సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " ఇది ఒక రైల్వే బడ్జెట్ గా లేదు ఏదో ఉన్నవాటిని బాగుచేస్తామన్నట్లు ఉంది . "కిర్రు కిర్రు మని నడుస్తున్న ఎడ్ల బండి చక్రాల ఇరుసు కు కందెన వేసినట్లు ఉన్నది బడ్జెట్" . ధరలు పెంచలేదంటు గొప్పగా చెప్పుకోవడం ఎందుకు ? అధికారం లోకి వచ్చి రాగానే 14,2% ధరలు పెంచిన సంగతి అప్పుడే మరచి పోయారా ! ఇంత మొత్తం ఏ ప్రభుత్వ మైన పెంచినదా ? భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగినదా ? సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమిలేదు . విద్యార్థులకు కూడా ఏమిచేయలేదు . రైలు చార్జీలు బస్సు చార్జీల కంటే చాల తక్కువగా ఉండాలికదా ! చాలా మంది సామాన్యులు ప్రయాణించేది రైళ్ల లో . రైళ్ల లో సామాన్యులకు సీట్ లే దొరకవు , జనరల్ భోగిలో ఒంటి కాలు పై సామాన్యులు వందల మైళ్ళు ప్రయాణిస్తున్నారు , జనరల్ భోగీలు పెంచేది లేదు , ఎవ్వరైనా ఇన్ని రోజు లైన ఎందుకు గమనించటం లేదు ?. కనీసం ఈ ప్రభుత్వమైనా జనరల్ భోగీలు పెంచుతుంది అనుకుంటే అదీ లేదు . అన్ని రైళ్ళు ఫుల్ గానే ప్రయాణికులతో పోతాయి . ఎన్నో రోజుల ముందు బుక్ చేసికుంటే గాని టికెట్ దొరకదు . గూడ్స్ బండ్లు మోయలేని బరువులు మోస్తూనే ఉన్నాయి . క్రొత్త రైల్వే లైన్ ఒక్కటి వేయలేదు , మన దగ్గర బీబీనగర్ - నడికూడి తప్ప . అన్ని రైల్వే లైనులు పాతవె . బ్రిటిష్ వారు , నిజాం వేసినవే ! ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించ లేదు . బయో టాయిలెట్ లు ఏర్పాటు చేస్తామని ప్రభు గారు చెప్పారు చాలా బాగుంది . ఇది ముందు చూపుతో చేసిన రైల్వే budget అట . ప్రయాణీకులకు ఈ సౌకర్యాలు కల్పించడం రైల్వే ల mandatory కాని ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏదో ప్రవేశ పెట్టి చేతులు దులుపు కున్నాయి . ఎప్పుడో మంజూర్ ఐన పనులు ఇంతవరకు పూర్తీ కాలేదు ఇంకా కొన్ని మొదలు కూడా పెట్టలేదు .శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్ లోక్ సభ నుండి ఎన్నిక అయినప్పుడు క్రొత్త రైల్వే లైను పటాన్ చేరు -- సంగారెడ్డి --జోగిపేట్ --మెదక్ --సిద్దిపేట మీదుగా వేయుటకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు . సర్వే కూడా చేశారు . అసలు రైల్వే లైన్ లేని మెదక్ జిల్లా ప్రజలు చాల సంతోషించారు . కనీసం ఈ విషయం రైల్వే శాఖకు తెలుసా అని , ఇన్ని సంవత్సరాలు గడచినా ఒక్క బడ్జెట్ లో ఈ సంగతి ఎక్కడా ఎప్పుడు కూడా ప్రస్తావన లేదు . అదే కాంగ్రెస్ మల్లికార్జున్ రైల్వే మంత్రిగా చేసినా వారి ప్రధాన మంత్రి గారి వాగ్దానం జ్ఞాపకం కూడా చేయలేదు . దత్తన్న కూడా ఎం చేయలేదు .. ఇక రైల్వే కేబినేట్ మంత్రులకు ఈ విషయం అసలు తెలియదు ,ఇక్కడి నాయకులకు రైల్ ఎలా ఉంటుందో ,ఎప్పుడు చూడ లేదేమో మరి అందుకే ఈ లైను ప్రస్తావన గురించి కేంద్రం ముందుకు తేలేదు .
ఎప్పుడు చూచినా రైల్వే లు లాస్ లో ఉందంటారు , ఇంతకూ ముందు ప్రభుత్వాలు ఇలాగే చెప్పుతూ వస్తున్నాయి . ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పుతున్నది . ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టె రైల్వే budget చాల బాగుంటుంది అనుకొన్నారు కాని వారి ఆశలన్నీ అడియాశ లయ్యాయి . వీరు పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ద్వారా రైల్వే లను అభివృద్ధి చేస్తారట . ఈ ప్రభుత్వానికి కలలో కూడా పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) అని కల వస్తుందేమో !
