ఆరోగ్యమే మహాభాగ్యం -7 Health is wealth -7
Date : 19-03-2017
updated: 22-03-2017,23-03-2017
03-04-2017
Heart Care
Roselle (Gongura flowers)
Make jams and crushes with the Roselle. It is high in vitamin C and perfect to prevent cough and cold. It is also said to prevent mouth ulcers and relieve heart burn. It also facilitates urination. But consult your doctor first.
ఈ ఆహారాలను పచ్చిగానే తినాలి..!
ఎన్నో రకాల కూరగాయలు, ఆహార పదార్థాలను మనం బాగా వండుకుని తింటాం. దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవడమే కాదు, మన శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం పచ్చిగానే తినాలట. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ క్రమంలో అలా పచ్చిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటాలు...
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని పచ్చిగా తింటే యాంటీ ఆక్సిడెంట్లు మనకు బాగా అందుతాయి. అప్పుడవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక టమాటాలను పచ్చిగా తినడం బెటర్.
కీరదోస...
వీటిని పచ్చిగా తింటేనే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్ అందుతాయి. నీరు ఎక్కువగా ఉండడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. శరీర బరువును తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయ, వెల్లుల్లి...
ఇవి రెండు బీపీని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. కనుక వీటిని పచ్చిగా తినాలి.
మొక్కజొన్న, పచ్చి బఠానీలు...
ఇవి పచ్చిగా ఉన్నప్పుడే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం దూరమవుతుంది.
క్యారెట్లు...
క్యారెట్లను కూడా పచ్చిగానే తినాలి. అలా తింటే గుండె సంబంధ సమస్యలు రావు. కంటి సమస్యలు నయమవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కొత్తిమీర...
కొత్తిమీరలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. కనుక కొత్తిమీరను పచ్చిగా తింటే అవి మనకు అందుతాయి. తద్వారా శరీరానికి పౌష్టికాహారం లభిస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
డయాబెటిస్ పనిపట్టే పచ్చి ఉల్లిపాయ..!
డయాబెటిస్... నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అని తేడా లేకుండా చాలా మందిని షుగర్ ఇబ్బంది పెడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో కంట్రోల్ చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. పచ్చి ఉల్లిపాయను నిత్యం 50 గ్రాముల మోతాదులో తింటే దాంతో షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది.
50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక విధంగా తింటుంటే షుగర్ గణనీయంగా తగ్గుతుందని తెలిసింది. ఒకేసారి తినకున్నా రోజులో 3 సార్లు 50 గ్రాముల ఉల్లిపాయను విభజించుకుని తిన్నా ఫలితం ఉంటుందట. క్రమం తప్పకుండా ఒక వారం తింటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పచ్చి ఉల్లిపాయలను అలా తింటే కేవలం షుగర్ మాత్రమే కాదు, ఇంకా ఇతర అనేక అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అవేమిటంటే...
పచ్చి కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో కీలక పోషకాలు ఉంటాయి. దీన్ని చాలా మంది వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కేవలం రుచి మాత్రమే కాదు, పచ్చి కొబ్బరి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దాని వల్ల మనం పొందగలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి కొబ్బరిని నిత్యం ఏదో ఒక విధంగా తింటూ ఉంటే దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైట్ గుణాలు పచ్చి కొబ్బరిలో పుష్కలంగా ఉండడం వల్ల క్రిములు, బాక్టీరియలు, వైరస్‌ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. అవి మన శరీరంలోకి ప్రవేశిస్తే ఏ మాత్రం బతకవు.
2. క్రీడాకారులకు, నిత్యం వ్యాయామం చేసే వారికి, శారీరక శ్రమ చేసే వారికి పచ్చి కొబ్బరి ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరి తినడం వల్ల శక్తి వేగంగా అందుతుంది. దీంతో మరింత సేపు శ్రమించినా పెద్ద అలసట రాదు. ఎక్కువ శక్తి అందుతుంది.
3. జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు పచ్చి కొబ్బరి తింటే మేలు జరుగుతుంది. దీంతో వారి రక్తంలోని షుగర్ స్థాయిలు అదుపులోకి వచ్చి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.
5. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు పచ్చి కొబ్బరిలో ఉన్నాయి. పచ్చి కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణతుల వృద్ధిని అడ్డుకుంటాయి.
6. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు పోతాయి.
7. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పచ్చికొబ్బరిని తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. తద్వారా కలిగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.
8. మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి కూడా పచ్చి కొబ్బరి మేలు చేస్తుంది. మూత్రం సాఫీగా వస్తుంది. బ్లాడర్ ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి.
9. అధిక బరువు సమస్యతో బాధ పడుతున్న వారు పచ్చి కొబ్బరిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు.
10. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతాయి. చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
- seaflowdiary
No comments:
Post a Comment