Wednesday, March 18, 2015


CNN - IBN Popular Choice Indian of the year KCR

సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కేసీఆర్

    Congratulations to our beloved CM KCR

                                                                Date : 18-03-2015

మన ప్రియతమ ముఖ్యమంత్రి KCR గారు తెలంగాణా ను సాధించి తెలంగాణా అంటే ఏమిటో ప్రపంచానికి తెలియ జేసిన మహానుభావుడు . కొద్ది రోజులలోనే తన సత్తా చాటారు . ఆరు నెలలలోనే బంగారు తెలంగాణా కు బాట వేసారు . హైదరాబాద్ ను ప్రపంచ నగరముగా తీర్చి దిద్దుటకు కంకణం కట్టుకున్నారు . దేశం లో ఏ ముఖ్యమంత్రి  చేయని అభివృద్ధి పనులను మన KCR గారు ఆరు నెలలలోనే చేసి చూపెట్టారు . మన KCR గారిని  Popular Choice Indian of the  year గా గుర్తించడం మామూలు విషయం కాదు . ఎంతో మంది ఎన్నో రోజుల నుండి ముఖ్య మంత్రులుగా  ఉన్నా సాధించ లేనిది  మన KCR సాధించడం తెలంగాణా ప్రజలందరికి చాల సంతోషం . ఆ అవార్డు ని  తెలంగాణ అమరులకే అవార్డు అంకితమని ప్రకటించడం నిజంగా ఆయన మహానుభావుడు . 




Updated : 3/18/2015 3:51:47 AM
Views : 3673

- ప్రదానం చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ
- కేసీఆర్ తరఫున అందుకున్న ఎంపీ కేశవరావు
- తెలంగాణ అమరులకే అవార్డు అంకితమని ప్రకటన


Indian-of-the-Year-2014-KCRన్యూడిల్లీ, నమస్తే తెలంగాణ:దశాబ్దంపైగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. గమ్యానికి చేర్చి.. తెలంగాణ రాష్ట్రం సాధించడమేకాకుండా.. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఘనతను యావద్దేశం గుర్తించింది. ప్రముఖ ఆంగ్ల టీవీ చానల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఏటా వివిధ విభాగాల్లో ప్రకటించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 2014 సంవత్సరానికిగాను పాపులర్ చాయిస్ విభాగంలో కేసీఆర్ ఎంపికయ్యారు.


క్రీడలు, వ్యాపారరంగం, వినోదరంగం తదితరాల్లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లను జ్యూరీ ఎంపిక చేయగా.. ఇంటర్నెట్ ద్వారా సేకరించిన జనాభిప్రాయంలో కేసీఆర్ పాపులర్ చాయిస్ విభాగంలో అగ్రభాగాన నిలిచారు. ఈ అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కే కేశవరావుకు అందజేశారు. రాజకీయం, స్పోర్ట్స్, బిజినెస్, గ్లోబల్ ఇండియన్, ఎంటర్‌టైన్‌మెంట్, పాపులర్ చాయిస్, పబ్లిక్ సర్వీస్ అనే విభాగాల్లో 2014వ సంవత్సరానికి ప్రతి విభాగంలో ఆరుగురు నామినీలను ఎంపిక చేసి.. వారి నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లను ఎంపిక చేశారు. ఇందులో పాపులర్ చాయిస్ విభాగంలో రాజకీయ కేటగిరీలో కేసీఆర్ ముందు వరుసలో నిలిచారు. భారతదేశ చరిత్రలో రాష్ట్ర సాధన కోసం దీర్ఘకాలం శాంతియుత ఉద్యమం నడిపిన రాజకీయ నాయకుడిగా, చివరికి ఆ ఉద్యమం ద్వారా రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల నుంచి భారీ స్థాయిలో గుర్తింపు పొందారని, దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారని ఆ చానల్ పేర్కొంది.

దశాబ్ద కాలానికి పైగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిపిన గుర్తింపు కేసీఆర్‌కే దక్కిందని వ్యాఖ్యానించింది. ఇదే కేటగిరీలో కేరళకు చెందిన పోలీసు అధికారి విజయన్ కూడా అవార్డు పొందారు. 2014 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రధాని నరేంద్రమోదీ నిలిచారు. జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇస్రో బృందం చేజిక్కించుకుంది. రాజకీయ నేతల్లో అరుణ్‌జైట్లీని జ్యూరీ ఎంపిక చేసింది.


ప్రజలు, అమరవీరులకే అవార్డు అంకితం:కేకే

Popular-Choice-award-KCR
ఈ అవార్డును అందుకున్న అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నిర్వహించి అశేష ప్రజలను ఇందులోకి ఆకర్షించిన కేసీఆర్ దేశస్థాయిలోనే పాపులర్ లీడర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం అన్ని సెక్షన్ల ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని, వెయ్యి మందికి పైగా యువకులు ఆత్మత్యాగం చేశారని చెప్పిన కేసీఆర్.. ఈ అవార్డు వారికే అంకితమని అన్నారు. ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఓట్లద్వారా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, ఇప్పుడు దేశ స్థాయిలో ప్రజలు ఇంటర్నెట్ ఓటింగ్ ద్వారా సీఎన్‌ఎన్ ఐబీఎన్ చాననెల్ నిర్వహించిన సర్వేలో పాపులర్ లీడర్ ఆఫ్ ది ఇండియాగా ఎన్నుకున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంవైపు యావత్తు దేశ దృష్టి ఉన్నదని, 29వ రాష్ట్రం అయినప్పటికీ తొలి స్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో యావత్తు దేశాన్ని ఆకర్షించారని అన్నారు.

ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు కూడా కేసీఆర్‌ను దేశం మొత్తం మీద పాపులర్ లీడర్‌గా ప్రజలు ఎన్నుకోవడం సంతోషకరమని, ప్రజాదరణ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని, యావత్తు దేశంలోనే కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నజ్మా హెప్తుల్లా, రవిశంకర్ ప్రసాద్, సినీ నటులు ఖుష్బూ, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హారిస్, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరబ్జీ తదితరులు పాల్గొన్నారు.

అవార్డులు పొందింది వీరే..


