Kejriwal's Unprecedented Victory - కేజ్రివాల్ చారిత్రాత్మక విజయం
Dated : 10-02-2015
Up dated :11-02-2015 , 12-02-2015
Up dated :11-02-2015 , 12-02-2015
New Delhi: Through a shower of petals and jubilant cheers that rained all around him, Arvind Kejriwal, the 44-year-old chief of the Aam Aadmi Party (AAP), addressed a sea of supporters, who were wearing the trademark AAP white caps.
"Thanks for the unprecedented victory," Mr Kejriwal, said, "It's very scary - this support of support. We must guard against arrogance."
The scale of Mr Kejriwal's victory is so immense that the note of caution sounded by him seems appropriate. AAP, just two years old, won 67 of a possible 70 seats in Delhi, crushing the BJP with such force that it was left with just three seats. Its mauling is surpassed only by that of the Congress, which won no seats at all.
Prime Minister Narendra Modi, who campaigned aggressively for the BJP in Delhi, congratulated Mr Kejriwal on the phone and said on Twitter that the Centre will provide full support to Mr Kejriwal for the development of Delhi.
The only three BJP candidates who survived the AAP tsunami were Jagdish Pradhan, Vijender Gupta and Om Prakash Sharma. The Congress scored a duck for the first time.
Jagdish Pradhan won in Mustafabad, Vijender Gupta in Rohini and Om Prakash Sharma in Vishwas Nagar.
At election rallies, the PM had described Mr Kejriwal as "a back-stabber" who ejected from office when confronted with a challenge. But the visible people connect for Mr Kejriwal and his cadres, who launched a well-planned campaign months before other parties,
Why did these voters leave the BJP and go over to the AAP? Because eight months of Modi rule at the Centre have made it clear that while the BJP makes vague announcements for the poor, it delivers concrete results for the corporate sector. Like the ordinance which makes it easier for the land of farmers and adivasis to be acquired and made over to industry. Like labour laws and environmental reform which makes it easier for industry to violate existing standards.
And not taken any drastic measures to control Nirbhaya cases. Jan-Dhan yojana with zero balance opened bank accounts then what is the use with out depositing amount.
Swach Bharath is a nice program but that program nominated only high level people like cinema actors, industrialists etc. then where is the seat to the common man. And ready to make privatization of PSUs.
The citizens of Delhi may not have experienced what these changes mean, but they are clever enough to realise the development being pursued isn't quite inclusive.
Any party needs at least 10 per cent of the house strength to qualify for Leader of Opposition. The BJP has not even won seven seats, which means, there will be no opposition party in the assembly and no Leader of Opposition.
AAP leader Kumar Vishwas, however, said the party would give the BJP Leader of Opposition status even if it won less than seven seats. The BJP had not shown the same generosity when it came to the Congress. In the national election, when the Congress won 44 seats, falling short of the 55 it needed to qualify as Leader of Opposition, the government said it would allow the post to remain vacant.
Fresh from the diplomatic high of a successful summit meeting with President Obama, Prime Minister Narendra Modi has been brought down to earth by domestic politics. He and his Bharatiya Janata Party, or B.J.P., were crushed in the election Tuesday for New Delhi’s 70-member state assembly, winning three seats while the upstart Aam Aadmi Party, or A.A.P., captured the rest.
The Newyork Times
The Opinion Pages | Editorial
A Defeat for Prime Minister Modi
On social media, the vanishing opposition in Delhi became a recurring theme. "The entire Delhi opposition can fit in a Nano car," said one tweet. Another revised it to an "auto-rickshaw."
Requesting Mr Kejriwal he may think twice before taking decisions . Should keep good relations with Centre. Take advice from Annaji, KCR cm Telangana, he is working day n night for development of Hyderabad as a world city and telangana state, IT ,water grid, kakatiya mission ,pension to poor, physically challenged, fee to students , 6 kg fine rice per head etc. etc. DiDi cm bengal , Navin patnaik cm odisha and other excellencies.
