Sunday, June 28, 2015



INTERNATIONAL YOGA DAY  - ప్రపంచ యోగా దినోత్సవం      विश्व  योगा दिवस 
                                                                                                                            Date : 28 - 06 - 2015 

YOGA యోగా ను చేస్తూ క్రమ బద్ధంగా ఆహార నియమాలను పాటించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యముగా జీవించవచ్చు . యోగా కు exercise మరియు gymnastic లతో దగ్గరి సంబంధం ఉన్నది . యోగా నెమ్మదిగా చేయవలసిన క్రమము. 






."ఆరోగ్యమే మహాభాగ్యము" అని మనందరికీ చిన్నప్పటినుండే తెలుసు . కాని మనము ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూపెట్టడం లేదు . ఆరోగ్యం బాగా లేనప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళడం మందులు వ్రాసిస్తే కొనుక్కొని వేసుకోవడం రోగం తగ్గనప్పుడు హాస్పిటల్ లో చేరి చికిత్స చేయించు కొనడం, హాస్పిటల్ వారు అన్ని పరీక్షలు చేయిస్తారు .    తీర హాస్పిటల్ బిల్లు చూసి పరేషాన్ కావడం ,బిల్లు కట్టడానికి జమచేసిన డబ్బులు ఖర్చు చేయడం సరిపోకుంటే బంగారం ,ఇల్లు, భూమి అమ్ముకొని కట్టవలసిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము .   హాస్పిటల్ వారు వైద్యమును కమర్షియల్ గా మార్చి వేశారు . బిల్లును చూసి మనం పరేషాన్ అవుతుంటే  హాస్పిటల్ వారు ఇక్కడ ఎందుకు జైన్ అయ్యారు ప్రభుత్వ దవాఖాకు పోవలసినదని ఉచిత సలహాలు ఇస్తారు .
డబ్బు మొత్తం కట్టకుంటే రోగిని బందిస్తారు , మొత్తం డబ్బులు కట్టిన తరువాత వదలి పెడుతున్నారు . మొన్ననే ఇక్కడ హైదరాబాద్ లో ఒక గర్భిణి డెలివరి గురించి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిట్ అయి డెలివరీ అయి ఇల్లు భూమి అమ్ముకొని 20 లక్షల బిల్లు చెల్లించి నా ఇంకా 4 లక్షలు చెల్లించ లేని పరిస్థితులలో తల్లీ బిడ్డలను వారం రోజులుగా హాస్పిటల్ లోనే బంధించారు .
మనమేమో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళామాయే అక్కడి పరిస్థితులు మనకు బాగా తెలుసు. అక్కడ మంచి డాక్టర్ లు ఉన్నా ఏం లాభం ? సరియైన చికిత్సా పరికరములు , మందులు ఉండవని అతి సామాన్యుడు కూడా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళడానికి దారి తీస్తుంది  .
మందులతో సంబంధం లేని చికిత్స యోగా . నేటి ఉరుకులు ,పరుగుల జీవనం లో మనిషికి తీరిక లేకుండా పోయినది . మరికొంత మంది నోట్ల సంపాదన లో పడి కోట్ల విలువైన ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మానసిక ఒత్తడి , ఆందోళన లతో సతమతమై ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణం మీదికి తెచ్చు కుంటున్నారు .
ఈ తరుణం లో ప్రాచీన మైన యోగా సాధన ఒక్కటే సరియైన మార్గం చూపెడుతున్నది . బుద్ధి ,మనస్సు , శరీరం మధ్య సమన్వయము కోసం చేసే వ్యాయామమే యోగా . యోగా విద్యను వెలుగులోనికి తెచ్చింది  పతంజలి మహర్షి మరియు కపిల మహర్షి లు. యోగా 5000 ఏళ్ళ నుంచి భారతీయ జీవన సంస్కృతి లో ఆచరణలో ఉన్నదిగా విశ్వసించు చున్నారు . క్రీ . పూ . 500 కాలం లో యోగా బాగా విలసిల్లినది . అప్పుడు బౌద్ధ మతం బాగా ప్రచారం లో ఉన్నది . తరువాత హైందవ మతం ఆధిపత్యం వహించడం లో మతం రంగు పులమడం తో యోగా కు తీరని నష్టం జరిగింది . 