ఇండియన్ ఆఫ్ ది ఇయర్ : నరేంద్రమోదీ
అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్: అజీం ప్రేమ్‌జీ, కైలాశ్ సత్యార్థి
పాపులర్ చాయిస్ : కే చంద్రశేఖర్‌రావు, పీ విజయన్
రాజకీయం: అరుణ్‌జైట్లీ (కేంద్ర ఆర్థిక మంత్రి)
గ్లోబల్ ఇండియన్: సత్య నాదెంళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈవో)
క్రీడలు : జితు రాయ్
బిజినెస్ : ఎన్ చంద్రశేఖరన్ (టీసీఎస్)
వినోదరంగం : చేతన్ భగత్ (రచయిత)
ప్రజాసేవ : తంగమ్ రినా (జర్నలిస్టు)

మన  కె సి ఆర్  గారు ప్రజల గురించి ముందు ముందు మంచి మంచి పనులు చేయాలని ప్రపంచములోనే ఒక మంచి వాడు గా గుర్తింపు పొందగలరని మన మంతా కోరుకుందాము . 

                                                                                                                yours ,


                                                                                           www.seaflowdiary.blogspot.in 






Friday, March 13, 2015

Telangana Budget 
మన తెలంగాణా బడ్జెట్ 2015-16
                                                                           Date : 13-03-015

 మన తెలంగాణా రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2015-16 ని మన ఆర్ధిక మంత్రి శ్రీ . ఈటెల రాజేందర్ గారు తెలంగాణా అసెంబ్లీ లో 11-03-2015 నాడు ప్రవేశ పెట్టారు . ఇది మొట్ట మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ . 








ఈ బడ్జెట్ అందరికి ఆమోదకరముగా ఉన్నది . కేంద్ర బడ్జెట్ కంటే చాల బాగుంది .

వివిధ రంగాలకు ప్రాధాన్యత ను బట్టి కేటాయింపులు చేశారు .











14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రాబడుల వాటా 32% నుండి 42% పెరిగి నప్పటికీ తెలంగాణా కు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గించడం వలన ఈ వార్షిక బడ్జెట్ లో ప్రణాళిక వ్యయం పెంచేందుకు ఇబ్బందులు పడ్డామని ఆర్ధిక మంత్రి శ్రీ . ఈటెల రాజేందర్ గారు చెప్పారు . కేంద్రం 20 వేల కోట్లు కోత వేసింది . 

అమర వీరుల కుటుంబాలకు 90 కోట్లు కేటా ఇంచారు. ఇప్పటికే 481 కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం చేశారు . అమర వీరులు 1200 మంది  చెప్పి కేవలం 481కుటుంబాలకు సాయం చెయ్యడమేమిటి , అందరికి సహాయం చేయాలి . 1969 లోని  తెలంగాణా అమరుల కుటుంబాలకు కూడా సాయం చెయ్యాలి. 

తెలంగాణ యూనివర్సిటి లకు కొంత నిరాశ కలిగింది నిజమే . ఉస్మానియా యూనివర్సిటి కి 238.19 కోట్లు కేటాయించారు . 



ఉస్మానియా యూనివర్సిటి తెలంగాణా కు గుండె కాయ వంటిది , తెలంగాణా సాధనలో ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థుల త్యాగం గురు తర మైనది . అందుకే అన్ని యూనివర్సిటి ల లాగా కాకుండా ఉస్మానియా యూనివర్సిటి కి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి అన్ని విధాలుగా ఆదుకో వలసిన అవసరం ఎంతో ఉంది  కావున కె సి ఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . 

Mar 12 2015 : The Times of India (Hyderabad)
OU faculty miffed over meagre allocation

Hyderabad
TIMES NEWS NETWORK


Allocation of Rs 238 crore to Osmania University in the budget came as a disappointment
 for authorities who said development was not possible in the coming academic year.
Angry teachers now say they are mulling a strike to protest.The university , which has
 over 700 affiliated colleges, had asked for Rs 450 crore to undertake developmental
activities.But the allocation is hardly enough to meet even salaries and pension of  teaching and non-teaching staff, officials said.“The campus will not see any new 
construction and maintenance work too will suffer  since Rs 320 crore is required for 
 covering salary expenditure alone. Unless the varsity gets more grants we will not be 
able to function,“ said B Satyanarayana, president of OU Teachers Association (OUTA).
The varsity would be in no position to complete even the electric and water works
that commenced a year ago let alone undertaking construction of new hostels and
maintenance of classrooms. The faculty members said that they might have to go on
strike if the government failed to hike the budget to cover their salaries.
“We have requested the government to release more funds.If it does not meet our
 needs we might have to go on strike,“ Satyanarayana said.
OU was the hotbed of Telan gana statehood movement and gave TRS an MP and an
MLA, but now stands neglected, students lamented. “ At one point of time, the varsity
was the most sought after place for the TRS. Once it assumed power the
government does not want to support the university,“ said Manavata Rai, a student
leader.
The National Assessment and Accreditation Council (NAAC) members are expected
to visit the university during the coming academic year for inspection. “Without any
noteworthy development the chance of OU getting a good NAAC ranking is grim. A poor
 rank will further undermine its chances of getting funds from University Grants Commission,“ Rai said.
Times View
I t's high time the government takes urgent steps to improve the standards in the
prestigious Osmania University, especially in view of the upcoming inspection by the
National Assessment and Accreditation Council. It should also stop a possible strike at
 the affiliated colleges through dialogue and ensure that students do not suffer



విద్యార్థుల బోధనా ఫీజు , స్కాలర్ షిప్ లకు రూ .   2677       కోట్లు 
యాదాద్రికి                                               రూ .    100         "
కల్యాణ లక్ష్మి కి                                         రూ .    237         "
న్యాయ శాఖ కు                                        రూ  .   816         "
ఆసరా  కు                                                రూ . 4000          "
మైనారిటీ  లకు                                         రూ .     75          "
చేనేత , జౌళి కి                                          రూ .   197          "
సంక్షేమ పద్దు                                           రూ 13,195.51    "
SC అభివృద్ధి కి                                         రూ . 6156. 82    "
భూమి కొనుగోలుకు                                  రూ . 1000          "
ST సంక్షేమానికి                                        రూ . 3308          "
BC  సంక్షేమానికి                                      రూ . 2172          "
స్త్రీ ,శిశు సంక్షేమానికి                                 రూ . 1559          "
రోడ్లు భవనాలకు                                        రూ . 4747         "
హరిత వనానికి                                          రూ .   325         "
గృహ నిర్మాణానికి                                       రూ .   874        "
రెవిన్యూ శాఖకు                                          రూ . 1686        "
ఆర్టిసి కి                                                     రూ .    400         "
విద్యుత్ రంగానికి                                        రూ .  7400        "
పారిశ్రామిక రంగానికి                                   రూ .    973        "
IT కి                                                           రూ .   134         " 

అంగన్వాడి కార్య కర్త వేతనం రూ . 4200 నుంచి రూ . 7000 లకు  సహాయకురాలి వేతనం రూ . 2450 నుంచి రూ . లకు ప్రతి పాదించారు . 



వ్యాట్ పై వేటు క్రొత్త బడ్జెట్ లో రూ . 35,463 రాబడిని కోరు కుంటున్నారు . ఇప్పటికే కేంద్రం సర్వీస్ టాక్స్ 2% పెంచింది . ఇంకా రేట్లు పెరుగుతాయి . మీకు కేంద్రానికి తేడా ఏమిటి ? 

ఈ బడ్జెట్ మనది మన తెలంగాణా రాష్ట్రం ది . మన అభి వృద్ధి మనం చేసుకుంటాం . ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణా కు అన్యాయం చేశారు . అసలు  తెలంగాణా అనేది ఉందా అని కూడా అప్పటి పాలకులకు తెలియదేమో ! తెలిస్తే తెలంగాణా కు ఇంత   సర్ ప్లస్ బడ్జెట్ ఉన్నా కావాలని ఇంత కాలం అభివృద్ధి చేయలేదు . అంటే మన సర్ ప్లస్ బడ్జెట్ ని ఆంధ్రా కు తరలించారు . ఒకరు తెలంగాణా అని ఉచ్చ రించా నీయలేదు , మరి ఒకతను తెలంగాణా కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలన్నారు , మరి ఇంకోతను తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసి కుంటారో అన్నాడు . ఇలాగ తెలంగాణా ను అడుగడుగునా అవమాన పరిచారు . ఇనా మనం ఓపిక తో ఉన్నాము . ఇప్పుడు మనమే పాలించు కుంటున్నాము కాబట్టి ఇప్పుడు తెలంగాణా సర్వతో ముఖాభి వృద్ధి తొందరలో కాబోతుంది . 
ఇంత మంచి  బడ్జెట్ ఉంటె కావాలని ప్రతి పక్షాలు పెదవి విరిచడం ఏమిటి ? వాళ్ళ పార్టీలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఇంత మంచి  బడ్జెట్ ప్రవేశ పెట్టారా ? 

కేంద్ర బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ చూడండి అందులో ఏముంది . ఎవ్వరు సంతోషముగా లేరు, కార్పోరేట్ వాళ్ళు తప్ప . అందులో బడా బాబులకు కార్పోరేట్ టాక్స్ ని 30% నుండి 25% నికి తగ్గించారు . సామాన్యులు చెల్లించే సర్వీసు టాక్స్ ని మాత్రం 12.36% నుండి 14% పెంచారు . వారికి సామాన్య ప్రజలంటే ఎంత ప్రేమ ఒలుక బోశారో మరి . ప్రభు గారి రైల్వే బడ్జెట్ ఎలా ఉందంటే  " కిర్రు - కిర్రు మంటూ శబ్దం చేస్తూ వెళుతున్న ఎడ్ల బండి ఇరుసు కు కందెన పూసినట్లు" మాత్రమే ఉంది . 

గోదావరి పుష్కరాలకు రూ . 100 కోట్లు కేటాయించారు . గోదావరి మరియు  కృష్ణా  పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి వస్తాయి . ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చాయి . తెలంగాణా లో ఈ రెండు నదుల పరివాహక  ప్రదేశాల్లో భక్తులు పుష్కరాలకు వెళితే స్నానం చేయడానికి సరియైన ఘాట్ లను ఏర్పాట్లు ఇంతకు ముందటి ప్రభుత్వాలు  చేయ  లేదు . ఇప్పుడు ఏకం గా మన ప్రభుత్వం  గోదావరి పుష్కరాలకు రూ . 100 కోట్లు కేటాయించారు .  చాలా సంతోషం . 

గోదావరి అంటే రాజమండ్రి అని కృష్ణా అంటే విజయవాడ చెప్పు కొనే  వారు . కాని తెలంగాణా లో ఈ రెండు నదుల పరివాహక  ప్రదేశాలు 80% కాని ఆంద్రా పెత్తం దార్లు తెలంగాణా ను అణచి పెట్టారు , కాని ఇప్పుడు అదేమీ జరగదు . మన  గోదావరి మరియు  కృష్ణా పుష్కరాలు మనవే . 

                                                                                                                 yours ,
                                                                                            www.seaflowdiary.blogspot.com 



















Monday, March 9, 2015

 Our  Inter mediate Exams

    మన  ఇంటర్మీడియట్ పరీక్షలు
                                                                Date : 09-03-015


Updated : 3/9/2015 2:14:11 AM
Views : 281
- ఏర్పాట్లు పూర్తిచేసిన ఇంటర్‌బోర్డు
- హాజరుకానున్న 9.73 లక్షల మంది
- విద్యార్థుల పరీక్ష ఫీజులు కట్టని కొన్ని ప్రైవేటు కాలేజీలు
- హాల్‌టికెట్లు రాక ఆందోళనలో విద్యార్థులు
- ఇంటర్‌బోర్డు కార్యాలయం ముందు ఆందోళన
-ఆ విద్యార్థులకు న్యాయం చేస్తాం
- వెబ్‌సైట్లోనూ హాల్‌టికెట్లు పొందవచ్చు: ఇంటర్‌బోర్డు

 తెలంగాణా రాష్ట్రంలో సోమవారం 09-03-2015 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి . . పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల 9,73,237 మంది హాజరవుతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,66,448 మంది, రెండో ఏడాది విద్యార్థులు 5,06,789 మంది ఉన్నట్లు వెల్లడించింది. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికంటే 15 నిమిషాల ముందే పరీక్ష గదికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు జరుగుతాయి.

ప్రైవేటు కాలేజీల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు రాబట్టుకొనేందుకు ప్రైవేటు కాలేజీలు వేధింపులకు పాల్పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజులు చెల్లించలేదన్న నెపంతో హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టలేకపోతున్నారు. మరోవైపు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలుచేసి ఇంటర్ బోర్డుకు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించటంతో పలువురు విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలుచేసి ఇంటర్ బోర్డుకు చెల్లించకుండా ఉన్న ప్రైవేటు కాలేజీల పై కఠిన చర్య తీసుకొనవలసిన అవసరం ఉంది . 

students

ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఇంటర్ బోర్డు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు కాలేజీల యాజమాన్యాలను నిలదీస్తే ఇంటర్ బోర్డు వైఫల్యం వల్లనే హాల్‌టిక్కెట్లు రాలేదని బుకాయిస్తున్నాయి. దీంతో బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 14 వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి బోర్డు గడువు విధించింది. ఆలోగా కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల పరీక్ష ఫీజులను బోర్డుకు చెల్లించలేదు. దీంతో శనివారం, ఆదివారాలు తమకు హాల్‌టిక్కెట్లు అందలేదని ఇంటర్‌బోర్డు కార్యాలయం ముందు పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

కాలేజీల యాజమాన్యాల తప్పులకు తమను బలిచేయొద్దని, పరీక్ష ఫీజు ఇప్పుడు చెల్లిస్తామని విజ్ఞప్తిచేశారు. హాల్‌టిక్కెట్లు జారీచేసి పరీక్షకు అనుమతించాలని కోరారు. కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల హాల్‌టిక్కెట్లు అందని విద్యార్థులకు న్యాయం చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు హమీ ఇచ్చారు. దాదాపు 100-150 మంది విద్యార్థులు ఆదివారం కూడా బోర్డు కార్యాలయంలో హాల్‌టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారిలో అర్హులైనవారికి హాల్‌టిక్కెట్లు అందజేస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. తప్పుచేసిన కాలేజీలకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
  అర్హులైన వారికి కాదు ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ హాల్‌టిక్కెట్లు అందజేసి అందరు పరీక్షా లు వ్రాసేటట్లు చేసే భాద్యత ప్రభుత్వం పై ఉన్నది . ఫీసులు కట్టని వారికి కూడా పరీక్షకు అనుమతించి కావాలంటే ఫీజు కట్టిన తరువాత రిజల్ట్స్ చెప్పండి అంటే కాని పరీక్షలకు హాజరు కానివ్వక పోవడం దారుణం . సంవత్సర మంతా కష్టపడి చదివి ఫీజు కట్టలేదని , ప్రైవేటు కాలేజి లు బోర్డ్ కు చెల్లించ లేదని హాల్ టికెట్లు ఇవ్వక పోవడమేమిటి ? తల్లి దండ్రులు ఎంత కస్టపడి పిల్లలను చదివిస్తారో ఇంటర్‌బోర్డుకు తెలియదా ! కావాలంటే ఫీజు కట్టిన తరువాత రిజల్ట్స్ చెప్పండి ప్రస్తుతం పరీక్షలకు అనుమతి ఇవ్వండి . 

     ప్రియమైన  KCR గారు దయచేసి మీరొకసారి ఇందులో కలుగ జేసికోనగలరు . తెలంగాణా రాష్ట్రం లో మీ హయాములో మొట్టమొదటి సారి జరుగుతున్న ఈ పరీక్షలు . మన తెలంగాణా పిల్లలు పరీక్షలు వ్రాస్తున్నారు , అందరు  ఈ పరీక్షలు వ్రాసేటట్లు చెయ్యండి . మీరు ఎంతో మంది విద్యార్తులకు ఫీజు చెల్లించి చదివిస్తున్నారు . ఎందరినో ఆర్థికంగా ఆదు కొంటున్నారు కావున దయతో మన తెలంగాణా పిల్లలు ఫీజు చెల్లించుట లో జాప్యం జరిగింది ,వీరందరినీ ఆదుకొని ఈ కనీస పరీక్షా ఫీజు ప్రభుత్వం చెల్లించు నట్లు చర్యలు గై కొనండి , తరువాత వారినుండి వసూలు చేయించండి . ప్రస్తుతం వాళ్ళను ఆదు కొనండి . కనీసం రేపటి నుండైన పరీక్షలకు అనుమతించండి . మిస్సయిన పరీక్షలను తరువాత నిర్వహించండి. 

వెబ్‌సైట్లో హాల్ టికెట్లు: ఇంటర్ బోర్డు
ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ హాల్‌టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bietalagangna.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సంతవ్సరం హాల్‌టికెట్ కోసం పదోతరగతి హాల్‌టికెట్ నంబర్, సెకండియర్ హాల్‌టికెట్ కోసం ఇంటర్ ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్‌ను టైప్ చేయాలని కోరారు.

































 

పరీక్షకు పరుగెత్తడం


                                                          పరీక్షకు పరుగెత్తడం 

ఇంటర్  మీడియట్ బోర్డ్  తెలంగాణా ది , ఇక్కడి విద్యార్థులు తెలంగాణా వారే . ఇక్కడ ఎన్ని కాలేజి లు ఉన్నవో ఇంటర్  మీడియట్ బోర్డ్ కు ముందే తెలుసు . ఎంతమంది ఫీజు కట్టారో ఇంకెంతమంది కట్టాలో కూడా తెలుసు.  ఎవరెవరు ఫీజు కట్టాలో ఎందుకు కట్టలేదో బోర్డ్ ఒక సారి అనలైస్ analyse చేయవలసింది . కట్టని వారికి ఒక సారి remind చేయవలసింది . ఎందుకంటే వారు మనపిల్లలు , వారు ఒకసారి miss అయ్యారంటే వారి జీవితం లో ఎంతో కోల్పోతారు   కాని ఆ  చిన్న  పని కూడా  బోర్డ్ చెయ్యలేదు , ఒక న్యూస్ పేపర్ లో ప్రకటన ఇస్తే సరిపోయేది  కాని  వారికి  కావలసింది పరీక్ష ఫీజు మాత్రమే . రేపు పరీక్షలు అనగా చదువు కొనకుండా విద్యార్థులు ఇంటర్  మీడియట్ బోర్డ్ చుట్టూ హాల్ టికెట్ గురించి తిరుగ వలసిన బాధ తప్పేది . ఒక్క నిమిషం కూడా లేటు అవుతే అనుమతించరట , ఇక్కడ హైదరాబాద్ ఎంత పెద్దదో ఎక్కడెక్కడి నుండి రావాలో , బస్సులు సరయిన టైం కు వస్తాయా ? ఇదేమి competitive exam  ఏమి కాదు, EMCET కూడా కాదు  , ఒక్క నిమిషం లో ఏమి పోదు . విద్యార్ధులు రైట్ టైం లో నే వస్తారు , ఒక్కో సారి ఒక్క నిమిషం లేటు అయినా అనుమతించుటలో తప్పు లేదు , ఏ ఒక్క విద్యార్ధి కి కూడా మిస్ కాకుండా హాల్ టికెట్ అందించే బాధ్యత బోర్డ్ పై ఉన్నది . కావున దయచేసి మన ప్రభుత్వం  బోర్డ్ నియమాలను మార్చి  ఇలాంటి బాధలు విధ్యార్థులకు మరియు తల్లి దండ్రులకు లేకుండా చేయాలని అందరం కోరుకుందాం ! 

                                                                                                                        yours,
                                                                                                    www.seaflowdiary.blogspot.com 









Praja Pratinidhi

ప్రజా ప్రతినిధి 
 Date : 09-03-2015

           శాసన సభ్యులు ప్రజలచేత ఎన్నుకోనబడినవారు . ప్రజా ప్రతినిధులు . ప్రజలు తమ ప్రతినిధిగా ఓట్లు వేసి గెలిపించి శాసన సభకు పంపిస్తారు . అక్కడ వారు తమ ప్రజలకు ఏమి అవసరమో , ప్రజల సమస్యలు ఏమిటో  అసెంబ్లీ లో చర్చించి సాధించాలి . అప్పుడే అతను నిజమైన ప్రజా ప్రతినిధి .  ఎన్నికలప్పుడు ఇంటింటికి తిరిగి  కనబడిన వారినందరినీ ఆప్యాయంగా పలుకరించి ఓటు వేసి గెలిపించమని బ్రతిమిలాడుతాడు. ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతుకుతారు , ఇస్త్రి చేసి పెడతారు , చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడుతారు . అమాయక ప్రజలు తమ సమస్యలు తీరుస్తాడని ఓట్లు వేసి గెలిపించి శాసన సభకు , పార్లమెంట్ కు పంపిస్తారు . 
          ఆయన ఓట్లు వేసి గెలిపించిన వారికి కనిపించడు .  ప్రజలకు లేక ఆ ఊరి  వారికి ఏదైనా పని బడినప్పుడు వారి MLA  గాని MP దగ్గరకు వెళ్ళి కలవాలంటే ఎన్ని కష్టాలు పడతారో ! అప్పుడు ఆయన వీళ్ళను గుర్తు పట్టడు మీరెవరని ఎదురు ప్రశ్నలు వేస్తాడు . ఆయనకు అతి ముఖ్య మైన వాడు అవుతే పనులు జరుగుతాయి . వారు ప్రజలకు సేవ చేయాలి , వారు ప్రజా సేవకులు కదా మరి ! వారు ప్రజా ప్రతినిధులు , ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి వారికి వారే జీతం , అలవెన్సులు , ఇతర అన్ని రాయితీలు  అసెంబ్లీ లో చట్టం చేసికొని వేల రూపాయలు పొందు చున్నారు . ఇదే కాకుండా ఒక్కసారి  MLA  గాని MP గా  ఉంటే  జీవితాంతం పెన్షన్  కూడా వస్తుంది . అంటే వారు ఇంద్రభోగం అనుభవిస్తారు . అందుకే ప్రతి ఒక్కరు ఈ పదవులకు విపరీతమైన పోటి పడుతున్నారు . 

ఒక్కసారి  MLA  గాని MP అయితే తర తరాల వరకు ఆస్తులు కూడా సంపా దిస్తారు .  కాని మనం  మాజీ 
 MLA  గాని MP లను కొందరిని చూస్తే వారిప్పుడు కూలి పని చేస్తూ బ్రతుకు వెళ్ళ బోస్తున్నారు . వారి సమయం లో పెన్షన్ పథకం లేదేమో ! 

        ఇంకా కొందరు మహానుభావులను చుస్తే గుండె తరక్కు మంటుంది . లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి ప్రధాన మంత్రిగా చేశారు , ఇప్పటి లెక్క ప్రకారం ఆయనకు ఆస్తి ఎంత ఉండాలి ఒక్కసారి అనుకుంటే మనం ఉహించ వచ్చు కాని ఆయనకు ఉండడానికి ఇల్లే లేకుండెను . ఆయన కట్టుకున్న బట్టలు అతి సామాన్యం . అనుకుంటే ఆయన కు కూడా 10-20 లక్షల సూట్ కూడా ఇచ్చేవారు . ఆయన రైల్వే మంత్రిగా పని చేసినప్పుడు మన దగ్గరే ఆలేరు వద్ద వసంత వాగులో మద్రాస్  Madras express పడి పోయి నప్పుడు ఆయన నైతిక భాధ్యత వహించి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనం ఉపయోగించ కుండ సొంతముగా ఇంటికి వెళ్ళి పోయారంటే ఆయన దేశ భక్తీ ఎలాంటిదో ఒక్కసారి మనం ఊహించు కుందాము . 

    మురార్జీ దేశాయ్ గారు కూడా మన దేశానికి ప్రధాన మంత్రి గా చేశారు , ఆర్థిక మంత్రిగా ఎన్నో సంవత్సరాలు చేశారు.  ఆయన గారికి కూడా ఉండడానికి ఇల్లు లేకుండెను , కాకి కి కబురు పంపిన ఒక పది ఎకరాల భూమిలో విలస వంతమైన ఇల్లు కట్టి ఇచ్చేది . ఇలాంటి వారు ఇంకా ఎంతో మంది ఉండవచ్చు , వారి జన్మ జన్మ ధన్య మైనది
     ఏ చదువు లేకున్నా MLA  గాని MP గా  ఎన్నికలలో పోటి చేసి గెలవ వచ్చు , అప్పుడు కూడా ఉండే వారు . నేడు క్రిమినల్స్ కూడా ఎన్నికలలో పోటి చేసి గెలుస్తున్నారు . ఒక ఉద్యోగి కి మాత్రం పది investigations చేసి మాత్రం 
employment ఇస్తారు, చిన్న తప్పు చేస్తే punishment ఇచ్చి ఇంటికి పంపుతారు. 
    
      ఇప్పటి శాసన సభ లలో  చుస్తే  వారు నిజంగా ప్రజా ప్రతినిదులేనా అనిపిస్తుంది . మొన్ననే ఒక విదేశములో MP లు Boxing కూడా చేసికున్నారు . ఇక మన దేశం లో అయితే మితిమీరిన ప్రజా స్వామ్యం . ఒకరు పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే చేస్తారు , ఇంకొకరు సెక్రటరీ దగ్గర కాగితాలు తీసికొని చింపు తారు , మైకులు విరగ గొడతారు , కాగితాలు చింపి గవర్నర్ , స్పీకర్ పై వేస్తారు . అయినా వాళ్ళు మళ్లీ ఎన్నికల్లో పోటి చేయవచ్చు గెలవ వచ్చు , చూశారా " మితిమీరిన ప్రజా స్వామ్యం" ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి , లేడిస్ పై కూడా దౌర్జన్యం జరిగిన సంఘటనలు ఉన్నాయి . 

       నిన్న మొన్నటి సంఘటనలు చూస్తే కొందరు ప్రజా ప్రతినిధులు ఎం చేశారో అందరు గమనించి ఉంటారు . వీరు నిజంగా ప్రజా ప్రతినిదులేనా అనిపించక మానదు . 

     శాసన సభ లో బల్లలు ఎక్కి జోరు జోరు గా అరవడం సిగ్గు చేటు . జాతీయ గీతాన్ని అవమాన పరచడం , గవర్నర్ గారిని కించ పరచడం ప్రజా ప్రతినిధుల పని కాదు . వారికంటే స్కూల్ లో చిన్న పిల్లలు చాల నయం ,వారికి ఉన్న తెలివి వీరికి లేదు . బల్లలు ఎక్కి జోరు జోరు గా అరిస్తే  వారి నాయకుడు సంతోషిస్తారను కోవడం,  వారి నాయకుడు వారిని వారించక పోవడం సిగ్గు చేటు . పెద్ద ప్రజా స్వామ్యం అని చెప్పుకోవడం సిగ్గుచేటు . ఇలాంటి పిచ్చి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి . ఓట్లు వేసి గెలిపించినట్లు ప్రజలకు ఇష్టం లేనప్పుడు ,ప్రజలను పట్టించుకోనప్పుడు , అసెంబ్లీ లో బుద్ధి తక్కువగా ప్రవర్తించి నప్పుడు వారి నాయకుడిని MLA , MP లను పదవి నుండి దింపే అధికారం ఓట్లు వేసిన వారికి ఇస్తే ఇలాంటి కోతి చేష్టలు ఎవ్వరు చేయరు . వారికి ప్రజలంటే భయం ఉంటుంది . MLA,  MP లను పదవి నుండి దింపే అధికారం ఓట్లు వేసిన వారికి ఇచ్చే చట్టం తేవాలి అప్పుడే దేశం బాగు పడుతుంది . 

జాతీయగీతాన్ని అవమాన పరిచారని 

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా జాతీయగీతాన్ని అవమానపర్చిన వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 7న అసెంబ్లీలో జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు బెంచీలు ఎక్కి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే.  

సారీ చెప్పమన్నందుకు జానాపై స్వంత సభ్యుల గుర్రు

Updated : 3/9/2015 4:08:43 PM
Views : 910

 Unsatisfaction on jana

హైదరాబాద్ : ఇవాళ సభలో జానారెడ్డి తీరుపై స్వంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జాతీయ గీతం ఆలాపన సందర్భంగా గడిబిడి చేసిన సంపత్ కుమార్‌ను క్షమాపన చెప్పాల్సిందిగా జానారెడ్డి ఆదేశించడం ఆయనకు నచ్చలేదట. ఆయనకే కాదు ఆ పార్టీ మిగతా నేతలకు కూడా నచ్చలేదట. సభలో హూందాగా నడుచుకోవాలన్న జానా ఆలోచనను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బయటికి క్షమాపణలు చెప్పినా లోపల జానాపై సంపత్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.


జాతీయగీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలి: అక్బరుద్దీన్

Updated : 3/9/2015 12:00:21 PM
Views : 1180

హైదరాబాద్: జాతీయ గీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. శాసన సభ్యులు తన విద్యాసంస్థల్లో జాతీయ గీతం ఆలాపించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించడంపై అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గీతాన్ని తమ సంస్థల్లో పాటించని సభ్యులు ఉంటే సిగ్గుపడాలన్నారు. జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. ఏ విద్యాసంస్థలు జాతీయగీతాన్ని పాడించడం లేదో వారి పేర్లు సంపత్ కుమార్ తెలపాలని, జాతీయ గీతం పాడించని వారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.




జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు క్షమాపణ చెప్పాలి


Updated : 3/9/2015 11:14:47 AM
Views : 467

Latest News

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయం మేరకు సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సభ్యులు సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

క్షమాపణ చెప్పిన సంపత్‌కుమార్

Updated : 3/9/2015 11:46:17 AM
Views : 1060

MLA Sampath Kumar say sorry to Assembly

హైదరాబాద్ : శాసనసభలో జాతీయగీతాన్ని అవమానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఎట్టకేలకు సభకు క్షమాపణ చెప్పారు. సభకు క్షమాపణ చెప్పాలని కోరుతూ స్పీకర్ ఆయనకు నాలుగు సార్లు మైక్ ఇచ్చినప్పటికీ క్షమాపణ చెప్పకుండా ఇతర విషయాలు మాట్లాడుతూ సభలో గందరగోళం సృష్టించారు. అప్పటికే ఒక సారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి క్షమాపణ చెప్పాలని సంపత్‌కు సూచించారు. అయినప్పటికీ వినిపించుకోలేదు సంపత్.

అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. సంపత్ సభకు క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటోందని హెచ్చరించారు. సభా సంప్రదాయాలను కాపాడకుండా సంపత్ సభకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే జానారెడ్డే సభకు క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ సంపత్ క్షమాపణ చెప్పకోవడం దారుణమన్నారు. ఇక ఐదో సారి మైక్ తీసుకుని సభకు సంపత్ క్షమాపణ చెప్పారు. అంతకుముందు సభకు క్షమాపణ చెప్పని పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

ప్రజా ప్రతి నిధులు  ప్రజలకొరకు, దేశం కొరకు పాటు పడాలి, ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడాలి.   అప్పుడే వారికి విలువ పెరుగుతుంది , ప్రజల సానుభూతి ఉంటుంది . వారు మిమ్మల్ని గుండెల్లో దాచు కుంటారు .                                                                                                                          yours ,
                                                                                                   www.seaflowdiary.blogspot.com 










Friday, March 6, 2015




                  Hyderabad best city to live in India 
                       హైదరాబాద్ ఇండియా లో బెస్ట్ సిటీ 
                                          Date : 06-03-2015




In what is yet another jewel in Hyderabad's crown, the `City of Pearls' has emerged as the  numero 
uno city  in India when it comes to offering the best quality of living standards 
in Mercer's Quality of Living Report 2015 that was released on Wednesday .Ranked  138th 
globally by the Mercer report, Hyderabad beat Pune (145th) to the top spot in India  and left 
India's IT hub Bengaluru (146th), Chennai (151st), commercial capital Mumbai (152nd) and  India's
  political capital New Delhi (154th) behind  in the quality of living sweepstakes. “Indian cities have not
 made much progress on the quality of living scale, scoring nearly the same as they did last year. 
However, over time, Hyderabad has emerged as a city of choice due to factors such as  improved
 options for international schools. Additionally the Rajiv Gandhi International Airport ( RGIA )is located 
22 km from the city and offers a good range of international flights, which  improves its ranking
 on account  of public services,“ the release said. The survey took into consideration  parameters
 such as political and social environment, medical care and health considerations,  public services,
 recreation facilities and natural environment among others in preparing the report, Mercer said
  in a  release. Elaborating on the reasons behind ranking Hyderabad ahead of traditional business 
centres like Mumbai and New Delhi, Ruchika Pal, India practice leader (global mobility), Mercer,
 said: “While other factors have remained constant, considerable population increases in Mumbai and
 New Delhi in recent decades have lead to  an increase in problems like access to clean water,
 air pollution, and traffic congestion.“However, the study pointed out that Indian cities were  `safer' 
than  most others in South  Asia.
The study rated Vienna as the city with the best quality of living in the world for the second
 consecutive time followed by Zurich, Auckland, and Munich at second, third, and fourth place 
respectively . Mercer, which is a $4 billion turnover US player in talent, health, retirement and 
investments, conducts its quality of living survey annually to help multinational companies and
 other employers compensate employees fairly when placing them on international assignments, 
 the release said.

