రెట్టింపు కానున్న ఎంపీల జీతాలు! - Double the MP's salary
Date: 25-07-2016
ఎంపీల జీతాలు త్వరలోనే రెట్టింపు కానున్నాయి. ఎంపీల కమిటీ సిఫారసులను ప్రధాని మోదీ ఆమోదిస్తే.. ఈ సెషన్‌లోనే పార్లమెంట్ కూడా ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం 50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ పే.. లక్షకు చేరనుంది. అలాగే అలవెన్సులు కూడా రెట్టింపవుతాయి. పెరిగిన జీతాలు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతాయి. నియోజకవర్గ అలవెన్సు 90 వేలకు చేరుతుండగా, ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫర్నిచర్ అలవెన్స్ ఏడాదికి లక్షా 50 వేలకు చేరనుంది. ఇక నెలకు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కూడా ఉచితంగా అందించనున్నారు. మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ 20 వేల నుంచి 35 వేలకు పెరగనుంది.
బేసిక్ పే, అలవెన్సుల్లో పెరుగుదలతో ప్రస్తుతం నెలకు ఉన్న లక్షా 90 వేల మొత్తం రెండు లక్షల 80 వేలకు చేరుతుంది. ఆరేళ్ల కిందట చివరిసారి ఎంపీల జీతాలు పెరిగాయి. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతో తమ జీతాలు కూడా పెంచాలని కొందరు ఎంపీలు పబ్లిగ్గానే డిమాండ్ చేశారు. అయితే కొందరు తృణమూలు, సీపీఎం పార్టీల ఎంపీలు మాత్రం జీతాలు పెంచాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడున్న జీతాలే చాలా ఎక్కువని అభిప్రాయపడుతున్నారు.
ఎంపీల జీతాలు త్వరలోనే రెట్టింపు కానున్నాయి.అదే జరిగితే ప్రస్తుతం 50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ పే.. లక్షకు చేరనుంది. అలాగే అలవెన్సులు కూడా రెట్టింపవుతాయి.నియోజకవర్గ అలవెన్సు 90 వేలకు చేరుతుండగా, ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫర్నిచర్ అలవెన్స్ ఏడాదికి లక్షా 50 వేలకు చేరనుంది. ఇక నెలకు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కూడా ఉచితంగా అందించనున్నారు. మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ 20 వేల నుంచి 35 వేలకు పెరగనుంది.
బేసిక్ పే, అలవెన్సుల్లో పెరుగుదలతో ప్రస్తుతం నెలకు ఉన్న లక్షా 90 వేల మొత్తం రెండు లక్షల 80 వేలకు చేరుతుంది. ఆరేళ్ల కిందట చివరిసారి ఎంపీల జీతాలు పెరిగాయి. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతో తమ జీతాలు కూడా పెంచాలని కొందరు ఎంపీలు పబ్లిగ్గానే డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి కాబట్టి తమ జీతాలు కూడా పెంచాలని కొందరు ఎంపీలు పబ్లిగ్గానే డిమాండ్ చేశారు కాబట్టి ఎంపీల జీతాలు త్వరలోనే రెట్టింపు కానున్నాయి అదే పద్దతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా రెట్టింపు అవుతాయని మనం ఆశించవచ్చు ! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయని MP లు చెబుతున్నారు కాబట్టి వాళ్ళ జీతాలు రెట్టింపు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా రెట్టింపు కావాలి అని ఉద్యోగులు కోరుకుంటారు .
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జీతాలు పది సంవత్సరములకు ఒకసారి పే కమీషన్ నియమించి వారి రికమెండేషన్ ప్రకారం పూర్తిగా కూడా పెంచరు, సెవెంత్ పే కమిషన్ అలాగే జరుగుతున్నది , దానికి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా ! కానీ ప్రజా ప్రతినిధులకు ఆరు సంవత్సరములకే పెంచాలని ఎంపీల కమిటీ సిఫారసుల అనుగుణం గా అడుగుతున్నారు. వాళ్ళ అలవెన్సులు రెట్టింపు అవుతాయి ,నియోజకవర్గ అలవెన్సు 90 వేలకు చేరుతుండగా,ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫర్నిచర్ అలవెన్స్ ఏడాదికి లక్షా 50 వేలకు చేరనుంది. ఇక నెలకు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కూడా ఉచితంగా అందించనున్నారు.
వారు దేశానికి సేవ చేస్తారు, నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి బాధలను తీరుస్తారు కాబట్టి వాళ్ళ జీతం పెంచుతున్నారు అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు .
కానీ వారి లో చాలామంది పార్లమెంటుకు వెళ్ళరు , పార్లమెంటుకు వెళితే డైలీ అలవెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది.
ఈ అలవెన్స్ వారికి ఒక లెక్కా ! పార్లమెంటుకు వెళ్లినా అక్కడ మాట్లాడే వారు చాలా తక్కువ . ఎలెక్షన్ లప్పుడు ఇంటింటికి వెళతారు , పనులు చేసి పెడతారు , పిల్లలను ఎత్తుకుంటారు , బట్టలు కూడా ఇస్త్రీ చేసి పెడతారు చాలా సంతోషం . ప్రజలు మాకు చాలా సహాయం చేస్తాడు , చాలా మంచివాడు మనందరినీ పేరు పేరు నా గుర్తు పడతాడు అని ఓటు వేసి గెలిపిస్తారు .
వీరిలో చాలా మంది గెలిచిన తరువాత ఊరికి అసలు రానేరారు ఎవరైనా ధైర్యం చేసి మా ఊరికి రమ్మంటే టైం లేదు ,పార్లమెంటు సమావేశాలు ఉన్నవి తరువాత పార్లమెంటు స్టాన్డింగ్ కమిటీ మెంబర్ ని దేశమంతా తిరగాలి లేదా విదేశాలకు వెళ్ళి స్టడీ చేసి రావాలి కావున మీ ఊరికి రావడానికి వీలు దొరకడం లేదంటారు . కానీ వీరిలో చాలామంది
ఉదయం తమ రాష్ట్ర రాజధానిలో లో ఉంటారు మధ్యాహ్నం ఢిల్లీలో కన్పిస్తారు మళ్ళీ రాత్రి తమ రాష్ట్ర రాజధానిలో కన్పిస్తారు ఎందుకంటే వారికి విమానయానం ఫ్రీ కనుక ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్ళగలరు .
వీరు ప్రజాప్రతినిధులు వీరికి జీతం అవసరమా ? ఉద్యోగులు అంటే వారికి జీతం లేనిదే జీవితం గడవదు., కుటుంబం అంతా అతనిపై ఆధారపడుతారు , మండుతున్ననిత్యావసర ధరల వలన ఉద్యోగుల జీతాలు పెంచడం తప్పనిసరి.
తృణమూలు, సీపీఎం పార్టీల ఎంపీలు మాత్రం జీతాలు పెంచాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడున్న జీతాలే చాలా ఎక్కువని అభిప్రాయపడుతున్నారు.వీరు చెప్పిందే అక్షరాలా నిజం.
yours,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment