ఇంటర్ విద్యార్థులకు ఎందుకీ శిక్ష
Date : 03-03-2017
ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు ప్రత్యక్ష శిక్షను అనుభవిస్తున్నారు ,వారికి ఎందుకీ శిక్ష . ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు కాలేజీ వెళ్ళి బాగుగా నేర్చుకొని ఇంట్లో రాత్రి పగలు చదివి పరీక్షలకు తయారై నేడు పరీక్ష హాలుకు వెళితే శిక్షకు గురి అవుతున్నారు ,విద్యార్థులు ఏం పాపం చేశారని ? వాళ్ళు సంవత్సరం అంతా కష్ట పడి చదివి సంతోషం తో పరీక్ష వ్రాయాలని వెళితే ఫలితం ఇదా , వారు పడిన శ్రమ అంతా వృధాయేనా ! కన్నీరు తుడువ గలరా !
ఏదో కంటితుడుపు హామీల వలన వారి గుండె బాధ పోగలదా ? ఉదయం 0845 గంట లకు కు పరీక్షా హాలుకు హాలుకు హాజరు కావడం అందరికి ఈ మన హైదరాబాద్ లో సాధ్యమా ? ఎక్కడో దూరం నుండి వచ్చి ఎక్కడో కాలేజీ లో చదువుకుంటే పరీక్షలు కూడా కాలేజీ కి దగ్గరి సెంటర్లో వేసి లోనే వేశామని చేతులు దులుపుకోవడం కాదు . అసలు విద్యార్థి ఇంటికి ఆ పరీక్ష హాలు ఎంత దూరం లో ఉన్నది అనే విషయం పరిగణన లోనికి తీసుకోవాలిసిన పనిలేదా , వారి రెసిడెన్సీ ని బట్టి పరీక్ష సెంటర్ ను వేయాలి , అదేం కష్టమైనా పనా ! కాలేజీ లు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి అదీ కూడా చేయడం కష్టమైన పని గా సాధ్యం కాదని భావిస్తే ఎలా ? . పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో 3-4 నెలల ముందే నిర్ణయిస్తారు ఆ సమయం లో అన్ని జాగ్రత్తలు తీసికోవడానికి టైం సరిపోదా ? మనసుంటే మార్గం ఉంటుంది .
పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థుల ప్రయాణ సౌకర్యం గురించి వారు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ జోన్ ED శ్రీ .పురుషోత్తం గారు 1000 బస్సులను ఉదయం 7 గంటలనుండి నడిపిస్తున్నారు,పర్యవేక్షక సిబ్బందిని కూడా ప్రధాన స్టాపుల్లో నియమించారు . పోలీస్ వారుకూడా విద్యార్థుల కు ఆలస్యం జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రిస్తున్నారు , వారిద్దరికి విద్యార్థుల పట్ల ఉన్నప్రేమ కు ధన్యవాదములు .
ఇక్కడ మన హైదరాబాద్ లో విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చేసిన తక్కువే , పాపం కొందరు విద్యార్థులు అనివార్య కారణాలతో అధిగమించి పరీక్ష హాలుకు చేరుకోవడం లో 1 నిమిశం ఆలస్యమైనా హాల్లోకి వెళ్లకుండా చేయడం వలన విద్యార్థులు కంట నీరు పెట్టుకొని వెనుతిరిగారు , వారి కంటి నీరు చూసి కూడా మన వాళ్లకు హృదయం కరగలేదంటే ఏమనాలి , మనం ఇంకా వలస విధానం లో ఉన్నామా అనిపిస్తుంది . వారు కూడా ఇలా చేసిన దాఖలాలు ఎక్కడా మనం చూడలేదు .
పరీక్షలు ఉదయం 9 గంటలకు పెట్టి హాలుకు 0845 గంటలకే రావాలని ఆంక్షలు పెట్టడం ఏమిటీ ? తెల్లారేదే ఉదయం 0640 గంటలకు సూర్యుడు కూడా అప్పుడే ఉదయిస్తాడు , అంత ప్రొద్దున పరీక్షలు పెట్టి విద్యార్థులు ఒక్క నిమిషం లేటు అయినా అనుమతించక పోవడం అనే హుకుం జారీ చేసి వారిని అనుమతించక పోవడం ఎందుకు ?
ఇదేమి అయినా ఉద్యోగ నియామక పరీక్షలనా , లేదా IAS ,IPS సెలక్షన్ పరీక్షలా లేదా నామినేషన్ వేసి ఎలక్షన్ లో పోటీ చేయడానికా ? ఎలక్షన్ నామినేషన్ లో కూడా ఎక్కడా ఒక నిమిషం లేటు అని తిరస్కరించింది లేదు . ఇంటర్ విద్యార్థులు పసి పాపలు , మరి విద్యార్ధులకే అసలు పరీక్షా కంటే ఎందుకీ ఇదొక పరీక్షా ? 5-10 నిమిషాలు లేటైనా ఏమైనా కొంపలు అంటుకుంటాయా ?
ఇంతకూ ముందు ప్రతి పరీక్షలో 30 నిమిషాలు అనుమతి ఉండేది, ఇప్పుడు 1 నిమిషం గా ఎలా మారింది ఆ విషయం చట్టాలు చేసేవారికి తెలియదా , వారి పరీక్షలప్పుడు ఒక నిమిషం లేటు కాకుండా 0845 కె వెళ్ళారా! ఒక సారి గుండెపై చెయ్యి వేసుకొని చూస్తే ఈ రోజు విద్యార్థుల భవిషత్తు గందరగోళం లో పడేది కాదు .
విద్యార్థులు దగ్గరి కాలేజీ లలో చదివితే అది వారి నేరమా ? కాలేజీ లు పెట్టి ఎవరికి తెలియకుండా , కనిపించకుండా గుప్పిట్లో దాచుకొన్నది కాదు , సంవత్సరమంతా కాలేజీ నడుస్తున్నది అందులో విద్యార్థులు చదువుతున్నారు అని అందరికి తెలుసు అలాంటప్పుడు కాలేజీకి అనుమతి లేదని పరీక్ష తెల్లారి ఉందనగా కూడా హాల్ టికెట్లు జారీ చేయకపోవడం , అనుమతి లేని కాలేజీ లో విద్యార్థులు చదువుతుంటే వారి భవిష్యత్తు ఏమిటని కాలేజీ లు నియంత్రించే వారికి ముందే తెలియకుంటే ఏమనుకోవాలి , రేపు exam ఉన్నప్పుడే ఈ విషయం తెలియడం ఈ కాలం లో మనం ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ యుగం లో ఉన్నామా లేదా అనిపిస్తుంది .
కొన్ని పరీక్షా హాళ్లలో బయటి వెలుతురు లేదు , నిరంతర విద్యుత్తు ఉన్న ఈ సమయం లో కూడా పరీక్షా హాళ్లలో వెలుతురు లేదంటే విద్యార్థులు పరీక్షా ఎలా వ్రాయగలరు . సీటింగ్ ఆరెంజ్ మెంట్ లో కూడా చిన్న పేపర్ పై చిన్నగా ప్రింట్ చేసి బోర్డు పై అతికించడం వలన సీటు ,హాలు ,ఏ ఫ్లోరో ఉన్నదో కనుక్కోవడం కూడా విద్యార్థులకు కష్టం గా ఉంది , అక్కడ చెప్పేవారు కూడా ఉండరు .
కాలేజీ కి పర్మిషన్ లేకా , ఒక్క నిమిషం రావడం లో లేటై తే అనుమతింపబడని విద్యార్థులకు కంటితుడుపుగా అడ్వాన్స్ కు permission ఇస్తామని చెప్పి కంటి తుడుపు తో చేతులు దులుపుకోవడం భావ్యమా ?
ప్రస్తుతం మనం, మనం సాధించుకున్న మన రాష్ట్రం లో ఉన్నాము . అలాంటప్పుడు మన విద్యార్థుల భవిష్యత్తు పై విద్యార్థులకు వారి తల్లి దండ్రులు పెట్టుకున్న ఎన్నో ఆశలు మిగలకుండా ఉంటే ఎలా !
మరుసటి రోజు గాని ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షల లో గాని విద్యార్థులకు మొదటి రోజు జరిగిన బాధలను ఏమైనా తొలగించనట్లు దాఖలాలు ఏమి లేవు .
.
No comments:
Post a Comment