After 2 years we can find hyderabad will the best in all aspects. CM KCR improving the city 
as the world class number one city. For traffic clear more sky and fly overs coming soon.
Improving public transport system by METRO Rail, MMTS rail, increasing Buses. Cleaning 
of Hussain Sagar lake, multiplexes around the lake etc. world no. 1 IT Hub, Pharma city 
 are under developing. The public in Hyderabad are so cordial, co-operative , helpful ,
no schism among the people. only due to the outsiders came to here for living  are 
responsible for antagonism. roundish ,land grabbing, theft and antisocial activities 
etc. in the calm city. To overcome this situation our beloved CM KCR taking all 
security measures.  
So, after 2 years  No other city in the world will compete Hyderabad.















రెండు సంవత్సరాల తరువాత హైదరాబాద్ ప్రపంచములో ఒక మంచి సిటీ కాబోతుంది . మన ముఖ్యమంత్రి గారు 
హైదరాబాద్ ను ప్రపంచ ముఖ్య నగరముగా చేయ బోవు చున్నారు . మెట్రో రైల్ వస్తుంది , MMTS రెండవ పేస్ వస్తుంది .
ట్రాఫిక్ సమస్య ఉండదు . బస్సులు ప్రతి కాలానికి వస్తాయి . హుస్సేన్ సాగర్ మంచి నీటి సాగర్ కాబోతుంది . కరెంట్
 కూడా అప్పటికి మిగులుగా ఉంటుంది . ఇంటింటికి మంచి నీరు నల్లాల ద్వారా సప్లై చేయబడుతుంది . ప్రపంచ  I T  హబ్ 
కాబోతుంది , ఫార్మా సిటీ వస్తుంది. మన ప్రక్కనే యాదాద్రి ఒక పెద్ద పుణ్య క్షేత్రాన్ని చేయుటకు కె సి ఆర్ గారు చిత్త శుద్ధి 
తో ముందుకు వెళుతున్నారు . 












hyderabad  ప్రజలు చాల ఉదార హృదయులు , ఆనందరిని ఆదుకొనే వారు , ఎవ్వరికి హాని తలపెట్టరు, 
మాట మీద నిలబడే వారు . మత సామరస్యం అంటేనే హైదరాబాద్,  వందల సంవత్సరాలు ఎలాంటి మత భేదాలు లేకుండా సొంత 
అన్న తమ్ముల లాగా జీవించు చున్నారు . 1970 వరకు మత కల్లోలాలు అంటే ఏమిటో ఇక్కడి ప్రజలకు 
తెలియదు . హైదరాబాద్  ప్రపంచ I T హబ్ , హెల్త్ సిటీ , ఫర్మా సిటీ , ఎడ్యుకేషన్ సిటీ గా  ట్రాఫిక్ మెజర్స్ 
మన CM గారు తీసి కొంటున్నారు . 

 ప్రస్తుతం ఇక్కడ జరిగే గూండా ఇజం , రౌడి ఇజం, దొంగ తనం, హత్యలు ,అత్యాచారాలు , రికార్డు 
లను తారు మారు చేసి భూ ఆక్రమణలు చేసేది కేవలం బయటి నుండి ఇక్కడకు వచ్చిన వారి పనే ! 
అందుకే మన కె సి ఆర్ గారు పోలీస్ వ్యవస్తను లండన్ పోలీస్ లాగా పటిష్ట పరుస్తున్నారు.  "షీ  " టీం లను 
ఏర్పాటు చేసి స్త్రీ లకు రక్షణ కల్పిస్తున్నారు. అప్పుడు అందరు హాయిగా ఉండవచ్చు . 

రెండు సంవత్సరాల అనంతరం హైదరాబాద్ నగరం అన్ని రంగములలో ప్రపంచములో నంబర్ వన్ సిటీ గా 
ఉంటుంది . 

                                                                                           yours,
                                                                        www.seaflowdiary.blogspot.com 



