Tuesday, July 7, 2015


Digital  India - డిజిటల్ ఇండియా - डिजिटल इंडिया 
                                                             Date : 07-07-2015
                                                                                    up dated:  09-07-2015









     ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశాన్ని సరికొత్త soft ware  సాఫ్ట్ వేర్ యుగం లోకి నడిపిస్తుందనడం లో ఎలాంటి సందేహం  లేదు . ఈ కార్యక్రమానికి హాజరైన అనేకమంది పారిశ్రామిక వేత్తలు హర్షద్వానాల తో ఆమోదం తెలిపారు . 
 ఈ పథకం అమలు కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి సాంకేతిక పరిశ్రమలు సుముఖత తెలుపాయి . 
డిజిటల్ పరిజ్ఞానం పెంచడం ముఖ్యముగా సేవా రంగాన్ని డిజిటల్ రూపంలో గ్రామ స్థాయి వరకు తీసుకవెళ్ళడం,2020 కల్లా ఎలక్ట్రానిక్ దిగుమతులు లేకుండా దేశం లోనే తయారు చేయడం . మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వలన 10 కోట్ల ఉద్యోగాలు కల్పించవచ్చు అని అంటున్నారు . ఇప్పటికే డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి కాని గ్రామీణులకు కూడా అందుబాటులోకి తేవడం ముఖ్య ఉద్దేశ్యం .  

బస్సు ,రైలు ., విమానం టికెట్లు బుక్ చేసుకోవచ్చు . సినెమా టికెట్లు  బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ,ప్రైవేటు బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించవచ్చు . ఆన్ లైన్ షాపింగ్ వలన కాలు బయట పెట్టకుండా కోరుకున్న వస్తువులను పొందవచ్చు . బ్యాంకు లో మన ఖాతాలో ఉన్న డబ్బును వేరే బ్యాంకు కు ఇంట్లో నుండే జమచేయవచ్చు . message లను క్షణం లో పంపవచ్చు , ఫోటో లను ,వీడియో లను క్షణం లో మనవాళ్ళు ప్రపంచములో ఎక్కడున్నా క్షణం లో పంపవచ్చు. అదంతా ఎందుకు లైవ్ చాట్ చేయవచ్చు . ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొన్నట్లు వీడియో లో అమెరికా లో ఉన్న మన వాళ్ళతో ఎంత సేపైనా చాట్ చేయవచ్చు . documents ను స్కాన్ చేసి   క్షణాల్లో net ద్వారా పంపొచ్చు . నెట్ లో హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు , వార్తలు వీడియో ద్వారా తిలకించవచ్చు . డిజిటల్ నెట్ వర్క్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నవి . 



ఇంతకు ముందు మనం అమెరికాలో ఉన్న మనపిల్లలకు గాని బంధువులకు గాని సమాచారం ఇవాలంటే ఫోన్ గాని టెలిగ్రాం గాని చేసేవాళ్ళము . లేదా ఉత్తరములు వ్రాసుకొనే వాళ్లము . ఉత్తరం అందడానికి 15 రోజులు పట్టేది , మరి జవాబు రావడానికి 15 రోజులు పట్టేది మొత్తం మీద ఒక విషయం తెలుసు కోవాలంటే ఒక నెల పట్టేది . కాని technology develop అయింది కాబట్టి within seconds లో మనం సమాచారాన్ని ఈ network , internet ద్వారా పొందగలుగు తున్నాము . communication టెక్నాలజీ కనుగొన్న గ్రాహంబెల్ నిజంగా దేవుడు . అది battery తో పనిచేస్తుంది . battery , electricity ని కనుగొన్న volt , faradey  గొప్ప scientists . బాటరీ లో వాడే chemicals ను తయారు చేసిన శాస్త్రజ్ఞులు గొప్పవారు. ఇలా ఒకదానిని కనుగొన్న తరువాత దానిపై పరిశోధనలు చేసి ఇంకొక క్రొత్త దానిని కనిపెట్టారు .   stethoscope ను ఉపయోగించి doctor  గారు మన శరీరం లో జరుగుతున్న మార్పులను అంచనా వేయగలరు . BP check చేయడానికి ఒక పరికరం కనుగొన్నారు కాబట్టి ఎంతో మంది ప్రాణాలు దక్కుతున్నాయి . ప్రస్తుతం X -ray ,CT స్కాన్  మొదలగునవి కనుగొనబడి డాక్టర్ గారికి వ్యాధి diagnose చేయడానికి చాల సులువు అయినది . అలాగే సైకిల్ .motor cycle ,car ,bus ,train బులెట్ train ,rocket , Atomic energy , computer , cellphone కనుగొనబడి మన జీవితాలు చాలా సులువు ఇనాయి . వీటన్నిటిని కనుగొన్న మహానుభావులు నిజంగా దేవుళ్ళు . వారికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపాలో మనకు అర్థం కాదు , వారికి మనమెంతో ఋణపడి ఉన్నాము .వాళ్లకు మనం రోజు పూజలు చేసినా తక్కువే .  


