Thursday, July 9, 2015

"శేఖర్ ...యూ   ఆర్ డూయింగ్ వెల్"-"Shekhar ... U R doing well" 
                                                                                         Date: 09-07-015


ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన దేశ ప్రథమ పౌరుడు , మన రాష్ట్రపతి గారు శ్రీ . ప్రణబ్ ముఖర్జీ గారు . 
మన ముఖ్యమంత్ర్రి ప్రియతమ కె సి ఆర్ గారు మన రాష్ట్రపతి నుండి ప్రశంసలు అందు కొంటుంటే మన తెలంగాణా ప్రజలకు ఎంతో సంతోషం కల్గినది .  




దేశం లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇంతటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదు . కె సి ఆర్ ను చూసి ,ఇక్కడ అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను చూసి కేంద్ర మంత్రులు ,ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులు , దేశం లోని ప్రజానీకం ప్రశంసిస్తున్నారు . 


కాని మన ప్రక్కనున్న ముఖ్యమంత్రి గారికి మనం అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక పోవుచున్నాడు . అన్ని అడ్డుపుల్లలు వేస్తున్నాడు . ఆయన ఉండేది ఇక్కడే ,పరిపాలించేది ఇక్కడి నుండే . ఐనా మనం ముందుకు దూసుకెళ్ళుతున్నాము , అది మన అదృష్టం . మంచి పనులు చేస్తే ఆ దేవుడు కూడా సహకరిస్తాడు . ఇప్పుడు దేవుడు అదే చేస్తున్నాడు . అక్కడ అభివృద్ధి చేసుకోవడం చేతగాక , ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చ లేక మనమీద కక్ష కట్టి హూంకరిస్తుంటే మనకు ఏ మౌతది ? మనకు ఏమి కాదు . దీని నంతటిని విద్యార్ధి , ఉద్యోగ ,ప్రజా ఉద్యమం, బలిదానాల  ద్వారా ముఖ్యమంత్రి అయిన మన కె సి ఆర్ గారికి ఇది ఎంత ? 


రెండు ప్రాంతాలు సమానమని రెండుకళ్ళ సిద్ధాంతం , కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఏమైనట్లు ? ఇక్కడికొస్తే ఒకమాట , అక్కడికి పోతే ఇంకొక మాట . ప్రజలు ఈ మాటలను నమ్ముతారా ? హ్యాపీ గా క్రొత్త రాష్ట్రానికి సహకరించ కుండా ఎందుకు చేస్తున్నట్లు ? 




అక్కడి ప్రజలందరికి మన ప్రజలంటే అభిమానం ఎప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి ద్వేషాలు లేవు . ఇద్దరి మధ్య సహాయ సహాకారాలు ఉన్నాయి , వాటిని ఇంకా పెంచాలి , ప్రజలు కోరుకున్నది చేయాలి .  




చూశారా మనపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారో . పాలమూరు ప్రాజెక్ట్ లు ఎప్పుడో సమైక్య పాలనలో ప్లానింగ్ చేసినవి . వాటిని అడ్డుకోవాలని ప్రయత్నం .కేంద్రములో తమ భాగస్వామ్య ప్రభుత్వం ఉందికదా అనే ధీమా . కేంద్రం ఒక వంక ఈ కుట్రలను కనిపెడుతూ ,అన్యాయాన్ని అరికట్టాలి .వారేమో క్రొత్తగా పట్టిసీమ ప్రాజెక్ట్ కేంద్రం అనుమతి లేకుండా కడితే న్యాయమా ? ఏది ఏమైనా తెలంగాణా ప్రజల ఓపికను పరీక్షిస్తున్నారు . అసలు ముందే అన్ని లెక్కలు అయిన తరువాత గాని తెలంగాణా ఏర్పాటు చేస్తే గాని మనం ఒప్పుకోవలసినది . ఈ కిరి కిరి ఉండేది కాదు ,కాని ప్రస్తుతం జరుగు తున్నది ఏమిటి ? మన గడ్డ పై ఉండి మనకే ఎసరు పెడుతుంటే మనం ఎంత కాలం ఓపిక పడుదాం ? 


పవన్ గారు కూడ మంచిని కోరుకుంటున్నారు . 


కొందరికి పుట్టినప్పటినుండి ఒక హాబి , ఏమిటంటే "మనకు దక్కనిది ఇతరులకు దక్కోద్దని" . మనం చరిత్రలో చూశాం . పురాణాలలో చదువు కున్నాము ఇది మంచిది కాదని , చివరకు దేవుడు కూడా ఏం చేశాడో  తెలుసు కున్నాము . 
ఇక మనదగ్గర ఉన్న ప్రతిపక్షాల దారి ఏమిటో ఎవ్వరికి తెలియదు . ఎందుకంటే వారికి మంచి ఏమిటో  చెడు ఏమిటో తెలియకుండా మాట్లాడడం , అయినదానికీ కాని దానికి గుడ్డిగా వ్యతిరేకించడం ఏమిటో ? ప్రజలందరు మేము సంతోషముగా ఉన్నామని చెబుతున్నా మీరు సంతోషముగా లేరు అని ప్రజలను తప్పు త్రోవ పట్టించడ మేమిటి ? హై కామాండ్ ను సంతోష పరుచడానికా ఈ ఆర్భాటం ! కుంభ కోణాల్లో పీకల దాకా మునిగితే ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టారు . అయినా దానినుండి గుణపాఠం నేర్చుకొని ప్రజలకు సమాధానం చెప్పుకోకుండా మేమే గొప్ప అని చెబుతుంటే, పదవిలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించ కుండా ఇప్పుడు వారిని  ప్రజలు ఎలా నమ్ముతారు ?  


అప్పుడు మీకు నోరు లేదా ..? 
 

ఇప్పుడు వీరు  వేసే ప్రశ్నలకు ఏమిటి సమాధానం ? ఎవరు సమాధానం ఇస్తారు . 

                                                                             yours ,
                                                                            www.seaflowdiary.blogspot.com 










No comments:

Post a Comment