Monday, July 27, 2015

Poisonous - n - Wild Animals 
విష జంతువులు -క్రూర జంతువులు 
                                                                                      Date :27-07-2015
                                                                                              Updated : 06-09-2015
                                                                                                              12-09-2015

                                                                                                                21-01-2016



గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది అమాయకులు పాము కాట్లకు బలై ప్రాణాలు కోల్పోవుచున్నారు. పంట పొలాల వద్దకు వెళ్ళినప్పుడు . ఇంతకు ముందు కరెంట్ కొరత ఉన్నప్పుడు రాత్రి పూట కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు పొలాలకు బోర్ నీళ్ళు పెట్టడానికి చీకట్లో రైతులు వెళ్ళేవారు , వారిలో చాలామంది పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు .
స్కూల్ లలో కూడా కొన్ని చోట్ల పాములు విద్యార్థుల తరగతు లోనికి వెళ్లి విధ్యార్థు లను కరిచి పొట్టన బెట్టుకున్నాయి . పాములు ఎప్పుడు వచ్చి కరుస్తాయో నని గ్రామీణ సామాన్య ప్రజలు బిక్కు బిక్కు మంటూ నిద్రపోతారు . పాములు గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఉంటాయి . ప్రొద్దున్నే వాకింగ్ వెళ్ళే వాళ్లకు కూడా పాముల వల్ల భయం ఉంటుంది .
ఒకప్రక్క పాములను చంపొద్దు అవి వన్య ప్రాణులు అని కొందరు ప్రచారం చేసుకుంటారు . కొన్ని స్నేక్ సొసైటీ లు కూడా ఏర్పాటు చేసుకున్నారు . వారికి చెబితే వచ్చి పాముని పట్టుకొని అడవిలో వదలి పెడతారు . ఏది ఏమైనా పాముకాటు వలన చనిపోయిన వారిని బ్రతికించగలరా ?  మరికొందరు పాముకాటు వేస్తె మంత్రాలు వేసి నయం చేస్తామంటారు కాని ఆ మంత్రాల వలన బ్రతికిన వాళ్ళు లేరు . మరికొందరు పాము కరచిన తరువాత మంత్రం వేసే ఆయన పేరు తలచుకొని గుడ్డను ముడి వేసి ఆయన దగ్గరకు వెళితే బ్రతుకుతారు అంటారు . ఇవన్ని మన మూఢ నమ్మకాలు మాత్రమే . పాము కరచిన వాళ్లకు వైద్య సహాయం తొందరగా అందితే బ్రతకడానికి అవకాశం ఉంది . మన హిందువులు అయితే పామును దేవుడుగా భావించి వాటిని చంపరు . శివుడు నాగు పాముని మెడలో వేసుకుంటారని దేవుని గుడిలో రాతిపై నాగు పాముని చెక్కి పూజలు చేస్తుంటాము . నాగుల పంచమని ఒక పండుగ చేసికొని పుట్టలో పాలు పోసి పూజిస్తాము . పుట్టలో పాలు పోస్తే పాము ఎలా త్రాగుతుంది ? ఇవన్ని మన నమ్మకాలు మాత్రమే . పాము ల పై ఎన్నో సినిమాలు కూడా తీశారు . పాము దేవుడైతే కరవాలేందుకు మనషిని మరియు పశువులను జంతువులను చంపాలేందుకు ? పాములు కరచి విషాన్ని విడుస్తాయి , అవి ఏమన్నా మన రక్తం త్రాగి జీవిస్తాయంటే అదీ లేదు . దేవుడు విష జంతువులను ఎందుకు పుట్టించాడో మరి !

వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా పాము కరిచి ప్రాణాలు పొతే అప్పుడు ఏమంటారు ? పాముల వలన ఎలాంటి చెప్పుకోదగ్గ ఉపయోగాలు ఏమి లేవు , అవి ఎలుకలను మింగి పంట నష్టం కలుగకుండా చేస్తున్నాయని వాదిస్తారు . కొంతవరకు నిజమే కావచ్చు కాని ఎలుక కూడా ఒక వన్య ప్రాణే కదా మరి పాములు వాటిని మింగితాయి కదా మరి ఎలుకలను  రక్షించ వద్దా  ? పాము  కరచి ఒకే కుటుంబములో ఇద్దరి ప్రాణాలు పోయాయి కదా ! వారిని ఈ స్నేక్ సొసైటీ ఆదు కుంటుందా లేక బ్లూ క్రాస్ వాళ్ళు ఆదుకుంటారా ?వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా పాము కరిచి ప్రాణాలు పొతే అప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది .

21-01-2016

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఇందిరానగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసింది. ఈ ఘటనలో అక్క మృతిచెందింది. చెల్లెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

శ్రీకృష్ణుడు కాళింది సర్పాన్ని చంపలేదా ? గజేంద్రుడిని రక్షించడానికి మొసలిని చక్రం వదలి సంహారించలేదా ? 
13-09-2015

పాము కాటుకు మహబూబనగర్ జిల్లా బత్తాం గ్రామం లో వృద్ధురాలు మృతి . 

12-09-2015

అన్నా చెల్లెలుకు పాముకాటు, చెల్లెలు మృతి

Published: Sat,September 12, 2015 05:30 PM

snake bite to brother sister మహబూబ్‌నగర్: జిల్లాలోని కోడేరు మండలం గన్యా నాయక్ తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అన్నాచెల్లెలు పాము కాటుకు గురయ్యారు. ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. చెల్లెలు నిహారిక (4) మృతిచెందింది. అన్న చరణ్ (7) పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 


పామును చంపి.. కాటుకు కన్నుమూశాడు!

Published: Sat,September 12, 2015 01:17 AM
కోటపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో పామును చంపి దాని కాటుకు బలయ్యాడో వ్యక్తి. కోటపల్లి మండలం సర్వాయిపేటకు చెందిన చింతపూడి రాజయ్య ఇం ట్లోకి శుక్రవారం తాచుపా ము రావడంతో పాములను అలవోకగా పట్టే ఈర్ల రామయ్య(47)ను పిలిపించాడు. రామయ్య పామును పట్టే క్రమంలో తోకను పట్టుకోవడంతో అతని చేతిపై రెండు చోట్ల కాటువేసింది. అయినప్పటికీ పామును చంపేసిన రామయ్య ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు 108కు ఫోన్‌చేశారు. అంబులెన్స్ వచ్చేలోగానే అతను మృతిచెందాడు. 

06-09-2015

పులి దాడిలో ఆవు మృతి

Published: Sun,September 6, 2015 07:39 PM

cow dead in tiger attack ఆదిలాబాద్: పులి దాడిలో ఆవు మృతిచెందిన సంఘటన జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం చారిగాం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామంలోని శంకర్ అనే వ్యక్తికి చెందిన ఆవు శుక్రవారం మేత కోసం ఆటవీ ప్రాంతానికి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో శంకర్ అటవీ ప్రాంతంలో ఆవు కోసం గాలించాడు. అక్కడ ఆవు మృతిచెంది కనిపించింది. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి దాడిలోనే ఆవు మృతిచెందిందని నిర్దారించారు.  













అలాగే అరణ్యంలో సింహం మృగరాజు , రాజు అది బలవంతుడని తన ఇష్టం వచ్చిన అమాయక జంతువులను క్రూరంగా వేటాడి చంపి తింటుంది . ఏనుగును కూడా  అలాగే ఇతర బలమైన జంతువుల లాగా  చంపి తింటుంది . అసలు సింహం ,పులి వలన మనకు ఏం  లాభముంది ? వాటి పని కేవలం జంతువులను తినడం , దానివలన వాటి సంఖ్యను తగ్గిస్తుంది కాని ఇతర ఎలాంటి లాభం లేదు . అడవిలో అమాయక జంతువులు నదిలో నీళ్ళు త్రాగడానికి కూడా భయపడుతూ నలుదిక్కుల చూస్తూ దాహాన్ని తీర్చుకుంటాయి ఇదెక్కడి  ఆటవిక న్యాయం ? దేవుడు అసలు పనికిరాని జంతువులను ఎందుకు పుట్టించాడో వాటి వలన ఇతర జంతువులు ఎంత బాధ పడుతున్నాయో మనకు అర్థం కాదు .

మనం అడవిలోనికి వెళ్లి చూడక పోయినా ఒకసారి " Animal planet " ఛానల్ చూస్తే సింహాలు ,పులులు ఎంత క్రూరంగా బలహీన జంతువులను చంపుతాయో అర్థమవుతుంది.

మనషిని పొట్టన బెట్టుకొనే విష పాములు , క్రూర జంతువులను మట్టుబెట్ట అవసరముందా ? లేదా ?

                                                                                                                      yours ,
                                                                                                www.seaflowdiary.blogspot.com 










No comments:

Post a Comment