Health is wealth -6 ఆరోగ్యమే మహాభాగ్యం -6
Date :16-02-2017
డయాబెటిస్...
డయాబెటిస్... నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన దేశంలోనైతే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కొన్ని కోట్ల మంది దాకా ఉన్నారు. డయాబెటిస్ ప్రధానంగా టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఏ తరహా షుగర్ వ్యాధి వచ్చినా దాంతో ప్రమాదమే. ఈ క్రమంలో డయాబెటిస్ బారిన పడ్డవారు వైద్యుల సిఫారసు మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటుగా కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దాల్చిన చెక్కకు రక్తంలోని చక్కెరను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ తరహా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్కను ఎలా వాడాలంటే... దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మరిగాక వచ్చే ద్రవాన్ని వడకట్టి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
2. టైప్-1 డయాబెటిస్‌ను సమర్థవంతంగా నయం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జరిపిన పలు అధ్యయనాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
3. వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ రకమైన రసాయనం సమృద్ధిగా ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే పచ్చిగా తింటుంటే దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
4. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కరివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔషధ కారకాలు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందుగా గుప్పెడు కరివేపాకు ఆకులను తింటే దాంతో చక్కెర వ్యాధి నయం అవుతుంది.
5. జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీలకర్ర పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఆ నీటిని మరిగించాలి. అలా నీరు అరగ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్రవాన్ని వడకట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగర్ వెంటనే అదుపులోకి వస్తుంది.
6. ఉదయాన్నే పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
7. మీఠీ పత్తి అని పిలవబడే ఓ మొక్క ఆకులు కూడా బ్లడ్ షుగర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని సహజ సిద్ధమైన తీపి పదార్థంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు కూడా. దీంతో షుగర్ స్థాయిలు పెరగవు సరి కదా, పైగా ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోకి వస్తాయి. దీన్ని 2011లో పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఈ మొక్కకు చెందిన పొడి కూడా మనకు మార్కెట్‌లో లభ్యమవుతోంది.
8. బీట్‌రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తింటున్నా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు.
9. పొడపత్రి ఆకు చూర్ణం నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అర గంట ముందు నీళ్లలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా షుగర్ అదుపులోకి వస్తుంది.
దంతాలు తెల్లగా మెరవాలంటే !
దంతాలు తెల్లగా మెరవాలంటే !
స్వీట్లు, జంక్‌ఫుడ్, ఇతర కొన్ని ఆహార పదార్థాల కారణంగా దంతాల మధ్య కావిటీలు వచ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాలకు రంధ్రాలు పడతాయి. దీంతోపాటు చిగుళ్ల సమస్యలు కూడా బాధిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు కొందరికి పలు కారణాల వల్ల దంతాలపై గార పట్టడమో, పాచి ఎక్కువగా పేరుకోవడమో జరుగుతుంది. అయితే దంతాలకు చెందిన ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా వాటిని మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే దూరం చేసుకోవచ్చు. దీంతో ఆ సమస్యలు పోవడమే కాదు, దంతాలు కూడా తెల్లగా తళతళ మెరుస్తాయి. ఈ క్రమంలో దంతాలను తెల్లగా చేసే అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రా బెర్రీలు...
స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి. దంతాల మధ్య పేరుకుపోయే వ్యర్థాలు తొలగిపోతాయి. స్ట్రా బెర్రీలను తరచూ తింటుంటే దంత సమస్యలు బాధించవు.
యాపిల్స్...
చిగుళ్లను దృఢంగా చేసి దంతాలను తెల్లగా మార్చే ఔషధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా తయారవుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది.
బ్రకోలి...
బ్రకోలిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చేందుకు, దంతాలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్స్...
క్యారెట్లలో దంతాలను తెల్లగా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని తరచూ తింటుంటే చాలు దంత సమస్యలు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.
చీజ్...
చీజ్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, దంతాలను తెల్లగా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది.
నట్స్...
బాదం పప్పు, జీడి పప్పు, వాల్‌నట్స్‌లలో దంతాలను తెల్లగా చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. పాచి పళ్లు ఉన్నవారు నట్స్‌ను తరచూ తింటుంటే మంచిది. దీంతో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
ఉల్లిపాయలు...
ఉల్లిపాయలతో ఒకటే సమస్య. అది నోటి దుర్వాసన. ఉల్లిపాయలను తింటే నోరంతా వాసన వస్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయల వల్ల మన దంతాలకు మేలే జరుగుతుంది. వాటిని పచ్చిగా తింటుంటే వాటిలో ఉండే సల్ఫర్ నోటి సమస్యలను పోగొడుతుంది. దంతాలను తెల్లగా మారుస్తుంది.
నారింజలు...
నారింజలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, తెల్లగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
పైనాపిల్స్...
బ్రొమిలీన్ అనే రసాయనం పైనాపిల్స్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలకు పట్టిన పాచి, గార వంటి వాటిని తొలగించి దంతాలను తెల్లగా, దృఢంగా మారుస్తుంది. దంతాల మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు, బాక్టీరియాను తొలగిస్తుంది.
- seaflowdiary
No comments:
Post a Comment