దీనికి కూడా ప్రతి బంధకాలు ఉన్నాయి , వాటిని అధిగమించాలి , అప్పుడే దానికి విలువ ఉంటుంది . ముఖ్యముగా చెప్పాలంటే డిజిటల్ ఇండియా అంటే దేశం మొత్తానికి broad band connection కల్పించడమే . ఆప్టికల్ ఫైబర్ ద్వారా గాని microwave మైక్రోవేవ్ ద్వారా గాని net work connectivity కల్పించడం . ఇప్పటికే ఇంతకు ముందు ప్రభుత్వ రంగ సంస్థ  ( BSNL)  ఈ net work కనెక్టివిటీ ని కల్పించింది  . NGN -  New generation network కూడా రెడీ చేసి ఇప్పటికే పని కూడా చేస్తున్నాయి .  ఇప్పుడు ప్రభుత్వం దానిలో ప్రైవేటు వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నది . ప్రైవేటు వాళ్ళు కేబుల్ వేసేది లేదు , టవర్ పెట్టేది లేదు , వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం (BSNL)  రెడీ చేసిన ఈ infrastructure ను nominal రేటు పై ప్రైవేటు వాళ్ళు లీసు కు తీసికొని వేల కోట్ల రూపాయలను మూట కట్టుకుంటారు ,  అదే డిజిటల్ ఇండియా - Digital India. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది .   ఇన్నేండ్ల ప్రభుత్వ రంగ సంస్థ BSNL ప్రయత్నమే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ స్థితి లో ఉన్నాము . 
ఇంత కష్ట పడి net work కల్పించిన BSNL కు డిజిటల్ ఇండియా - Digital India.inauguration program లో ప్రారంబోత్సవ కార్యక్రమములో ఉచిత స్థానం కూడా కల్పించ బడలేదు . అదే ప్రైవేటు వాళ్ళను భుజాలపైకి ఎక్కించు కున్నారు . 


మొత్తం మీద మనం కోరుకోవడం దేశాభి వృద్ధి అన్ని రంగాల్లో  కావాలని .  ప్రధాని మోడీ ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భమున ఒక పారిశ్రామిక వేత్త దీన్ని ఆకాశానికి ఎత్తాడు . దేశ వ్యాప్తంగా డిజిటల్ అనుసంధానం వలన ప్రజలకు మిగతా ప్రపంచం తో సంబంధం ఏర్పడి అత్యంత శక్తి లభిస్తుందని అన్నారు . క్రొత్తగా కనుగొన్న ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ సంక్షేమం గురించే ఉపయోగించాలి . అనేక సామాజిక సమస్యలను సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి పరిష్కరించ లేము . 

డిజిటల్ పరిజ్ఞానం ద్వారా పారదర్శికత పెరుగుతుందని , లంచగొండితనం అంతరిస్తుందని , పనిదనం పెరుగుతుందని మనం అనుకోవచ్చు . ఎవ్వరు ఏం పనిచేశారో ,అతని దగ్గరకు ఎప్పుడువచ్చింది ఎంత సేపట్లో చేశాడో తెలుసు కోవచ్చు . ఎందుకు ఎక్కడ delay అయిందో కనుగొనవచ్చు . explanation అడుగవచ్చు . ప్రస్తుతం ప్రతిచోటా  సి సి కెమెరా లు పెట్టి దొంగలను అతి తొందరగా పట్టవచ్చు . information తొందరగా లభిస్తుంది . Data  ఎప్పటికప్పుడు feed చేస్తేనే correct information దొరుకుతుంది . 
ప్రస్తుతం మనిషి కదలికను తెలిసికొనే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు అది దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి . మనం దీని పర్యావసానాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలి . అంతేగాని దుర్వినియోగం చేయరాదు . 

ఆశ్లీల website లను పూర్తిగా నిషేదించాలి . దీనివలన చిన్న పిల్లలు తమ భవిష్యత్తును పాడుచేసుకుంటారు . ప్రస్తుతం మనం రోజు చూస్తున్నాము . స్త్రీ ల ఆశ్లీల దృశ్యాలను చిత్రీకరించి block mail చేస్తున్నారు , వారి జీవితాలతో ఆడుకుంటున్నారు . వారి మరణాలకు కూడా కారణమౌతుంది . 



లాటరి వచ్చిందని message లు పంపి అమాయకులను మోసం చేసి డబ్బులు లాగుతున్నారు . website లను hack చేసి ఇతరుల information ను కనుగొంటున్నారు . అందుకే డిజిటల్ లో మోసం జరుగకుండా జాగ్రత్త పడాలి . పటిష్టమైన వ్యవస్తను ఏర్పాటు చేసి మోసగాళ్ళను పట్టుకొని శిక్షించాలి కాని మోసగాడు ఎక్కడో విదేశాల్లో ఉండి మోసం చేస్తాడు  వాడిని పట్టుకోవడం చాల కష్టం . IPL దొంగ ఎక్కడో విదేశాల్లో దాక్కొని రోజుకు ఒక రకమైన tweet చేస్తూ అతను నాతొ కలిశాడు , ఇతను నావలన లాభం పొందాడని రోజు tweet చేస్తూ గందరగోళం చేస్తున్నాడు . 
e - governance  కాని m -governance గాని internet పైనే పనిచేస్తాయి . ఈ internet ను దేశం మొత్తానికి విస్తరింప చేయడమే Digital India కార్యక్రమం .  
Digital India కార్యక్రమం టెక్నాలజీ సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతుంటే తమవంతుగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెలికం దిగ్గజాలు ప్రకటించాయి.
ఎందుకు ప్రకటించవు ఇప్పటికే ప్రభుత్వం network ను optical fiber , microwave , NGN ను దేశం లోని మూల మూలకు  విస్తరించిపెట్టింది . ఈ ప్రైవేటు టెలికం దిగ్గజాలు ఆ నెట్ వర్క్ నే ఉపయోగించుకుంటాయి . వారికి మళ్ళి ఎలాంటి కేబుల్ వేయవలసిన పనిలేదు , ఏదో కొంత చెల్లించి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తారు . అందుకే పోటీ పడి  మరీ పెట్టుబడులు పెడతామంటున్నారు  . 

BSNL places mobile tower with Indian 


Army’s help at 16,000 feet in Ladakh


BSNL with Indian Army's help has set up the highest mobile 


tower in Eastern Ladakh.



- See more at: http://indianexpress.com/article/technology/tech-news-technology/bsnl-places-

mobile-tower-with-indian-armys-help-at-16000-feet-in-

ladakh/#sthash.CYM4skJk.vKwikXe5.dpuf





దేశం ను అభివృద్ధి చేయడానికి ఒక్క టెలికాం రంగం మాత్రమే ఉందా ? ఎన్నో రంగాలు మన దేశం లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది . విద్యా రంగం , పాటశాలలు ,కాలేజీలు విద్యార్థులకు పాటశాలల్లో ,కాలేజి లలో సరియైన వసతులు లేవు ,ప్రయోగ శాలలు లేవు . గ్రామీణ ప్రాంతాల్లో పాటశాలకు వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు నడవవలసిన పరిస్థితి  ఉంది . ఎండలో ఎండుతూ , వానలో తడుస్తూ స్కూల్ కు వెళ్ళుతున్నారు . 

ప్రభుత్వ పాఠశాలలను రక్షించండి, మౌలిక వసతులు కల్పించండని విద్యార్థులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వ విద్య ఆందోళనకరంగా ఉంది. పాగైన కంప్యూటర్లు, బల్లలు లేని తరగతి గదులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో  బాలికలకు మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీటిని మర్చిపోయి ప్రభుత్వం మాత్రం టెక్నాలజీ గురించి మాట్లాడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత వైఫై కలిస్తానని, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నది. ఇచ్చిన వాగ్దానాలకు దిక్కులేక మూలనపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం ఒక పక్క అయితే మరో పక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు మూలనపడ్డాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సాంకేతిక విద్యనే మర్చిపోయింది. వీటిని పట్టించుకోకుండా వైఫై అంటూ హైటెక్‌గా ఆలోచించి హైటెక్‌ ప్రభుత్వం అన్పించుకోలనుకుంటోంది.. 
ఆరోగ్యరంగం లో సరియైన ఆసుపత్రులు లేవు , గ్రామీణ ప్రాంతములో రోగం వస్తే లేదా గర్భిణి లు ఆసుపత్రికి వెళ్ళాలంటే పెద్ద ఊరికి పోవలసినది . అక్కడ కూడా సరియైన డాక్టర్లు అందుబాటులో ఉండరు . సరియైన మందులు  లభించవు , చిన్న ఊ ళ్ళకు రహదారులు కూడా లేవు , వ్యవసాయరంగం లో వర్షం మీదనే లేదా బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు .  స్వచ్చమైన  త్రాగునీరు లభించదు  ,విద్యుత్తు సప్లై సరిపోను లేదు  , 

 అందుకే ఈ పై రంగాలలో ప్రైవేటు వాళ్ళు పెట్టుబడులు పెట్టి  దేశాభివృద్ధి కి తోడ్పడవచ్చు కాని వారు అక్కడ పెట్టుబడులు పెట్టటలేదు . కాని టెలికాం రంగం లో మాత్రం పెట్టుబడులు పెడతామని పరుగులు తీస్తున్నారు .  

టెలికాం రంగం రోజుకు ఒక బంగారు గ్రుడ్డు పెట్టే బాతు , Daily golden egg laying goose ఒక్కసారి పెట్టుబడి పెడితే అదే కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తుంది . ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశం లో నలు మూలల నెట్ వర్క్ వేసినప్పుడు ప్రభుత్వమే digital ఇండియా చేయవచ్చు కాని ఎందుకు చేయడం లేదు ? మనకు మన పిల్లలకు కూడా తెలిసినా ఏం చేయగలం . మనం సామాన్య పౌరులం కదా ! 

సామాన్యుడికి సైతం టెక్నాలజీ సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతుంటే తమవంతుగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెలికం దిగ్గజాలు ప్రకటించాయి.

డిజిటల్ ఇండియా ప్రవేశ పెట్టడం మంచిదే . ఎవ్వరు కాదనరు కాని చాలా లాభం పొందేది మాత్రం కార్పొరేట్ వాళ్ళే . దానివల్ల సామాన్యుడికి కొద్దిగా మాత్రమే  ఉపయోగ పడుతుంది , ఇందులో ఎలాంటి సందేహం లేదు . కేవలం కమ్యూనికేషన్ గురించి అంటే ఫోన్ లో మాట్లాడు కోవడానికి మాత్రం చాలా ఉపయోగ పడుతుంది . సామాన్యుడికి  ఒకసారి ఎప్పుడో ఉపయోగ పడుతుండవచ్చు . అతడు ప్రయానించేది జనరల్ రైల్వే బోగి లో అక్కడ రిజర్వేషన్ ఉంటుందా ? అతనికి  income tax కట్టే సంపాదన ఉందా ? ఉంటే కదా online లో tax online లో కట్టేవాడు . విద్యార్థులకు మాత్రం ఉపయోగం ఉంటుంది . e -books , latest knowledge  దొరుకుతుంది . 
నెట్ ఏమైనా free గా ఇస్తారా అంటే అదీలేదు . రైతు తనకు కావలసిన సమాచారం టీవీ లలో లభిస్తుంది .పుస్తకాలలో లభిస్తుంది  రైతు కేవలం నెట్ లో చూస్తూ భూమి దున్నుతూ వ్యవసాయం చేస్తాడా ఏమిటి ?

ఒక బిచ్చగాడు సెల్ ఫోన్ లో అన్నం వండడం అయిందా బిచ్చానికి రావాల ? అని అడగడం వలన సాంకేతిక రంగములో అభివృద్ధి చెందినట్లు కాని దీని వలన దేశం నిజంగా  అభివృద్ధి చెందినట్లా ? కాదు , అసలు బిచ్చగాడు బిచ్చం ఎత్తకుండా స్వయం గా సంపాదించి కడుపునిండా అన్నం తిన్ననాడే , బిచ్చగాళ్ళు లేనినాడే దేశం  అభివృద్ధి చెందినట్లు . 





అసలు ఇక్కడ internet ను wi fi  ని క్షణం తీరికలేకుండా వందల computer ల ద్వారా ఉపయోగించేది కార్పొరేట్ దిగ్గజాలు . వారికే  చాల ఉపయోగం . ఒక్క క్షణం net పని చేయకుంటే వాళ్లకు కోట్లలో నష్టం కలుగుతుంది . ఈ రంగం లో  పెట్టుబడి పెట్టేవాళ్ళ కు చాలా లాభం . దేశం లో 70-80% మంది పేదవారు . వాళ్లకు సరియైన ఇళ్లు లేవు . త్రాగడానికి నీరు దొరకదు . కట్టుకోవడానికి,  క్రొత్త బట్టలుకొనుక్కోవడానికి డబ్బులు లేవు . రోగం వస్తే సరియైన చికిత్స దొరకదు . మంచి పాటశాలలో పిల్లలను చదివించలేరు . అసలు చెప్పాలంటే చిన్న ఊ ళ్ళకు రోడ్ వసతి కూడాలేదు . రవాణా సౌకర్యం లేదు . నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటు తుంటే , international market లో పెట్రోలియం ధరలు తగ్గినా మన దేశం లో పెంచుకుంటూ పోవడమేమిటి ? technology అభివృద్ధి చెందాలి , దానికి ఎవ్వరు అడ్డు చెప్పారు  కాని  డిజిటల్ ఇండియా మాత్రం  కార్పొరేట్ వాళ్లకు మేలు చేసేది కాదా ! 
దేశమంతా optical fiber network  ఇంతకు ముందు ప్రభుత్వాలు  టవర్ లు పెట్టారు .ఇప్పటికే వాటి ద్వారా మీ -సేవా , online ద్వారా సౌకర్యం కల్పించారు . 
ఇప్పుడు దానినే ప్రైవేటు operators వాళ్ళు ఉపయోగించు కొనునట్లు చేసి private operator లకు లాభం చేస్తున్నారు .నెట్ వర్క్ ను గ్రామాల స్తాయికి ప్రభుత్వ రంగ సంస్థ తీసుక వెళ్ళుచున్నది  అంతే తప్ప పెద్దగా చేసింది ఏమిలేదు .

పేరుకి సామాన్యులది కాని లాభం మాత్రం corporate వాళ్ళది  . కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఎందుకు పెట్టరు ?ఇంకా కోట్లు సంపాదించడానికి ఎంతైనా పెడతారు ,  సంపాదించినదంతా ప్రజలనుండే కదా ! లేదా బ్యాంకు లు కూడా వారికే కోట్ల రూపాయలు అప్పులుగా ఇస్తాయి . సామాన్యుడి దగ్గర డబ్బు ఉంటే అతను కూడా  పెట్టుబడి పెట్టగలడు , invest చేయగలడు కదా ! 

                                                                                                                                  yours ,
                                                                                                          www.seaflowdiary.blogspot.com 



No comments:

Post a Comment