి . తెలంగాణా కోరుకున్న దానిలో ఇదొక అంశమే కదా ! ఉద్యోగాల గురించి ఎంతోమంది విద్యార్థులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ గారి ఆవేదన సరియైనదే .
ఇంతకు ముందు విడి పోయిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ , ఛత్తీస్ గడ్ , జార్ఖండ్ లలో కూడా ఇలాగే జరిగిందా ? అక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా జరిగాయి , మరి ఇక్కడే ఎందుకు ? మద్రాస్ నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది ? అప్పుడు అక్కడ కేటాఇంచినట్లు ఇప్పుడు ఇక్కడ అదే చేస్తే సరిపోతుంది- seaflowdiary
No comments:
Post a Comment