Monday, March 9, 2015


Praja Pratinidhi

ప్రజా ప్రతినిధి 
 Date : 09-03-2015

           శాసన సభ్యులు ప్రజలచేత ఎన్నుకోనబడినవారు . ప్రజా ప్రతినిధులు . ప్రజలు తమ ప్రతినిధిగా ఓట్లు వేసి గెలిపించి శాసన సభకు పంపిస్తారు . అక్కడ వారు తమ ప్రజలకు ఏమి అవసరమో , ప్రజల సమస్యలు ఏమిటో  అసెంబ్లీ లో చర్చించి సాధించాలి . అప్పుడే అతను నిజమైన ప్రజా ప్రతినిధి .  ఎన్నికలప్పుడు ఇంటింటికి తిరిగి  కనబడిన వారినందరినీ ఆప్యాయంగా పలుకరించి ఓటు వేసి గెలిపించమని బ్రతిమిలాడుతాడు. ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతుకుతారు , ఇస్త్రి చేసి పెడతారు , చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడుతారు . అమాయక ప్రజలు తమ సమస్యలు తీరుస్తాడని ఓట్లు వేసి గెలిపించి శాసన సభకు , పార్లమెంట్ కు పంపిస్తారు . 
          ఆయన ఓట్లు వేసి గెలిపించిన వారికి కనిపించడు .  ప్రజలకు లేక ఆ ఊరి  వారికి ఏదైనా పని బడినప్పుడు వారి MLA  గాని MP దగ్గరకు వెళ్ళి కలవాలంటే ఎన్ని కష్టాలు పడతారో ! అప్పుడు ఆయన వీళ్ళను గుర్తు పట్టడు మీరెవరని ఎదురు ప్రశ్నలు వేస్తాడు . ఆయనకు అతి ముఖ్య మైన వాడు అవుతే పనులు జరుగుతాయి . వారు ప్రజలకు సేవ చేయాలి , వారు ప్రజా సేవకులు కదా మరి ! వారు ప్రజా ప్రతినిధులు , ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి వారికి వారే జీతం , అలవెన్సులు , ఇతర అన్ని రాయితీలు  అసెంబ్లీ లో చట్టం చేసికొని వేల రూపాయలు పొందు చున్నారు . ఇదే కాకుండా ఒక్కసారి  MLA  గాని MP గా  ఉంటే  జీవితాంతం పెన్షన్  కూడా వస్తుంది . అంటే వారు ఇంద్రభోగం అనుభవిస్తారు . అందుకే ప్రతి ఒక్కరు ఈ పదవులకు విపరీతమైన పోటి పడుతున్నారు . 

ఒక్కసారి  MLA  గాని MP అయితే తర తరాల వరకు ఆస్తులు కూడా సంపా దిస్తారు .  కాని మనం  మాజీ 
 MLA  గాని MP లను కొందరిని చూస్తే వారిప్పుడు కూలి పని చేస్తూ బ్రతుకు వెళ్ళ బోస్తున్నారు . వారి సమయం లో పెన్షన్ పథకం లేదేమో ! 

        ఇంకా కొందరు మహానుభావులను చుస్తే గుండె తరక్కు మంటుంది . లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి ప్రధాన మంత్రిగా చేశారు , ఇప్పటి లెక్క ప్రకారం ఆయనకు ఆస్తి ఎంత ఉండాలి ఒక్కసారి అనుకుంటే మనం ఉహించ వచ్చు కాని ఆయనకు ఉండడానికి ఇల్లే లేకుండెను . ఆయన కట్టుకున్న బట్టలు అతి సామాన్యం . అనుకుంటే ఆయన కు కూడా 10-20 లక్షల సూట్ కూడా ఇచ్చేవారు . ఆయన రైల్వే మంత్రిగా పని చేసినప్పుడు మన దగ్గరే ఆలేరు వద్ద వసంత వాగులో మద్రాస్  Madras express పడి పోయి నప్పుడు ఆయన నైతిక భాధ్యత వహించి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనం ఉపయోగించ కుండ సొంతముగా ఇంటికి వెళ్ళి పోయారంటే ఆయన దేశ భక్తీ ఎలాంటిదో ఒక్కసారి మనం ఊహించు కుందాము . 

    మురార్జీ దేశాయ్ గారు కూడా మన దేశానికి ప్రధాన మంత్రి గా చేశారు , ఆర్థిక మంత్రిగా ఎన్నో సంవత్సరాలు చేశారు.  ఆయన గారికి కూడా ఉండడానికి ఇల్లు లేకుండెను , కాకి కి కబురు పంపిన ఒక పది ఎకరాల భూమిలో విలస వంతమైన ఇల్లు కట్టి ఇచ్చేది . ఇలాంటి వారు ఇంకా ఎంతో మంది ఉండవచ్చు , వారి జన్మ జన్మ ధన్య మైనది
     ఏ చదువు లేకున్నా MLA  గాని MP గా  ఎన్నికలలో పోటి చేసి గెలవ వచ్చు , అప్పుడు కూడా ఉండే వారు . నేడు క్రిమినల్స్ కూడా ఎన్నికలలో పోటి చేసి గెలుస్తున్నారు . ఒక ఉద్యోగి కి మాత్రం పది investigations చేసి మాత్రం 
employment ఇస్తారు, చిన్న తప్పు చేస్తే punishment ఇచ్చి ఇంటికి పంపుతారు. 
    
      ఇప్పటి శాసన సభ లలో  చుస్తే  వారు నిజంగా ప్రజా ప్రతినిదులేనా అనిపిస్తుంది . మొన్ననే ఒక విదేశములో MP లు Boxing కూడా చేసికున్నారు . ఇక మన దేశం లో అయితే మితిమీరిన ప్రజా స్వామ్యం . ఒకరు పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే చేస్తారు , ఇంకొకరు సెక్రటరీ దగ్గర కాగితాలు తీసికొని చింపు తారు , మైకులు విరగ గొడతారు , కాగితాలు చింపి గవర్నర్ , స్పీకర్ పై వేస్తారు . అయినా వాళ్ళు మళ్లీ ఎన్నికల్లో పోటి చేయవచ్చు గెలవ వచ్చు , చూశారా " మితిమీరిన ప్రజా స్వామ్యం" ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి , లేడిస్ పై కూడా దౌర్జన్యం జరిగిన సంఘటనలు ఉన్నాయి . 

       నిన్న మొన్నటి సంఘటనలు చూస్తే కొందరు ప్రజా ప్రతినిధులు ఎం చేశారో అందరు గమనించి ఉంటారు . వీరు నిజంగా ప్రజా ప్రతినిదులేనా అనిపించక మానదు . 

     శాసన సభ లో బల్లలు ఎక్కి జోరు జోరు గా అరవడం సిగ్గు చేటు . జాతీయ గీతాన్ని అవమాన పరచడం , గవర్నర్ గారిని కించ పరచడం ప్రజా ప్రతినిధుల పని కాదు . వారికంటే స్కూల్ లో చిన్న పిల్లలు చాల నయం ,వారికి ఉన్న తెలివి వీరికి లేదు . బల్లలు ఎక్కి జోరు జోరు గా అరిస్తే  వారి నాయకుడు సంతోషిస్తారను కోవడం,  వారి నాయకుడు వారిని వారించక పోవడం సిగ్గు చేటు . పెద్ద ప్రజా స్వామ్యం అని చెప్పుకోవడం సిగ్గుచేటు . ఇలాంటి పిచ్చి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి . ఓట్లు వేసి గెలిపించినట్లు ప్రజలకు ఇష్టం లేనప్పుడు ,ప్రజలను పట్టించుకోనప్పుడు , అసెంబ్లీ లో బుద్ధి తక్కువగా ప్రవర్తించి నప్పుడు వారి నాయకుడిని MLA , MP లను పదవి నుండి దింపే అధికారం ఓట్లు వేసిన వారికి ఇస్తే ఇలాంటి కోతి చేష్టలు ఎవ్వరు చేయరు . వారికి ప్రజలంటే భయం ఉంటుంది . MLA,  MP లను పదవి నుండి దింపే అధికారం ఓట్లు వేసిన వారికి ఇచ్చే చట్టం తేవాలి అప్పుడే దేశం బాగు పడుతుంది . 

జాతీయగీతాన్ని అవమాన పరిచారని 

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా జాతీయగీతాన్ని అవమానపర్చిన వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 7న అసెంబ్లీలో జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు బెంచీలు ఎక్కి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే.  

సారీ చెప్పమన్నందుకు జానాపై స్వంత సభ్యుల గుర్రు

Updated : 3/9/2015 4:08:43 PM
Views : 910

 Unsatisfaction on jana

హైదరాబాద్ : ఇవాళ సభలో జానారెడ్డి తీరుపై స్వంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జాతీయ గీతం ఆలాపన సందర్భంగా గడిబిడి చేసిన సంపత్ కుమార్‌ను క్షమాపన చెప్పాల్సిందిగా జానారెడ్డి ఆదేశించడం ఆయనకు నచ్చలేదట. ఆయనకే కాదు ఆ పార్టీ మిగతా నేతలకు కూడా నచ్చలేదట. సభలో హూందాగా నడుచుకోవాలన్న జానా ఆలోచనను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బయటికి క్షమాపణలు చెప్పినా లోపల జానాపై సంపత్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.


జాతీయగీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలి: అక్బరుద్దీన్

Updated : 3/9/2015 12:00:21 PM
Views : 1180

హైదరాబాద్: జాతీయ గీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. శాసన సభ్యులు తన విద్యాసంస్థల్లో జాతీయ గీతం ఆలాపించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించడంపై అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గీతాన్ని తమ సంస్థల్లో పాటించని సభ్యులు ఉంటే సిగ్గుపడాలన్నారు. జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. ఏ విద్యాసంస్థలు జాతీయగీతాన్ని పాడించడం లేదో వారి పేర్లు సంపత్ కుమార్ తెలపాలని, జాతీయ గీతం పాడించని వారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.




జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు క్షమాపణ చెప్పాలి


Updated : 3/9/2015 11:14:47 AM
Views : 467

Latest News

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయం మేరకు సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సభ్యులు సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

క్షమాపణ చెప్పిన సంపత్‌కుమార్

Updated : 3/9/2015 11:46:17 AM
Views : 1060

MLA Sampath Kumar say sorry to Assembly

హైదరాబాద్ : శాసనసభలో జాతీయగీతాన్ని అవమానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఎట్టకేలకు సభకు క్షమాపణ చెప్పారు. సభకు క్షమాపణ చెప్పాలని కోరుతూ స్పీకర్ ఆయనకు నాలుగు సార్లు మైక్ ఇచ్చినప్పటికీ క్షమాపణ చెప్పకుండా ఇతర విషయాలు మాట్లాడుతూ సభలో గందరగోళం సృష్టించారు. అప్పటికే ఒక సారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి క్షమాపణ చెప్పాలని సంపత్‌కు సూచించారు. అయినప్పటికీ వినిపించుకోలేదు సంపత్.

అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. సంపత్ సభకు క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటోందని హెచ్చరించారు. సభా సంప్రదాయాలను కాపాడకుండా సంపత్ సభకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే జానారెడ్డే సభకు క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ సంపత్ క్షమాపణ చెప్పకోవడం దారుణమన్నారు. ఇక ఐదో సారి మైక్ తీసుకుని సభకు సంపత్ క్షమాపణ చెప్పారు. అంతకుముందు సభకు క్షమాపణ చెప్పని పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

ప్రజా ప్రతి నిధులు  ప్రజలకొరకు, దేశం కొరకు పాటు పడాలి, ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడాలి.   అప్పుడే వారికి విలువ పెరుగుతుంది , ప్రజల సానుభూతి ఉంటుంది . వారు మిమ్మల్ని గుండెల్లో దాచు కుంటారు .                                                                                                                          yours ,
                                                                                                   www.seaflowdiary.blogspot.com 










No comments:

Post a Comment