Saturday, March 25, 2017

 
             60 సంవత్సరాల చరిత్ర  - 60 Years History 
                                               ( నమస్తే తెలంగాణ సహకారం తో ) 
                                                                                                  Date : 25-03-2017 

ఆరు దశాబ్దాల చరిత్ర



Sat,March 25, 2017 01:36 AM
    నమస్తే తెలంగాణ సహకారం తో 

- లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో సర్వే
- పీవీ హయాంలో శంకుస్థాపన
- మోదీ హయాంలో ప్రారంభం
- ఉమ్మడి రాష్ట్రంలో బలైపోయిన రైలు
- స్వరాష్ట్రంలో సాకారం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కొత్తరైలు మార్గం నేడు ప్రారంభమవుతున్నది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పెద్దపల్లి- నిజామాబాద్ రైలు కూత పెట్టబోతున్నది. కేవలం 160 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కోసం ప్రజలు దశాబ్దాలుగా కలలు కన్నారు. ఆరాటపడ్డారు. ఎందరెందరో నాయకులు తమ శక్తిమేర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేక పోయింది. ఆఖరుకు స్వరాష్ట్రంలో ఆ కల నిజమైంది. 
lalbahadur 

1956లోనే ఆమోదం..


పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గం చరిత్ర పరిశీలిస్తే నిజాం కాలంలోనే ఈ 160 కిలోమీటర్ల మార్గానికి ఆలోచన జరిగింది. ఎందువల్లనో అది సాకారం కాలేదు. హైదరాబాద్ భారత్‌లో విలీనమైన తర్వాత 1952లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు ప్రణాళికలు వేయటంతో పాటు రామగుండం-నిజామాబాద్ రైలు మార్గాన్ని కేంద్రానికి ప్రతిపాదించింది. ఆనాడు రైల్వే మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. ఆయన ఈ పథకాన్ని ఆమోదించి సర్వేకు ఆదేశించారు. 1956 మే 30న ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఒకటి రెండేండ్లలో ఈ మార్గాన్ని ప్రణాళికలో చేరుస్తామని ఎంపీ విఠల్‌రావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో..


1956 నవంబరులో హైదరాబాద్ రాష్ట్రం అంతర్థానమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రైలు మార్గం ప్రతిపాదన మూలన పడింది. ఆనాడు ఏపీ ఏర్పడకుండా ఉంటే 1958-59లోనే ఈ మార్గం సర్వే పూర్తై లాల్ బహదూర్ శాస్త్రి హామీ మేరకు పనులు ప్రారంభమయ్యేవి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటై పాలన ఆంధ్ర నాయకుల చేతిలోకి పోయింది. వాళ్లు రైలు మార్గాలన్నీ తమ ప్రాంతానికి తరలించుకున్నారు. ఆ తర్వాత దీన్ని పట్టించుకున్న వారు లేరు. 1977లో కేంద్రంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వం జనతాపార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సోషలిస్టు నాయకులు కొందరి కృషితో నాటి రైల్వే మంత్రి మధు దండావతే ఈ రైలు మార్గం ఫైలును దుమ్ము దులిపి సర్వేకు ఆదేశించారు. కేంద్రంలోని జనతా ప్రభుత్వం ఏడాదిన్నరకే కుప్పగూలింది. ఫైలు మళ్లీ మూతపడింది. 

పీవీ ప్రధాని అయ్యాకే..


తెలంగాణది ఎంత దైన్యస్థితి అంటే ఇక్కడ ఓ చిన్న పని జరగాలన్నా ఎంతో ప్రయాస కావాలి. ఎన్నో ఉద్యమాలు జరగాలి. హింస, కాల్పులు, బలిదానాలు జరుగాలి. 1969 జై తెలంగాణ ఉద్యమంలో వందలమంది బలైతే పోచంపాడు ముందుకు కదిలింది. ఒకటి రెండు వర్సిటీలు, ఎన్టీపీసీ వంటి తాయిలాలు వచ్చాయి. ఇక రామగుండం-నిజామాబాద్ రైల్‌లైన్ మంజూరుకు ఏకంగా ఈ ప్రాంతంనుంచి ప్రధాని రావాల్సి వచ్చింది. దేశ ప్రధానిగా కరీంనగర్ బిడ్డ పీవీ నరసింహారావు పదవి అధిష్టించిన తర్వాత తెలంగాణ ప్రజల చిరకాల కోరికలు రెండింటిని నెరవేర్చారు. అందులో ఒకటి శ్రీరాంసాగర్ వరద కాలువ పథకం. రెండు పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గం. ఇదీ అంత ఆశామాషీగా జరుగలేదు. ఇక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి ఉన్నారు. వరదకాల్వ పథకం ఆయనకు ససేమిరా ఇష్టంలేదు. అయినా ప్రధాని 1991లో ప్రత్యేకంగా రాష్ట్రపర్యటన పెట్టుకొని వచ్చి మరీ రైలులైన్, వరదకాల్వకు శంకుస్థాపన చేశారు. కోట్ల అయిష్టంగానే నిధులు ఇచ్చారు. ఫలితంగా పెద్దపల్లినుంచి కరీంనగర్ వరకు లైను పూర్తి కావడానికే పదేండ్లు పట్టింది. 

మలుపు తిప్పిన మలిదశ ఉద్యమం..


2001లో కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. దీనితోనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాయిలాలతో ఉద్యమాన్ని చల్లార్చే కార్యక్రమం ప్రారంభించారు. ఆగమేఘాల మీద దేవాదుల ప్రాజెక్టుకు,,గుత్ప, అలీసాగర్‌కు రాళ్లు వేశారు. ఆ సందర్భంగా తెలంగాణ ఎంపీలతో జరిగిన సమావేశంలో నాటి నిజామాబాద్ ఎంపీ ఈ రైలు మార్గాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో రామగుండం రైలు మార్గంలో కదలిక వచ్చింది. 2004ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. ఆనాటి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌తో కేసీఆర్‌కు మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల రామగుండం రైలు మార్గానికి లాలూ నిధులు ఇచ్చారు. తర్వాత కాలంలో తెలంగాణలో ఉద్యమ తీవ్రత కొనసాగుతూ రావటంతో కేంద్రం ఎంతోకొంత నిధులు ఇస్తూ వచ్చింది. 

ఎంపీగా కవిత కృషితో..


2014లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రభుత్వం కొత్త రైలు ప్రాజెక్టుల అనుమతులు పూర్తిగా నిలిపివేసి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయటం మీద దృష్టి పెట్టింది. ఈ అవకాశాన్ని కవిత ఉప యోగించుకున్నారు. ఆమె కృషి వల్ల రెండంకెలు దాటని నిధుల కేటాయింపు మూడంకెలకు పెరిగింది. ఫలితంగా ఈ మార్గం శరవేగంగా పూర్తయ్యింది. దీనికితోడు ఆదిలాబాద్ ఆర్మూర్ మార్గానికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. మరోవైపు కరీంనగర్ హైదరాబాద్ లైన్ భూసేకరణ వేగవంతమైంది. స్వరాష్ట్రంలో ఇదో గొప్ప ముందడుగు. తెలంగాణ వచ్చింది కాబట్టికవిత వెంటపడి నిధులు తెచ్చుకున్నారు కాబట్టి ఇవాళ ఈ మార్గం ప్రారంభమైంది తప్ప ఉమ్మడి పాలనే కొనసాగి ఉంటే ఈ ప్రారంభోత్సవానికి మరో దశాబ్ద కాలం పట్టేది. 
-సవాల్‌రెడ్డి


సికింద్రాబాద్ -పటాన్ చెరు - సంగారెడ్డి -జోగిపేట్ - మెదక్ రైల్వే రూట్ ఇందిరా గాంధీ హయాంలో సర్వే చేశారు కానీ అది ఏమైందో ఎవ్వరికి తెలియదు . 


