రైతు విషాదం - Poor Farmer
Date : 26-12-2016
దుర్గ్ : టమోటా ధర దారుణంగా పడిపోయింది. మార్కెట్లో కిలో టమోటా ఇప్పుడు రూపాయికే దొరకుతోంది. దీంతో ఆ పంట పండించిన రైతులు ఆగ్రహానికి గురయ్యారు. తగ్గిన టమోటా ధరలకు నిరసనగా చత్తీస్‌ఘడ్‌లో రైతులు భారీ ప్రదర్శన చేపట్టారు. దుర్గ్ నగరంలో సుమారు 70 ట్రక్కుల టమోటాలను రోడ్డుపై పారపోశారు. ఆ టమోటాల మీద నుంచే వాహనాలు వెళ్లాయి.
ఒక రోజు టమాటా కిలో రూ . 100 కి అమ్మబడిన రోజులు,కానీ నేడు అదే టమాటా రూ . 1 కి కిలో , అది కూడా గిట్టుబాట లేక రైతు రోడ్డు పై పారబోస్తున్న రోజులు .
రాత్రి పగలు తేడా లేకుండా కష్ట పడి పండించిన టమాటా మట్టి పాలు అవుతుంటే, దానిని పండించిన రైతు ఎంత బాధ పడుతాడో మనకు కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంది . ఎంతో కష్టపడి భూమిని దున్ని ,నారు పెంచి నాటు వేసి పెంచి ,నీరు అందించి , చీడ పురుగుల బారి నుండి కాపాడి ఎండా వానలను తట్టుకొని టమాటా ను రైతు పండించడం పాపమా ? ఉల్లి ధర కూడా ఇలాగే ఉంది . మిగతా కూరగాయల ధర కూడా విపరీతం గా పడిపోయింది . రైతుకు చేను నుండి మార్కెట్ కు తెచ్చిన కూలి కూడా రావడం లేదు . పోనీ పంటను నిలువ చేసికోలేడు , అమ్మకపోతే కూరగాయలు మురిగిపోతాయి .
అదే పారిశ్రామిక ఉత్పత్తి దారులకు తమకు ఎంత ఆదాయం వస్తుందో ముందే తెలుస్తుంది .
మనది వ్యవసాయ దేశం , 70% మంది ప్రజలు రైతులే. ఇలా నష్టాల పాలు అవుతుంటే వ్యవసాయం చేయాలని ఎలా అనుకుంటాడు . అందుకే రైతులు వ్యవసాయం మానుకొని బ్రతకడానికి పట్టణాల దారి పట్టి కూలి చేసుకుంటున్నారు . రేట్లు తగ్గితే కొనేవారు సంతోషించవచ్చు కానీ ఎంత కొనగలడు , ఎలా ఎన్ని రోజులు నిలువ ఉంచుకొనగలడు?
కొనేవారికి కూడా రైతు అవస్థలు చూసి బాధ పడగలడు .
పారిశ్రామిక వర్గాలకు కల్పించే రాయితీలు ముందుగా రైతులకు కల్పించాలి . కనీసం పెట్టిన పెట్టుబడి కి రెండింతలైన ఆదాయం వచ్చునట్లు సౌకర్యాలు కల్పించాలి . వారు పండించిన ధాన్యం కానీ కూరగాయలు గాని ధైర్యం గా అమ్మగలనని నమ్మకం ఉండాలి , నిలువ ఉంచే సౌకర్యం కల్పించాలి , అప్పుడే రైతు మనోబలం తో వ్యవసాయం చేసి పంటలు పండించి మనందరికీ తిండి కల్పించగలడు . "రైతే రాజు ", " జై జవాన్ - జై కిసాన్ "
yours ,
. - seaflowdiary
No comments:
Post a Comment