హస్తినలో ఆప్ చారిత్రాత్మక విజయం
దేశ రాజధాని ఢిల్లీలో సామాన్యుడి పార్టీ సత్తా చాటింది. ఢిల్లీపై ఆప్
జెండా రెపరెపలాడుతోంది. హస్తిన ఎన్నికల్లో ఆప్ సరికొత్త ఒరవడిని
సృష్టించింది. దేశ రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా 70 స్థానాల్లో పోటీ చేసి
67 స్థానాల్లో గెలుపొందండం సామాన్యుడికి సాధ్యమైంది. ఎన్నో ఏళ్ల రాజకీయ
చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు కనీస మెజార్టీని సాధించలేకపోయాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహితం ప్రతిపక్ష పార్టీ హోదాను
దక్కించుకోలేక పోయింది. మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్
అయితే ఖాతా కూడా తెరవలేదు. ఆప్‌కు పోటీని కూడా ఇవ్వలేదు. ఒంటి చేతితో
కేజ్రీవాల్ తన చీపురుతో కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేశారు. 16 ఏళ్ల తర్వాత
ఢిల్లీలో మళ్లీ పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలు ఆడియాశలయ్యాయి. సార్వత్రిక
ఎన్నికల నుంచి ఆయా రాష్ర్టాల్లో వరుస ప్రభంజనలు సృష్టిస్తున్న కమలానికి
ఎదురుదెబ్బ తగిలింది. 15 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. 49
రోజులు సీఎంగా పాలన అందించి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌కే మరోసారి పట్టం
కట్టారు హస్తిన ప్రజలు.
కేజ్రీవాల్‌కు రాజకీయ అనుభవం లేదు. కోట్ల
ఆస్తులు లేవు. రాజకీయ వారసత్వం లేదు. కేజ్రీవాల్ సామాన్య వ్యక్తి.
రాజకీయాల్లో కేజ్రీవాల్ ఎంత అని అపహస్యం చేసిన పార్టీలకు ఢిల్లీ ప్రజలు
బుద్ధి చెప్పారు. సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నేతలకు కేజ్రీవాల్ సరియైన
సమాధానం ఇచ్చాడు. సామాన్యుడిగా ఉన్న కేజ్రీవాల్ ప్రజల్లోకి వెళ్లి
అవినీతిపై పోరాటం చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అవినీతిని అంతం
చేయాలనే సంకల్పంతో పోరాటం చేశాడు. ఒక్కడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన
ఆయనకు సామాన్య ప్రజలంతా మద్దతు పలికారు. సామాన్యుడిని గెలిపించారు. ప్రధాని
మోడీని మొదలుకొని కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల బీజేపీ సీఎంలు ఢిల్లీలో
ప్రచారం చేసినా బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ ఘోర పరాజయం పాలైంది.
కాంగ్రెస్ కనుమరుగైపోయింది.
BJP పరాజయానికి స్వయం కృత అపరాధమే , కేజ్రీవాల్ ను ఆప్ పార్టిని కించ పరుస్తూ చేసిన ప్రసంగాలు ఒకటి . BJP మాటలే కాని చేతల్లో చూపెట్టలేదు . నిర్భయ లాంటి కేసులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు . ఇంకా దేశం లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి . జన్ - ధన్ కార్యక్రమములో బ్యాంకు ఖాతాలు జీరో బాలన్స్ తో ఓపెన్ చేశారు కాని అందులోకి డబ్బు ఎలా వస్తుందో చెప్పలేదు . స్వచ్చ భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ లు గా సినిమా యాక్టర్లు , ఇండస్ట్రి యల్ బడా బాబులనే చేశారు అందులో ఒక సామాన్య మానవుడు లేడు . భూములు తీసికొనడానికి ఆర్డినెన్సు తీసుకొచ్చారు. PSU లను ప్రైవేటు చేస్తామనడం లేదా అందులో వాటా అమ్మడం . UPA నియమించిన గవర్నర్లను తొలగించడం లేదా అరుణాచల్ ప్రదేశ్ కు పంపి వాళ్ళంతట వాళ్ళే తోలుగునట్లు చేయడం . వాళ్ళ కనుసన్నలలో మెలిగే వారిని అలాగే ఉంచడం. ఢిల్లీ లో త్రాగు నీటికి , కరెంటు కు ఇబ్బందులు ఇలా ఎన్నో ఉన్నాయి . దేశం లో సామాన్యులను పట్టి పీడిస్తున్న భూతం "corruption " దాని నిర్మూలన గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు ,దానిపై ఒక్క కార్యక్రమం కూడా చేపట్ట లేదు. ఇక్కడ KCR గారు లంచం అడిగితే ఫోన్ చేయమని ఫోన్ నంబరు కూడా ఇచ్చారు . పారిశ్రామిక వేత్తలకే మేలు జరిగిందని అన్నా గారు చెప్పారు. F D I ని ఆహ్వానించడం లో చాల ఇంటరెస్ట్ చూపించారు . భారత దేశం లో డబ్బు లేదనా ! Insurence లో మరియు Railway లలో F D I అట . ఎలక్షన్ లలో పర్సనల్ ఎటాక్ చేయడం కాదు కించ పరచడం కాదు పార్టి సిద్దాంతాల పై ఫోకస్ చేయాలి .
ఒక పెద్ద మనిషి కేజ్రివాల్ ని నక్స లైట్ అంటాడు . వెంకయ్య గారు ఈ గెలుపు రెఫ రండం కాదంటారు , ఎందుకు కాదు .
గద్దె నెక్కించె వారు అధికారం లో తెచ్చే వారు సామాన్య ప్రజలేనని నిరూపించారు కేజ్రివాల్ గారు . సామాన్య ప్రజలు ఏదో కావాలని అడగరు వారు నిత్యావసర సౌకర్యాలు మాత్రమే ప్రభుత్వం నుండి కోరుకుంటారు .
BJP పరాజయానికి స్వయం కృత అపరాధమే , కేజ్రీవాల్ ను ఆప్ పార్టిని కించ పరుస్తూ చేసిన ప్రసంగాలు ఒకటి . BJP మాటలే కాని చేతల్లో చూపెట్టలేదు . నిర్భయ లాంటి కేసులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు . ఇంకా దేశం లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి . జన్ - ధన్ కార్యక్రమములో బ్యాంకు ఖాతాలు జీరో బాలన్స్ తో ఓపెన్ చేశారు కాని అందులోకి డబ్బు ఎలా వస్తుందో చెప్పలేదు . స్వచ్చ భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ లు గా సినిమా యాక్టర్లు , ఇండస్ట్రి యల్ బడా బాబులనే చేశారు అందులో ఒక సామాన్య మానవుడు లేడు . భూములు తీసికొనడానికి ఆర్డినెన్సు తీసుకొచ్చారు. PSU లను ప్రైవేటు చేస్తామనడం లేదా అందులో వాటా అమ్మడం . UPA నియమించిన గవర్నర్లను తొలగించడం లేదా అరుణాచల్ ప్రదేశ్ కు పంపి వాళ్ళంతట వాళ్ళే తోలుగునట్లు చేయడం . వాళ్ళ కనుసన్నలలో మెలిగే వారిని అలాగే ఉంచడం. ఢిల్లీ లో త్రాగు నీటికి , కరెంటు కు ఇబ్బందులు ఇలా ఎన్నో ఉన్నాయి . దేశం లో సామాన్యులను పట్టి పీడిస్తున్న భూతం "corruption " దాని నిర్మూలన గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు ,దానిపై ఒక్క కార్యక్రమం కూడా చేపట్ట లేదు. ఇక్కడ KCR గారు లంచం అడిగితే ఫోన్ చేయమని ఫోన్ నంబరు కూడా ఇచ్చారు . పారిశ్రామిక వేత్తలకే మేలు జరిగిందని అన్నా గారు చెప్పారు. F D I ని ఆహ్వానించడం లో చాల ఇంటరెస్ట్ చూపించారు . భారత దేశం లో డబ్బు లేదనా ! Insurence లో మరియు Railway లలో F D I అట . ఎలక్షన్ లలో పర్సనల్ ఎటాక్ చేయడం కాదు కించ పరచడం కాదు పార్టి సిద్దాంతాల పై ఫోకస్ చేయాలి .
ఒక పెద్ద మనిషి కేజ్రివాల్ ని నక్స లైట్ అంటాడు . వెంకయ్య గారు ఈ గెలుపు రెఫ రండం కాదంటారు , ఎందుకు కాదు .
The Newyork Times
The Opinion Pages | Editorial
A Defeat for Prime Minister Modi
కుల, మత రాజకీయాలకు స్వస్తి పలికిన
హస్తిన ప్రజలు సామాన్యుడైన అరవింద్ కేజ్రీవాల్‌కు అఖండ విజయం
తెచ్చిపెట్టారు. భారీ ప్రదర్శనలు, ప్రచారాలు లేకుండానే సామాన్యుడికి
అర్థమయ్యే రీతిలో తమ ప్రచారాన్ని సాగించిన ఆప్ భారీ అధిక్యాన్ని కైవసం
చేసుకుంది. కేజ్రీవాల్ ప్రచారం సాదాసీదాగా సాగినప్పటికీ గత ప్రభుత్వాలు
చేసిన అవినీతిని ఎండగట్టారు. బీజేపీ ఎన్ని సభలు పెట్టి, ఆప్‌పై
విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టిన ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్‌కే ఓటు వేశారు.
