హైదరాబాద్‌కీ షాన్.. కాకతీయ నిషాన్|Secretariat welcome the entrance of the Kakatiya Arcade -Telangana News Date:27-08-2015.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం స్వాగత ద్వారం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనలకు, సంస్కృతికి అద్దంపట్టేలా రూపుదిద్దుకోనుంది. నవాబుల పాలన ఔన్నత్యంతోపాటు, కాకతీయుల రాజసం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రధాన ద్వారానికి ఇప్పటికే అనుమతులు లభించినప్పటికీ కాకతీయ కళా తోరణంకోసం అధికారులు ప్రతిపాదనలు పంపారని వార్తలు వచ్చాయి .
బాగానే ఉంది కాని మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు రాష్ట్ర సచివాలయం ని ఇక్కడి నుండి మార్చాలని అనుకుంటున్నారు కదా ! ఎర్రగడ్డ కు మారుస్తామన్నారు , అక్కడ వ్యతిరేకత రావడం వలన అక్కడినుండి జింఖానా గ్రౌండ్ అన్నారు . జింఖానా గ్రౌండ్ రక్షణ శాఖా ఆధీనం లో ఉంది దానికి బదులుగా వేరే చోటా స్థలం ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదని జింఖానా గ్రౌండ్ స్థలానికి డబ్బులు ఇవ్వాలని అందుకు వారు ఒప్పుకున్నట్లు . అందుకు ప్రభుత్వం నిస్సహాయత తెలిపినట్లు వార్తలు వచ్చాయి .
సచివాలయం ని షిఫ్ట్ చేసే యోచనలో ఉన్నప్పుడు అక్కడ స్వాగత ద్వారం ఇప్పుడే కట్టడం అవసరమా ? ముందు సచివాలయం ని ఎక్కడకు మారుస్తున్నారు ? అసలు మారుస్తారా లేదా ? అది తేల్చు కున్నాక స్వాగత ద్వారం నిర్మిస్తే బాగుంటుంది . -seaflowdiary
No comments:
Post a Comment