To remove Kidney stones - కిడ్నీ లో రాళ్ళు పోవాలంటే
Date : 13-03-2017
కిడ్నీ స్టోన్స్... ఇప్పుడీ సమస్య చాలా మందికి ఎదురవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతున్నాయి. అయితే అనేక మంది కిడ్నీ స్టోన్స్ అనగానే హైరానా పడిపోయి ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ... నిజానికి 5 ఎంఎం కన్నా తక్కువ సైజ్‌లో రాళ్లు ఉంటే వాటిని సులభంగా కరిగించుకోవచ్చు. అందుకు పలు టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు, శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలు తొలగి పోతాయి.
2. ఒక టీస్పూన్ తులసి ఆకు రసంలో, 1 టీ స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే సేవించాలి. ఇలా కనీసం 6 నెలల పాటు చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
3. వేపాకులు కాల్చి బూడిద చేసి ఒకరోజు నిల్వ ఉంచి అనంతరం ఆ మిశ్రమాన్ని ఒకటిన్నర గ్రాముల చొప్పున నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే రాళ్లు కరిగిపోతాయి.
4. కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగినా కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
5. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేర్లు తెచ్చి వాటిని నీడిలో ఎండబెట్టి పొడి చేసి దాన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని లీటరు మజ్జిగలో కలిపి తాగాలి.
6. అరకిలో పెసరపప్పును లీటరు మంచి నీళ్లలో కలిపి కాచి తర్వాత పైన తేరిన కట్టును తాగితే రాళ్లు పడిపోతాయి.
7. సీమ గోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాముల మోతాదులో తీసుకుని ప్రతి రోజు ఉదయం మంచి నీటితో కలిపి సేవిస్తే రాళ్లు కరిగిపోతాయి.
- seaflowdiary
No comments:
Post a Comment