Friday, February 27, 2015


సురేష్ ప్రభుజీ  గారి రైల్వే బడ్జెట్ 
RAILWAY BUDGET OF SURESH PRABHU JI 

Date :  27-02-2015





సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు "  ఇది ఒక రైల్వే బడ్జెట్ గా లేదు ఏదో ఉన్నవాటిని బాగుచేస్తామన్నట్లు ఉంది . "కిర్రు కిర్రు మని నడుస్తున్న  ఎడ్ల బండి చక్రాల ఇరుసు కు కందెన వేసినట్లు ఉన్నది బడ్జెట్" .  ధరలు పెంచలేదంటు గొప్పగా చెప్పుకోవడం ఎందుకు ?  అధికారం లోకి వచ్చి రాగానే  14,2% ధరలు పెంచిన సంగతి అప్పుడే మరచి పోయారా ! ఇంత మొత్తం ఏ ప్రభుత్వ మైన పెంచినదా ? భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగినదా ?  సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమిలేదు . విద్యార్థులకు కూడా ఏమిచేయలేదు . రైలు చార్జీలు  బస్సు చార్జీల కంటే చాల తక్కువగా ఉండాలికదా !  చాలా మంది సామాన్యులు ప్రయాణించేది రైళ్ల లో .  రైళ్ల లో సామాన్యులకు  సీట్ లే దొరకవు , జనరల్ భోగిలో ఒంటి కాలు పై సామాన్యులు వందల మైళ్ళు ప్రయాణిస్తున్నారు , జనరల్ భోగీలు పెంచేది లేదు , ఎవ్వరైనా ఇన్ని రోజు లైన ఎందుకు గమనించటం లేదు ?. కనీసం ఈ ప్రభుత్వమైనా జనరల్ భోగీలు పెంచుతుంది అనుకుంటే అదీ లేదు .  అన్ని రైళ్ళు ఫుల్ గానే ప్రయాణికులతో పోతాయి . ఎన్నో రోజుల ముందు బుక్ చేసికుంటే గాని టికెట్ దొరకదు . గూడ్స్ బండ్లు మోయలేని బరువులు మోస్తూనే ఉన్నాయి .  క్రొత్త రైల్వే లైన్ ఒక్కటి వేయలేదు , మన దగ్గర బీబీనగర్ - నడికూడి తప్ప .  అన్ని రైల్వే లైనులు పాతవె . బ్రిటిష్ వారు , నిజాం వేసినవే !   ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించ లేదు . బయో టాయిలెట్ లు ఏర్పాటు చేస్తామని ప్రభు గారు చెప్పారు చాలా బాగుంది . ఇది ముందు చూపుతో చేసిన రైల్వే budget అట . ప్రయాణీకులకు ఈ సౌకర్యాలు కల్పించడం రైల్వే ల mandatory కాని ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏదో ప్రవేశ పెట్టి చేతులు దులుపు కున్నాయి . ఎప్పుడో మంజూర్ ఐన పనులు ఇంతవరకు పూర్తీ కాలేదు ఇంకా కొన్ని మొదలు కూడా పెట్టలేదు .శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్ లోక్ సభ నుండి ఎన్నిక అయినప్పుడు క్రొత్త రైల్వే లైను   పటాన్ చేరు -- సంగారెడ్డి --జోగిపేట్ --మెదక్ --సిద్దిపేట  మీదుగా వేయుటకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు . సర్వే కూడా చేశారు . అసలు రైల్వే లైన్ లేని మెదక్ జిల్లా ప్రజలు చాల సంతోషించారు .  కనీసం ఈ విషయం రైల్వే శాఖకు తెలుసా అని , ఇన్ని సంవత్సరాలు గడచినా ఒక్క బడ్జెట్ లో ఈ సంగతి ఎక్కడా ఎప్పుడు కూడా ప్రస్తావన లేదు . అదే కాంగ్రెస్ మల్లికార్జున్ రైల్వే మంత్రిగా చేసినా వారి ప్రధాన మంత్రి  గారి వాగ్దానం జ్ఞాపకం కూడా చేయలేదు . దత్తన్న కూడా ఎం చేయలేదు .. ఇక రైల్వే కేబినేట్ మంత్రులకు ఈ విషయం అసలు తెలియదు ,ఇక్కడి నాయకులకు రైల్ ఎలా ఉంటుందో ,ఎప్పుడు చూడ లేదేమో మరి అందుకే ఈ లైను ప్రస్తావన గురించి కేంద్రం ముందుకు తేలేదు .  

  ఎప్పుడు చూచినా రైల్వే లు లాస్ లో ఉందంటారు , ఇంతకూ ముందు ప్రభుత్వాలు ఇలాగే చెప్పుతూ వస్తున్నాయి .  ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పుతున్నది . ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టె రైల్వే budget చాల బాగుంటుంది అనుకొన్నారు కాని వారి ఆశలన్నీ అడియాశ లయ్యాయి . వీరు పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ద్వారా రైల్వే లను అభివృద్ధి చేస్తారట . ఈ ప్రభుత్వానికి కలలో కూడా  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) అని కల వస్తుందేమో ! 

Date:  31-03-2015



సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని ఇంత వరకు అనుకున్నాము కాని రేపటి నుండి అనగా 01-04-2015 నుండి  5 రూపాయల ప్లాట్ ఫాం టికెట్ ను రూ . 10 కి పెంచడమేమిటి ? ఇక వీడ్కోలు చెప్పడానికి రైల్వే భోగి వరకు వెళ్ళవలసిన పనిలేదు . ఇంటి వద్దనే వీడ్కోలు చెప్పి పంపించాలి . రైల్వే స్టేషన్ కు వెళ్ళే చార్జీలు మిగలాలని ఏమో !   ఇప్పటికే  ప్లాట్ ఫాం టికెట్ ధర రూ . 5 ఎక్కువ ఉన్నదంటే  రూ . 10 కి పెంచి నడ్డి విరిచారు . ఇంకా కొన్ని రోజు లైతే  ట్రైన్ ను దూరం నుండి చూస్తే కూడా డబ్బు వసూలు చేస్తారేమో 

!   సరకు రవాణా చార్జీలను కూడా పెంచు చున్నారు . యూరియా , గింజ ధాన్యాల రవాణా చార్జీలు 10% బొగ్గు  రవాణా చార్జీలు 6.3% , సిమెంట్ 2.7% ,  ఇనుప తుక్కు 3. 1% కోల్ తార్ రవాణా 3. 5% పెంచుతున్నారు .   
బడ్జెట్ లో చెప్పేది ఒకటి ఇప్పుడు చేసేది మరొకటి . ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు , ఎంత పెంచినా భారిస్తారును కుంటున్నారు కాని దీనివల్ల అన్ని ధరలు పెరుగుతాయి . సామాన్యుడు తన జీవితం లో ఇల్లు కట్టు కో లేడు   ఎందుకంటే సిమెంట్ మరియు ఇనుము ధరలు పెరుగుతాయి . 
గింజ ధాన్యాల రేటు పెరుగుతుంది కావున సామాన్యుడు సగమే తినాలి ! ముందే సామాన్యుడు సరిపోని ఆదాయం తో సత మత మవుతున్నాడు . 
ప్రభుత్వానికి ఎప్పుడు చూసిన ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా ! సైంటిఫిక్ గా ఎంతో ఎదుగుతున్నా రాను రాను ధరలు తగ్గాలి కాని పెరుగుతూనే ఉన్నాయి . 

మనకు ఇంత అర్జెంటు  గా  అభివృద్ధి  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ల ద్వారా అవసరం లేదు. రైల్వే లు పబ్లిక్ ద్వారా అభివృద్ధి చేయండి అంతేగాని ప్రైవేటుని ఇందులోనికి లాగవద్దు, ప్రైవేటు వారు లేకుంటే ప్రభుత్వానికి చేతకాదా ?  నిపుణులు లేరా ? కావాలంటే ఇతర దేశాల రైల్వే లను చూస్తె తెలుస్తుంది. రైల్వే అంటేనే సామాన్య ప్రజలది.  

 ఈ అవకాశం గురించి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు  ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.  

జనతా ప్రభుత్వం లో మధుదండావాతే గారు రైల్వే మంత్రిగా సర్ప్లేస్ surplus budget ప్రవేశ పెట్టినారు ఆ  ఘనత నిజంగా ఆయనదే . ఆయను చూచి కూడా తరువాత వచ్చిన రైల్వే మంత్రులు ఆ పని చేయలేక పోయారు . 
లాలూ గారు గరీబ్ రథ్ ప్రవేశ పెట్టి కనీసం పేదవారు  ఏసీ లో ప్రయాణించే టట్లు చేశారు . దీది దూరంతో పెట్టి టైం సేవ్ చేశారు . కాని ప్రభు గారు క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని చెప్పి దొడ్డి దారిన పెంచడమేమిటి ?

                                                                                                                         yours,
                                                                                                    -www.seaflowdiary.blogspot.com