Monday, August 1, 2016



స్వ‌తంత్ర దినోత్స‌వ ప్ర‌సంగంపై స‌ల‌హాలు కోరిన మోదీ గారు 
                                    
                                             Date :01-08-2016




 మన ప్ర‌ధాని మోదీ గారు ఈసారి త‌న స్వ‌తంత్ర దినోత్స‌వ ప్ర‌సంగంపై స‌ల‌హాలు ఇవ్వాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరడం సంతోషం . ఎలాంటి అంశాల‌పై మాట్లాడాలో చెప్పాలంటూ వారి ఆలోచ‌న‌ల‌ను ఆహ్వానించారు. 
ప్రజలు ఇచ్చిన సలహాలను మాట్లాడుతామని చెప్పారు వాటిని అమలు చేస్తే చాలా బాగుంటుంది . ముఖ్యం గా ప్రజలు కోరుకునేది సుఖవంతమైన ,సులభం గా పనులు జరగాలని కోరుకుంటారు. వాటిలో కొన్ని ఈవిధం గా ఉండవచ్చు . 
ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి . 
స్వంత ఇల్లు కావాలి . 
ఆకాశాన్ని అంటుకున్న ధరలు తగ్గాలి . 
విధ్యావసరాలు పెరగాలి , ప్రతి విధ్యార్థికి ఉన్నత చదువులు అందుబాటులో ఉండాలి . 
ప్రతి గ్రామం లో పాఠశాల భవనాలు, హాస్టళ్లు , మెస్  మంచి స్థితి లో ఉండాలి . 
విధ్యార్థికి చదువులు అయినతరువాత ఉద్యోగాలు కల్పించాలి . 
KG టు PG ఉచిత విధ్య అందించాలి . 
వ్యవసాయ దారులను ఆదుకోవాలి . 
పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి . 
ఎరువులు తక్కువధరకు అందించాలి .
ఇండస్ట్రియలిస్ట్ లకు ఆదుకొన్నట్లు  రైతులను వారితో సమానంగా ఆదుకోవాలి .   
నదులను అనుసంధానించి వరదలను అరికట్టి సాగునీరు ,త్రాగునీరు అందించాలి . 
రవాణా సౌకర్యం మెరుగు పర్చాలి . 
రవాణా చార్జీలు ,రైలు చార్జీలు తగ్గించాలి . 
పెట్రోల్ ధరలు 15 రోజులకొకసారి తగ్గించడం ,పెంచడం నిరోధించాలి . 
 ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణం గా మన దేశంలో పెట్రోలియం ధరలు ఉండాలి . 
వంట గ్యాస్ ధరను కూడా  ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణం గా మన దేశంలో గ్యాస్  ధర ఉండాలి .  
గ్యాస్ సిలిండర్ ధర మార్కెట్ ధరకు అమ్మి తిరిగి సబ్సిడీ వాపస్ ఇవ్వడం డబుల్ పనిని తీసెయ్యాలి . 
INCOME TAX పరిమితిని పెంచి ఉద్యోగులకు ఊరట కల్పించాలి . 
సర్వీస్ TAX ను మొత్తం తీసివేయాలి ,20 సంవత్సరాల క్రింద లేదు కదా .
TAX లన్ని చాలా వరకు తగ్గించాలి ,అప్పుడే ధరలు తగ్గుతాయి . 
ధరలు అందుబాటులో ఉంటే ప్రజలు SUBSIDY ఎందుకు అడుగుతారు .
ప్రజలకు వైద్యం చవుకగా అందించాలి . కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన  వైద్యం అందించాలి . 
MP లకు జీతం పెంచినట్లు ఉద్యోగులకు కూడా జీతం పెంచాలి . 
MP లను MLA లను రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి . 
MP లను MLA లకు విద్యార్హత మరియు వయపరిమితి ఉండాలి .
ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు అదిచేస్తాం ,ఇదిచేస్తాం అని చెప్పి చేయక పోవడం ప్రజలను మభ్య పెట్టడాన్ని   అరికట్టాలి.  
దేశం కోసం పాటుబడిన మహానీయులను ఆదరించాలి , వారి సేవలను,చరిత్రను  భావితరాల వారికి అందించాలి . 
స్త్రీల  గౌరవాన్ని పెంపొందించాలి . రేప్ లు జరగకుండా రేపిస్టులను కఠినం గా శిక్షలు ఉండాలి . 
ACID దాడులు చేసినవారిని వదలి పెట్టకుండా  కఠినం గా శిక్షలు ఉండాలి . 
ప్రతి పేద వారికి ఉచితం గా మరుగు దొడ్లు కట్టించి ఇవ్వాలి . 
పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించి దేశం లో శాంతి ని నెలకొల్పితే ప్రజలంతా సంతోషం గా ఉంటారు . దేశం అన్ని రంగాల్లో  ఇంకెంతో అభివృద్ధి చెందుతుంది.  
                                                                                                               yours ,
                                                                                                                    www.seaflowdiary.blogspot.com  

No comments:

Post a Comment