తెలంగాణ ప్రజలకు ముఖ్యముగా నిజామాబాద్ , కరీంనగర్ ప్రజలకు ఈ రోజు చాలా సంతోషమైన రోజు . పట్టు పట్టి సాధించించిన మన కవిత అక్క గారికి ధన్యవాదములు .  

ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగిందో ! ఎందుకింత వివక్ష ? తమ స్వార్థం ఎంతుందో తెలుస్తుంది . ఒకతను అసెంబ్లీ లో తెలంగాణ ఉచ్ఛరించవద్దు అని ఆంక్షలు పెడతాడు . ఇంకొకతను పాస్ పోర్ట్ కావాలా అంటాడు ఇంకొక ఆయన తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తావో చేసుకొమ్మని మన అన్న హరీష్ రావు ని అసెంబ్లీ లో బెదిరిస్తాడు . 
ఎంతో మంది త్యాగాలు  1200 మంది,  ముఖ్యముగా చాలామంది విద్యార్థులు బలిదానం తో తెలంగాణ ప్రజలందరి సహకారం తో ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో  తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా ఇంకా ఆ వాసనలు పోలేదు . న్యాయంగా వచ్చే నీటికి కటకటా ఉద్యోగుల విభజన ఇంకా జరుగలేదు .      ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉదార స్వభావాన్ని మంచితనాన్ని చూసి ఇంకా పాత పద్ధతులు ఉపయోగిస్తే ఎలా ? అన్ని చోట్ల ఉదార స్వభావం వద్దని మనం  ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ని కోరుదాం . 

                                                                                                                        - seaflowdiary 







Sunday, March 19, 2017


                             ఆరోగ్యమే మహాభాగ్యం -7  Health is wealth -7
                                                                          Date : 19-03-2017
                                                                  updated: 22-03-2017,23-03-2017
                                                                                                        03-04-2017

Heart Care 


Roselle (Gongura flowers)
Make jams and crushes with the Roselle. It is high in vitamin C and perfect to prevent cough and cold. It is also said to prevent mouth ulcers and relieve heart burn. It also facilitates urination. But consult your doctor first.



ఈ ఆహారాలను పచ్చిగానే తినాలి..!



ఎన్నో రకాల కూరగాయలు, ఆహార పదార్థాలను మనం బాగా వండుకుని తింటాం. దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవడమే కాదు, మన శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం పచ్చిగానే తినాలట. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ క్రమంలో అలా పచ్చిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

టమాటాలు...
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని పచ్చిగా తింటే యాంటీ ఆక్సిడెంట్లు మనకు బాగా అందుతాయి. అప్పుడవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక టమాటాలను పచ్చిగా తినడం బెటర్.

కీరదోస... 
వీటిని పచ్చిగా తింటేనే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్ అందుతాయి. నీరు ఎక్కువగా ఉండడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. శరీర బరువును తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. 

ఉల్లిపాయ, వెల్లుల్లి... 
ఇవి రెండు బీపీని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. కనుక వీటిని పచ్చిగా తినాలి. 
raw-vegetables 
మొక్కజొన్న, పచ్చి బఠానీలు... 
ఇవి పచ్చిగా ఉన్నప్పుడే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం దూరమవుతుంది. 

క్యారెట్లు... 
క్యారెట్లను కూడా పచ్చిగానే తినాలి. అలా తింటే గుండె సంబంధ సమస్యలు రావు. కంటి సమస్యలు నయమవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

కొత్తిమీర... 
కొత్తిమీరలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. కనుక కొత్తిమీరను పచ్చిగా తింటే అవి మనకు అందుతాయి. తద్వారా శరీరానికి పౌష్టికాహారం లభిస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. 




డయాబెటిస్ పనిపట్టే పచ్చి ఉల్లిపాయ..!