Date: 31-03-2015
మనకు ఇంత అర్జెంటు గా అభివృద్ధి పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ల ద్వారా అవసరం లేదు. రైల్వే లు పబ్లిక్ ద్వారా అభివృద్ధి చేయండి అంతేగాని ప్రైవేటుని ఇందులోనికి లాగవద్దు, ప్రైవేటు వారు లేకుంటే ప్రభుత్వానికి చేతకాదా ? నిపుణులు లేరా ? కావాలంటే ఇతర దేశాల రైల్వే లను చూస్తె తెలుస్తుంది. రైల్వే అంటేనే సామాన్య ప్రజలది.
ఎప్పుడు చూచినా రైల్వే లు లాస్ లో ఉందంటారు , ఇంతకూ ముందు ప్రభుత్వాలు ఇలాగే చెప్పుతూ వస్తున్నాయి . ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పుతున్నది . ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టె రైల్వే budget చాల బాగుంటుంది అనుకొన్నారు కాని వారి ఆశలన్నీ అడియాశ లయ్యాయి . వీరు పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ద్వారా రైల్వే లను అభివృద్ధి చేస్తారట . ఈ ప్రభుత్వానికి కలలో కూడా పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) అని కల వస్తుందేమో !
Date: 31-03-2015
సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని ఇంత వరకు అనుకున్నాము కాని రేపటి నుండి అనగా 01-04-2015 నుండి 5 రూపాయల ప్లాట్ ఫాం టికెట్ ను రూ . 10 కి పెంచడమేమిటి ? ఇక వీడ్కోలు చెప్పడానికి రైల్వే భోగి వరకు వెళ్ళవలసిన పనిలేదు . ఇంటి వద్దనే వీడ్కోలు చెప్పి పంపించాలి . రైల్వే స్టేషన్ కు వెళ్ళే చార్జీలు మిగలాలని ఏమో ! ఇప్పటికే ప్లాట్ ఫాం టికెట్ ధర రూ . 5 ఎక్కువ ఉన్నదంటే రూ . 10 కి పెంచి నడ్డి విరిచారు . ఇంకా కొన్ని రోజు లైతే ట్రైన్ ను దూరం నుండి చూస్తే కూడా డబ్బు వసూలు చేస్తారేమో
! సరకు రవాణా చార్జీలను కూడా పెంచు చున్నారు . యూరియా , గింజ ధాన్యాల రవాణా చార్జీలు 10% బొగ్గు రవాణా చార్జీలు 6.3% , సిమెంట్ 2.7% , ఇనుప తుక్కు 3. 1% కోల్ తార్ రవాణా 3. 5% పెంచుతున్నారు .
బడ్జెట్ లో చెప్పేది ఒకటి ఇప్పుడు చేసేది మరొకటి . ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు , ఎంత పెంచినా భారిస్తారును కుంటున్నారు కాని దీనివల్ల అన్ని ధరలు పెరుగుతాయి . సామాన్యుడు తన జీవితం లో ఇల్లు కట్టు కో లేడు ఎందుకంటే సిమెంట్ మరియు ఇనుము ధరలు పెరుగుతాయి .
గింజ ధాన్యాల రేటు పెరుగుతుంది కావున సామాన్యుడు సగమే తినాలి ! ముందే సామాన్యుడు సరిపోని ఆదాయం తో సత మత మవుతున్నాడు .
ప్రభుత్వానికి ఎప్పుడు చూసిన ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా ! సైంటిఫిక్ గా ఎంతో ఎదుగుతున్నా రాను రాను ధరలు తగ్గాలి కాని పెరుగుతూనే ఉన్నాయి .
ఈ అవకాశం గురించి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
జనతా ప్రభుత్వం లో మధుదండావాతే గారు రైల్వే మంత్రిగా సర్ప్లేస్ surplus budget ప్రవేశ పెట్టినారు ఆ ఘనత నిజంగా ఆయనదే . ఆయను చూచి కూడా తరువాత వచ్చిన రైల్వే మంత్రులు ఆ పని చేయలేక పోయారు .
లాలూ గారు గరీబ్ రథ్ ప్రవేశ పెట్టి కనీసం పేదవారు ఏసీ లో ప్రయాణించే టట్లు చేశారు . దీది దూరంతో పెట్టి టైం సేవ్ చేశారు . కాని ప్రభు గారు " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని చెప్పి దొడ్డి దారిన పెంచడమేమిటి ?
yours,
-www.seaflowdiary.blogspot.com
yours,
-www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment