ఆరోగ్యమే మహాభాగ్యం -3 - Health is wealth - 3
Date :08-11-2016
updated: 11-11-2016,22-11-2016
24-11-2016,28-11-2016, 01-12-2016
సబ్జా గింజల పానీయం త్రాగితే !
ఒంట్లో వేడి చేసిందంటే చాలు అప్పట్లో చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. అయితే క్రమంగా వాటిని అలా తాగేవారు తక్కువయ్యారు కానీ, ఆ పానీయం తాగితే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగితే ఇంకా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలో సబ్జా గింజల వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సబ్జా గింజల పానీయాన్ని తాగితే శరీరంలో ఉన్న వేడి అంతా ఇట్టే హరించుకుపోతుంది.
2. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే దాంతో మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
4. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
5. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
6. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.
7. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలను పోగొట్టే సహాయకారిగా పనిచేస్తాయి.
8. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, చక్కెర వేసి తాగితే అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు.
9. గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు.
10. రోజంతా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను రాత్రి పూట పానీయం రూపంలో తాగితే దాంతో అధిక బరువు తగ్గిపోతుంది. స్థూలకాయులకు ఇది మేలు చేసే అంశం. అంతే కాదు, ఆ పానీయం సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు ఉంటే పోతాయి.
11. నీటిలో వేయగానే జెల్ మాదిరిగా మారే సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యంత అవసరం.
12. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.
13. గోరువెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
జామపండు ఆరోగ్యానికి దివ్యౌషధం
జామపండు ఆరోగ్యానికి దివ్యౌషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధు లైన క్యాన్సర్, మధుమేహం, గుండె రోగాల బారిన పడకుండా కాపాడుతుందని, ఒంటి నొప్పులు తగ్గించి ఆకలి పెంచడంలో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. అయితే జామకాయలు ప్రస్తుతం శీతాకాలంలో అధికంగా లభిస్తాయి. సీజనల్‌గా లభించే ఈ జామపండులో అనేక పోషక విలువలున్నాయి.
జీర్ణశక్తికి దోహదం..
ఎన్నో పోషక విలువలున్న జామ దివ్యౌషధం లాంటిది. ఆహారం తీసుకున్నాకా జామ కాయో, పండో తింటే తొందరగా జీర్ణమవుతోంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమ వుతుంది. మధుమేహ వ్యాధి ఉన్న వారికి మంచి ఆహారం.
దంత సంరక్షణలో..
రోజూ దోర జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్ట వచ్చు. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. జామలో విటమిన్-సీ అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. ముక్కలుగా తరిగిన పచ్చి జామకాయ ముక్కలను బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైంధవ లవణాన్ని వేసి, మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకుని రోజు పళ్ల పొడిలా వాడితే దంతాలు గట్టి పడటమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
మల బద్ధకం నివారణలో:
బాగా పండిన జామ పండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం చిలకరించుకొని తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అతిసారా, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, గర్భిణుల్లో వాంతులు ఉన్నప్పుడు దోర జామకాయను కషాయం గానీ, మజ్జిగలో కలుపుకుని తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది.
శారీరక బలానికి..
బాగా పండిన జామపండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు, తేనే కలిపి తీసుకుంటే విటమిన్-సీ, క్యాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు, దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకటైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యల్లో శక్తి చేకూర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
జలుబు నుంచి ఉపశమనానికి..
విటమిన్-సీ అధిక మొత్తాల్లో ఉండడంతో వైరస్ కారణంగా వచ్చిన జలుబు నివారణకు జామ బాగా పనిచే స్తుంది. కానీ జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంత మందికి జలుబు తగ్గాల్సింది పోయి, పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధికమించేందుకు జామ ను కొద్దిగా నిప్పుల మీద వేడి చేసి, సైందవ లవణాన్ని, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అధిక దప్పిక తీరేందుకు..
జామ పండ్లను చిన్న సైజు ముక్కలుగా తరిగి తాగు నీళ్లలో మూడు గంటల పాటు నానేసి, ఆ నీళ్లను దాహం తీరేంత వరకు తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పి, మైగ్రెయిన్ నివారణలో..
