CM gaaru Pl help the 1969 Telangana Student Martyrs
ముఖ్యమంత్రి గారు 1969 తెలంగాణా అమర విద్యార్థు లను కూడా ఆదుకోండి .
Date: 22-02-015
పూజ్యులైన మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ,
తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఇండ్లలో చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం. అమరవీరుల కుటుం బాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి గారు కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా సంతోషం, అమర వీరులైతే లేరు కాని వాళ్ళ తల్లి తండ్రులు ప్రతి క్షణం వారి పిల్లలను స్మరిస్తూ ఉంటారు . అమర వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం లో పాల్గొన్నారంటే వారికి తెలంగాణా అంటే ఎంత ప్రేమో ! నిజంగా వారు దేశ భక్తులు కూడా ! సుమారు 12-13 వందల మంది అమర వీరులయ్యారంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు . కొన్ని రాజకీయ పార్టీలు అంతా అబద్దమని కొట్టిపారేశారు . తరువాత నిజం తెలుసుకొని తాము కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు , కాని ఇప్పటికి ఇవ్వలేదు ఆ విషయాన్ని మార్చి పోయారు కూడా ! ఇలాంటి సహాయం మీరు చేయడం ఒక గొప్ప కార్యక్రమం . మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇందుకు కావల్సిన నిధులను కలెక్టర్ల వద్ద జమ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు.
మీరు ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేయాల్సింది కాని మరి ఎందుకో ఆలస్యం జరిగినది .
మీరు ఎవ్వరు వచ్చి అడిగినా కాదనకుండా వారికి సహాయం చేస్తున్నారు . స్థలం ఇస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీ కి భవనాలు కట్టిస్తున్నారు . ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు . పేదవారికి మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇంటిలోని అందరికి రూపాయకే కిలో అందిస్తున్నారు . సంక్షేమ హాస్టళ్ళ లోని విద్యార్థులకు సన్న బియ్యం తో అన్నం పెట్టిస్తున్నారు . పేద విద్యార్థులు చదువు కొనడానికి వేల కోట్ల రూపాయల ఫీసులు చెల్లిస్తున్నారు . పేద వారి నెల వారి పెన్షన్ రూ . 1000 కి వికలాగులకు రూ 1500 కి పెంచి ఇస్తున్నారు . పేద వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నారు . హైదరాబాద్ ను ప్రపంచ నంబర్ వన్ సిటీ గా , I T సిటీ గా , పరిశ్రమలను ఇక్కడ పెట్టించ బోవుచున్నారు . వేల ఉద్యోగాలు కల్పించ డానికి మార్గం చేస్తున్నారు . హుసేన్ సాగర్ ను పూర్వ స్థాయి మంచినీటి సరస్సుగా చేయ బోతున్నారు , ఈ విషయం లో ఎంతో మంది అడ్డంకులు చెబుతున్నారు కాని మీరు మాత్రం వీరందరినీ ప్రక్కన బెట్టి నిపుణుల సహాకారం తో ముందుకు వెళ్ళ గలరని కోరు చున్నాను . అలాగే ట్యాంక్ బండ్ కు సమాంతరముగా ఈ పనిలో పనిగా మరియొక రోడ్ వేయగాలరని ప్రార్థించు చున్నాను .
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చుటకు ఫ్లై , స్కై ఓవర్లు , సిగ్నల్ ఫ్రీ రోడ్లు చేయ బోవు చున్నారు . ఇంటింటికి మంచినీటి గురించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు , కాకతీయ మిషన్ ద్వారా చెరువులను గొలుసు చెరువులుగా అభివృద్ధి చేసి తెలంగాణా పంటపొలాలను హరిత వనాలుగా మార్చి పాడి - పంటలను అభివృద్ధి చేస్తున్నందులకు తెలంగాణా ప్రజలు మీకు ఋణ పడియుంటారు .
ఇన్ని చేస్తున్న మీరు 1969 లో 350 మంది విద్యార్థులు ఆంధ్రా పాలకుల తుపాకులకు అమర వీరులైన సంగతి ఎలా మరచి పోయారన్నది చాల బాధ వేస్తుంది . అసలు ప్రత్యేక తెలంగాణాకు బీజం వేసింది ఆనాటి ఉద్యమమేకదా ! ఆనాడు బ్రహ్మానందరెడ్డి పిట్టలను కాల్చినట్లు రోజుకు 5-6 మంది విద్యార్థులను బలిగోన్నాడు . ఒక సంవత్సరము విద్యా సంవత్సరమును ఆనాటి విద్యార్థులు కోల్పోయారు ఆనాటి తెలంగాణా అమరవీరుల స్థుపమే క్లాక్ టవర్ గార్డెన్ లో కట్టారు కాని వారి ని ఎవ్వరు ఆదుకోలేదు . మీకు బాగా తెలుసు . మరి ఆనాటి అమర విద్యార్థుల తల్లి దండ్రులు ఎంత క్షోభ అనుభ విస్తు ఉండవచ్చు .
అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు
-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
-అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
-కలెక్టర్ల వద్ద నిధులు జమచేయనున్న ఆర్థిక శాఖ
-బీడీ కార్మికులకు రూ. వేయి భృతి
-మార్చి 1 నుంచి ప్రారంభం
-వ్యాక్సిన్ పరిశ్రమకు ప్రోత్సాహం
-అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
-కలెక్టర్ల వద్ద నిధులు జమచేయనున్న ఆర్థిక శాఖ
-బీడీ కార్మికులకు రూ. వేయి భృతి
-మార్చి 1 నుంచి ప్రారంభం
-వ్యాక్సిన్ పరిశ్రమకు ప్రోత్సాహం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఇండ్లలో చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం. అమరవీరుల కుటుం బాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇందుకు కావల్సిన నిధులను కలెక్టర్ల వద్ద జమ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అమరవీరుల కుటుంబాల అంశం, బీడీ కార్మికుల భృతి, వ్యాక్సిన్ల పరిశ్రమకు చేయూత తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగాల కోసం మార్గదర్శకాలు..
అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించి తగు ప్రతిపాదనలు తనకు అందించాలని కేసీఆర్ అధకారులను ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యుల నిర్ణ యానికే వదిలిపెట్టాలని సూచించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి అర్హులు లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా.. మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వారికి వ్యాపారంలో ఆసక్తి ఉంటే అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయం చేసుకుంటామంటే భూమిని సమకూర్చాలని చెప్పారు. ఆయా కుటుంబాల వారు తమ తమ కుటుంబాలు నిలబడడానికి ఏమి కోరుకుంటారో తెలుసుకుని దానిపై ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు ఈ విషయంలో ప్రధాన బాధ్యతలు అప్పగించారు. తమ జిల్లాలో ఉన్న అమరవీరుల కుటుంబాల జాబితా ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుని ఏ కుటుంబానికి ఆ కుటుంబం తమకేం కావాలని కోరుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఈలోగా ఏమాత్రం జాప్యం లేకుండా ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిధులు కలెక్టర్ల వద్ద జమచేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కావున మీరు విశాల హృదయం తో 1969 అమర విద్యార్థుల తల్లి దండ్రుల కు కూడా ఇప్పటి వారి లాగ ఆదుకోవాలని ప్రార్థించు చున్నాను .
yours,
yours,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment