Friday, December 23, 2016


     Health is wealth - 4    ఆరోగ్యమే మహాభాగ్యం - 4
                                                                     Date : 23-12-2016
                                                                     updated: 31-12-2016

Ginger - అల్లం 


మ‌న‌కు ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం కూడా ఒకటి. భారతీయులు దాదాపు 5వేల‌ సంవత్సరాల నుంచి అల్లంను వంటల్లోనే కాదు అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లంలో మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మైన కీల‌క పోషకాలున్నాయి. దీంతో ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇట్టే న‌యం చేసుకోవ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలో అల్లం వల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి స‌హజ సిద్ధ‌మైన యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. 

2. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్‌, ర‌క్తం గ‌డ్డ‌కుండా చూస్తుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. 

3. నిత్యం అల్లం ర‌సం తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క‌డుపులో ఉండే అల్స‌ర్లు మానిపోతాయి. నోటి దుర్వాస‌న‌ను తొలగించుకునేందుకు అల్లం ర‌సం ఉప‌యోగ‌ప‌డుతుంది. నోటిలో చేరిన హానిక‌ర‌మైన బాక్టీరియా కూడా తొల‌గిపోతుంది. దంతాలు దృఢంగా మారుతాయి. 

4. షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి అల్లం ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు తీసుకుంటూ ఉంటే దాంతో షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. 

5. అల్లం ర‌సం తాగితే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఆక‌లి లేని వారు అల్లం ర‌సం తాగ‌డం మంచిది. 

6. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో అల్లం ర‌సం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

7. అల్లం ముక్క‌ల‌ను కొన్నింటిని మ‌రుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం ఆ నీటిలో కొంత తేనె క‌లుపుకుని తాగితే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవ‌డ‌మే కాదు, ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క‌ఫం పోతుంది. 

8. పైన చెప్పిన విధంగానే అల్లంను వేడి నీటిలో వేసి మ‌రిగించాక అందులో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేసి క‌లుపుకుని తాగితే ఒళ్లు నొప్పులు త‌గ్గుతాయి. 

9. ఉద‌యాన్నే అల్లం ర‌సం లేదా అల్లంను అలాగే డైరెక్ట్‌గా తింటే గ్యాస్ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. 

10. రెండు టీస్పూన్ల అల్లం ర‌సంలో అంతే మోతాదులో నిమ్మ‌ర‌సం క‌లుపుకుని అందులో ఉప్పు వేసి తాగితే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది.


జలుబు వెంటనే తగ్గాలంటే..?


వేరే ఏ కాలంలోనైనా జలుబు చేస్తే కాస్త త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది, కానీ ఈ కాలంలో మాత్రం అలా కాదు. ఓ వైపు పొగమంచు, మరో వైపు చలి, దీంతోపాటు దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాప్తి చెందడంతో జలుబు చేస్తే ఓ పట్టాన తగ్గదు. ఇందుకోసం చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తారు. కానీ దాంతో పని లేకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగంటే... 


1. కొద్దిగా అల్లం దంచి రసం తీసుకోవాలి. దానికి సమాన భాగంలో తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. అయితే ఆ మిశ్రమం రుచి నచ్చని వారు దాన్ని వేడి పాలలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు వెంటనే తగ్గిపోతాయి. గొంతు నొప్పి నయమవుతుంది. 

2. ఒక పసుపు కొమ్మును తీసుకుని దాని చివర కొద్దిగా కాల్చాలి. అనంతరం ఆ కొమ్ము నుంచి వచ్చే పొగను పీలిస్తే వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలా చేయలేని వారు కొద్దిగా పసుపును ఒక గ్లాస్ వేడి పాలలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. 

3. అవిసె గింజలు కొన్నింటిని తీసుకుని ఒక పాత్రలో నీటిని పోసి అందులో ఆ అవిసె గింజలను వేయాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చిక్కని ద్రవం తయారవుతుంది. దాంట్లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఆ మిశ్రమాన్ని తాగితే జలుబు వెంటనే మాయమవుతుంది. 

4. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా నల్ల మిరియాల పొడి వేయాలి. అనంతరం ఆ నీటిని మరిగించాలి. కొద్దిగా మరిగాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మళ్లీ ఆ నీటిని మరిగించాలి. కొంత సేపటికి రెండు, మూడు చిన్న బెల్లం ముక్కలను ఆ నీటిలో వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మళ్లీ ఆ నీటిని మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడబోసి వేడిగా ఉండగానే తాగేయాలి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

5. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా టీ పొడి వేసి మరిగించాలి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాల పొడి వేసి మళ్లీ ఆ నీటిని మరిగించాలి. చివర్లో కొద్దిగా పాలు కలుపుకుని దాన్ని మసాలా చాయ్‌గా చేసి తాగితే చాలు. జలుబు నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి కూడా మాయమవుతుంది.








ఇంటా... బయట... ఎక్కడ ఉన్నా ఇప్పుడు చలి చంపేస్తోంది. దీంతో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తూ అవి ఓ పట్టాన తగ్గడం లేదు. చాలా మంది రోజుల తరబడి ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారు టమాటాలతో చేసిన సూప్ ట్రై చేయవచ్చు. దీంతో జలుబు తగ్గుతుంది. దగ్గు రాదు. ఇతర అనారోగ్యాలు కూడా నయమవుతాయి. ఈ క్రమంలో టమాటా సూప్‌ను చలికాలంలో తాగితే ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


రోగ నిరోధక శక్తికి... 

ఈ కాలంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు వర్షాకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా పొగ మంచు రూపంలో అవి ఒకరినుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అయితే నిత్యం ఉదయాన్నే ఒక కప్పు టమాటా సూప్ తాగితే అలాంటి ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున టమాటా సూప్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముందు చెప్పినట్టుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా పోతాయి. 



ఎముకల దృఢత్వానికి... 

టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు ఎంతగానో మంచిది. ఎముకలు విరిగి అతుక్కుంటున్న వారికి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి టమాటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం ఒక కప్పు సూప్ తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 



గుండె జబ్బులకు... 

విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల టమాటా సూప్ తాగితే రక్త నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారు టమాటా సూప్‌ను తాగితే మంచిది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. 



మానసిక ఆరోగ్యానికి... 

ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందు వల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి. 



అధిక బరువుకు... 

టమాటా సూప్‌ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేసే అంశం. 



క్యాన్సర్... 

లైకోపీన్, కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రావు. క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు. ప్రధానంగా వక్షోజ క్యాన్సర్, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ వంటివి ఉన్నవారు టమాటా సూప్‌ను తాగడం మంచిది. 



మగవారి ఆరోగ్యానికి... 

2 వారాల పాటు టమాటా సూప్‌ను రోజూ తాగితే దాంతో మగవారిలో వీర్య వృద్ధి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లైకోపీన్ వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. 



డయాబెటిస్... 

టమాటాల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. కనుక మధుమేహం ఉన్న వారు టమాటా సూప్‌ను రోజూ తాగడం మంచిది. అయితే సోడియం పదార్థం ఎక్కువగా ఉన్నందున నిత్యం ఒక కప్పు వరకు మాత్రమే టమాటాలను తీసుకోవాలి. అది దాటితే దాంతో శరీరంలో సోడియం పెరిగి తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.


                                                                                       - seaflowdiary 

No comments:

Post a Comment