ప్రైవేటు చేతుల్లోకి చమురు కంపెనీలు..
కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థ లను ఎప్పుడు ప్రైవేటు చేయాలనే చూస్తుంది . http://seaflowdiary.blogspot.com/2015/09/for-sale-date-03-09-2015-ongc-69.html
Lists out the latest News and Events in India. A very useful website targeted for the entire age group who is interested in learning political, history, science and people's opinions in India. This everyday updated news website helps tremendously for especially young readers to boost their general knowledge in addition to what they get in schools and colleges. Very detailed in Telugu language also encourages people from Telangana and Andhra Pradesh to browse through the news articles.
Thursday, September 3, 2015
For Sale - అమ్మకానికి
Date : 03-09-2015
ప్రభుత్వరంగ ఇంధన సంస్థ లైన ONGC ఆయిల్ ఇండియా లకు చెందిన 69 చిన్న, మధ్య స్థాయి చమురు బావులను ప్రైవేటు సంస్థలకు కట్ట బెట్టేందుకు పావులు కదుపు తున్నట్లు వార్తలు వస్తున్నాయి . 89 మిలియన్ టన్నుల చమురు గ్యాస్ నిల్వలు కలిగిన 69 బావులను అమ్మడం ద్వారా 70 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రాథమిక అంచనా . ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు .
1999 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 254 చిన్న , మధ్య తరహా బ్లాక్ లను విక్రయించింది .
69 బావులను అమ్మడం ద్వారా 70 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు కదా ,1999 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 254 చిన్న , మధ్య తరహా బ్లాక్ లను విక్రయించింది కదా మరి వాటికి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి ఒక సారి మనం ఊహించు కోవాలి .
ఇదే పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఇంకా చాల ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మాలని లేదా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది . వాటి వలన లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడతాయి .
ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే , ఆ సొమ్ము తోనే మనం మన పరిశ్రమలను , I T రంగాన్ని స్థాపించి అభివృద్ధి చేసి నిరుద్యోగాన్ని నిర్మూలించ వచ్చు కదా !
మరి విదేశాలకు వెళ్లి అక్కడి పారిశ్రామిక వాళ్ళను బ్రతిమిలాడి మన దేశం లో పెట్టుబడి పెట్టమని , మేక్ ఇన్ ఇండియా ( make in India ) చెయ్యమని అని అడగడం ఎందుకు ?
ఇదే కాకుండా ఆదాయపు పన్ను ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో రూ . 7. 98 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూలు చేయాలని లక్షం గా పెట్టుకున్నది .
సర్వీస్ టాక్స్ ( Service Tax ) ద్వారా లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి . సేల్స్ టాక్స్ ( Sales Tax ) ,VAT ద్వారా అది స్టేట్ గాని సెంట్రల్ గాని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అది కాక రక రకాల టాక్స్ లు ,రిజిస్ట్రేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ! ఇన్ని కోట్ల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో కి నెట్టి వాటి వాటాలను అమ్మడం దేనికీ ? వాటిని పూర్తిగా అమ్మడం దేనికి సంకేతం ?
Home » National
- పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికే! : సిఐటియు హెచ్చరిక
ఇండియా న్యూస్ నెట్వర్క్, న్యూఢిల్లీ : కొత్తగా కనుగొన్న 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ క్షేత్రాలన్నీ మార్జినల్ ఫీల్డ్ (ఆర్ధికంగా అంత క్రియాశీలమైనవి కాదు)లని పేర్కొంది. ఈ క్షేత్రాలను వేలం వేయడమంటే జాతీయ ఆస్తులను ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలకు - దేశీయ, విదేశీయ సంస్థలకు - అప్పగించడం తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఈ క్షేత్రాల్లో అన్వేషణ జరపడానికే ప్రభుత్వ రంగ చమురుసంస్థలు వందల కోట్ల రూపాయిలు ఖర్చుపెడుతున్నాయని, కానీ వాటిపై లాభాలు మాత్రం రావడం లేదని విమర్శించింది. కాంట్రాక్టులో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏమిటంటే ఈ క్షేత్రాలను రెవిన్యూ పంచుకోవడం ప్రాతిపదికన 20ఏళ్ళపాటు యథేచ్ఛగా వాడుకోవడానికి లైసెన్స్ ఇవ్వడమని, అలాగే బహిరంగ మార్కెట్ ధరల విధానం, బహిరంగ మార్కెటింగ్ హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వడమేనని పేర్కొంది. పైగా కొత్త మోడల్ కింద ముడిచమురుపై సెస్‌ను ప్రభుత్వానికి చెల్లించనక్కరలేకుండా కాంట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వజూపుతున్నారని, దీనివల్ల కోట్లాది రూపాయిలు కాంట్రాక్టర్లకు బదిలీ అయిపోతాయని సిఐటియు కార్యదర్శివర్గం పేర్కొంది. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. చమురు, గ్యాస్ రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచేటపుడు ముందుగా 'ఉత్పత్తి భాగస్వామ్యం' అని పేర్కొన్నారని, తర్వాత 'లాభాలు పంచుకోవడానికి' అనే పద్ధతికి మారారని, ఇప్పుడు 'ఆదాయం పంచుకోవడమనే' పద్ధతికి వచ్చారని పేర్కొంది. పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించడానికి గానూ ప్రైవేటు ఆపరేటర్లు ఈ కొత్త మోడల్‌ను విపరీతంగా దోపిడీ చేయడానికి అవకాశాలు వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. అంతకన్నా విస్మయానికి గురి చేసే అంశం ఏమిటంటే ప్రైవేటు రంగానికి అనుకూలంగా వున్న ఈ కొత్త మోడల్ కేవలం చిన్న క్షేత్రాలకే పరిమితం కాలేదని, పెద్ద పెద్ద క్షేత్రాలకు కూడా విస్తరించనున్నారని సిఐటియు పేర్కొంది. ఈ కొత్త చర్య వల్ల ప్రభుత్వ రంగ ముడి చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం వుంటుందని, పర్యవసానంగా నిత్యావసరాల ధరలన్నీ కూడా ప్రభావితమవుతాయని పేర్కొంది. ప్రచారం, కార్యాచరణతో ఈ రంగానికి చెందిన కార్మికులను, ప్రజలను సమీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా సిఐటియు తన అనుబంధ సంఘాలన్నింటికీ పిలుపునిచ్చింది.
చమురు, గ్యాస్ క్షేత్రాల వేలం వద్దు
Posted On
1 day 21 hours 44 mins ago
- పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికే! : సిఐటియు హెచ్చరిక
ఇండియా న్యూస్ నెట్వర్క్, న్యూఢిల్లీ : కొత్తగా కనుగొన్న 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ క్షేత్రాలన్నీ మార్జినల్ ఫీల్డ్ (ఆర్ధికంగా అంత క్రియాశీలమైనవి కాదు)లని పేర్కొంది. ఈ క్షేత్రాలను వేలం వేయడమంటే జాతీయ ఆస్తులను ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలకు - దేశీయ, విదేశీయ సంస్థలకు - అప్పగించడం తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఈ క్షేత్రాల్లో అన్వేషణ జరపడానికే ప్రభుత్వ రంగ చమురుసంస్థలు వందల కోట్ల రూపాయిలు ఖర్చుపెడుతున్నాయని, కానీ వాటిపై లాభాలు మాత్రం రావడం లేదని విమర్శించింది. కాంట్రాక్టులో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏమిటంటే ఈ క్షేత్రాలను రెవిన్యూ పంచుకోవడం ప్రాతిపదికన 20ఏళ్ళపాటు యథేచ్ఛగా వాడుకోవడానికి లైసెన్స్ ఇవ్వడమని, అలాగే బహిరంగ మార్కెట్ ధరల విధానం, బహిరంగ మార్కెటింగ్ హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వడమేనని పేర్కొంది. పైగా కొత్త మోడల్ కింద ముడిచమురుపై సెస్‌ను ప్రభుత్వానికి చెల్లించనక్కరలేకుండా కాంట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వజూపుతున్నారని, దీనివల్ల కోట్లాది రూపాయిలు కాంట్రాక్టర్లకు బదిలీ అయిపోతాయని సిఐటియు కార్యదర్శివర్గం పేర్కొంది. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. చమురు, గ్యాస్ రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచేటపుడు ముందుగా 'ఉత్పత్తి భాగస్వామ్యం' అని పేర్కొన్నారని, తర్వాత 'లాభాలు పంచుకోవడానికి' అనే పద్ధతికి మారారని, ఇప్పుడు 'ఆదాయం పంచుకోవడమనే' పద్ధతికి వచ్చారని పేర్కొంది. పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించడానికి గానూ ప్రైవేటు ఆపరేటర్లు ఈ కొత్త మోడల్‌ను విపరీతంగా దోపిడీ చేయడానికి అవకాశాలు వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. అంతకన్నా విస్మయానికి గురి చేసే అంశం ఏమిటంటే ప్రైవేటు రంగానికి అనుకూలంగా వున్న ఈ కొత్త మోడల్ కేవలం చిన్న క్షేత్రాలకే పరిమితం కాలేదని, పెద్ద పెద్ద క్షేత్రాలకు కూడా విస్తరించనున్నారని సిఐటియు పేర్కొంది. ఈ కొత్త చర్య వల్ల ప్రభుత్వ రంగ ముడి చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం వుంటుందని, పర్యవసానంగా నిత్యావసరాల ధరలన్నీ కూడా ప్రభావితమవుతాయని పేర్కొంది. ప్రచారం, కార్యాచరణతో ఈ రంగానికి చెందిన కార్మికులను, ప్రజలను సమీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా సిఐటియు తన అనుబంధ సంఘాలన్నింటికీ పిలుపునిచ్చింది.
ఇంత డబ్బు వచ్చినా , మనకు స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయినా మన దేశం వెనుకబడిన వారు చాలా మంది ఉన్నారు .
మన జనాభాలో సగం కంటే ఎక్కువ మంది నిరు పేదలు గానే బ్రతుకు తున్నారు . శ్రీ కృష్ణుడి కాలం లో ఆయన మిత్రుడు కుచేలుడు కూడా దుర్భర దారిద్ర్యం తో బ్రతికాడని సరిపెట్టు కుందామా ?
నిత్యావసర సరకుల ధరలు విపరీతం గా పెరుగు తున్నాయి . పండించిన రైతులకు లాభం లేదు ,కొనేవాడికి లాభం లేదు మరి ఎందుకింత ధరలు విపరీతం గా పెరుగు తున్నాయి?
రైతు సంతోషముగా లేడు , పంటలు పండించడానికి రైతు రాత్రింబవళ్ళు కష్ట పడాలి . వర్షం సకాలం లో కురవాలి , విత్తనాలు , ఎరువులు , కూలి రేట్లు పెరిగాయి . చివరకు అతివృష్టి , అనావృష్టి కి తట్టుకోవాలి . మార్కెట్ కు వెళితే గిట్టుబాటు ధర రాదు . కాని కొనుగోలు దారునికి చుక్కలు కనిపిస్తాయి .
చేతి వృత్తుల వారికి పని లేకుండా పోయి జీవితం దుర్భరం గా మారింది . చేనేత కార్మికుల జీవితం మరీ అధ్వాన్హం, కుటుంబం లోని వారందరూ రాత్రిం బవాళ్ళు కష్ట పడితే గాని వారికి 200 - 300 రావు .
చాల మందికి ఉండడానికి ఇళ్లు ఉండవు , తిండి ఉండదు , కొలవులు దొరకవు , సరైన మందులు దొరకవు . ఏదో విధముగా బ్రతుకుతున్నారు .
ధనవంతులు వారి కుక్కకు పెట్టే తిండి ఖర్చు కూడా చేతి వృత్తుల వారు సంపాదించు కోలేక పోవుచున్నారు .
ధనవంతులకు అన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రోత్సాహం సులభంగా లభిస్తుంది . అందరికి సమాన హక్కులు ఉన్నాయి , సమాన అవకాశాలు ఉన్నాయి . కాని పేదవారు అలాగే ఉన్నారు . ఎంతో ముందుకు పోయిన వారిని వీరు అందుకోవడం అసంభవం .
కావున ప్రభుత్వం చిత్త శుద్ధితో ఆలోచించాలి , వారికి కల్పించే సౌకర్యాలు ఇంకా చాల పెంచాలి ఇప్పుడు ఉన్నవి వారికి సరి పోవడం లేదు లేదా వారికి అందడం లేదు . వారు తమ స్వంత కాళ్ళ పై నిలబడునట్లు చేయాలి , దీనికి సరైన మార్గాన్ని కనుగొనాలి .
Yours ,
www.seaflowdiary.blogspot.com
Monday, August 31, 2015
పేదరికానికి బలై... అత్యాచారానికి గురై...
పేదరికానికి బలై... అత్యాచారానికి గురై...
Date:31-08-2015
Date:31-08-2015
భగవంతుడా రోజు రోజు కు దేశం లో ఇదేమిటి ఘోరమ్ . ఆడ పిల్లలు ఉండాలా వద్దా ?
ఆడ పిల్లలుగా పుట్టడం తప్పా ?
ప్రభుత్వం కఠిన చర్యలు తీసికోవాలి . తొందరగా చర్యలు చేపట్టాలి . ఎంత మంది రేపిస్టు లకు ఇంతవరకు శిక్షలు పడ్డాయి ?
అన్ని న్యూస్ పేపర్లలో వార్నింగ్ advertise డైలీ ఇవ్వాలి . చర్యలు ఏమిటో కూడా వ్రాయాలి , మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలి అప్పుడు కాని భయపడుతారు .
ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి .
తప్పు చేసినవాడికి అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని సంఘటనలు జరిగేవి కావు. అత్యాచారం జరిపి ఆడ వారిని చంపేసి ఆనవాళ్ళు కూడా దొరక కుండ కాల్చేస్తున్నారు . ఏది ఏమైనా మొత్తం మీద ఆడవాళ్ళూ తమ జీవితాన్ని బలి చేయ వలసి వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా? మన దేశం లో ఆడ వాళ్ళు గా పుట్ట వద్దు .
బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ లో అడిగే విపరీత తల వంచుకునే ప్రశ్నల కు జవాబు చెప్పలేని స్థితి కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువే అన్నమాట .
ఇలాంటి తప్పు చేసినవాడికి కఠిన మరియు సరైన శిక్షలు ఎక్కడ ఉన్నవి , ఏదో నిర్భయ చట్టం చేసి చేతులు దులుపుకోవడం కాదు . రేప్ చేసిన వాడికి దేశద్రోహం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేయాలి . నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి తగినంత సిబ్బంది లేరని అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం. ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి ఉన్నాయి కాని వారు శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు . నేరం చేసిన తరువాత వాడిని పట్టుకోవడం , వాడికి ఎలాంటి శిక్ష విధించడం కాదు . అసలు జరగకుండా చూడాలి , మన ముఖ్యమంత్రి KCR గారు ఇలాంటి వారి కనుగుడ్లు పీకేయాలన్నారు చాలా బాగుంది అప్పుడు రేప్ లనేవి ఉండవు .
ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా చూస్తున్నారు , కీలు బొమ్మ గా చేసి డబ్బులు సంపాదించే యంత్రం గా గూండాలు , రౌడీలు తుదకు ధనవంతులు కూడా ఆడవారిని గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నారు .
చాలా మంది ఇది చూస్తూ కూడా నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ? మగ వారి బనియన్ లకు ఆడవారితో ఎందుకు అడ్వర్ టైస్ advertise ఎందుకు చేస్తున్నారు ?
స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే . మరి పురుషుడు చేసే ఇలాంటి నీచ పని చేయకుండ ఎం చేయాలో కూడా చెప్పాలి కదా! రేప్ చేసిన వారు బెయిల్ తెచ్చుకొని బాధితుల ముందు దర్జాగా తిరుగుతుంటే రేప్ లు ఎలా నిరోధించ బడతాయి ?
మన దేశం లో గూండాయిజం , రౌడిఇజం రాను రాను ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి ఎదురుగా కనబడిన ఒంటరి స్త్రీ ల పై అత్యాచారం చేయుచున్నాడరు. ఈ మధ్యనే హైదరాబాద్ లో స్నేక్ గ్యాంగ్ అనే రౌడీలు ఎన్నో రేప్ లు చేశారు . పెళ్లి చేసుకోబోయే వాడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారంటే ఇంతకు తెగబడ్డారు ! మనం రేప్ జరిగిన దాని గురించే మాట్లాడు తున్నాము . అసలు రేప్ లు జరుగ కుండా ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్ మీడియా , మరియు మాస్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి .
పురుషుని లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా పశువు లాగ మారి అతను ఎదురుగా కనబడిన ఒంటరి స్త్రీ ల పై అత్యాచారం చేయుచున్నాడు . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి ఉంది .
సమాజములో మార్పుతేవడానికి సినిమాలు మంచిమార్గాలు . ఒకప్పటి సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు కుటుంబమంత ఒక చోట కూర్చుని సినిమా ను చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని ద్వందార్ధాలు గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు . ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు పాటు పడినారు.
ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు , ఇంటర్ నెట్ లోని ఆస్లీల దృశ్యాలు,నీలి చిత్రాలు , సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి . నూటికి ఎనభై శాతం ఇవే అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి .
అసలు రేప్ లు జరుగ కుండా ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్ మీడియా , మరియు మాస్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి .
అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .
చెత్త సినిమాలను ,చెత్త T V సీరియల్స్ బ్యాన్ ban చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్ , డైరెక్టర్ , నటి నటులను కఠి నంగా శిక్షించాలి .
టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్ చెయ్యాలి.
నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .
సెల్ ఫోన్ లలో పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .
ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .
పైన చెప్పిన వాటి నన్నిటి ని ప్రభుత్వం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలి .
ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు సఫలమై స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు . -seaflowdiary
http://seaflowdiary.blogspot.com/2015/01/beti-bachaavo-beti-padavo-and-beti.html
Friday, August 28, 2015
అక్రమంగా ఏపీ ఉద్యోగుల కేటాయింపు
అక్రమంగా ఏపీ ఉద్యోగుల కేటాయింపు
అక్రమంగా ఏపీ ఉద్యోగుల కేటాయింపు
Date : 28-08-2015
ఉద్యోగుల విభజనలో అడ్వయిజరీ కమిటీ చైర్మన్ కమలనాథన్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే, టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. గురువారం శ్రీనివాస్‌గౌడ్ సెక్రటేరియట్ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ అక్రమపద్ధతిలో ఏపీ ఉద్యోగులందరినీ తెలంగాణకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మినహాయింపులన్నింటినీ ఉపయోగించుకొని సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వచ్చి పడుతున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు.
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వచ్చిపడితే తెలంగాణా కు వారు తెలంగాణా కు ఎలా నష్ట పరుచాలనే చూస్తారు గాని అనుకూలంగా వారు పనిచేస్తారా ? ఉద్యోగుల విభజన ఇంకెంత కాలం పడుతుంది ? రాష్ట్రం ఏర్పడి సంవత్సరం దాటినా విభజన ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ? ఇదంతా కావాలని చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది, లేకుంటే ఏమిటీ ? అక్రమపద్ధతిలో ఏపీ ఉద్యోగులందరినీ తెలంగాణకు కేటాయిస్తున్నారని టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు కదా !
ఎక్కడి ప్రాంతం వారిని అక్కడకు కేటాయించాలి . తెలంగాణా ప్రాంతములో ఖాళీలు ఏర్పడితే క్రొత్త వారిని నియమించుకుంటాం కదా , ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి . తెలంగాణా కోరుకున్న దానిలో ఇదొక అంశమే కదా ! ఉద్యోగాల గురించి ఎంతోమంది విద్యార్థులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . టీజీవో వ్యవస్థాపక చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ గారి ఆవేదన సరియైనదే .
ఇంతకు ముందు విడి పోయిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ , ఛత్తీస్ గడ్ , జార్ఖండ్ లలో కూడా ఇలాగే జరిగిందా ? అక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా జరిగాయి , మరి ఇక్కడే ఎందుకు ? మద్రాస్ నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది ? అప్పుడు అక్కడ కేటాఇంచినట్లు ఇప్పుడు ఇక్కడ అదే చేస్తే సరిపోతుంది- seaflowdiary
Thursday, August 27, 2015
హైదరాబాద్‌కీ షాన్.. కాకతీయ నిషాన్|Secretariat welcome the entrance of the Kakatiya Arcade -Telangana News
హైదరాబాద్‌కీ షాన్.. కాకతీయ నిషాన్|Secretariat welcome the entrance of the Kakatiya Arcade -Telangana News Date:27-08-2015.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం స్వాగత ద్వారం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనలకు, సంస్కృతికి అద్దంపట్టేలా రూపుదిద్దుకోనుంది. నవాబుల పాలన ఔన్నత్యంతోపాటు, కాకతీయుల రాజసం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రధాన ద్వారానికి ఇప్పటికే అనుమతులు లభించినప్పటికీ కాకతీయ కళా తోరణంకోసం అధికారులు ప్రతిపాదనలు పంపారని వార్తలు వచ్చాయి .
బాగానే ఉంది కాని మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు రాష్ట్ర సచివాలయం ని ఇక్కడి నుండి మార్చాలని అనుకుంటున్నారు కదా ! ఎర్రగడ్డ కు మారుస్తామన్నారు , అక్కడ వ్యతిరేకత రావడం వలన అక్కడినుండి జింఖానా గ్రౌండ్ అన్నారు . జింఖానా గ్రౌండ్ రక్షణ శాఖా ఆధీనం లో ఉంది దానికి బదులుగా వేరే చోటా స్థలం ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదని జింఖానా గ్రౌండ్ స్థలానికి డబ్బులు ఇవ్వాలని అందుకు వారు ఒప్పుకున్నట్లు . అందుకు ప్రభుత్వం నిస్సహాయత తెలిపినట్లు వార్తలు వచ్చాయి .
సచివాలయం ని షిఫ్ట్ చేసే యోచనలో ఉన్నప్పుడు అక్కడ స్వాగత ద్వారం ఇప్పుడే కట్టడం అవసరమా ? ముందు సచివాలయం ని ఎక్కడకు మారుస్తున్నారు ? అసలు మారుస్తారా లేదా ? అది తేల్చు కున్నాక స్వాగత ద్వారం నిర్మిస్తే బాగుంటుంది . -seaflowdiary
Sunday, August 23, 2015
ఆర్టీసీ కొత్త ప్రయోగం
ఆర్టీసీ కొత్త ప్రయోగం
Initiation to modification of
Ferozguda ,
Date : 26-08-015.
శ్రీ . పురుషోత్తం నాయక్ గారు ,
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Sir ,
Sub :- Better Public transport system in Hyderabad -reg
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ గారికి ధన్యవాదములు ప్రయాణికులతో interact అయి మరిన్ని మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు "డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం" పెట్టి
ప్రజల సలహాలు, సూచనలు, పిర్యాదులు స్వీకరించడానికి ప్రతి నెలకు ఒకసారి కార్యక్రమం నిర్వహించతలపెట్టడం చాల సంతోషం . ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం . బస్సుల సంఖ్య పెంచాలి . క్రొత్త కాలనీ లకు బస్సు సౌకర్యం కల్గించాలి . బస్సుల డెస్టినేషన్ బోర్డు లను మార్పుచేయాలి . బోర్డ్ లపై తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాషల్లో నీట్ గా వ్రాయాలి, సులభంగా అందరికి కనబడునట్లు వ్రాయాలి . రూట్ నంబరింగ్ సిస్టం కాకుండా ఏరియా కు ఒక నంబర్ పెట్టాలి, అందరికి అనుకూలం గా ఉంటుంది . బస్సుల రంగులను తక్షణం మార్చాలి , ఎప్పుడో మన తెలంగాణా రాగానే మార్చాల్సింది . TSRTC లాభాల్లో రావాలని ,దేశం లోని అన్నిRTC లకు మార్గ దర్శకత్వం వహించాలని కోరుకుందాం .
మీకు request చేయడం ఏమంటే సికిందరాబాద్ - బాలానగర్ రూట్ లో ఫెరోజ్ గూడ బస్ స్టాప్ ఉంది . ఈ బస్ స్టాప్ నుండి A F S ( Air Force station ) Begumpet , ఫెరోజ్ గూడ, గౌతం నగర్ , BHEL R & D , Foolbagh , Rajucolony , Sainagar , BBR Hospital పేషంట్లు మొదలగు వారు ప్రయాణిస్తారు . విద్యార్థులు ,ఉద్యోగస్తులు ,వ్యాపారస్థులు మొదలగువారు వందల సంఖ్యలో నిత్యం ప్రయాణిస్తారు .
ఈ రూట్ లో JDM ,KP ,MYP 1&2, RNG 1&2,BHEL ,CNT ,HPT MDCL ,KG ,HYT 1&2 మొదలగు డిపో ల బస్సులు తిరుగుతాయి . ఇక్కడి నుండి నిమిషానికి ఒక బస్సు సికిందరాబాద్ స్టేషన్ కు వెళతాయి . 1,2 బస్సులు ఉప్పల్ , ECIL , LBnagar , మిగతా అన్ని బస్సులు సికిందరాబాద్ స్టేషన్ కు వెళతాయి .
ఇక్కడి ప్రయాణికులు KOTI , ABIDS ,CHARMINAR , SECRETARIAT వెళ్ళాలంటే బస్సులు లేవు , అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరి సికిందరాబాద్ స్టేషన్ కే వెళ్ళాలి , దీనివలన చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది . కావున దయచేసి కొన్ని బస్సులను రాణిగంజ్ , ట్యాంక్ బండ్ ద్వారా బస్సులు వేయాలని విన్నవించు కుంటున్నాము . -seaflowdiary
మన ప్రియతమ నాయకులు , మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి రవాణా వ్యవస్థ మార్పు పై వ్రాసిన ఈ క్రింద ఉన్న లెటర్ ని ఒక సారి చదువుకొని తగినట్లు మార్పులు చేస్తారని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ గారిని కోరుతున్నాం . -seaflowdiary
మీకు request చేయడం ఏమంటే సికిందరాబాద్ - బాలానగర్ రూట్ లో ఫెరోజ్ గూడ బస్ స్టాప్ ఉంది . ఈ బస్ స్టాప్ నుండి A F S ( Air Force station ) Begumpet , ఫెరోజ్ గూడ, గౌతం నగర్ , BHEL R & D , Foolbagh , Rajucolony , Sainagar , BBR Hospital పేషంట్లు మొదలగు వారు ప్రయాణిస్తారు . విద్యార్థులు ,ఉద్యోగస్తులు ,వ్యాపారస్థులు మొదలగువారు వందల సంఖ్యలో నిత్యం ప్రయాణిస్తారు .
ఈ రూట్ లో JDM ,KP ,MYP 1&2, RNG 1&2,BHEL ,CNT ,HPT MDCL ,KG ,HYT 1&2 మొదలగు డిపో ల బస్సులు తిరుగుతాయి . ఇక్కడి నుండి నిమిషానికి ఒక బస్సు సికిందరాబాద్ స్టేషన్ కు వెళతాయి . 1,2 బస్సులు ఉప్పల్ , ECIL , LBnagar , మిగతా అన్ని బస్సులు సికిందరాబాద్ స్టేషన్ కు వెళతాయి .
ఇక్కడి ప్రయాణికులు KOTI , ABIDS ,CHARMINAR , SECRETARIAT వెళ్ళాలంటే బస్సులు లేవు , అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరి సికిందరాబాద్ స్టేషన్ కే వెళ్ళాలి , దీనివలన చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది . కావున దయచేసి కొన్ని బస్సులను రాణిగంజ్ , ట్యాంక్ బండ్ ద్వారా బస్సులు వేయాలని విన్నవించు కుంటున్నాము . -seaflowdiary
మన హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు నకు శ్రీకారం
Initiation to modification of
Public Transport System n Traffic in Our Hyderabad
29-08-2014
మన హైదరాబాద్ ( Hyderabad ) లో ప్రజా రవాణా వ్యవస్థ మార్పు ( change of public transport system ) నకు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు శ్రీకారం చుట్టడం చాల సంతోషం . నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చేసేందుకు మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు Hon"ble CM KCR టాప్ ప్రియారిటి ఇచ్చినందుకు హైదరాబాద్ నగర ప్రజలందరు ధన్యవాదములు తెలుపు తున్నారు . ఇందుకు ఇప్పటికే పలు దఫాలు పోలీస్ ,రవాణా శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు అందులోని భాగంగానే ముంబాయి తరహా ప్రజా రవాణా విధానాన్ని పరిశీలించి అమలు చేయడానికి ఇద్దరు మంత్రుల నేతృత్వం లో ప్రత్యెక బృందాన్ని ముంబై పంపించారు. ప్రత్యెక బృందం లో మంత్రులు శ్రీ . నాయిని నరసింహారెడ్డి గారు గౌ. నీ హోం మంత్రి గారు Hon'ble Home Minister , శ్రీ . పట్నం మహేందర్ రెడ్డి గౌ. నీ రవాణా శాఖ మంత్రి గారు Hon'ble Transport Minister , వీరితో పాటు గౌ. నీ . అధికారులు Hon'ble Officers రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి గారు , నగర పోలీస్ కమీషనర్ గారు , రవాణా శాఖ కమీషనర్ గారు , ఆర్ టి సి జె ఎం డి గారు , జి హెచ్ ఎం సి కమీషనర్ గారు , ఎడిషనల్ పోలీస్ కమీషనర్ గారు, సైబరాబాద్ ట్రాఫిక్ ఎడిషనల్ కమీషనర్ గారు, హైదరాబాద్ జె టి సి తదితరులు వెళ్ళారు.
ఈ బృందం ముంబాయి వెళ్లి అక్కడి ముంబాయి రవాణా వ్యవస్థ కు తలమానికంగా నిలచిన " ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ ట్రాన్స్పోర్ట్ విధానం బెస్ట్ ( BEST ) ను అధ్యయనం చేశారు . బెస్ట్ జి యం ఓం ప్రకాష్ గుప్త డిప్యూటి జి యం దేశ్ పాండే లతో పని తీరుని తెలుసు కున్నారు . ముందుగా ముంబాయి లోని మెట్రో స్టేషన్ , ఆర్టిసి , రైల్వే స్టేషన్ల కలయికగా ఉన్న " అంధేరీ " జంక్షన్ ను పరిశీలించారు . అక్కడి ఆర్ టి సి బస్సు రూట్లు , బస్సు షెల్టర్లు , బస్ బే లలో ప్రయాణికులు పాటిస్తున్న "క్యూ " " Q " system విధానాన్ని నిశితంగా పరిశీలించారు . కేవలం ముగ్గురు అధికారులు మెట్రో వ్యవస్థ తో పాటు ట్రాఫిక్ ,రోడ్డు భద్రతను జి పి ఆర్ స్ ( GPRS ) విధానం ద్వారా నియంత్రించే తీరును ఆసక్తి గా పరిశీలించారు జి పి ఆర్ స్ విధానం ద్వారా కంట్రోల్ రూం తో ముంబై కి చెందిన 9 వేల ఆర్టిసి బస్సులు , 12 వేల మంది కండక్టర్లు , 10 వేలమంది డ్రైవర్ల పని తీరును అనుక్షణం తెలుసుకొని అవసరమైన సూచనలు అందిస్తూ నియంత్రణ చేస్తున్న తీరును పరిశీలించారు . అక్కడి ట్రాఫిక్ పోలీసులు కేవలం తొమ్మిది కేంద్రాల నుంచి యావత్తు ముంబాయి నగరం లోని ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించే పరిస్థితులను పరిశీలించారు. స్కై వాక్ వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటున్న విషయాన్ని వారు పరిశీలించారు . ఈ అధ్యయనం మరియు పరిశీలన కార్యక్రమాన్ని రెండు రోజులు గావించి హైదరాబాదు కు తిరిగి వచ్చారు కూడా . ఇక ఈ బృందం అధ్యయన రిపోర్ట్ ను తొందరగా సి యం గారికి అందించనున్నారు . సి యం గారు రిపోర్ట్ ను చదివి హైదరాబాద్ ను రవాణా ఇబ్బందులు లేని నగరముగా తీర్చి దిద్దాలని , బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచాలని ధృడ నిశ్చయం తో ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు సి యం గారికి ఎంతో రుణ పడి యుంటారు .
మన ప్రియతమ కెసిఆర్ గారు వీటన్నిటిని అమలు చేసే ముందు ఒకసారి దయతో ఈ క్రింది సూచనలను పరిగణన లో కి తీసుకొన గలరని కోరుచున్నాను .
మన నగరం లో చాలా వరకు రోడ్ లన్ని సన్నగా ఇరుకుగా ( narrow ) ఉన్నవి , ట్రాఫిక్ ఎక్కువై రోడ్లు ఇరుకుగా మారినవి . కావున అవకాశం ఉన్న చోట్ల అత్యవసరం గా రోడ్ లను వెడల్పు చెయాలి . పెద్ద పెద్ద ఇళ్లనే కూలగొట్టి వెడల్పు చేస్తున్నప్పుడు కాంపౌండ్ వాల్ ఉన్న చోట్ల వాటన్నింటిని తొలగించి రోడ్ ను విశాలం చేయాలి , లేదా వీలున్నంత వెనుకకు జరపాలి . బాటిల్ నెక్ ( bottle neck ) లన్నింటిని పూర్తిగా తొలగించాలి . చౌరస్తాలను ( cross roads ) విశాలంగా చేయాలి , మలపులను ( directions ) 90 ( degree ) డిగ్రీలలో కాకుండా 110-120 డిగ్రీలలో ఏర్పాటు చేయాలి ,ఇప్పుడున్న మలుపులో బస్సులు మరల డానికి చాల కష్టంగా ఉంది .
ట్యాంక్ బండ్ ( tank band ) ను ఎన్ టి అర్ ( NTR ) గారు వెడల్పు చేసి బాగు చేశారు ఐనా అది ప్రస్తుత ట్రాఫిక్ కు సరిపోవడం లేదు కావున ఇప్పుడు ఉన్నట్యాంక్ బండ్ రోడ్ కు ప్యారేలేల్ గా మరొకటి ట్యాంక్ సైడ్ రోడ్ నిర్మించినట్లు అయితే , ఒకటి పోవడానికి మరొకటి రావడానికి ఉపయోగించవచ్చు . ట్యాంక్ బండ్ పై రాత్రుల్లో లైటింగ్ సరిగా లేక మినుకు మినుకు మంటు చీకటి గా ఉంటుంది . వినాయక చవితి కి లైట్లు ఎలా జిగేలు మంటాయో అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి, అప్పుడే హైదరాబాద్ అందం గా కనిపిస్తుంది . అదే కాకుండా మరొక రోడ్ సికింద్రాబాద్ సైడ్ నుండి ట్యాంక్ బండ్ మధ్య( జలాశయం ) ( middle of the tank band ) నుండి ఒకటి సెక్రెటేరియట్ ( secretariat )కు ఇంకొకటి ఖైరతాబాద్ కు "వై " షేప్ ( Y shape ) లో వేస్తె ఎంతో ట్రాఫిక్ తొందరగా క్లియర్ అవుతుంది దానికి ప్రజలు ఎంతో సంతోషిస్తారు, ట్రాఫిక్ , టైం,మరియు ఫ్యూయల్ కలసి వస్తుంది . ఇంకొక విషయం బేగంపేట్ విమానాశ్రయం ( air port )సిటి మధ్యలో ఉంది , ఇటు నుండి అటుప్రక్క వెళ్ళాలంటే కనీసం 9-10 కి మీ చుట్టూ ప్రయాణించి వెళ్ళాలి . కావున ఎయిర్ పోర్ట్ బౌండరీ చుట్టూ ఒక రహ దారి నిర్మించినచో ఎంతో సౌలభ్యం అవుతుంది . ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు ఈ విషయాన్ని ఒక సారి పరిశీలించి తగిన చర్య తీసుకొనగలరని కోరుచున్నాను .
మన దగ్గర అసలు ఫుట్ పాత్ ( foot path ) లు ఉన్నాయా? ఉంటె వాటిని షాప్ వాళ్ళు ఎప్పుడో ఆక్యుపై ( occupy )చేశారు . వాటిని ఖాళీ చేయించి నడిచే వాళ్లకు అది ఫ్రీ గా ఉంచాలి , లేకుంటే వారు రోడ్ ల పైనే నడవ వలసి వస్తుంది , ఫుట్ పాత్ లేని చోట్ల ఫుట్ పాత్ లను నిర్మించి దాని మీదుగానే నడిచే టట్లు చేయాలి . రోడ్ పై "జీబ్రా " క్రాసింగ్ ( " Z " crossing ) వేసి అక్కడినుండే నడిచే వాళ్ళను క్రాస్ చేయనీయాలి , ఇప్పుడు ఉన్నట్లు ఎక్కడబడితే అక్కడ రోడ్ క్రాసింగ్ ను నిరోధించాలి .
రోడ్ కు ఇటు ప్రక్క అటు ప్రక్క ఆక్రమించుకొని చిల్లర వ్యాపారం చేయనీయరాదు . ప్రస్తుత మున్న వాటిని తొలగించాలి, లేదా సాధ్యమైనంత వెనుకకు జరపాలి లేదా వారికి స్థలం కేటాయించాలి .
రోడ్ కు రెండు ప్రక్కల ( two sides of road )ఇష్టం వచ్చినట్లు వాహనాలను ,మోటార్ సైకిళ్ళను పార్కింగ్ ( parking )నిషేధించాలి , పార్కింగ్ కు ప్లేస్ అలాట్ చేసి అక్కడే పార్కింగ్ కు అనుమతి ఇవ్వాలి .
నగరం లో రోడ్ లన్నింటిని వన్ వే లు లేకుండా ( no one way ) చేయాలి , వన్ వే ఉన్నవి తీసి వేయాలి అంటే రోడ్లన్నీ విశాలం గా చేయాలి . ఆల్టర్నేట్ రూట్ ( alternate route ) లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ( traffic ) ను అనుమతించాలి, కనీసం చిన్న వాహనాల నైన అక్కడి నుండి పంపాలి, దీని వలన చాల వరకు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది .
సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే 4-5 చోట్ల లో మాత్రమే రోడ్ ఉంది అది కూడా రైల్ ఓవర్ బ్రిడ్జి ( rail over bridge ) క్రింది నుండి వెళ్ళాలి , ఎక్కడయున్న చుట్టూ తిరిగి ఈ బ్రిడ్జి ల వద్దకు వచ్చి మాత్రమే వెళ్ళాలి . ఈ బ్రిడ్జి లు కూడా వెడల్పు మరియు ఎత్తు తక్కువగా యుండడం వలన ట్రాఫిక్ చాల స్లో గా వెళుతుంది , కొన్ని సార్లు ఎంతో సేపు ఆగిపోతుంది . కావున ఈ బ్రిడ్జి లను వెడల్పు , ఎత్తులను పెంచాలి . ఇంకా కొన్నిక్రొత్త బ్రిడ్జి లను మధ్యలో అక్కడ అక్కడ నిర్మించాలి .
ప్రతి చౌరస్తా లలో నాల్గు దిక్కులా ( four sides of cross road ) వెళ్ళే రోడ్లకు అటు ఉండే ఏరియా లను బోర్డులపై ( sign board ) తప్పకుండ వ్రాయాలి . మరి యు రోడ్లలో అక్కడక్కడ రోడ్ల పేర్ల బోర్డులను ( name of the road ) వ్రాసి పెట్టాలి . దాని వలన ప్రయాణికుడు ఎక్కడ ఉన్నాడో ,ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది .
పాడైన రోడ్లను ( damaged roads ) ఎప్పటికప్పుడు రిపేర్ ( repair ) చేయాలి , ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది మరియు ట్రఫిక్ కు ఇబ్బంది ఉండదు .
ప్రస్తుతం మనదగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లు ( traffic signal ) ఒక్కొక్క క్రాస్ రోడ్ లో ఒక్కొక్క విధంగా వస్తాయి అలాకాకుండా అన్ని చోట్ల ఒకే పద్దతి లో ( uniform ) వస్తే ప్రయాణికులకు మంచి అవగాహన ఏర్పడుతుంది . సిగ్నల్ పై టైం డిస్ప్లే ఏర్పాటు చేస్తే సిగ్నల్ ఎంత సేపట్లో వస్తుందో తెలిసి ఇంజన్ ను ఆపు కుంటారు దాని వల్ల కొంత ఫ్యూయల్ ( fuel ) ఆదా అవుతుంది .
మన నగరం లో ప్రజా రవాణ సరిగా మరియు సరిపోయినంత లేనందువలన ప్రైవేటు ,పర్సనల్ ట్రాన్స్ పోర్ట్ అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు రోజు రోజుకు వందల సంఖ్యలో పెరగడం మరియు ఫ్లోటింగ్ పాపులేషన్పె ( floating population )రగడం వలన రోడ్ లన్ని ట్రాఫిక్ తో నిండి గమ్యం చేరడానికి గంటలకు గంటలకు పడుతుంది . ఒక్కో సారి అంబులెన్స్ లు కూడా ( ambulances also ) ట్రాఫిక్ లో చిక్కుకొని పేషంట్ ను హాస్పిటల్ కు సరియైన సమయం లో చేర్చే పరిస్థితి కూడా లేదు . కావున యుద్ద ప్రాతి కన ప్రజా రవాణ మెరుగు పరచాలి.
ప్రస్తుతము బస్సు లు ,యం యం టి ఎస్ ( MMTS ) రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు . మెట్రో రైల్ ( Metro rail ) పనులు వేగం గా జరుగు చున్నవి , కాని అందులో యం యం టి ఎస్-2 మరియు మెట్రో పనులకు చాల ఖర్చు , సమయం పడుతుంది . ఈ రెండింటి వలన అనగా యం యం టి ఎస్ మరియు మెట్రో రైల్ ద్వారా ఆ రూట్ లో ఉన్న ప్రజలకే ఉపయోగ పడుతుంది కాని బస్సు ల వలన అలా కాకుండా అతి తక్కువ ఖర్చు తో ఏర్పాటు చేయవచ్చు , ఎక్కడికైనా, ఎప్పుడైనా బస్సు పోయే రోడ్ ఉంటె చాలు అక్కడికి బస్సులను నడపవచ్చు .
ఇక మనవద్ద బస్సుల సంఖ్య ( No.of Buses ) చాల తక్కువ ,ప్రయాణికులకు సరిపోవడం లేవు . గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు . ఏదో నామ్ కె వాస్తే బస్సులు నడుస్తున్నాయా అంటే నడుస్తున్నాయి తప్ప ప్రయాణికులు ,విద్యార్థులు ఎంత బాధ పడుతున్నారో కూడా తెలుకోలేక పోయారు . కొన్ని జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం బస్సులు వేసి, కొన్ని బస్ షెల్టర్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు .
చంద్రబాబు నాయుడు గారు సిటీ లో నడుస్తున్న సిటి పచ్చ బస్సులను ( green buses ) ఎర్ర రంగు బస్సులుగా ( red buses ) మరియు వై ఎస్ ఆర్ గారు డిస్ట్రిక్ట్ లో నడుస్తున్న ఎర్ర రంగు బస్సులకు ( red buses ) పచ్చ రంగు ( green buses ) పూసి వాటి పై " పల్లెవెలుగు" అని వ్రాసి ఆ ఇద్దరు హాయిగా నిద్ర పోయారు . కాని ఇప్పుడు మన సి యం కె సి ఆర్ గారు వాటి దుమ్ము దులిపి మళ్లి " ప్రజా సేవయే మన కర్తవ్యం" గా రూపు దిద్దుతున్నందుకు ధన్యవాదములు .
బస్సు ల సంఖ్యను తగినంత గా పెంచాలి , నగరం లోని మారు మూల ప్రాంతాలకు, క్రొత్త -క్రొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కలిగించాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం బస్సులు ఎక్కడికి వెళ్ళే వో ఇప్పుడు కూడ అక్కడికే వెళ్ళు చున్నాయి . క్రొత్త ప్రాంతాలకు ఇంత వరకు బస్సులు లేవు . బస్సులు ఉంటె సెవెన్ సీటర్ ఆటో లో క్రిక్కిరిసి ఎందుకు ప్రయాణం చేయవలసి వస్తుంది ? బస్సుల్లో వ్రేలాడి ప్రాణం అర చేతిలో పెట్టుకొని ఎందుకు ప్రయాణం చేస్తారు .?
ముంబాయి ( mumbai ) లాగ , బెంగుళూరు ( bengaluru ) లో కూడా ప్రజా రవాణా చాలా బాగుంది , అక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు లేవు , ప్రతి 2-3 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది , స్టాండింగ్ పాసింజర్లు చాల తక్కువ , అక్కడి బస్సులు చాల వరకు క్రొత్తవి, వాటిని నీట్ గా మెంటేన్ ( neat maintenance ) చేస్తారు. కాని మన దగ్గర రెండు బస్సులు చేసే పనిని ఒక్క బస్సు చేస్తుంది . బెంగళూరు కు కూడా ఒక బృందాన్ని పంపి స్టడి చేయిస్తే బాగుంటుంది .
బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు ( destination boards ) నీట్ గా ( neat ) అందరికి కనుపించేట్లు అందం గా ఒకే ఫాంట్ సైజు లో అన్ని డిపోలు ఒకే విధముగా వ్రాయాలి , బోర్డ్ ల దగ్గర రాత్రి పూట కనిపించేటట్లు లైట్లు పెట్టాలి . ఇప్పుడు కొన్నిటికి లైట్లు ఉన్నాయి కాని అవి వెలగకుంటే అలాగే వదలి పెడుతున్నారు . బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లు ముందు వెనుక తప్పకుండ ఏర్పాటు చేయాలి .
ఈ బోర్డ్ లను తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీ భాషలలో తప్పకుండా వ్రాయాలి . చాల రాష్ట్రాల్లో వారి వారి భాష నే వ్రాసుకొని అక్కడి వాళ్ళ కే తెలియునట్లు తమ ప్రాంతీయ ( regional ) అభిమానాన్ని చాటు కొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ? కాని మనం అలా కాకుండా మనం మూడు తెలుగు ,ఇంగ్లీష్ మరియు ఉర్దూ / హిందీభాషలలో వ్రాసి ( in regional, national & international languages ) దేశాభి మానాన్ని ( patratism ) చాటుదాం . హైదరాబాద్ వచ్చే ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ ఎంతో సులభం గా తెలిసికొని ప్రయాణం చేయగలరు , వారందరికీ హైదరాబాద్ అంటే , హైదరాబాద్ ప్రజలంటే ఒక అభిమానం కలుగుతుంది. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళిన మనను గౌరవిస్తారు .
డెస్టినేషన్ బోర్డ్ లో నంబరింగ్ సిస్టం ను మనం ఫాలో అవుతున్నాం కదా ! ఒక సారి మన ప్రియతమ కె సి ఆర్ గారు ఈ విషయం పై దృష్టి పెట్టాలి అదేమిటంటే బస్సుల పై డెస్టినేషన్ బోర్డ్ లో వెళ్ళే ప్రదేశం పేరు తో బాటు ఆ రూట్ నంబర్ వేస్తారు ,ఇక్కడే మనం ఈ నంబరింగ్ విధానాన్ని మార్చాలి .
ఉదా:- సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ కు మొదటి నుండి నం ."1" ( No. 1 ) రూట్ గా పరిగణిస్తున్నారు , అఫ్జల్ గంజ్ నుండి సికింద్రాబాద్ కు కూడా ఇదే నంబర్ తో నే నడిపిస్తున్నారు, అంటే రెండు దిక్కుల వెళ్ళ డానికి ఒకే నంబర్ అన్నమాట , క్రొత్త వారు గాని చదువు లేదా ఇంగ్లిష్ రానివారు ఈ నంబర్ లనే చూసి బస్సు ఎక్కుతారు కదా ! సరే నంబర్ అయితే కరక్టే ( No. is correct ) కాని బస్సు ఎక్కడికి వెళ్ళుతుంది ? సికింద్రాబాదా ? లేక అఫ్జల్ గంజ్ ? అందుకే బస్సు ఎటు వైపు వెళ్ళు తుందో గమనించి ఎక్కాలన్నమాట . ఒక వేళ అది కామన్ పాయింట్ అనుకోండి అప్పుడు ఎలా ? బస్సు డ్రైవర్ ను గాని బస్సు లోని ప్రయాణికుడి ని గాని అడిగి బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ రెండు వైపులా వెళ్ళాలంటే ఒకే నంబర్ ఉంటుంది .
డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ వచ్చే బస్సులన్నింటికి "హైదరాబాద్" అని మాత్రం వ్రాస్తారు. ఆదిలాబాద్ నుండి వచ్చినా , ఖమ్మం నుండి వచ్చినా ,తిరుపతి నుండి వచ్చినా "హైదరాబాద్" అని మాత్రం వ్రాస్తారు. అట్లాగే సిటి లో కూడా ఒక్కొక్క ఏరియాకు ఒక నంబర్ కేటాయించాలి, ఆ నంబర్ తో నే బస్సులను ఆపరేట్ చేయాలి .
కావున రూట్ నంబర్ కాకుండా డెస్టినేషన్ ( ఏరియా ) ( destination ) కు ఒక నంబర్ అలాట్ ( allot one number ) చేయాలి ,
సికిందరాబాద్ కు ఒకటి (1) ,
చార్మినార్ కు రెండు (2)
అఫ్జల్ గంజ్ కు మూడు (3)
ఉస్మానియా యునివర్సిటి నాలుగు (4)
మెహదిపట్నం ఐదు (5)
కోటి ఆరు (6) ,
సెక్రటేరియట్ ( 7 ),
లక్డికాపూల్ ( 8 ) ,
సనత్ నగర్ ( 9 ) ,
కుకట్ పల్లి ( 10 ) ,
జె బి ఎస్ ( 11 ) ,
ఇమ్లిబన్ ( 12 )
ఇవే నంబర్లని కాదు మన కె సి ఆర్ గారి ఇష్ట ప్రకారం వేయాలి .
ఇలా బస్సు టెర్మినేట్ ( terminate ) అయ్యే ప్రతి ఏరియాకు ( area ) ఒక నంబర్ ను అలాట్ చేసి ఆర్ టి సి ( RTC ) వారు దీనినే ఫాలో ( follow ) చేయమనాలి . నంబర్లు వేయడం లో కష్టం ఏమి లేదుకదా ఎన్నైనా నంబర్లను ( infinity ) 1 నుండి 2... 3.... 20.... 36.... 50... 101 ... 222.... ఇలాగా 1000 ........... ఇంకా ఎక్కువ వరకు వేయాలి . ఈ నంబర్ల వలన పర్టిక్యులర్ నం బస్సు ( particular bus ) ఎక్కడి నుండైనా పర్టిక్యులర్ ఏరియా ( అదే ప్లేస్ ) ( to particular area ) కు వెళ్లుతుందని ప్రజలకు మరియు సిటి కి వచ్చే క్రొత్త వారికి తెలిసి ప్రయాణించుటకు చాలా సౌకర్యం గా ఉంటుంది .
సికింద్రాబాద్ కు సిటి లో ఎక్కడి నుండైన వచ్చే బస్సు లన్ని ఒకే నంబర్ తో ( one number only ) వస్తాయి . అట్లాగే సిటి లో ఎక్కడి కైనా ఆ ఏరియా నంబర్ తో ఎక్కడి నుండైన ఒకే నంబర్ తో వెళతాయి . ఒక వేళా ఒకే ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి రెండు లేదా మూడు రూట్లలో బస్సులు వేళ తాయి అనుకొండి అప్పుడు ప్రయాణికులు కన్ఫ్యూజ్ ( confuse ) కాకుండా నంబర్ అదే ఉంటుంది కాని ఆ నంబర్ ప్రక్కన ఒక ఆల్ఫా బెట్ (alphabet ) నంబర్ వేయాలి .
ఉదా:- ఇప్పుడు మెహదిపట్నం నుండి సికింద్రాబాద్ కు మూడు రూట్లలో బస్సులు వెళ్ళుతున్నాయి, అవి నం . 5 , 5 కె మరియు 49
వీటిని ఎలా మార్చాలంటే సిటి లో ఎక్కడి నుండైన సికింద్రాబాద్ కు నం . " 1` " తో నే రావాలి
మెహదిపట్నం 1 సికింద్రాబాద్ ( రాణిగంజ్ ద్వారా )
.
మెహదిపట్నం 1 కె సికింద్రాబాద్ ( కింగ్స్ వే ద్వారా )
మెహదిపట్నం 1 బి సికింద్రాబాద్ ( బంజారా హిల్స్ ద్వారా )
అట్లాగే
ఉస్మానియా యునివర్సిటి - "1" - సికింద్రాబాద్ , ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
సికింద్రాబాద్ - ' 4 ' ఉస్మానియా యునివర్సిటి. ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
అఫ్జల్ గంజ్ - " 1 " సికింద్రాబాద్ , ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
వనస్థలి పురం " 1 " - సికింద్రాబాద్ , ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
కుకట్ పల్లి " 1 " సికింద్రాబాద్ ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
సికింద్రాబాద్" 10 " కుకట్ పల్లి ( రెండు మూడు రూట్లు ఉంటె ఆల్ఫా బెట్ నంబర్ వేయాలి )
అంతా క్రొత్త నంబరింగ్ పద్దతి మాత్రమే ఇంప్లి మెంట్( implementation of new numbering system ) చేయాలి . భారత దేశం లోని ప్రజలకే కాక విదేశీ ప్రయాణికులకు ( international traversals ) కూడా హైదరాబాద్ లో ఎక్కడి నుంచైనా చార్మినార్ నుంచైనా, హై టెక్ సిటి నుంచైనా రిసాలా బజార్ నుంచైనా, శంషాబాద్ నుంచైనా నం . 1 బస్సు ఎక్కితే తప్పకుండా సికిందరాబాద్ స్టేషన్ చేరుతామని తెలుస్తుంది . హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు తమ-తమ పనులను హైదరాబాద్ లో ఎక్కడెక్కడో చేసుకొని అక్కడి నుండే నం 1 బస్సు ఎక్కి తే మేము తప్పకుండ సికింద్రాబాద్ లో తాము వెళ్ళే రైలు అందుకొన గలమని ధీమాగా యుంటారు .
.అట్లాగే ఉస్మానియా యునివర్సిటి కి ( OU ) సిటి లో ఎక్కడి నుండైన ' 4 ' తో నే బస్సులు వెళ్ళాలి .
ఈ అంకెలను రెడ్ కలర్ తో మెరిసే విధముగా పెద్ద ఫాంట్ ( font size ) రేడియం తో( with radium ) వ్రాయాలి .అప్పుడే బాగుగా కనిపిస్తాయి.
ఇక బస్సుల రంగు మార్చాల్సి ( change of bus co lours ) యుంది , సిటి బస్సు లకు ( to city bus ) పచ్చ రంగు కాంబినేషన్ లో ( combination of green color ) ఆర్దినరికి ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు అదే పచ్చ రంగు కాంబినేషన్ లో వేరొక రంగు మొత్తం మీద పచ్చ రంగు కాంబినేషన్ లో ఒక ప్రత్యేక మైన కలర్ లో సిటి బస్సులు.
ఇక జిల్లా బస్సులకు అని ఆర్దినరికి ఒకరంగు , ఎక్ష్ ప్రెస్ లకు , డీలక్స్ లకు ఎర్ర రంగు కాంబినేషన్ లో ( re color combination ) , ఇంటర్ స్టేట్ బస్సు లకు ఇకో రంగు చూడ ముచ్చటగా , సింపుల్ గా ఎక్కడ వేయని డిజైన్ లో "తెలంగాణా బస్సు" అని చూడగానే చిన్న పిల్లలు కూడా గుర్తించే టట్లు వేయాలి .
బస్సులలో టికెట్ ఇష్యూ పద్దతి ని ( system of ticketing ) కండక్టర్ చాలా సులువుగా ఇచ్చే విధముగా చేయాలి. పేపర్ వేస్ట్ కాకుండా చూడాలి . ముంబాయి లో లాగ కండక్టర్ ఒకే చోట కూర్చొని టికెట్ ఇష్యూ చేయాలి . టిమ్స్ పద్దతి బావుంటుంది
బస్సు లో ఎక్కడానికి " Q " ( system ) మరియు దిగడానికి వేరు వేరు డోర్ లు ఉపయోగించాలి , వెనుక నుండి ఎక్కడం , ముందు నుండి దిగడం అవుతే డ్రైవర్ కు దిగేవాళ్ళ అవగాహన ఉంటుంది .
ఇక బస్సు షెల్టర్ లు పాతవి తీసి క్రొత్త వాటిని నిర్మించాలి . అక్కడ రాత్రి లైటింగ్ ఏర్పాటు చేయాలి . శుబ్రముగా ఉండునట్లు చర్యలు తీసికోవాలి . సరిగ్గా కూర్చుండు నట్లు ప్రతి ఒక్కరు చూడాలి . ప్రతి బస్సు షెల్టర్ పై అక్కడి ఏరియా పేరు తప్పకుండా వ్రాయాలి , దాని వలన ప్రయానికుడికి తాను దిగవలసిన చోటు తెలుస్తుంది .
. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ లకు ప్రోత్సాహకాలను పెంచ వలసిన అవసరం ఉన్నది , మనం ఒక సారి సికిందరాబాద్ నుండి హైదరాబాద్ కు బస్సులో వెళ్లి రావడానికే అలసి పోతాము , మరి బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ ఎన్నో ట్రిప్పులు చేస్తారు , వారు కూడా చాల అలసి పోతారు కావున ట్రిప్ - ట్రిప్ కు కొంత టైం ( time between each trip ) ఇవ్వాలి . వారికి ముంబాయి లో లాగ ప్రోత్సహించాలి . ఒక క్యాషియర్ కు రిస్క్ అలవెన్స్ ( risk allowance ) ఇస్తారు కదా ! మరి డ్రైవర్ ఇంత మంది ప్రయాణీకుల ప్రాణాల రిస్క్ తీసుకుంటాడు కదా .
ఇక బస్సు పాసులు విద్యార్థులకు గాని సామాన్యులకు గాని ప్రతి రోజు ఇస్ష్యు చేయాలి , అక్కడి నుండి ఒక నెల వ్యాల్యు అయేటట్లు చూడాలి , రైల్వే లు ఇస్తున్నట్లు చేస్తే బస్సు ప్రయాణికులకు టెన్షన్ ఉండదు , అందరు సంతోషిస్తారు .
ఈ పైన చెప్పినవన్నీ మన సి యం కె సి ఆర్ గారు ఆచరణలో పెట్టిచ్చి ఎక్కడ లేని విధముగా తొందరగా ప్రజా రవాణా కు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాము .
Many many thanks to our beloved Hon'ble CM, Sri. KCR gaaru
for your restless efforts for very good public transport system and for traffic control in our capital city Hyderabad.
- www.seaflowdiary.blogspot.com
తిమ్మాజిపేట రహదారిపై విద్యార్థినుల రాస్తారోకో
తిమ్మాజిపేట రహదారిపై విద్యార్థినుల రాస్తారోకో
గౌ.నీ . విద్యా మంత్రి కడియం గారు మిగతా విద్యార్థులు రోడ్డు ఎక్కక ముందే అన్ని పాటశాల లను ఒకసారి దయచేసి తనిఖీ చేసి సమస్యలను తీర్చండి .
గౌ.నీ . విద్యా మంత్రి కడియం గారు మిగతా విద్యార్థులు రోడ్డు ఎక్కక ముందే అన్ని పాటశాల లను ఒకసారి దయచేసి తనిఖీ చేసి సమస్యలను తీర్చండి .
Friday, August 14, 2015
OSMANIA HOSPITAL BUILDING
ఉస్మానియా దవాఖానా భవనము
Date :14-08-2015
Date :14-08-2015
Osmania General Hospital (OGH) is one of the oldest hospitals in Indialocated at Afzal Gunj, Hyderabad, Telangana. It is run by the Government of Telangana, and is one of the largest in the state.
The hospital was completed in 1919 and was designed by British architect Vincent Jerome Esch, C.V.O.(also designed The High Court, City High School, Railway Station of Hyderabad) for His Exalted Highness(H.E.H), Osman Ali Khan, the Nizam of Hyderabad in Indo-Sarcenic style.
Inauguration of the Osmania Hospital out-patient clinic in Hyderabad (Deccan). Seated dignitaries (left to right): Akbar Hydari(finance minister), Dr. Naidu, Princess Dürreshwar, Azam Jah, Kirshen Pershad (prime minister), 1930
ఉస్మానియా దవాఖానా 1919 లో పూర్తి చేశారు . దీనిని British architect Vincent Jerome Esch, C.V.O డిజైన్ చేశారు . హైదరాబాద్ నిజాం ఉస్మాన్ ఆలీఖాన్ గారు ఇండో సార్సెనిక్ స్టైల్ లో నిర్మింప జేశారు . ఆయన రెండున్నర ఎకరాలలో హాస్పిటల్ ను నిర్మించారు . తరువాత ఇంతపెద్ద భవనం గా మారింది .
ఉస్మానియా దవాఖానా భవనం శిథిలావస్త కు చేరుకుంది . తొందరలోనే కూలిపోయే ప్రమాదం ఉంది . అందుకే ప్రభుత్వం పేషంట్ల భద్రత కై వారిని అక్కడినుండి తరలించి అక్కడే ఒక లేటెస్ట్ ఆసుపత్రిని బహుళ అంతస్థుల లో ఇప్పుడు ఉన్న మాదిరి గానే నిర్మించాలని అనుకుంటున్నది . ప్రత్యక్షముగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ వెళ్లి మొత్తం బిల్డింగ్ ని పరిశీలించారు . అక్కడి ఆ పురాతన భవనాన్ని చూసి చలించి వేలమంది పేషంట్ ల ప్రాణాలను కాపాడుటకు ముందు వారిని అక్కడి నుండి వేరే వేరే ఆసుపత్రులకు వారం రోజులలో తరలించాలని నిర్ణయం తీసికొన్నారు .
అనుకొన్నట్లు వారం రోజుల తరువాత అక్కడినుండి పేషంట్ లను తరలించడం మొదలు పెట్టారు .
అదే స్తానం లో రూ .100 - 200 కోట్లు పెట్టి అధునాతన మల్టి స్టోర్ బిల్డింగ్ కట్టాలని నిర్ణయించారు .
భవనం ప్రమాదకర స్థితికి చేరుకున్నదని J N T U H కు చెందిన ఇంజనీరింగ్ నిపుణుల బృందం చెప్పింది . TSMSIDC చీఫ్ ఇంజనీర్ అభ్యర్థన మేరకు ఇంజనీర్ల బృందం ఏప్రిల్ 2015 లో హాస్పిటల్ భవనాన్ని పరిశీలించి నివేదిక సమర్పించింది .
95 ఏళ్ళ క్రింద నిర్మించిన భవనం మొదటి అంతస్తులో సీలింగ్ పడిపోయినదని , స్లాబ్ క్రింది భాగం పెచ్చులు ఊడి పోయి స్టీల్ బీములు కనిపిస్తున్నాయని ,అక్కడ ఇంతకు ముందు లీక్ ప్రూఫ్ చేయించినా నీరు లీక్ అవుతుందని , బిల్డింగ్ డేడ్ వెయిట్ గా మారిందని ,స్లాబ్ మరియు గోడలు చీరికలు ఏర్పడ్డాయని ఇలాగే భవనాన్ని కొనసాగించలేమని ఇంజనీర్ల బృందం నివేదిక సమర్పించింది . మరియు చెక్క వస్తువులు చీకి పోయాయని , భవనం చెక్క ద్వారాలపై ఆధారపడి కట్టారు . ద్వారాలు శిథిలావస్థ కు చేరు కున్నాయని , ఒకవేళ దానిని 50 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేసినా లాభం లేదని తేలిపోయింది .

ఈ భవనం కనీసం 10-15 ఏళ్ళ నుండే కాకుండా అంతకు ముందునుండే శితిలావస్థ కు గురి అవుతున్నట్లు కనుపిస్తుంది . అప్పుడే అక్కడ పనిచేసే డాక్టర్లు ,నర్సులు , సిబ్బంది వెళ్ళి ఆరోగ్య శాఖా మంత్రికి శితిలావస్థ పై విజ్ఞాపన పత్రం కూడా సమర్పించారు . డాక్టర్స్ అసోసియేషన్ కూడా దీనిపై చర్య తీసుకోవాలని , పెచ్చులు ఊడి పేషంట్ లపై డాక్టర్ పై పడుతున్నాయని అక్కడ పని చేయడం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చేయవలసి వస్తుందని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది కాని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసికోలేదు .
సమైక్య రాష్ట్రం లో ఎవ్వరు ఆరోగ్య శాఖా మంత్రి గాని ముఖ్య మంత్రులు గాని పట్టించుకున్న పాపానికి పోలేదు .
ఇప్పుడు మన కెసిఆర్ గారు స్వయంగా వెళ్ళి చూసిన తరువాత, అప్పుడు అధికారంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఉస్మానియా హాస్పిటల్ వెళ్లి దానిని చూసి బాగానే ఉంది , రిపేర్ చేస్తే సరిపోతుంది . అది హెరిటేజ్ బిల్డింగ్ దానిని కూల్చ డానికి వీల్లేదు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు .
నిజమే అది వారసత్వ కట్టడం ,దానిని శిథిలావస్థ కు ఎందుకు తెచ్చారు? దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలిసింది . 95 సంవత్సరాల క్రింద నిర్మించిన కట్టడం ఇప్పుడు కూడా ధృడంగా ఉందంటే ఆనాటి టెక్నాలజీ ఎంత విలువైనదో మనం తెలిసికోవాలి . ఆనాడు ఆ కట్టడానికి సున్నం ( డంగు సున్నం )ఉపయోగించారు . వర్షం కురిసినప్పుడు సున్నం వర్షపు నీటిని పీల్చుకుంటుంది , దానివలన రాను రాను కట్టడం లో పటుత్వం తగ్గుతూ శిథిలావస్థకు చేరుతుంది . కావున వర్షం నీరు కట్టడం లో ఇంకకుండా, దానిపై వర్షపు నీరు జారిపోవునట్లు ఒక పెయింట్ కోటింగ్ వేశారా ? . లేదా ఫిలిం లాంటిది వేయాల్సింది . ఎంత వర్షం పడినా నీళ్ళు ఇంకకుండా దాని రూపు రేఖలు మారకుండా కలకాలం ఉండేది. హైదరాబాద్ లో భారి వరదలు వచ్చినా ధృడంగా నిలచిందాభవనం . ఎన్నో రోజుల నుండి గోడలపై రావి చెట్లు , మర్రి చెట్లు , పిచ్చి మొక్కలు మొలచి పెద్దగా అవుతున్నా పట్టించుకోని వారు , ఇంటాక్ సంస్థ వారు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇన్ని రోజులు తెలియదా అది హెరిటేజ్ బిల్డింగ్ అని .