దోర జామపండును సానరాయి మీద గంధం చేసి, నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రెయిన్‌తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
నిమ్మతో అందాలకు మెరుగు
ఆయుర్వేదంలోనూ, ప్రజల వాడుకలోనూ నిమ్మ, నిమ్మజాతి ఫలాలైన కమలా, నారింజ, దబ్బ మొదలగు ఫలాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పుష్కలంగా పోషకాలు, సౌందర్య గుణాల కారణంగా నిమ్మ ప్రత్యేకతను సంతరించుకుంది. నిమ్మ ప్రత్యేకత గురించి విశేషాలు..
- నిమ్మకాయ పిండిన నీటిలో చేతులు ముంచితే మృదువుగా ఉంటాయి.
- మందార ఆకుముద్దలో నిమ్మరసం జోడించి, జుట్టుకి పట్టించి గంట సేపు ఆరనిచ్చి తలస్నానం చేస్తే మీ కేశ సంపద బాగా అభివృద్ధి చెందుతుంది.
- నిమ్మరసానికి అంతేమొత్తంలో పాలు కలిపి, రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే వేడినీటితో కడుక్కుంటే మెరిసే ముఖఛాయ సొంతమవుతుంది.
- నిమ్మరసంలో మెట్టతామర ఆకుల రసం కలిపి పై పూత మందుగా రాస్తూంటే చర్మవ్యాధులు దూరమవుతాయి.
- తేనె, మీగడ, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పేస్టులా చేసి ముఖానికి రాసుకొని కాసేపయ్యాక కడిగేస్తే బ్లీచింగ్‌లా పనిచేసి ముఖం తలతలా మెరుస్తూ ఉంటుంది.
- శరీరంపై దురదలున్న చోట గసగసాలు, నిమ్మరసం, కలిపి రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
- కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రుపోతుంది.
- ప్రతిరోజూ ఉదయం పూట నిమ్మకాయ రసం తలకు మర్దనా చేసుకుని పూటకో మారేడుపండు చొప్పున రెండు నెలల తింటే ఉన్మాదం నయమవుతుంది.
- చేపలు, మాంసం వంటివి తింటున్నప్పుడు చిన్న ఎముక తునకలు, చేపముళ్లు వంటివి ఏమైనా గొంతుకడ్డం పడితే, నిమ్మరసం కొద్దికొద్దిగా మింగడం ద్వారా వాటి అడ్డు తొలగించుకోవచ్చు!
- అరకప్పు పెరుగులో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి చేతులకు, ముఖానికి రాసుకొని చల్లటి నీటితో కడిగితే చక్కటి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
- జాండీస్ వస్తే 30 గ్రాముల నిమ్మరసం నీటిలో కలిపి తాగుతుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గుతుంది.
హైబీపీని తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్
బీపీ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి ఎంతటి నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లకు అది దారి తీస్తుంది. గుండె జబ్బులను కలిగిస్తుంది. చివరిగా ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. కనుక ఎవరికైనా బీపీ కంట్రోల్‌లో ఉండాల్సిందే. ఈ క్రమంలో బీపీ తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం...
నిమ్మకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఎక్కువే. ఇవి గుండెకు వెళ్లే రక్త నాళాలను మృదువుగా ఉండేలా చేస్తాయి. వాటిలో ఏవైనా పదార్థాలు ఆగిపోయి ఉంటే వాటిని తొలగించేందుకు దోహదపడుతాయి. అంతేకాదు, అధికంగా ఉన్న బీపీ కూడా నిమ్మరసం తాగితే వెంటనే తగ్గిపోతుంది. అందుకు ఏం చేయాలంటే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మ ముక్కను పూర్తిగా పిండి అనంతరం ఆ నీటిని తాగాలి. దీంతో బీపీ డౌన్ అవుతుంది. దీన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగుతుంటే బీపీ క్రమంగా అదుపులోకి వస్తుంది.
వెల్లుల్లి...
గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూడడంలో వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొవ్వు కరిగేలా చేస్తుంది. బీపీ నియంత్రణకూ ఉపయోగపడుతుంది. నిత్యం 1, 2 వెల్లుల్లి రేకులను బాగా నలిపి 15 నిమిషాలు ఆగాక పచ్చిగానే తినాలి. అలా తినలేని వారు వాటిని పాలతోనూ తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా కూర వండాక దాంట్లో కలుపుకుని తినవచ్చు.
అరటిపండు...
పొటాషియం అధికంగా ఉండడం వల్ల అరటిపండు బీపీని అదుపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బీపీ బాగా ఉంటే వెంటనే ఒక అరటిపండును తినాలి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు, అరటిపండును నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటుంటే బీపీ కూడా క్రమంగా తగ్గుతుంది.
ఆకుపచ్చని కూరగాయలు...
పీచు పదార్థం, పొటాషియం, విటమిన్ సి, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఆకుపచ్చని కూరగాయల్లో ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూస్తాయి. బీపీని నియంత్రిస్తాయి. నిత్యం ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ క్రమంగా తగ్గిపోతుంది.
బీన్స్...
పీచు పదార్థం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు బీన్స్‌లో ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. బీన్స్‌ను తరచూ తీసుకుంటూ ఉంటే బీపీ తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లు...
హైబీపీ ఉన్నవారు తమ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం వారు నిత్యం కనీసం 10 గ్లాసుల నీటినైనా తాగాలి. అయితే నీరు అందుబాటులో లేకపోతే కొబ్బరి నీళ్లు అందుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఎందుకంటే పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నందున కొబ్బరి నీళ్లను తాగితే శరీరానికి నీరు అందడమే కాదు, హై బీపీ వెంటనే అదుపులోకి వస్తుంది.
పుచ్చకాయ విత్తనాలు...
బీపీని నియంత్రించడంలో పుచ్చకాయ విత్తనాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పలువురు సైంటిస్టులు దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. కొన్ని పుచ్చకాయ విత్తనాలను సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. అనంతరం అంతే మొత్తంలో గసగసాలను తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ చొప్పున తీసుకుని నీటిలో కలిపి తాగాలి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది.
మన పరిసరాల్లో లభించే ఔషధ మొక్కలను సరిగ్గా వాడుకోవడం లేదు. ఇంటి పరిసరాల్లో, పొలాలో, రోడ్ల వెంట ఉన్నటువంటి ఔషధ మొక్కలను గుర్తించి వాటిని ఉపయోగించుకున్నట్లయితే పలురకాల వ్యాధుల నుంచి బయట పడవచ్చని అంటున్నారు ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యాధికారులు. ఇటీవల బోనకల్లు మండలంలో డెంగ్యూ జ్వరాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయూష్‌శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేదిక్ మందులతో జ్వరా లను తగ్గించడం, రక్తకణాలు పెంపొందించేందుకు ఉపయోగపడే మొక్కల గురించి వైద్యాధికారులు డాక్టర్ లక్ష్మీనారాయణ, కటకం శ్రీనివాసరావు, సురేష్, జకోటియాలు వివరించారు. ఈ మొక్కల ఉపయోగాలతో జ్వరం తగలకుండా ఉండేలా దోహదపడతాయని, వాటిని ప్రజలు అవసరాల మేరకు ఉపయోగించుకోవాలని వివరించారు. నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే నేలవేము, వామి, ఉసిరి, అర్థస్వరము, గుడూచి వంటి ఔషధ మొక్కల గురించి వారు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించారు. మొక్కలు వాటి ఉపయోగాలు.
వావిలి...
వావిలి చెట్టు అందరికీ తెలిసింది. ఇంటిచుట్టూ తడికలుగా పెంచిన ట్లయితే చెట్టు వాసనకు దోమల రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఎండినవావి లాకులను ఇంటిలో పొగపెట్టిన దోమలు పూర్తిగా నివారించేందుకు ఉపయో గపడతాయి. వేడినీళ్లలో కొన్ని ఆకులు వేసి స్నానం చేస్తే వాతపు నొప్పులు, జ్వరం, నీరసం తగ్గుతాయి. ఆకులను దంచి వేడిచేసి అన్నిరకాల నొప్పులకు కట్టవచ్చు ఈ ఆకులను కాల్చినప్పడు వచ్చే పొగను పీలిస్తే జలుబు, తలనొప్పి తగ్గుతుంది. ఆకు కాషాయంతో బాలింతలకు స్నానం చేయిస్తారు. ఈనీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, నోటిపూత తగ్గుతుంది. ఈ మొక్క15 నుంచి 20 అడుగుపెరుగుతుంది. ప్రస్తుత కాలంలో వావిలి చెట్టును పెంచుకుంటే దోమల నివారణకు దోహదపడుతుంది.
ఉసిరి...
ఉసిరి చెట్టు అందరికీ పరిచయం ఉన్నప్పటికీ ఈ కాయలతో ముఖ్యంగా రోజు ఉసిరి పొడిని 1,2 గ్రాములు తింటే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోని అన్ని అవయవాలకు బలాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే అత్యంధికంగా సీ-విటమిన్‌కలిగిన ద్రవ్యంగా పేరుపొందినది. నిత్యం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే బీపీ, గుండెజబ్బు, క్యాన్సర్, కొలస్టాల్ తోపాటు జ్వరంతో కలిగే నీరసం, బల హీనతను తగ్గిస్తుంది. దీని కాయలను చూర్ణం కానీ, పచ్చకాయలు కానీ, ఆహారం రూపంలో తీసుకుంటే శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో జన్మతో మొదలు అంతిమ సంస్కారం వరకు అన్ని కర్మలలో ఉసిరిని వాడతారు.
అడ్డసరము(వాస)...
ఇది ఒక మధ్యరకం చెట్టు. ఇంటి చుట్టూ ప్రహరీలా తడికలు కడితే పాములు రాకుండా ఉంటాయి. ఎండిన ఆకులు మురికినీటిలో వేస్తే ఆనీటిలో ఉన్న దోమల లార్వా నశించిపోతుంది. దీని ఆకు చూర్ణం చేసుకొని ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు నీటిలో కలిపి తాగితే జ్వరంతో పాటు, వచ్చే దగ్గు, ఆయసం, నీరసం తగ్గుతుంది.
గుడూచి (తిప్పతీగ)...
ఇది తీగజాతికి చెందిన ఔషధపు మొక్క. ఇది ప్రతి గ్రామంలో పొలాల గట్లపై, కంపచెట్లపై తీగలా అల్లుకుపోతుంది. ఎక్కువగా ఈతీగ వేపచెట్లపైన పాకుతుంది. తీగను అమృత అని అంటారు. 5,6 తాజా ఆకులు మధుమేహం ఉన్నవారు రోజు తింటే మంచింది. ఈ తీగ జానెడు కాండంను తీసుకొని దంచి 100 గ్రాములు మంచినీటిలో వేసి కాశాయంగా కాచి తాగినైట్లెతే విషజ్వరాలు తగ్గడంతో పాటు, రక్తంలోని తెల్లకణాలు పెరుగుతాయి. చూర్ణంతో సొరియూసిస్, బొల్లి, చర్మవ్యాధులు తగ్గటానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక, బంక విరోచనల నివారనకు దోహదపడుతుంది.
నేలవేము...
ఇది చిన్నమొక్క విరివిగా దొరుకుతుంది. ఈ మొక్క పూర్తిగా ఎండబెట్టి చూర్ణం చేసి అరచెంచా నుంచి ఒక చెంచా వరకు వాడినట్లయితే అన్ని రకాల విషజ్వరాలు తగ్గడంతో పాటు, డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, లాంటి రోగాలు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఈ మొక్కలను ఔషధ మొక్కలుగా ఉపయోగించుకొని జ్వరాలు సోకిన వారు వాడినైట్లెతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకొనే అవకాశం ఉంటుందని వారు తెలుపు తున్నారు.
తృణధాన్యాలలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా తృణధాన్యాల వాడకం కనుమరుగైంది. కాని ఈ మధ్య కాలంలో వీటి వాడకం ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. తృణధాన్యాలు అంటే ధాన్యాలలో ఒక రకం. బెబ్బెర్లు, అనుములు, సజ్జలు, ఉల్వలు, గడ్డినువ్వులు, తైదలు, అవుశలు, కొరబియ్యం ఇవన్ని తృణధాన్యాల కోవకు చెందినవి. తృణధాన్యాలు శరీరీనికి ఆరోగ్యరీత్యా మంచిగుణాలు, సత్పలితాలు చూపిస్తాయి. ఈ ధాన్యా లు మంచి రుచితో పాటు ఔషధలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఆరోగ్యంతో పాటు శరీర వృద్ధి పెంపొందిస్తాయి. కొన్ని ధాన్యాలు అంబలి చేసుకుని తాగితే అలసత్వం తొలగి ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. తృణధాన్యాలతో ఆరోగ్యం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తృణధాన్యాలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
సజ్జలు
ఇవి చాలా పుష్టికరమైనవి. సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి పిల్లలకు, బలహీనులకు పాలలో కలిపి తాగిస్తే దేహదారుడ్యాన్ని, మనోబుద్ధిని పెంపొందిస్తాయి. బెల్లంలో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది.
బెబ్బెర్లు
బెబ్బెర్లు ఉడకబెట్టి తినడం వలన బాలింతలకు స్థనవృద్ధి కలుగుతోంది. ఆసిడిటీ (ఆమ్లపిత్తం)ను తగ్గించి, ఆకలిని వృద్ధి పరుస్తుంది. వాతాన్ని అరికడుతుంది. మహిళలకు ఋతుక్రమము సక్రమంగా వచ్చే విధంగా దోహదపడుతుంది. పురుషులలో వీర్యవృద్ధిని పెంపొదించే గుణం ఉంటుంది. మూత్రరోగాలను అరికడుతుంది. దేహపుష్టిని కలిగిస్తుంది. అలాగే బెబ్బెర్లను పిండి వంటల్లో వాడితే మంచి రుచినిస్తాయి.
తైదలు
తైదలను అంబలిగా కాచి సేవిస్తే శరీరానికి చలువను ఇస్తుంది. ఎండాకాలంలో మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. తైదలలో లోహతత్వం ఉంటుంది. కాబట్టి రక్తం వృద్ధి చెందుతుంది. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది.
గడ్డినువ్వులు
శరీరంలోని చలువను తగ్గించి వేడిని కలిగిస్తాయి.మంచి జీర్ణశక్తి కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారికి పుష్టిని పెంపొందిస్తాయి.
ఉల్వలు
ఉలవలలో తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగులు ఉంటాయి. నల్ల ఉలవలు శ్రేష్టమైనవి. ఇవి మూత్రరోగాలను తగ్గిస్తాయి. మూత్రాశయంలో పెరిగిన రాళ్లను కరిగించే గుణం ఉంటుంది.
అవుషలు
అవుషలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. జలుబు, వాతాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, రేచీకటిని హరింపజేస్తాయి. విరేచనాలను అరికడతాయి.
కొరబియ్యం
శరీరంలో వేడిని పెంపొందిస్తుంది. జలుబును హరింపజేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. విరిగిన ఎముకలను అతికింపజేసే శక్తి కలుగుతుంది. నారీకురుపులను తగ్గించే గుణం ఉంటుంది.
సోయాబీన్
సోయాబీన్‌లో మంసకృత్తులు ఎక్కువ గా ఉంటాయి. బలహీనవంతులకు శక్తిని స్తుంది. వీటిని రుబ్బి పాలను తీసి వంటల లో కూడా వాడుకోవచ్చు. అందుకే సోయాబీన్‌ను గరీబోళ్ల మాంసం అంటుంటారు.
అనుములు
అనుములను బుజించడం వలన వర్షాకాలంలో విషదోషాలను హరింపజేస్తాయి. బాలింతలలో పాలవృద్ధి పెంపొందిస్తా యి. విషం, వాపు, జలుబు నుం చి ఉపశమనంకలుగుతోంది.
- www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment