Friday, July 15, 2016



హరితహారం 
                                                                                Date : 15-07-2016
                                                                                 updated:  16-07-2016



మన తెలంగాణ లో మన ప్రభుత్వం హరితహారం ను ప్రతిష్టాత్మకం గా చేపట్టి గ్రామాలు , పట్టణాలు , మన రాజధాని హైద్రాబాద్ లో తేదీ  11-07-2016 నాడు  ఒకేరోజు 45 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది . మన తెలంగాణ మొత్తం హరితవనం అవుతుంది . ఎక్కడచూచినా పచ్చదనం కన్పిస్తుంది . ఈ మహాకార్యక్రమం లో గవర్నర్, ప్రజాప్రతినిధులు, నాయకులు , విద్యార్థులు , ఉద్యోగులు మరియు ప్రజలందరు  పాల్గొని విజయవంతం చేస్తున్నారు.మొక్కలను నాటేందుకు మరియు  పరిరక్షించేందుకు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఐటీ సంస్థలు సైతం హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని ఉద్యోగులకు పిలుపునిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా మారుతున్నాయి .పాఠశాల విద్యార్థులు హరితహారం గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. గ్రామాల్లో అయితే పోటీతో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు లక్షలాది మొక్కలు నాటినప్పటికీ మరిన్ని మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు . "వృక్షో రక్షతి రక్షతే"  ని అమలు చేయుచున్నారు . ఈ మొక్కలు కొన్ని రోజులకు మహా వృక్షాలై అడవులుగా మారుతాయి . దీనివలన వర్షాలు విపరీతం గా కురిసి సస్యశామలమవుతుంది . మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు కోరుకున్నట్లు " వానలు రావాలి - కోతులు పోవాలి " నిజమవుతుంది . మన దేశం లో ఇతర రాష్ట్రాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాయి కానీ ఇంత భారీగా లేదు . 
మొక్కలు పెంచే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది . కోట్ల రూపాయలు హరితవనం గురించి ఖర్చు పెడుతున్నది . మన IT మరియు Municipal  మంత్రి కె టి ఆర్ గారు హరిత హారానికి ఒక నెల జీతాన్ని విరాళం గా ప్రకటించారు చాలా సంతోషం . 



ఇలాగే అందరూ మరియు పెద్ద పెద్ద కంపెనీ వారు కూడా కంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వానికి కొంత వ్యయం తగ్గుతుంది . 




మన అదృష్టం బాగా లేనట్లు ఉంది ఇన్ని లక్షల చెట్లు ఈ వానా కాలం లో నాటినాము కదా ! ఒక్క వర్షం కూడా మొక్కలు నాటిన తరువాత కురువలేదు . నాటిన మొక్కలు ఎండ వేడిమికి తట్టుకోలేక పోవుచున్నవి , వాడినట్లు కన్పిస్తున్నవి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు లేకుంటే ప్రయాస అంతా వృధా కావాల్సి వస్తుంది . ఇన్ని మొక్కలకు నీరు పోయాలంటే అయ్యే పని కాదు కనీసం ఇంటి ముందు నాటిన మొక్కలకు ఆ ఇంటివారు నీళ్లు చెట్లకు పోసి బ్రతికించుకోవచ్చు . కొందరు నీళ్లు పోస్తున్నారు మరికొందరు మన చెట్లు కావు కదా అని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇది మంచిది కాదు , చెట్లు పెరిగితే వారికి నీడ తో బాటు కార్బండ ఆక్సయిడ్ తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది . 



ఇతర రాష్ట్రాలలో వర్షాలు విపరీతంగా కురిసి వరదలు ముంచెత్తుతున్నాయి . 
 ఏది ఏమైనా మనమందరం వర్షాలు తొందరగా కురిసి నాటిన మొక్కలు అన్ని బ్రతకాలని దేవుడిని ప్రార్థించుదాం . 


                                                                                                                  yours ,
                                                                                          www.seaflowdiary.blogspot.com     

No comments:

Post a Comment