Monday, March 9, 2015

 Our  Inter mediate Exams

    మన  ఇంటర్మీడియట్ పరీక్షలు
                                                                Date : 09-03-015


Updated : 3/9/2015 2:14:11 AM
Views : 281
- ఏర్పాట్లు పూర్తిచేసిన ఇంటర్‌బోర్డు
- హాజరుకానున్న 9.73 లక్షల మంది
- విద్యార్థుల పరీక్ష ఫీజులు కట్టని కొన్ని ప్రైవేటు కాలేజీలు
- హాల్‌టికెట్లు రాక ఆందోళనలో విద్యార్థులు
- ఇంటర్‌బోర్డు కార్యాలయం ముందు ఆందోళన
-ఆ విద్యార్థులకు న్యాయం చేస్తాం
- వెబ్‌సైట్లోనూ హాల్‌టికెట్లు పొందవచ్చు: ఇంటర్‌బోర్డు

 తెలంగాణా రాష్ట్రంలో సోమవారం 09-03-2015 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి . . పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల 9,73,237 మంది హాజరవుతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,66,448 మంది, రెండో ఏడాది విద్యార్థులు 5,06,789 మంది ఉన్నట్లు వెల్లడించింది. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికంటే 15 నిమిషాల ముందే పరీక్ష గదికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు జరుగుతాయి.

ప్రైవేటు కాలేజీల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు రాబట్టుకొనేందుకు ప్రైవేటు కాలేజీలు వేధింపులకు పాల్పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజులు చెల్లించలేదన్న నెపంతో హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టలేకపోతున్నారు. మరోవైపు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలుచేసి ఇంటర్ బోర్డుకు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించటంతో పలువురు విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలుచేసి ఇంటర్ బోర్డుకు చెల్లించకుండా ఉన్న ప్రైవేటు కాలేజీల పై కఠిన చర్య తీసుకొనవలసిన అవసరం ఉంది . 

students

ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఇంటర్ బోర్డు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు కాలేజీల యాజమాన్యాలను నిలదీస్తే ఇంటర్ బోర్డు వైఫల్యం వల్లనే హాల్‌టిక్కెట్లు రాలేదని బుకాయిస్తున్నాయి. దీంతో బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 14 వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి బోర్డు గడువు విధించింది. ఆలోగా కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల పరీక్ష ఫీజులను బోర్డుకు చెల్లించలేదు. దీంతో శనివారం, ఆదివారాలు తమకు హాల్‌టిక్కెట్లు అందలేదని ఇంటర్‌బోర్డు కార్యాలయం ముందు పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

కాలేజీల యాజమాన్యాల తప్పులకు తమను బలిచేయొద్దని, పరీక్ష ఫీజు ఇప్పుడు చెల్లిస్తామని విజ్ఞప్తిచేశారు. హాల్‌టిక్కెట్లు జారీచేసి పరీక్షకు అనుమతించాలని కోరారు. కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల హాల్‌టిక్కెట్లు అందని విద్యార్థులకు న్యాయం చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు హమీ ఇచ్చారు. దాదాపు 100-150 మంది విద్యార్థులు ఆదివారం కూడా బోర్డు కార్యాలయంలో హాల్‌టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారిలో అర్హులైనవారికి హాల్‌టిక్కెట్లు అందజేస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. తప్పుచేసిన కాలేజీలకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
  అర్హులైన వారికి కాదు ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ హాల్‌టిక్కెట్లు అందజేసి అందరు పరీక్షా లు వ్రాసేటట్లు చేసే భాద్యత ప్రభుత్వం పై ఉన్నది . ఫీసులు కట్టని వారికి కూడా పరీక్షకు అనుమతించి కావాలంటే ఫీజు కట్టిన తరువాత రిజల్ట్స్ చెప్పండి అంటే కాని పరీక్షలకు హాజరు కానివ్వక పోవడం దారుణం . సంవత్సర మంతా కష్టపడి చదివి ఫీజు కట్టలేదని , ప్రైవేటు కాలేజి లు బోర్డ్ కు చెల్లించ లేదని హాల్ టికెట్లు ఇవ్వక పోవడమేమిటి ? తల్లి దండ్రులు ఎంత కస్టపడి పిల్లలను చదివిస్తారో ఇంటర్‌బోర్డుకు తెలియదా ! కావాలంటే ఫీజు కట్టిన తరువాత రిజల్ట్స్ చెప్పండి ప్రస్తుతం పరీక్షలకు అనుమతి ఇవ్వండి . 

     ప్రియమైన  KCR గారు దయచేసి మీరొకసారి ఇందులో కలుగ జేసికోనగలరు . తెలంగాణా రాష్ట్రం లో మీ హయాములో మొట్టమొదటి సారి జరుగుతున్న ఈ పరీక్షలు . మన తెలంగాణా పిల్లలు పరీక్షలు వ్రాస్తున్నారు , అందరు  ఈ పరీక్షలు వ్రాసేటట్లు చెయ్యండి . మీరు ఎంతో మంది విద్యార్తులకు ఫీజు చెల్లించి చదివిస్తున్నారు . ఎందరినో ఆర్థికంగా ఆదు కొంటున్నారు కావున దయతో మన తెలంగాణా పిల్లలు ఫీజు చెల్లించుట లో జాప్యం జరిగింది ,వీరందరినీ ఆదుకొని ఈ కనీస పరీక్షా ఫీజు ప్రభుత్వం చెల్లించు నట్లు చర్యలు గై కొనండి , తరువాత వారినుండి వసూలు చేయించండి . ప్రస్తుతం వాళ్ళను ఆదు కొనండి . కనీసం రేపటి నుండైన పరీక్షలకు అనుమతించండి . మిస్సయిన పరీక్షలను తరువాత నిర్వహించండి. 

వెబ్‌సైట్లో హాల్ టికెట్లు: ఇంటర్ బోర్డు
ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ హాల్‌టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bietalagangna.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సంతవ్సరం హాల్‌టికెట్ కోసం పదోతరగతి హాల్‌టికెట్ నంబర్, సెకండియర్ హాల్‌టికెట్ కోసం ఇంటర్ ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్‌ను టైప్ చేయాలని కోరారు.

































 

పరీక్షకు పరుగెత్తడం


                                                          పరీక్షకు పరుగెత్తడం 

ఇంటర్  మీడియట్ బోర్డ్  తెలంగాణా ది , ఇక్కడి విద్యార్థులు తెలంగాణా వారే . ఇక్కడ ఎన్ని కాలేజి లు ఉన్నవో ఇంటర్  మీడియట్ బోర్డ్ కు ముందే తెలుసు . ఎంతమంది ఫీజు కట్టారో ఇంకెంతమంది కట్టాలో కూడా తెలుసు.  ఎవరెవరు ఫీజు కట్టాలో ఎందుకు కట్టలేదో బోర్డ్ ఒక సారి అనలైస్ analyse చేయవలసింది . కట్టని వారికి ఒక సారి remind చేయవలసింది . ఎందుకంటే వారు మనపిల్లలు , వారు ఒకసారి miss అయ్యారంటే వారి జీవితం లో ఎంతో కోల్పోతారు   కాని ఆ  చిన్న  పని కూడా  బోర్డ్ చెయ్యలేదు , ఒక న్యూస్ పేపర్ లో ప్రకటన ఇస్తే సరిపోయేది  కాని  వారికి  కావలసింది పరీక్ష ఫీజు మాత్రమే . రేపు పరీక్షలు అనగా చదువు కొనకుండా విద్యార్థులు ఇంటర్  మీడియట్ బోర్డ్ చుట్టూ హాల్ టికెట్ గురించి తిరుగ వలసిన బాధ తప్పేది . ఒక్క నిమిషం కూడా లేటు అవుతే అనుమతించరట , ఇక్కడ హైదరాబాద్ ఎంత పెద్దదో ఎక్కడెక్కడి నుండి రావాలో , బస్సులు సరయిన టైం కు వస్తాయా ? ఇదేమి competitive exam  ఏమి కాదు, EMCET కూడా కాదు  , ఒక్క నిమిషం లో ఏమి పోదు . విద్యార్ధులు రైట్ టైం లో నే వస్తారు , ఒక్కో సారి ఒక్క నిమిషం లేటు అయినా అనుమతించుటలో తప్పు లేదు , ఏ ఒక్క విద్యార్ధి కి కూడా మిస్ కాకుండా హాల్ టికెట్ అందించే బాధ్యత బోర్డ్ పై ఉన్నది . కావున దయచేసి మన ప్రభుత్వం  బోర్డ్ నియమాలను మార్చి  ఇలాంటి బాధలు విధ్యార్థులకు మరియు తల్లి దండ్రులకు లేకుండా చేయాలని అందరం కోరుకుందాం ! 

                                                                                                                        yours,
                                                                                                    www.seaflowdiary.blogspot.com 








No comments:

Post a Comment