‘నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి తెస్తాం’
Loss Depots being made in to profit
Date : 06-11-2015.
Published: Fri,November 6, 2015 07:42 PM
minister mahender reddy visits sangareddy మెదక్: రాష్ట్రంలో నష్టాలతో నడుస్తున్న బస్సు డిపోలను లాభాల్లోకి తీసుకురానున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మంత్రి మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1250-1300 గ్రామాలకు బస్సు సదుపాయం లేదు. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలు, పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులు. రూ. 150 కోట్లతో త్వరలో 500 బస్సులు కొనుగోలు చేయనున్నాం. కొనుగోలు చేసే వాటిలో 100 ఏసీ బస్సులు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ. కోటి చొప్పున నష్టం. త్వరలోనే నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
- See more at: http://www.namasthetelangaana.com/telangana-news/minister-mahender-reddy-visits-sangareddy-1-1-460004.html#sthash.9bb7s7of.dpuf
మనకు నిజాం కాలంలోనే బస్సు సౌకర్యం కల్పించబడినది . స్వాతంత్ర్యం వచ్చినతరువాత ,సమైక్య రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇంకా మన తెలంగాణా లో 1300 ల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదంటే నిజంగా మన దురదృష్టం .
ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది కదా , ఒక సంవత్సరం నాల్గు నెలలు అయినది , ఇంతవరకు మన ప్రభుత్వం ఎన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది ?
ఇప్పుడు ఆర్టీసి ని లాభాల్లోకి తెస్తామంటున్నారు ,చాలా సంతోషం కాని టికెట్ ధరలు పెంచి కాదు .
ఆర్టీసి ని టోల్ గేటు టాక్స్ నుండి తొలగించాలి అంటే టోల్ గేటు టాక్స్ వసూలు చేయవద్దు .
డీసెల్ పై పూర్తి టాక్స్ తొలగించాలి .
ఆర్టీసి కి రవాణా టాక్స్ నుండి విముక్తి చేయాలి .
మన ముఖ్యమంత్రి శ్రీ . కెసిఆర్ గారు దీనిపై దృష్టి పెట్టి ఆర్టీసి కి అన్ని సదుపాయాలు కల్గించాలి , అప్పుడే గాని ఆర్టీసి లాభాల్లో నడుస్తుంది .
చూడండి ఇక్కడి గిరిజనులకు రోడ్ సౌకర్యం లేదు , రోడ్ ఉంటేనే కదా బస్సు వచ్చేది ! వారికి ఎన్ని బాధలు . రోగం వచ్చిందంటే బ్రతికేది కష్టమే . ఇక పిల్లలు బడికి పోయేది లేదు . ఇలాంటి గిరిజన కుగ్రామాలకు, బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు నష్టం వచ్చినా " బస్సు సౌకర్యం " కల్పించాల్సిందే .
వారికి మంచమే అంబులెన్స్!
Updated : 2/3/2015 10:23:23 AM
Views : 233
గుట్టల మీదుగా రోగిని మోసుకొచ్చిన గిరిజనులు
15 కి.మీ.పాటు నరకయాతన.. ఆస్పత్రికి తరలింపు
ఆదిలాబాద్, గూడెం: అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో రోగి! అంతకంతకూ పరిస్థితి విషమిస్తున్నది! అల్లంత దూరంలో ఆస్పత్రి.. అక్కడికి చేరాలం టే నడక ఒక్కటే మార్గం! చలించిన గిరిజనులు.. మంచాన్నే ఆంబులెన్స్‌గా మార్చేశారు. రోగిని పడుకోబెట్టి దాదాపు 15 కిలోమీటర్ల దూరం మోసుకొచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది. తిర్యాణి మండలం గుండాలకు చెందిన సోయం చిన్ను కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం గుండాల నుంచి దండేపల్లికి తరలించాలని భావించారు.
కానీ రవాణాసౌకర్యాం లేకపోవడంతో మంచాన్నే అంబులైన్స్ గా మారేశారు. రోగిని పడుకోబెట్టి నాలుగు వైపుల నలుగురు భుజాన ఎత్తుకొని గుట్టలు దాటుకుంటూ దాదాపు ఐదు గంటలు ప్రయాణించి 15 కిలోమీటర్ల దూరంలోని ఊట్ల గ్రామానికి చేరుకున్నారు. ఊట్ల నుంచి ఆటోలో మ్యాదరిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
yours ,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment