Wednesday, August 5, 2015

                   LASHKAR BONALU లష్కర్ బోనాలు  02-08-2015    
                                                                           Date : 05-08-2015  
           
          

లష్కర్ బోనాలు అంటే సికిందరాబాద్ లో వెలసిన ఉజ్జయిని మహంకాళి  అమ్మవారికి  బోనాలు సమర్పించి భక్తి శ్రద్దలతో పూజించడం . తెలాంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక ఈ బోనాల ఉత్సవాలు . సంప్రదాయ బద్దంగా రెండు రోజుల పాటు బోనాల సమర్పణ నిర్వహిస్తారు . 200 సంవత్సరాల చరిత్ర గల ఉజ్జయిని మహంకాళి  అమ్మ ఆలయం లో జరిగే బోనాలకు తెలంగాణా రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పాల్గొంటారు .  
ఈ అమ్మ వారి ఆలయం తో బాటు సికిందరాబాద్ లో ఉన్న చిన్న చిన్న అమ్మవారి ఆలయాలను కూడా సుందరం గా అలంకరించి పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు . 
సుమారు 12 నుండి 15 లక్షల భక్తులు ఉజ్జయిని మహంకాళి  అమ్మవారి ని దర్శించు కుంటారు . ఈ ఉత్సవం ఆదివారం ఉదయం 4 గంటల నుండి 48 గంటల పాటు కొనసాగుతుంది . సోమవారం ఉదయం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు . మాతంగి పచ్చి కుండపై నిలబడి దేవి ఆమెలో ఆవేశమై భవిష్య వాణి ని వినిపిస్తుంది , దీనిని భక్తులు ఆసక్తి తో తిలకిస్తారు . అదేరోజు సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు పై లష్కర్ వీధుల్లో ఊరెగిస్తారు . మరియు ఫలహారం బండ్లను మేకపోతును కట్టి ఊరేగిస్తారు . ఈ ఉత్సవం లో పోతరాజుల విన్యాసాలు చూడ ముచ్చటగా ఉంటాయి . 

ఈ ఉత్సవానికి ప్రముఖులు గవర్నర్ గారు ,ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ప్రముఖులు దర్శించుకొని పట్టువస్త్రాలు దేవికి సమర్పిస్తారు . 

ఈ పండుగకు ఇక్కడి వారు జిల్లాలలో ఉన్న తమ చుట్టాలను పిలిపించుకొని బోనాలు సమర్పించుకొని కోరికలు కోరుకుంటారు , మ్రొక్కులు తీర్చుకుంటారు . ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లో జరుగుతుంది . 

సూరిటి అప్పయ్య  ముదిరాజ్ ఈ బోనాల పండుగకు ఆద్యుడు . ఈయన బ్రిటీష్ సైన్యం లో 1800 ప్రాంతములో చేరారు . బ్రిటిష్ వారు 1803 లో బర్మా తో యుద్ధం చేసే సమయం లో సికిందరాబాద్ నుండి కొంత సైన్యం ను మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని పట్టణానికి తరలించారు అందులో అప్పయ్య గారు కూడా ఉన్నారు . ఆ సమయం లో ఉజ్జయిని లో కలరా వ్యాధి సోకి చాలామంది చనిపోవడం చూసి అప్పయ్య గారు ఉజ్జయిని లో ఉన్న మహాకాళీ ని  ఘనం గా పూజలు చేసి వేడుకున్నాడు , అక్కడ ఆ వ్యాధి తగ్గిపోయింది. అదే భక్తీ తో లష్కర్ లో కూడా గుడి కడతానని లష్కర్  లో అందరు చల్లగా ఉండాలని ,వర్షాలు బాగా కురవాలని ,త్రాగడానికి నీరు రావాలని ,పంటలు బాగా పండాలని ,పశువులు బాగుండాలని ఎలాంటి వ్యాధులు రావద్దని సంకల్పించుకుని  ఒక కలప తో అమ్మవారి ప్రతిమను చెక్కి 1815 లో ఇప్పుడు పూజిస్తున్న చోట ప్రతిష్టించి నిత్య పూజలు చేయడం ప్రారంభించారు .  1864 లో కలప ప్రతిమ  స్థానం లో శాస్త్రీయ పద్దతిలో శిలా విగ్రహం ప్రతిష్టించారు . నేటికి 151 సంవత్సరాలనుండి సాంప్రదాయ పద్దతిలో వైదిక ఆగమ శాస్త్రానుసారం నిత్య పూజలు జరుగు తున్నాయి . అప్పయ్య కుటుంబీకులు ధర్మ కర్తలుగా కొనసాగుతున్నారు . 



బోనం అంటే అన్నం ,ఇంట్లో అన్నం వండుకొని మట్టి పాత్రలను రంగురంగులతో అలంకరించి, లేదా ఇత్తడి చెంబులలో అందులో వండిన అన్నం ఒకదానిలో ఇకొకదానిలొ సాకం ( నీరు ) పోసి వేపకొమ్మలు పెట్టి , క్రొత్త బట్టలు ధరించి అమ్మవారి గుడికి వచ్చి ఈ బోనం ని సమర్పించి కోరికలు కోరుకుంటారు , అందరు చల్లగా ఉండాలని ,వర్షాలు బాగా కురవాలని ,త్రాగడానికి నీరు రావాలని ,పంటలు బాగా పండాలని ,పశువులు బాగుండాలని ఎలాంటి వ్యాధులు రావద్దని కోరుకుంటారు . 
 







ఈ  రెండు రెండు రోజులు లష్కర్ బోనమెత్తి  అమ్మా బైలేల్లినాదో నాయనా  తల్లీ బైలేల్లినాదోఅంటూ లక్షల మంది భక్తులు తరలి వచ్చారు . బోనాల సంస్కృతిని తెలిపే జానపద గేయాలతో లష్కర్ మారు మ్రోగింది . కత్తులు ,చేర్లకోలా చేత బట్టి పోతరాజులు వీరంగం చేస్తూ ఆడుతూ , డప్పు దరువులు , తప్పెట మోతకు చిందులేస్తూ , పూనకాలతో ఊగిపోతు శివ సత్తువులతో లష్కర్ వీధులు నిండిపోయాయి . ఈ రెండు రోజులు ఇక్కడి దుకాణాలు మూసిఉంచి వ్యాపారులు భక్తులకు సహాయ సహాకారాలు అందిస్తూ వాలంటీర్లు గా పని చేస్తారు . 

రెండవ రోజు సోమవారం సాక సమర్పణ , భవిష్యవాణి , పోతరాజుల విన్యాసాలు , అంబారీ ఊరేగింపు ,ఫలహార బండ్లు తోట్టెల  ,బోనాల సమర్పణ కన్నుల పండుగగా ఘనంగా జరిగింది . 
ఈ బోనాల పండుగ ను ప్రతిష్టాత్మకంగా ప్రభుతం తీసికుని ఘనంగా జరిపింది . ఈ పండుగకు తెలంగాణా ప్రభుత్వం ఘనంగా జరుపుటకు గ్రాంట్ ను కూడా ఇచ్చింది . 


భవిష్య వాణిలో ఈసారి వర్షాలు ఆలస్యమైనా తగినంతగా కురుస్తాయని ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లుతారని  ఆశీర్వ దించింది . ప్రతి సంవత్సరం ఇలాగే ఘనం గా శాంతి యుతముగా జరగాలని ఆ అమ్మ ఉజ్జయిని మాతను ప్రార్థిస్దాం .  
                                                                                                                yours ,
                                                                                          www.seaflowdiary.blogspot.com 









 . 

No comments:

Post a Comment