Saturday, December 31, 2016


ఆరోగ్యమే మహాభాగ్యం-5. Health is Wealth-5  
                                                                                                                    Date : 31-12-2016
                                                                                                   updated: 11-01-2017&26-01-2016
                                                                                                                  06-02-2017







మోరంగడ్డ - రత్నపురిగడ్డ



పోషకాలు మెండుగా లభించే వాటిల్లో మోరంగడ్డ ఒకటి. దీనితో కూర చేసుకోవడమే కాదు ఆరోగ్యకరమైన అల్పాహారంగా కూడా ఉపయోగించవచ్చు. దీన్నే చిలగడదుంప, స్వీట్‌పొటాటో అని కూడా పిలుస్తారు. వీటిని కాల్చి, ఉడికించి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. యాసంగి సాగులో ఈ గడ్డను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఖర్చు తక్కువ... ఆదాయం ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 
-తిరుమలగిరి, నమస్తే తెలంగాణ

-రుచికరమైంది.... ఆరోగ్యవంతమైంది
-మలబద్ధకం నివారిణి 
-రక్తంలోని చక్కెర నిల్వల నియంత్రణకు తోడ్పాటు 
-పుష్కలంగా విటమిన్-సీ లభ్యం 

అందమైన పొదలా పాకే మొరంగడ్డలో చాలా రకాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తెలుపు, లేత పసుపు, లేత ఎరుపు రంగులో ఉండే దుంపలే లభిస్తాయి. కానీ, పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగుల్లోనూ ఈ దుంపలు ఉంటాయి. లేత పసుపు రంగు దుంపలతో పోలిస్తే మిగిలినవి తియ్యగా ఉంటాయి. ముఖ్యంగా చైనా, కొరియా దేశాల్లో చలికాలం సీజన్‌లో ఈ దుంపలను కాల్చి, బేక్‌చేసి విక్రయిస్తారు. ఉత్తర, దక్షిణ అమెరికాలో ఐస్‌క్రీమ్‌లు, కేకులుగా చేస్తారు. బంగాళదుంప మాదిరిగానే ఫ్రెంచ్, ఫ్రైస్, చిప్స్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. మన దగ్గర కూరల్లో కూడా కలిపి వండుతారు. 

ఎన్నో పోషకాలు.. 
మొరంగడ్డకు రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే గుణం ఉండడంతో అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ దీన్ని మధుమేహ రోగులకు మంచి ఆహారంగా పేర్కొంది. మొరంగడ్డలో ఉండే పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుంది. ఈ దుంపల్లో సంక్లిష్ట పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైగా ఇందులోని చక్కెరలు సహజమైనవి కాబట్టి రక్తంలో మెల్లగా కలుస్తూ శక్తిని అందిస్తాయి. 

ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ బీ6 శరీరంలోకి విడుదలయ్యే హోమోసిస్టీన్ రసాయనాలను తగ్గిస్తుంది. ఫలితంగా అనేక వ్యాధుల్ని ముఖ్యంగా హృద్రోగాలను ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. సిట్రస్ జాతి పండ్లలో మాదిరిగా ఇందులో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉం టుంది. శరీర జీవక్రియలకు అవసరమైన మెగ్నీషియం, పొటాషియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి.



యాసంగిలో అధిక సాగు.. 
మొరంగడ్డ 120రోజుల పంట. యాసంగిలో దీన్ని ఎక్కువగా సాగుచేస్తారు. దీనికి నీటి అవసరం కూడా తక్కువే. వారం రోజులకు ఒకతడి ఇస్తే సరిపోతుంది. పెట్టుబడి కూడా తక్కువగా ఉండడంతో గిరిజనులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎకరాకు రెండు డీఏపీ బస్తాలు వాడి, ఒకసారి కలుపు తీస్తే చాలు. ఎకరాకు 60బస్తాల దిగుబడి వస్తుంది. సుమారుగా రూ.70వేల ఆదాయం పొందవచ్చు. పెట్టుబడి రూ.20వేలు పోయినా రూ. 50వేల వరకు రైతుకు మిగిలే అవకాశం ఉంది. 

ప్రతి ఏటా పండిస్తాం
ప్రతి ఏటా యాసంగిలో ఈ పంటను సాగుచేస్తా. ఈ సారి రెండు ఎకరాల్లో వేశాను. ఇప్పటికే కొంత తీశాం. శివరాత్రికి దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. వ్రతం, ఒక్కపొద్దు ఉన్నవారు వీటిని ఎక్కువగా వాడుతారు. గతంలో వీటిని విక్రయించేందుకు ఇబ్బంది పడేవాళ్లం. ప్రస్తుతం వ్యాపారులు వ్యవసాయ క్షేత్రాల వద్దకే వచ్చి బస్తాకు రూ.1000 చొప్పున కొంటున్నారు. ఎకరానికి రూ.50వేల వరకు ఆదాయం వస్తుంది. 



నోటి దుర్వాస‌న పోవాలంటే 


నోటి దుర్వాస‌న ఇబ్బంది పెడుతుందా..? దాని వ‌ల్ల న‌లుగురిలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే. కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! 


పెరుగు...

పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోరు వాస‌న రాదు. పైగా తాజా శ్వాస‌ను అందిస్తుంది.

గ్రీన్ టీ...

గ్రీన్ టీలో ఫాలీ ఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో ఇవి నోటి దుర్వాస‌న‌ను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నోట్లో, నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ ఫాలీఫినాల్స్ ఉపయోగపడుతాయి. క‌నుక నోరు వాస‌న‌గా ఉంటే ఓ క‌ప్పు గ్రీన్ టీ తాగ‌డం ఉత్త‌మం.

క్యాప్సికమ్...

పచ్చి క్యాప్సికమ్ తిడనం వల్ల నోటి దుర్వాసనను వెంటనే తొలగించుకోవచ్చు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

యాపిల్స్...

నోరు దుర్వాస‌న‌గా ఉంటే ఒక యాపిల్ పండు తిన్నా చాలు. యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తాయి. శ్వాసను తాజాగా మారుస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువ తినే వారిలో ఇటువంటి సమస్య వ‌స్తుంది. అయితే అలాంటి వారు వెల్లుల్లి తిన‌గానే యాపిల్‌ను తింటే చాలు. దాంతో నోటి దుర్వాస‌న కంట్రోల్ అవుతుంది.

లవంగాలు...

ల‌వంగాల‌ను మ‌నం నిత్యం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అయితే ఇవి నోటి దుర్వాస‌న‌ను పోగొట్టేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నోరు దుర్వాస‌నగా ఉంటే ఒక ల‌వంగంను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తే చాలు. దాంతో ఆ స‌మ‌స్య నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీని వ‌ల్ల నోరు తాజాగా మారుతుంది. చ‌క్క‌ని శ్వాస వ‌స్తుంది.

బ్రొకోలి...

బ్రొకోలిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. నోటి నుంచి దుర్వాస‌న రాకుండా చూస్తుంది. శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది.

సోంపు...

దీని గురించి చాలా మందికి తెలుసు. నోరు రిఫ్రెష్ అవుతుంద‌ని సోంపును చాలా మంది వాడుతారు. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో మ‌న‌కు చ‌క్క‌ని తాజా శ్వాస అంద‌డ‌మే కాదు, నోటి దుర్వాసన కూడా పోతుంది.




బ్లాక్ టీ  BLACK TEA





శ‌రీరానికి నూత‌న ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే వాటిలో కాఫీ, టీలు ముఖ్య‌మైన‌వి. అయితే నిత్యం మ‌నం తాగే కాఫీ, టీల క‌న్నా బ్లాక్ టీని ఎక్కువ‌గా తాగితే దాంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప‌లు రకాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు కూడా తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో బ్లాక్ టీ ఎలా త‌యారు చేయాలంటే... పాలు, చ‌క్కెర లాంటివి క‌ల‌ప‌కుండా కేవ‌లం టీ పొడి వేసి మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే డికాక్ష‌న్‌నే బ్లాక్ టీ అంటారు. దాన్ని తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే... 



1. బ్లాక్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 

2. బ్లాక్ టీలో ఉండే టానిన్స్ జీర్ణ‌క్రియ‌కు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. ఇవి జీర్ణాశ‌యాన్ని శుభ్ర ప‌రుస్తాయి. ప‌లు ర‌కాల విష ప‌దార్థాల‌ను జీర్ణాశ‌యం నుంచి త‌రిమేస్తాయి. 

3. గుండె జ‌బ్బులున్న వారు నిత్యం బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో క‌రోన‌రీ ఆర్ట‌రీ డిస్ ఫంక్ష‌న్ అనే స‌మ‌స్య త‌గ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారు బ్లాక్ టీ తాగినా గుండె జ‌బ్బులు రావు. 

4. డ‌యేరియా స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు ఒక క‌ప్పు బ్లాక్ టీ తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

5. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుంచి బ్లాక్ టీ గ‌ట్టెక్కిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతుంటే ఆయా స‌మ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. 

6. చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల అధికంగా ఉన్న కొవ్వు కూడా క‌రిగిపోతుంద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

7. పొగ తాగేవారిలో వ‌చ్చే పార్కిన్స‌న్‌ వ్యాధి నుంచి బ్లాక్ టీ ర‌క్షిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతుంటే ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 

8. బ్లాక్ టీలో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ప‌లు క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను వృద్ధి చెంద‌నీయ‌వు. 

9. చ‌ర్మం ర‌క్షింప‌బ‌డాలంటే నిత్యం ఒక క‌ప్పు బ్లాక్ టీ తాగాలి. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో వెంట్రుక‌లు కూడా సంర‌క్షింప‌బ‌డ‌తాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది.

10. మ‌ధుమేహం ఉన్న వారు బ్లాక్ టీ తాగితే వారి ర‌క్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. 

11. దంత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు నిత్యం ఒక క‌ప్పు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.











ర‌కంగా ప‌ని చేసి బాగా అల‌సిపోయారా..? కీళ్లు, కండ‌రాల నొప్పులు, న‌రాల బెణుకులు ఉన్నాయా..? అయితే ఎప్సం సాల్ట్‌ను వేడి నీళ్ల‌లో క‌లిపి ఆ నీటితో స్నానం చేయండి. అంతే... ఆయా స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మార్కెట్‌లో మ‌న‌కు దొరికే ఎప్సం సాల్ట్‌ను తీసుకువ‌చ్చి స్నానం చేసే నీళ్ల‌లో దాన్ని రెండు స్పూన్ల మోతాదులో వేసి అనంతరం ఆ నీటితో స్నానం చేస్తే చాలు. అప్పుడు ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం అణువులు నీటిలో వెంట‌నే క‌లిసి దాంతో ఆ అణువులు మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ అణువులు మ‌న దేహంపై వెంట‌నే ప్ర‌భావం చూపుతాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు, కండ‌రాల నొప్పులు, బెణుకులు ఇట్టే త‌గ్గిపోతాయి. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దేహం తేలిక‌గా మారుతుంది. 



ఎప్సం సాల్ట్‌తో పైన చెప్పిన ఉప‌యోగ‌మే కాదు, దాని వ‌ల్ల మ‌న‌కు ఇంకా ఇత‌ర లాభాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే... ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల ఎప్సం సాల్ట్ క‌లుపుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉండ‌దు. ఎముక‌లు దృఢంగా మారుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది.

అనారోగ్య సమస్యలకు టిప్స్ 
జ‌లుబు, ద‌గ్గు లాంటి స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతున్నారు. దీంతో వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్రమంలో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కాస్తా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తున్నాయి. అయితే అలాంటి బాధ‌లు ప‌డ‌కుండా ఇంట్లో ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

జ‌లుబు, ముక్కు కార‌డం... 
న‌ల్ల మిరియాలు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర‌, యాల‌కుల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని వాటిని క‌లిపి మిక్సీలో పొడిలా ప‌ట్టుకోవాలి. అనంతరం ఆ పొడిని వాస‌న పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జ‌లుబు, ముక్కు కార‌డం వంటివి త‌గ్గిపోతాయి.

గొంతు నొప్పికి... 
ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ స‌ముద్ర‌పు ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని పుక్కిలిస్తూ ఉండాలి. దీంతో గొంతు స‌మ‌స్య‌లు పోతాయి.

నోటిలో పుండ్లకు... 
ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని ప్ర‌తి భోజ‌నానికి ముందు నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటిలో పుండ్లు పోతాయి.

గాల్ స్టోన్స్‌... 
నిమ్మ‌ర‌సం, న‌ల్ల మిరియాల పొడిని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్ ఆయిల్‌తో క‌లిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి. దాని వ‌ల్ల వ‌చ్చే నొప్పి కూడా తగ్గుతుంది.

అధిక బ‌రువుకు... 
1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1 టేబుల్ స్పూన తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఇది అధిక బ‌రువును ఇట్టే త‌గ్గిస్తుంది.

ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే... 
ఏదైనా కార‌ణం వ‌ల్ల ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే అందుకు నిమ్మ‌ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఒక కాట‌న్ బాల్‌ను నిమ్మ‌ర‌సంలో ముంచి దాన్ని ముక్కులో పెట్టుకోవాలి. అయితే అలా చేసే స‌మ‌యంలో త‌ల‌ను కొద్దిగా ముందుకు వంచాలి. దీంతో ముక్కు నుంచి కారే ర‌క్తం ఆగుతుంది.

దంతాల నొప్పికి... 
1/2 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, అంతే మోతాదులో ల‌వంగ నూనెలను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని నొప్పి ఉన్న దంతాల‌పై రాయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ ఔష‌ధం వాడితే కొద్ది రోజుల వ‌ర‌కు చ‌క్కెర‌, దాని స‌హాయంతో చేసిన ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు.

ఆస్త‌మాకు... 
న‌ల్ల మిరియాలు కొన్ని, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకులు తీసుకుని వాటిని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి వ‌చ్చే ద్ర‌వాన్ని జార్‌లోకి తీసుకోవాలి. దాన్ని చ‌ల్లార్చి అందులో కొంత తేనె క‌లుపుకుని తీసుకుంటుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది.

జ‌లుబు, ఫ్లూ జ్వరానికి... 
ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పిండి అనంత‌రం ఆ తొక్క‌ను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాల ఉంచాక తీసేయాలి. అనంత‌రం ఆ నీటిలో 1 టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌గ్గుతాయి.

వికారం... 
క‌డుపు అంతా ఉబ్బ‌రంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే న‌ల్ల మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం త‌గ్గుతుంది.
                                                                          - seaflowdiary.blogspot.com  








No comments:

Post a Comment