Monday, July 25, 2016


  రోడ్ ప్రమాదాలు - Road accidents 
                                                                                                          Date 25-07-2016


ఈ మధ్యన వాహనాల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి . కార్లు , బస్సులు అవి సరియైన పద్దతిలో వెళుతున్నా ఎదురుగా వచ్చే వాహనాలు సరియైన పద్దతి లో రాకపోవడం , వీటిని నడిపించే డ్రైవర్ అప్రమత్తంగా లేనిచో ఆక్సిడెంట్లు జరుగుతాయి . నిన్న బస్సు టిప్పర్ ఢీకొన్నాయి రోజుకు ఒకటి చొప్పున ఎక్కడో ఒకచోట దేశం లో ప్రమాదం జరుగుతుంది దీనితో నిండు జీవితాలు గాలిలో కలుస్తున్నాయి . ఎవరి తప్పు అయినా ఇద్దరికీ ప్రాణ నష్టమో లేదా అవయవాల కు దెబ్బలు తగిలి జీవితాంతం వికలాంగులుగా బ్రతకవలసి వస్తుంది . వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి అతలా కుతలం అవుతున్నది . 
ఈ పరిస్థితిని చక్కదిద్దలేమా ! చక్కదిద్దవచ్చు . స్పీడ్ ను తగ్గించాలి , ఒకగంటముందే లేక ఒకరోజు ముందే బయలుదేరాలి, మధ్య మధ్యన విశ్రాంతి తీసుకోవాలి . రోడ్ ఎలా ఉందో వాహనం నడిపే వారికి అవగాహన ఉండాలి . రోడ్ సిగ్నల్స్ ను ఫాలో అవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు నడుపరాదు . 
ట్రాన్స్ పోర్ట్ వారు కేవలం లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ పేపర్లు మరియు ఇన్సూరెన్స్ పేపర్లు చూడడం తో సరిపెట్టకుండా డ్రైవర్ పరిస్థితి ఎలావుంది , వాహనం సరైన స్థితి లో ఉందా ? బ్రేకులు సరిగ్గా ఉన్నావా ? డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా లేక మత్తులో ఉన్నాడా అనికూడా చూస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు . వాహనం ను ఢీ కొట్టడమే కాదు రోడ్ ప్రక్కన నిల్చున్న వారిని కూడా ఢీ కొట్టిన సంఘటనలు ,రోడ్ ప్రక్కన ఇళ్ల లోనికి దూసుక వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నవి . 



ఓవర్‌టేక్ చేయబోయి... నలుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓవర్‌టేక్ చేయబోయిన కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించినట్లు సమాచారం. 



రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్:జిల్లాలోని జమ్మికుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు జమ్మికుంటకు చెందిన క్రాంతి(25), శ్రీను(24)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


రోడ్ వెంట మద్యం దుకాణాలను లేకుండా చూడాలి , రోడ్ వెంట మద్యం దుకాణాలు లేకపోయినా ఎక్కడో కొని తెచ్చుకొని దాచుకోవచ్చుకదా అందుకే మద్యాన్ని నిషేధించాలి . రాత్రిళ్ళు లారీలు , బస్సులు మరియు కార్లు విపరీతమైన వేగంతో నడిపిస్తారు వాటి వేగాన్ని నియంత్రించాలి అవసమైతే రాత్రి 12 గంటలనుండి ఉదయం 5 గంటల వరకు మొత్తం ప్రయాణాన్ని నిషేధించాలి. అప్పుడు గాని ప్రమాదాలు జరుగవు . 


 ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలు వస్తున్న విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. డ్రైవర్ వ్యాన్‌ను రైల్వే గేట్‌ను దాటించే క్రమంలో వేగంగా వచ్చిన రైలు పాఠశాల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు విద్యార్థులు మృత్యువాత పడగా, మరో 12 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. 

                                                                                                                  yours ,
                                                                                        www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment