Health is wealth-10 .... ఆరోగ్యమే మహాభాగ్యం -10
Date : 04-06-2017
updated : 09-06-2017,13-06-2017
మన శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు . ఇవి శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను వడబోస్తాయి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. తద్వారా విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి మనకు ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఎప్పుడూ కిడ్నీలు క్లీన్‌గా ఉంటేనే అవి చక్కగా పనిచేసి మనకు అనారోగ్యం రాకుండా చేస్తాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ మూత్రపిండాల పట్ల జాగ్రత్త వహించాలి. అయితే కిడ్నీలు ఎప్పటికీ క్లీన్‌గా ఉండాలంటే ఈ సూచనలు పాటించాలి. అవేమిటంటే...
1. నీళ్లు
కిడ్నీలను సులభంగా శుభ్ర పరచగల సాధనాల్లో ఒకటి మంచి నీళ్ళు. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాస్ ల వరకు నీటిని తాగాలి. దీంతో ఆ నీళ్ళు విష పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. అయితే మూత్రం గనక దుర్వాసన వస్తుంటే అప్పుడు ఇంకా ఎక్కువ నీరు తాగాలని అర్థం. అలా తాగితే మూత్రం దుర్వాసన రాదు. ఫలితంగా కిడ్నీలు క్లీన్ అవుతాయి.
2. పండ్లు
తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజూ తీసుకోవాలి. ద్రాక్ష, నారింజ, అరటి పండ్లు, కివీ, అప్రికాట్ తదితరాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి కిడ్నీలను శుభ్రం చేస్తాయి. అదేవిధంగా పాలు, పెరుగు, పలు రకాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
3. బార్లీ
బార్లీ గింజలు కిడ్నీలను బాగా శుభ్రం చేస్తాయి. నిత్యం బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని గుప్పెడు బార్లీ గింజలను వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత వచ్చే నీటిలో నిమ్మకాయ రసం పిండి తాగాలి. ఇలా రోజూ చేస్తే కిడ్నీలు క్లీన్ అవడమే కాదు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీ స్టోన్లు కూడా పోతాయి. దీంతో కిడ్నీలకు రక్షణ లభిస్తుంది.
4. ఆల్కహాల్, చాకొలేట్, కెఫీన్
కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే మద్యం తాగకూడదు. చాకొలెట్ తినకూడదు. కెఫీన్ ఉన్న టీ, కాఫీ లాంటివి తాగకూడదు. పరిమితిలో తాగితే ఓకే. లేదంటే అవి శరీరంలో ఎక్కువై పోయి తద్వారా కిడ్నీల పనితనంపై ప్రభావం చూపుతాయి. కనుక వీటి వైపు చూడకపోవడమే మంచిది.
వెల్లుల్లిని దిండు క్రింద పెట్టుకుని నిద్రిస్తే !
వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన ఎన్నోకీలక పోషకాలు ఉన్నాయి. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీన్ని మనం నిత్యం వంటకాల్లో వాడుతుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే వెల్లుల్లిని తినకుండానే దాని ద్వారా కొన్ని ప్రయోజనాలను మనం పొందవచ్చు. అదెలాగంటే...
ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉపయోగాలు కలుగుతాయి.
1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించడం వల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని పడుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్య ఉండదు.
2. జలుబు, దగ్గు వంటి శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు. వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
3. గుండె సంబంధ వ్యాధులు దూరమవుతాయి. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రక్తం శుభ్రమవుతుంది.
4. లివర్ చక్కగా పనిచేస్తుంది. అన్ని రకాల లివర్ వ్యాధులు పోతాయి.
5. వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బట్టతల సమస్య తొలగిపోతుంది.
6. హార్మన్ సమస్యలు దూరమవుతాయి. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.
15 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గించే ఓమ నీరు !
శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు లేదా అధిక బరువును తగ్గించుకోవడం ఎంత కష్టమైన విషయమో అందరికీ తెలిసిందే. రోజూ వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే తప్ప అధిక బరువు తగ్గదు. కచ్చితమైన ఆహార, వ్యాయామ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాముతో కేవలం 15 రోజుల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు తెలుసా..? అందుకు ఏం చేయాలంటే...
ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వాము గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటితో సహా గింజలను అలాగే ఉంచి మరిగించాలి. అనంతరం గింజలను వడకట్టగా వచ్చే నీటిని తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఆ తరువాత గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా రోజూ చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే ఈ నీటిని రోజుకు 3 పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటే దాంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. పైన చెప్పినట్టుగా తక్కువ రోజుల్లోనే అధికంగా బరువు తగ్గవచ్చు..!