ఒకతను అంటాడు అది సున్నం (డంగు సున్నం ) కట్టింది కాబట్టి ఇప్పుడు సిమెంట్ తో రిపేర్ చేస్తే మిస్ మ్యాచ్ అవుతుంది అందుకే అతుక్కోవడం లేదు కావున దానిని అదే సున్నం తో చేస్తే సరిపోతుంది చాల కాలం మన్నుతుంది , బిల్డింగ్ ను కూలగొట్టి క్రొత్తగా కట్టడం అవసరం లేదంటాడు . ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సున్నం ని సున్నం తోనే రిపేర్ చేయాలంటే , రిపేర్ చేసే సున్నం కూడా పాతదే ఉండాలి మరి క్రొత్త సున్నం ఎలా మ్యాచ్ అవుతుంది ? ఆ భవనం సురక్షితమేనని ప్రజలను మభ్యపెడుతున్నారు . కోర్ట్ కు కూడా వెళ్ళి ఆపుతామని అంటున్నారు . ఇది ఏదో పాత కోటనో కాదు , ప్రజల ప్రాణాలతో ముడిపడిన హాస్పిటల్ భవనం .
Hon 'ble Court కి కూడా మానవతా దృక్పదం , ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉంటుంది .
Hon 'ble Court కి కూడా మానవతా దృక్పదం , ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉంటుంది .
ఉస్మానియా ఆసుపత్రి పురాతన మై కూలిపోవడానికి సిద్ధంగా ఉంది . ఇంతకు ముందు ప్రభుత్వాలు అసలు పట్టించుకోక పోవడం వలన ఈ స్థితికి చేరుకోవడం అందరికి తెలసిన విషయం . మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు స్వయంగా దర్శించి అది ఎప్పుడు కూలి పోతుందోనని ఎంతోమంది రోగుల ప్రాణాలు మరియు డాక్టర్ల ,ఉద్యోగుల ప్రాణాలకు చలించి వారం రోజుల ల లో పేషెంట్ లను ఇతర దవాఖానల లోనికి తరలించి పాత బడిన ఈ దవాఖానా బిల్డింగ్ ను కూల్చి 100-200 కోట్లతో క్రొత్త 20 అంతస్తుల అధునాతన హాస్పిటల్ బిల్డింగ్ ను నిర్మించడానికి పూనుకున్నారు .
చెప్పిందే తడవుగా వారం రోజులలోనే పేషెంట్ లను తరలించడం మొదలు పెట్టారు . అయితే దీనిపై విపక్షాలు నిరసనలు మొదలు పెట్టారు. అది హెరిటేజ్ బిల్డింగ్ అని అది కూల్చ వద్దని కొందరు , వేరొక చోట కట్టాలని మరికొందరు అడ్డు తగులు తున్నారు . ఏది ఏమైనా ఈ సారి వర్షాలు లేవు కాబట్టి అందరు బ్రతికారు ,లేనిచో వారి ప్రాణాలు గాలిలో కలసి పోయేవి . ప్రతి పక్షాలు సహకరించడం పోయి తాము అధికారం లో ఉండగా చేయలేని పనికి సిగ్గుపడాలి . తాము చేయలేదు కాబట్టి కెసిఆర్ చేయవద్దని అడ్డుపుల్ల వేస్తున్నారు . అసెంబ్లీ లో మన అన్న హరీష్ రావు గారు తెలంగాణాకు బడ్జెట్ ఇవ్వమని అడిగితే ఒక్క రూపాయి కూడా తెలంగాణా కు ఇవ్వనని ఒక మూర్ఖ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆరోజు ఒక్క MLA కూడా నోరు విప్పలేదు .
ఒక వేళా సడన్ గా కూలిపోయి వందలాది రోగుల కు , సిబ్బంది కి ప్రాణాపాయం జరిగితే వీరందరు responsible , జిమ్మేదార్ తీసికుంటారా ? ప్రజలకు మంచిపని జరుగుతుంటే దానికి సహకరించాలి కాని దానికి వ్యతిరేకంగా చేసే వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు .
ఒక వేళా సడన్ గా కూలిపోయి వందలాది రోగుల కు , సిబ్బంది కి ప్రాణాపాయం జరిగితే వీరందరు responsible , జిమ్మేదార్ తీసికుంటారా ? ప్రజలకు మంచిపని జరుగుతుంటే దానికి సహకరించాలి కాని దానికి వ్యతిరేకంగా చేసే వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు .
డాక్టర్ గోపాల్ కిషన్ (పూర్వ సూపరింటెండెంట్ ) గారు సూచించినట్లు ఉస్మానియా ఆసుపత్రి ని నిజాం నవాబు రెండున్నర ఎకరాలలో నిర్మించిన భవనాన్నిఅట్లాగే హెరిటేజ్ భవనం గా,మాన్యుమెంట్ గా ఉంచాలి మిగతా పురాతన మైన బిల్డింగ్ ను కూలగొట్టి దాని స్థలం లో ఇప్పుడున్న స్టైల్ లోనే అధునాతనమైన భవనాన్ని కట్టాలని తెలంగాణా ప్రజలందరు కోరుకుంటున్నారు.
Razing row over Osmania hospital
Mood overwhelmingly against construction of hi-tech structure in its place
A 95-year-old heritage structure that has immense historical value and has been witness to major medical achievements in the past is in the middle of a raging controversy in Hyderabad.
The State government’s decision to construct multiple towers in place of the heritage structure of Osmania General Hospital (OGH) has sparked an animated debate among public, care givers, historians, heritage conservationists and has become an issue for the Opposition parties to badger the ruling party.
It all started when Chief Minister, K. Chandrasekhar Rao on July 23 inspected the OGH campus and later announced that the hospital would be shifted within a week and the heritage building would be replaced by a hi-tech structure in the form of multiple towers. The Chief Minister’s decision was based on a report submitted by Professor in Civil Engineering and Registrar of JNTU, Hyderabad, Dr. N. V. Ramana, which said that ‘any repair to the building may extend the life for not more than five years.’
Much to its credit, the JNTU report, has nowhere recommended that the heritage structure be demolished and made it clear that the ‘approval of the heritage committee has to be taken up before carrying out any repairs of the OGH heritage structure.’
Ironically, for the past two years, Hyderabad, which has close to 166 notified heritage structures, has not had a heritage conservation committee to look after the well-being of the historically important edifices.
Strangely though, the State government, had made its intentions known that OGH would de-listed from the heritage list, which will pave the way for construction of a modern hospital in its place. The argument from a section of doctors favouring demolition of the heritage structure was based on the JNTU report, which said that any repairs will only safeguard the heritage structure for not more than five years.
‘Grave implications’
“Imagine the implications in future if one heritage structure is de-listed from the heritage list. What will happen to the 166-odd heritage structures, most of it in private hands, located in Hyderabad? The Charminar, OGH building, High Court, Unani hospital and even the Assembly building are unique and are the identity of Hyderabad,” says Convenor, Indian National Trust for Art and Cultural Heritage (INTACH), Hyderabad, Anuradha Reddy.
An independent study conducted by a committee of experts from INTACH, headed by its Principal Director of Architectural and Heritage division Divay Gupta, said that the OGH heritage building is structurally stable without any threat to its own life or that of patients and care givers. “It has a slight fever but if treated right, the building can survive for decades”, the experts said after their visit.
With widespread opinion against the proposal to demolish the OGH heritage building, at present the health officials here have decided to postpone the issue of demolition to a later date and concentrate on shifting. “We have always advocated that the heritage structure was not safe for patients and care givers. After shifting of OGH, it’s up to the State government to take a call,” Telangana Government Doctors Association (TGDA) president M. Veeresham said.
కూల్చి వేతను ఆపాలని వేసిన వ్యాజ్జం పై భవనం కూల్చివేత పై ఇంకా నిర్ణయం తీసికోలేదని ప్రభుత్వం Hon 'ble High Court కి నివేదించింది .
మన కె సి ఆర్ గారు అలాల్ టప్ప ముఖ్యమంత్రి కారు ఏదో ఎవరినో మోసం చేసి కుర్చీ ని లాక్కోలేదు లేదా సీల్డ్ కవర్ లో పంపిన ముఖ్యమంత్రి కారు . పోరాట నాయకుడు , ప్రాణాన్ని పణం గా పెట్టి ఏకధాటిగా పోరాడిన నాయకుడు , తెలంగాణా ఉరికేనే రాలేదు , 1200 మంది విద్యార్థుల,పౌరులు బలిదానం చేశారు . మరియు ప్రజలందరి ని ఎకధాటికి తెచ్చి సాధించుకున్న మన తెలంగాణా రాష్ట్రానికి తిరుగు లేని నాయకుడు . ఆయన జాతీయ నాయకుడు , ఇలాంటి వారిని ఎందరినో చూసారు . ప్రజలతో కలసి సమానం గా పోరాటం చేసి ప్రజల నుండి వచ్చిన ప్రజా నాయకుడు మన కెసిఆర్ గారు . దేశం లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు చేయని ప్రజా కార్యక్రమాలు చేస్తున్న మహా నాయకుడు .
కావున కె సి ఆర్ గారిని తెలంగాణా ప్రజలు కోరుకోవడం ఏమిటంటే , మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవ్వరు కల్పించినా ఆగేది లేదు , వాటన్నింటిని ప్రక్కకు పెట్టి ప్రజల కోరికను మన్నించి అధునాతనమైన ఉస్మానియా ఆసుపత్రిని ప్రపంచములో నంబర్ వన్ గా నిర్మించగలరని , తెలంగాణా ప్రజలందరూ మీ వెంబడే ఉండి పూర్తి సహాకారం అందించగలరు .
yours ,
www.seaflowdiary.blogspot.com
Subscribe to:
Posts (Atom)