డయాబెటిస్... నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అని తేడా లేకుండా చాలా మందిని షుగర్ ఇబ్బంది పెడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో కంట్రోల్ చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. పచ్చి ఉల్లిపాయను నిత్యం 50 గ్రాముల మోతాదులో తింటే దాంతో షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. 


50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక విధంగా తింటుంటే షుగర్ గణనీయంగా తగ్గుతుందని తెలిసింది. ఒకేసారి తినకున్నా రోజులో 3 సార్లు 50 గ్రాముల ఉల్లిపాయను విభజించుకుని తిన్నా ఫలితం ఉంటుందట. క్రమం తప్పకుండా ఒక వారం తింటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పచ్చి ఉల్లిపాయలను అలా తింటే కేవలం షుగర్ మాత్రమే కాదు, ఇంకా ఇతర అనేక అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అవేమిటంటే... 








  • జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి తగ్గుతాయి. 
  • మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రంలో మంట తగ్గుతుంది. 
  • పచ్చి ఉల్లిపాయను బాగా దంచి అందులో కొద్దిగా నల్ల ఉప్పు కలుపుకుని రోజుకు 2, 3 సార్లు తినాలి. దీంతో విరేచనాలు, వాంతులు తగ్గుతాయి. 
  • పచ్చి ఉల్లిపాయలను తింటే మహిళలకు రుతు సంబంధ సమస్యలు పోతాయి. పురుషుల్లో వీర్య వృద్ధి జరుగుతుంది. 

  • అనారోగ్యాలకు పచ్చి కొబ్బరి తో చెక్ 



    ప‌చ్చి కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఉంటాయి. దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. కేవ‌లం రుచి మాత్ర‌మే కాదు, ప‌చ్చి కొబ్బ‌రి వ‌ల్ల మ‌నకు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దాని వ‌ల్ల మ‌నం పొంద‌గ‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


    1. ప‌చ్చి కొబ్బ‌రిని నిత్యం ఏదో ఒక విధంగా తింటూ ఉంటే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ పారాసైట్ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల క్రిములు, బాక్టీరియ‌లు, వైర‌స్‌ల నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అవి మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తే ఏ మాత్రం బ‌త‌క‌వు.



    2. క్రీడాకారుల‌కు, నిత్యం వ్యాయామం చేసే వారికి, శారీర‌క శ్ర‌మ చేసే వారికి ప‌చ్చి కొబ్బ‌రి ఎంత‌గానో మేలు చేస్తుంది. ప‌చ్చి కొబ్బ‌రి తిన‌డం వ‌ల్ల శ‌క్తి వేగంగా అందుతుంది. దీంతో మ‌రింత సేపు శ్ర‌మించినా పెద్ద అల‌స‌ట రాదు. ఎక్కువ శ‌క్తి అందుతుంది.



    3. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.



    4. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌చ్చి కొబ్బ‌రి తింటే మేలు జ‌రుగుతుంది. దీంతో వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌చ్చి డ‌యాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.



    5. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో ఉన్నాయి. ప‌చ్చి కొబ్బ‌రిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని అడ్డుకుంటాయి.



    6. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు పోతాయి.
    raw-coconut


    7. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌చ్చికొబ్బ‌రిని తిన‌డం అల‌వాటు చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది. త‌ద్వారా క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.



    8. మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న వారికి కూడా ప‌చ్చి కొబ్బ‌రి మేలు చేస్తుంది. మూత్రం సాఫీగా వస్తుంది. బ్లాడ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవుతాయి. కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.



    9. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ప‌చ్చి కొబ్బ‌రిని త‌మ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే కొవ్వు క‌రుగుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గుతారు.



    10. చ‌ర్మం, వెంట్రుక‌లు ఆరోగ్యంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. వెంట్రుక‌లు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.

                                                                                                   - seaflowdiary 

    Monday, March 13, 2017



             To remove   Kidney stones -  కిడ్నీ లో రాళ్ళు పోవాలంటే 
                                                                               Date : 13-03-2017

            





    కిడ్నీ స్టోన్స్... ఇప్పుడీ స‌మ‌స్య చాలా మందికి ఎదుర‌వుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డుతున్నాయి. అయితే అనేక మంది కిడ్నీ స్టోన్స్ అన‌గానే హైరానా ప‌డిపోయి ఆప‌రేష‌న్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ... నిజానికి 5 ఎంఎం క‌న్నా త‌క్కువ సైజ్‌లో రాళ్లు ఉంటే వాటిని సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. అందుకు ప‌లు టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. ఒక టేబుల్ స్పూన్‌ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు, శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలు తొల‌గి పోతాయి.

    2. ఒక టీస్పూన్ తులసి ఆకు రసంలో, 1 టీ స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే సేవించాలి. ఇలా కనీసం 6 నెల‌ల పాటు చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

    3. వేపాకులు కాల్చి బూడిద చేసి ఒకరోజు నిల్వ ఉంచి అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఒకటిన్నర గ్రాముల చొప్పున‌ నీటిలో కలిపి ఉద‌యం, సాయంత్రం రెండు పూటలా తాగితే రాళ్లు క‌రిగిపోతాయి. 

    4. కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగినా కిడ్నీలో రాళ్లు క‌రుగుతాయి. 

    5. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేర్లు తెచ్చి వాటిని నీడిలో ఎండ‌బెట్టి పొడి చేసి దాన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని లీటరు మజ్జిగలో కలిపి తాగాలి. 

    6. అరకిలో పెసరపప్పును లీటరు మంచి నీళ్లలో కలిపి కాచి తర్వాత పైన తేరిన కట్టును తాగితే రాళ్లు పడిపోతాయి.

    7. సీమ గోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాముల మోతాదులో తీసుకుని ప్రతి రోజు ఉదయం మంచి నీటితో కలిపి సేవిస్తే రాళ్లు కరిగిపోతాయి.


                                                                                             - seaflowdiary 

    Friday, March 3, 2017



                                ఇంటర్ విద్యార్థులకు ఎందుకీ శిక్ష
                                                                                    Date : 03-03-2017


    ప్రస్తుతం ఇంటర్  విద్యార్థులు ప్రత్యక్ష శిక్షను అనుభవిస్తున్నారు ,వారికి  ఎందుకీ శిక్ష . ఈ సంవత్సరం  జూన్ నుండి ఇప్పటివరకు కాలేజీ వెళ్ళి బాగుగా నేర్చుకొని ఇంట్లో రాత్రి పగలు   చదివి   పరీక్షలకు తయారై నేడు పరీక్ష హాలుకు వెళితే శిక్షకు గురి అవుతున్నారు ,విద్యార్థులు  ఏం పాపం చేశారని ? వాళ్ళు సంవత్సరం అంతా  కష్ట పడి చదివి సంతోషం తో పరీక్ష వ్రాయాలని వెళితే ఫలితం ఇదా , వారు పడిన శ్రమ అంతా  వృధాయేనా ! కన్నీరు తుడువ గలరా ! 
    ఏదో కంటితుడుపు హామీల వలన వారి గుండె బాధ పోగలదా ? 



    ఉదయం 0845 గంట లకు కు పరీక్షా హాలుకు హాలుకు హాజరు కావడం  అందరికి  ఈ మన హైదరాబాద్ లో సాధ్యమా ? ఎక్కడో దూరం నుండి వచ్చి ఎక్కడో కాలేజీ లో చదువుకుంటే  పరీక్షలు కూడా కాలేజీ కి దగ్గరి సెంటర్లో వేసి లోనే వేశామని చేతులు దులుపుకోవడం కాదు . అసలు విద్యార్థి ఇంటికి ఆ పరీక్ష హాలు ఎంత దూరం లో ఉన్నది అనే విషయం పరిగణన లోనికి తీసుకోవాలిసిన పనిలేదా  , వారి రెసిడెన్సీ ని  బట్టి పరీక్ష సెంటర్ ను వేయాలి , అదేం కష్టమైనా పనా ! కాలేజీ లు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి అదీ కూడా చేయడం కష్టమైన పని గా సాధ్యం కాదని భావిస్తే ఎలా ?  . పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో 3-4 నెలల ముందే నిర్ణయిస్తారు ఆ సమయం  లో అన్ని జాగ్రత్తలు తీసికోవడానికి టైం సరిపోదా ? మనసుంటే మార్గం ఉంటుంది . 

    పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థుల ప్రయాణ సౌకర్యం గురించి వారు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ జోన్ ED శ్రీ .పురుషోత్తం గారు 1000 బస్సులను ఉదయం 7 గంటలనుండి నడిపిస్తున్నారు,పర్యవేక్షక సిబ్బందిని కూడా ప్రధాన స్టాపుల్లో నియమించారు .  పోలీస్ వారుకూడా విద్యార్థుల కు  ఆలస్యం జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రిస్తున్నారు ,  వారిద్దరికి  విద్యార్థుల పట్ల ఉన్నప్రేమ కు ధన్యవాదములు .  


    ఇక్కడ మన హైదరాబాద్ లో  విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చేసిన  తక్కువే , పాపం  కొందరు విద్యార్థులు అనివార్య కారణాలతో అధిగమించి పరీక్ష హాలుకు చేరుకోవడం లో 1 నిమిశం  ఆలస్యమైనా హాల్లోకి వెళ్లకుండా చేయడం వలన  విద్యార్థులు కంట నీరు పెట్టుకొని వెనుతిరిగారు , వారి కంటి నీరు చూసి కూడా మన వాళ్లకు హృదయం కరగలేదంటే ఏమనాలి , మనం ఇంకా వలస విధానం లో ఉన్నామా అనిపిస్తుంది . వారు కూడా ఇలా చేసిన దాఖలాలు ఎక్కడా మనం చూడలేదు . 

    పరీక్షలు ఉదయం 9 గంటలకు పెట్టి హాలుకు 0845 గంటలకే రావాలని ఆంక్షలు పెట్టడం  ఏమిటీ ? తెల్లారేదే  ఉదయం 0640 గంటలకు సూర్యుడు కూడా అప్పుడే ఉదయిస్తాడు ,  అంత ప్రొద్దున పరీక్షలు పెట్టి విద్యార్థులు ఒక్క నిమిషం లేటు అయినా అనుమతించక పోవడం అనే హుకుం జారీ చేసి వారిని అనుమతించక పోవడం ఎందుకు ? 
    ఇదేమి అయినా ఉద్యోగ  నియామక పరీక్షలనా , లేదా IAS ,IPS సెలక్షన్ పరీక్షలా లేదా నామినేషన్ వేసి ఎలక్షన్ లో పోటీ చేయడానికా ? ఎలక్షన్ నామినేషన్ లో కూడా ఎక్కడా ఒక నిమిషం లేటు అని తిరస్కరించింది లేదు . ఇంటర్ విద్యార్థులు పసి పాపలు , మరి విద్యార్ధులకే అసలు పరీక్షా కంటే ఎందుకీ ఇదొక పరీక్షా ? 5-10 నిమిషాలు లేటైనా ఏమైనా కొంపలు అంటుకుంటాయా ? 

    ఇంతకూ ముందు ప్రతి పరీక్షలో  30 నిమిషాలు అనుమతి ఉండేది, ఇప్పుడు 1 నిమిషం గా ఎలా మారింది  ఆ విషయం చట్టాలు చేసేవారికి తెలియదా , వారి పరీక్షలప్పుడు ఒక నిమిషం లేటు కాకుండా 0845 కె వెళ్ళారా! ఒక సారి గుండెపై చెయ్యి వేసుకొని చూస్తే ఈ రోజు విద్యార్థుల భవిషత్తు గందరగోళం లో పడేది కాదు . 
    విద్యార్థులు దగ్గరి కాలేజీ లలో చదివితే అది వారి నేరమా ?  కాలేజీ లు  పెట్టి  ఎవరికి తెలియకుండా , కనిపించకుండా  గుప్పిట్లో దాచుకొన్నది కాదు , సంవత్సరమంతా కాలేజీ నడుస్తున్నది అందులో విద్యార్థులు చదువుతున్నారు అని  అందరికి తెలుసు అలాంటప్పుడు కాలేజీకి అనుమతి లేదని  పరీక్ష తెల్లారి ఉందనగా కూడా హాల్ టికెట్లు జారీ చేయకపోవడం , అనుమతి లేని కాలేజీ లో విద్యార్థులు చదువుతుంటే వారి భవిష్యత్తు ఏమిటని కాలేజీ లు నియంత్రించే వారికి ముందే తెలియకుంటే ఏమనుకోవాలి ,  రేపు exam ఉన్నప్పుడే ఈ  విషయం తెలియడం  ఈ కాలం లో మనం ఈ ఆధునిక  ఎలక్ట్రానిక్ యుగం లో ఉన్నామా  లేదా అనిపిస్తుంది .


    కొన్ని పరీక్షా హాళ్లలో బయటి వెలుతురు లేదు , నిరంతర విద్యుత్తు ఉన్న ఈ సమయం లో కూడా  పరీక్షా హాళ్లలో వెలుతురు లేదంటే విద్యార్థులు పరీక్షా ఎలా వ్రాయగలరు . సీటింగ్ ఆరెంజ్ మెంట్ లో కూడా చిన్న పేపర్ పై చిన్నగా  ప్రింట్ చేసి బోర్డు పై అతికించడం  వలన  సీటు ,హాలు ,ఏ ఫ్లోరో ఉన్నదో  కనుక్కోవడం కూడా విద్యార్థులకు కష్టం గా ఉంది , అక్కడ చెప్పేవారు కూడా ఉండరు .  



    కాలేజీ కి పర్మిషన్ లేకా , ఒక్క నిమిషం రావడం లో లేటై తే అనుమతింపబడని విద్యార్థులకు కంటితుడుపుగా అడ్వాన్స్ కు permission ఇస్తామని చెప్పి కంటి తుడుపు తో   చేతులు దులుపుకోవడం భావ్యమా ? 


    ప్రస్తుతం మనం, మనం సాధించుకున్న మన రాష్ట్రం లో ఉన్నాము . అలాంటప్పుడు మన విద్యార్థుల భవిష్యత్తు పై  విద్యార్థులకు వారి తల్లి దండ్రులు పెట్టుకున్న  ఎన్నో ఆశలు మిగలకుండా ఉంటే ఎలా ! 
    మరుసటి రోజు గాని ఇంటర్ రెండవ  సంవత్సర పరీక్షల లో గాని విద్యార్థులకు మొదటి రోజు జరిగిన బాధలను ఏమైనా తొలగించనట్లు దాఖలాలు ఏమి లేవు . 



                మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ. K C R గారు అందరిని , ప్రతి వారిని  అన్ని వేళలలో విద్యార్థులను కూడా ప్రతి విషయంలో అక్కున చేర్చుకుంటున్నారు .ప్రస్తుతం జరిగిన  ఈ తప్పిదములకు కారణలైన వారిని ఉపేక్షించ వద్దని , ఈ పరీక్షల  సమయం , పరీక్షల విధానం, స్పాట్ వాల్యుయేషన్  లో గణనీయమైన మార్పులు  విద్యార్థులకు ప్రయోజనం ఉండేటట్లు తీసుకురావాలని  ,ఇలాంటి తప్పిదాలు మున్ముందు జరగ కుండా చేయాలని  , మన ఈ విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని   మన మందరం   మన ప్రియతమ నాయకుడిని కోరుకుందాం . తప్పకుండా వారు చేయగలరని ఆశిద్దాం  . --seaflowdiary