మహిళలకు ఋతు క్రమం సరిగ్గా రావాలంటే !
హార్మోన్ల లోపం, స్థూలకాయం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు... వంటి కారణాల వల్ల చాలా మంది మహిళలు నేడు అనేక రుతు సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో చాలా మందికి నెలసరి సరిగ్గా రావడం లేదు. ఫలితంగా ఇది సంతానం కావాలనుకునే వారికి పెద్ద సమస్యగా మారింది. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే దాంతో స్త్రీలు తమ రుతు సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీంతో నెలసరి సరిగ్గా వస్తుంది. ఈ క్రమంలో సంతానం కలిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటంటే...
1. బొప్పాయి పండు
బొప్పాయి పండును పూర్తిగా పండక ముందే అంటే కొంచెం పచ్చగా, దోరగా ఉన్నప్పుడే తినాలి. అలా తినడం వల్ల మహిళలకు రుతు క్రమం సరిగ్గా అవుతుంది. అయితే ఈ పండును పీరియడ్స్‌లో మాత్రం తినకూడదు.
2. పసుపు
ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపును కలుపుకుని రోజుకు ఒకసారి ఎప్పుడైనా తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే రుతు సమస్యలు పోతాయి. రుతు క్రమం సరిగ్గా అవుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు స్త్రీలకు కలిగే రుతు సమస్యలను నయం చేస్తాయి.
3. అలోవెరా
రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా (కలబంద) గుజ్జును తినాలి. దీంతో రుతు క్రమం సరిగ్గా అవుతుంది. పీరియడ్స్‌లో వచ్చే నొప్పి తగ్గుతుంది. పీరియడ్స్‌లో మాత్రం దీన్ని తీసుకోకూడదు.
4. అల్లం
చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర లేదా తేనె కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు 3 పూటలా భోజనం చేసిన వెంటనే తాగాలి. దీంతో రుతు సమస్యలు పోతాయి. రుతు క్రమం సరిగ్గా అవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా సంతానం కలిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
5. జీలకర్ర
రెండు టీస్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే జీలకర్రను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీంతో రుతు సమస్యలు పోతాయి. ఇలా రెగ్యులర్‌గా తాగితే ఫలితం ఉంటుంది.
6. దాల్చిన చెక్క
ఒక గ్లాస్ వేడి పాలలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే కొద్ది రోజులకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. రుతు సమస్యలు పోతాయి.
7. ప్రాణాయామం
పైన చెప్పిన చిట్కాలతోపాటు కపాలభత్తి అనే ప్రత్యేకమైన ప్రాణాయామ పద్ధతిని పాటిస్తే రుతు సమస్యలు పోతాయి. పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున పాటించాలి. గాలిని వేగంగా లోపలికి పీలుస్తూ వదులుతూ 5 నిమిషాల పాటు చేయాలి. దీన్ని ఒక ఆవృతం అంటారు. అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు. అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజూ చేయాలి. 5 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి. ఈ కపాలభత్తి ప్రాణాయామం చేస్తే రుతు సమస్యలే కాదు, ఇంకా అనేక సమస్యలు పోతాయి. అనారోగ్యాలు నయమవుతాయి.
మొలకెత్తిన గిగింజలను ఎప్పుడు తినాలి
మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీంతోపాటు జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. శరీరానికి శక్తి అందుతుంది. విటమిన్ ఎ, బి6, సి, కె, ఫైబర్, మాంగనీస్, రైబో ఫ్లేవిన్, కాపర్, థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఐరన్, మెగ్నిషియం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. అయితే మొలకెత్తిన గింజలను చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడే తింటారు. కానీ అలా కాదు, వాటిని కూడా నిర్దిష్టమైన సమయంలోనే తినాలి. ఆ సమయం ఏదంటే...
మొలకెత్తిన గింజలను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందుగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే వాటి వల్ల మనకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఉదయం పూట శరీరానికి శక్తి చాలా అవసరం. ఈ క్రమంలో వాటిని తింటే తగినంత శక్తి లభించడమే కాదు, జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా సాయంత్రం, రాత్రి పూట తింటే మొలకెత్తిన గింజల్లో ఉండే పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు. దీంతో మనకు పోషణ సరిగ్గా లభించదు. కనుక వాటిని ఉదయాన్నే తినడం అలవాటు చేసుకుంటే గరిష్టంగా ప్రయోజనాన్ని పొందవచ్చు..!
- seaflowdiary