నేడు మనదేశం లో యోగా ప్రాముఖ్యాన్ని అందరు తెలుసు కుంటూ సాధన చేయుచున్నారు . యోగా సాధన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ,సామాన్యుల నుండి సంపన్నులవరకు యోగా సాధన నిత్య కృత్య మైనది .

యోగా ఒక పెద్ద కష్టమైన ప్రక్రియ కాదు యోగా అంటే ఒక పెద్ద ప్రిపరేషన్ ఏమి కాదు , ఎంతో సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు కేవలం 30-60 నిమిషాలు సాధన చేస్తే చాలు . చిన్నపాటి శ్రద్ధ వహించి యోగా చేసి అపరిమితమైన ప్రయోజనం పొందవచ్చు . మనస్సుకు తగిన ప్రశాంతత ,ఏకాగ్రత మరియు మానసిక ఆరోగ్యం లభిస్తుంది . యోగా అభ్యాసం వలన అన్ని శరీరావయాలు చురుకుదనాన్ని పొందుతాయి , శరీరం తేలిక అవుతుంది ఫలితంగా జీవ క్రియాశీలత పెరుగుతుంది . ఈ కారణం గా రక్తం లో అధికం గా ఉన్న చక్కర నిల్వలు క్రమ బద్దీక రించ బడుతుంది, దీనితో స్తబ్దత తొలిగి ఉత్సాహం ఏర్పడుతుంది . ప్రకృతి  లోని కాస్మిక్ ఎనర్జీ ని గ్రహించి వాటన్నింటిని క్రమ బద్దీకరించే శక్తి యోగాకు మాత్రమే ఉంది .



యోగా ప్రాముఖ్యం తెలిసికొని ప్రపంచములో అక్కడక్కడ సాధన చేయు చున్నారు . కాని దీని విలువ ప్రపంచములో అందరికి తెలియదు . కావున మన ప్రధాన మంత్రి మోడీ గారు ప్రత్యేక చోరువ తీసికొని ఎలాగైనా యోగా కు మనదేశ గుర్తింపుగా తేవాలని అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ యోగా ప్రశస్తన ను అక్కడి మీటింగులో చెప్పారు . తదనుగుణం గా భారత్ సెప్టెంబర్ 2014 న ప్రతిపాదన ను ఐక్య రాజ్య సమితి లో మెజారిటి దేశాలు 177 ఆమోదం తెలిపాయి . ఇది ఐక్య రాజ్య సమితి చరిత్ర లో మొదటి సారి . ఇందులో అన్ని మతాల వారు ఆమోదించారు . ఆఫ్గానిస్తాన్ , పాకిస్తాన్ ,టర్కీ ,ఇరాన్ , ఇండోనిషియా , ఖతార్ , ఒమాన్ , అరేబియా , బ్రూని ,లిబియా లాంటి 47 ఇస్లామిక్ దేశాలు ఉండడం విశేషం . అలాగే క్రిస్టియన్ ఇతర మత సంస్కృతులు ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ మొదలు శ్రీలంక , నేపాల్ ,భూటాన్ లాంటి దేశాలు యోగాను ఆచరించడానికి ముందుకు వచ్చాయి .  జూన్ 21 ప్రపంచ యోగా దినం గా ప్రకటించబడినది . జూన్ 21 కి దేశాల సంఖ్యా 192 కు చేరు కున్నది . 






దీనికంతటికీ మోదిగారే కారణం , యోగాతో ప్రపంచ దేశాలన్నిటికీ భారత్ కు గుర్తింపు లభించింది . 
21-06-2015 మొట్ట మొదటి ప్రపంచ యోగా దినం ను మనమే  కాకుండా ప్రపంచ మంతా ఘనం గా జరుపుకున్నది . యోగాను నిత్యం సాధనలో పెట్టాలి . 

                                                                                                                                  yours ,
                                                                                                              www.seaflowdiary.blogspot.com 












No comments:

Post a Comment