కిరణ్‌బేడీ మంత్రం ఏ మాత్రం పని చేయలేదు. కిరణ్‌బేడీ కైలాశ్‌నగర్‌లో ఆప్
అభ్యర్థి బగ్గా చేతిలో 2,508 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కేజ్రీవాల్
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నూపుర్‌శర్మపై
26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2012 నవంబర్ 26న ఆప్‌ను
స్థాపించిన కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారు. 2013,
డిసెంబర్‌లో జరిగిన హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకున్న
ఆప్ ఢిల్లీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌తో
దోస్తీ చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ 49 రోజులుగా సీఎం
పదవిలో కొనసాగి జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో సీఎం పదవికి రాజీనామా చేశారు.
2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సార్వత్రిక
ఎన్నికల్లో నరేంద్రమోడీపై కేజ్రీవాల్ పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. హస్తిన
అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోతారు అనుకున్నా బీజేపీ నేతల అంచనాలు
తలకిందులు చేస్తూ ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు
మించి ఆప్ అత్యధిక మెజార్టీని సాధించింది. మళ్లీ ఢిల్లీ సీఎంగా ప్రమాణ
స్వీకారం చేయనున్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం
రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ నెల 14న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం
చేయనున్నారు.
ఎన్నికల తర్వాత ఆప్‌కే ప్రజలు పట్టం కడ్తారని అన్ని సర్వేలు, ఎగ్జిట పోల్స్ తేల్చాయి.
అయితే
ఆప్‌కు 30 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ
పేర్కొన్నాయి. కానీ 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67
సీట్లు గెలిచి ఎవ్వరూ ఊహించని సంచలనాత్మక విజయం సాధించి చరిత్ర
సృష్టించింది.
హస్తినను పూర్తిగా ఊడ్చేసిన చీపురు
కంపు రాజకీయాలతో ఉన్న హస్తినను చీపురు ఊడ్చేసింది. ఆప్ గుర్తు అయిన
చీపురు అవినీతి రాజకీయాలను ఊడ్చిపడేసింది. ఆప్ అత్యధిక మెజార్టీ
సాధించింది. 67 స్థానాలను గెలుచుకున్న ఆప్ సంబురాల్లో మునిగితేలింది.
టపాకాయాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆప్ కార్యకర్తలు సంబురాలు
చేసుకున్నారు. అయితే సంబురాల్లో భాగంగా ఢిల్లీ వీధుల్లో చెత్త భారీగా
పేరుకుపోయింది. చెత్తను అట్లనే వదిలేయకుండా ఆప్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు
ఊడ్చేశారు చీపుర్లతో. ఢిల్లీ వీధులను శుభ్రం చేసినట్లే ఢిల్లీలో అవినీతి
రాజకీయాలు లేకుండా చేస్తామని ఆప్ కార్యకర్తలు అంటున్నారు. ఆప్ కార్యకర్తలు
చాలా సంతోషంగా ఉన్నారు. 70 స్థానాలకు ఎన్నికలు జరిగితే 67 స్థానాలను ఆప్
గెలుచుకొనగా, 3 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.
భార్యకు ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ
: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన భార్యకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ
ఆయన ఢిల్లీ ప్రజానీకానికి తన భార్యను పరిచయం చేశారు. తన విజయం వెనుక తన
భార్య కృషి ఉందన్నారు. తన భార్య సహాయ సహకారాల వల్లే ఈ విసయం సాధ్యమైందని
కేజ్రీ పేర్కొన్నారు. హస్తినలో ఘనవిజయం అందించిన ప్రజలకు అరవింద్
కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజధానిలో మద్దతుగా నిలిచిన వారందరికీ
కృతజ్ఞతలు చెప్పారు కేజ్రీవాల్. ఈ విజయం ప్రజలది, సత్యానిది అని
పేర్కొన్నారు. నిజాన్ని నమ్ముకుని నడిస్తే ప్రపంచమే తమ వెంట వస్తుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌ల గర్వమే వారికి నష్టం కలిగించిందన్నారు. అందరం
కలిసి ప్రపంచం గర్వపడేలా ఢిల్లీని తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో అవినీతిని ఏరిపారేద్దామని చెప్పారు. ఇంత పెద్ద విజయాన్ని
ఊహించలేదన్నారు కేజ్రీవాల్. నేను చాలా చిన్నవాడిని. ఒక్కడినే ఏమి చేయలేను.
మీ అందరి సహకారం అవసరం. విజయగర్వం తమకు పనికిరాదు. గర్వం తలకెక్కితే ఐదేళ్ల
తర్వాత ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు.
దేశ రాజధాని
ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మోడీ నుంచి మొదలుకొని కేంద్ర
మంత్రులు, ఆయా రాష్ర్టాల బీజేపీ సీఎంలు ప్రచారం చేసినా లాభం లేకుండా
పోయింది. విస్తృత ప్రచారాలు, లక్షల మందికి లేఖలు, సామాన్యుడిపై
విమర్శనాస్ర్తాలు ఏం పని చేయలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన అంచనాలను కూడా
బీజేపీ చేరుకోలేక పోయింది. బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో
ఉంది. సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయా రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ
విజయ ఢంకా మోగించినప్పటికీ ఢిల్లీలో మాత్రం ఓటమి చవిచూసింది. ఘోర పరాజయం
పాలైంది. మేకింగ్ ఇండియా సూత్రం పని చేయలేదు. బీజేపీ విజయయాత్రకు
సామాన్యులు చెక్‌పెట్టారు. బీజేపీ కార్యాలయం మూగబోయింది. పార్టీ నేతలు,
కార్యకర్తలు లేక కార్యాలయం బోసిపోయింది.
అసలు ఈ సామాన్యుడు ఏవరు?
హస్తినలో కనివిని ఎరుగని రీతిలో భారీ విజయం సాధించిన ఈ సామాన్యుడు ఏవరు?
ఎన్నో సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లను ఒంటి చేతితో
ఊడ్చిపడేసిన ఆ అసామాన్యుడు ఏవరు? చీపురు కట్టను గుర్తుగా పెట్టుకుని
అవినీతి రాజకీయాలను ఊడ్చేసిన ఆ వ్యక్తి ఏవరు? అతనే ప్రజల్లో ఒక్కరైన
అరవింద్ కేజ్రీవాల్. సామాన్య జనం నుంచి పుట్టుకొచ్చిన ఆ కేజ్రీవాలే ప్రజలకు
చేరువయ్యాడు. రాజకీయ అనుభవం లేని కేజ్రీవాల్ ఈనాడు సీఎం స్థాయికి ఎదిగాడు.
దేశ చర్రితలోనే 70 స్థానాలకు గానూ 67 స్థానాల్లో గెలుపొంది రికార్డుల్లోకి
ఎక్కారు.
కేజ్రీవాల్‌కు రాజకీయ వారసత్వం లేదు. ఆస్తులు లేవు.
అయినప్పటికీ దేశాన్ని ఏలుతున్న బీజేపీని మట్టి కరిపించారు. కాంగ్రెస్‌ను
అడ్రస్ లేకుండా చేశారు. మరీ అరవింద్ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే..
కేజ్రీవాల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ నుంచి
మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. అనంతరం ఇండియన్ రెవెన్యూ
సర్వీస్‌కు ఎంపికయ్యాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్
కమిషనర్‌గా పని చేశారు. 2006లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు.
అన్నాహజారేతో కలిసి అవినీతి ఉద్యమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
సామాజిక
ఉద్యమాలు చేస్తూనే 2012, నవంబర్ 26న ఆమ్‌ఆద్మీ పార్టీని స్థాపించారు.
2013, డిసెంబర్ నెలలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ
28 స్థానాల్లో గెలుపొంది హస్తినలో రెండో అతి పెద్ద పార్టీగా ఆప్
అవతరించింది. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసింది. 2013 డిసెంబర్ 28న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
చేశారు. 49 రోజులు పాలన చేసిన కేజ్రీవాల్ జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో
సీఎం పదవికి రాజీనామా చేశారు. మళ్లీ మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ
ఎన్నికల్లో పోటీ చేసింది ఆప్. ఈ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 67
స్థానాల్లో గెలుపొంది ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేయబోతోంది. ఈ నెల 14న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం
చేయనున్నారు.
కేజ్రీవాల్ 1968, ఆగస్టు 16న హర్యానాలోని బివానీ
జిల్లా సివానీ గ్రామంలో జన్మించారు. తండ్రి గోబింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి
గీతాదేవి. తండ్రి గోబింద్ రామ్ కేజ్రీవాల్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో పట్టా పొందారు. కేజ్రీవాల్
విద్యాభ్యాసం అంతా హిస్సార్, సోనిపేట్‌లో జరిగింది. 1994లో సునీతతో
కేజ్రీవాల్‌కు వివాహమైంది. కేజ్రీవాల్‌కు ఇద్దరు సంతానం.. హర్షిత
కేజ్రీవాల్, పులకిత్ కేజ్రీవాల్.
No comments:
Post a Comment