Saturday, November 7, 2015




ఆరోగ్య రక్షణకు
For Good Health 


                                                                                                         Date : 07-11-2015. 

 Kindly go through the following to maintain good health (courtesy : namasthetelangaana)

ఆరోగ్య రక్షణకు 'గోధుమ గడ్డి జ్యూస్‌'...

 నిత్యం ఒక గ్లాసు 'గోధుమ గడ్డి జ్యూస్‌'ను తీసుకుంటే ఆరోగ్య పరంగా వచ్చే అధిక శాతం సమస్యలను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎర్రని రక్తంగా మారే ఈ ఆకుపచ్చ జ్యూస్ వల్ల కలిగే లాభాలు మీ కోసం...

1. గోధుమ గడ్డి జ్యూస్‌తో రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా బయట పడవచ్చు. శరీరానికి తగినంత హీమోగ్లోబిన్‌ను ఇది అందిస్తుంది.

2. నిత్యం మనిషి శరీరానికి కావల్సిన క్లోరోఫిల్‌ను ఇది అందజేస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్‌ను తీసుకోవడం వల్ల లభించే క్లోరోఫిల్‌కు చెందిన ప్రత్యేక కణాలను క్లోరో ప్లాసిస్ అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

3. గుండెను సరైన పద్ధతిలో పని చేయించడానికి, రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

4. శరీరంలో ఆల్కలైన్‌లా ఉండే రసాయన చర్యల్లో భాగంగా హైడ్రోజన్ అణువుకు గోధుమ గడ్డి జ్యూస్ సులభంగా కలుస్తుంది.

5. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు బలోపేతమై శక్తివంతంగా పనిచేస్తాయి.

6. విటమన్ ఇ, ఏ, సీలు గోధుమ గడ్డి జ్యూస్‌లో పుష్కలంగా ఉంటాయి.

7. జుట్టు తెల్లబడడం, రాలిపోవడం, నీరసం, చూపు మందగించడం, చర్మ సంబంధ అలర్జీలు, దంతాల బలహీనత వంటి సమస్యలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

'అక్రోట్స్‌'తో మధుమేహం దూరం...

 'మధుమేహం'... ఇప్పుడు ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా భారత్, చైనా, అమెరికా తదితర దేశాల్లో ఈ వ్యాధి బారిన పడ్డవారు, పడుతున్న వారు అధికంగా ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. వంశపారంపర్యం, ఒత్తిడి. కారణాలేవైనా టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. వీటికి ప్రధాన కారణం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడమే. కొంతమందిలో ఇన్సులిన్ సరిగానే ఉత్పత్తి అవుతుంది కానీ వారి శరీరం ఇన్సులిన్ నిరోధకంగా మారుతుంది.

ఒకసారి షుగర్ వ్యాధి బారిన పడితే ఇక దాన్ని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. వేళకు భోజనం తినడం, గ్లూకోజ్ తక్కువగా, పీచు పదార్థాలు అధికంగా ఉండే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వీటన్నింటికీ తోడు నిత్యం కొంత సేపు వ్యాయామం లేదా శారీక శ్రమ తప్పనిసరిగా చేస్తేనే రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించుకుంటూ దాని వల్ల మరిన్ని దుష్ఫలితాలు కలగకుండా చూసుకోవచ్చు.

'అక్రోట్స్‌'తో షుగర్ వ్యాధి నియంత్రణ...
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో అక్రోట్స్‌ను నిత్యం కొంత మోతాదులో తీసుకుంటే వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ఆల్ఫాలినోలినిక్ యాసిడ్, గామా టోకో ఫెరాల్, ఫైటోస్టెరాల్స్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి గుండె శక్తివంతంగా పనిచేసేలా చేయడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయని తెలియజేస్తున్నారు. దీంతోపాటు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు.

రోజుకు 2 అక్రోట్స్‌ను తీసుకున్నా దాంతో అనేక మంచి ఫలితాలు సాధించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. జీడిపప్పును మానేసి, బాదం, పిస్తా వంటి వాటిని మితంగా తీసుకుంటూ, డైట్‌లో అక్రోట్స్‌ను కూడా తీసుకుంటే లాభం కలుగుతుందని అంటున్నారు. మధుమేహం రానివారు కూడా అక్రోట్స్‌ను తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. దాదాపు 1.50 లక్షల మందిపై పరిశోధనలు చేస్తే ఈ విషయం వెల్లడైందని తెలియజేస్తున్నారు.
బరువు తగ్గాలా? అయితే ఇవి పాటించండి...
Published: Sat,November 7, 2015 02:08 PM
how to reduce weight by following simple steps అధిక బరువుతో ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు, వంశ పారంపర్యం ఇలా కారణాలు ఏవైనా అధిక బరువు నేడు సమస్యగా మారింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత నేడు ప్రతి ఒక్కరికీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని నియమాలను పాటిస్తే బరువు తగ్గడం సులభతరమవుతుందని న్యూట్రిషనిస్టులు తెలుపుతున్నారు. వాటి గురించిన వివరాలు...

1. నిత్యం చేసే భోజనానికి వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలి. దీనికి బదులుగా కూరగాయలు, ఆకుకూరల సలాడ్ తీసుకుంటే మంచిది. దీంతో పోషకాలు, విటమిన్లు అధికంగా లభించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

2. హడావిడిగా భోజనం చేయడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని కారణంగా ఎంత తింటున్నామో తెలియదు. సరైన సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. తినేటప్పుడు కేవలం ఆహారంపైనే దృష్టి సారించాలి. దీంతో తిన్నది సరిగా జీర్ణమవుతుంది.

3. చిన్న ప్లేటులో భోజనం చేస్తే మంచిది. దీంతో పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తినేందుకు అవకాశం ఉంటుంది.

4. ఉదయం నిద్ర లేచిన తరువాత గంటలోపే అల్పాహారం తీసుకోవాలి. ఆలస్యంగా టిఫిన్ చేస్తే దానికి, లంచ్‌కు మధ్య సమయం తగ్గుతుంది. దీని ద్వారా కొవ్వు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

5. నిత్యం తీసుకునే ఆహారంలో పాలు, దాని సంబంధిత ఉత్పత్తులను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే కాల్షియం కొవ్వును కొద్ది వరకు తగ్గిస్తుంది.

6. వ్యాయామం చేసిన తరువాత అరగంట నుంచి గంట లోపు భోజనం చేయాలి. దీంతో కొత్తగా చేరే క్యాలరీలు శరీరంలో తొందరగా ఖర్చవుతాయి.

7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మ జాతి పండు సగం తీసుకుంటే బరువు తగ్గుతారు.

8. వారంలో 3 రోజులు గుడ్లు, ఒక రోజు చేపలు తినాలి. ఇది బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
- See more at: http://www.namasthetelangaana.com/health/how-to-reduce-weight-by-following-simple-steps-1-1-460111.html#sthash.AdWPi5Oa.dpuf

బరువు తగ్గాలా? అయితే ఇవి పాటించండి...
అధిక బరువుతో ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు, వంశ పారంపర్యం ఇలా కారణాలు ఏవైనా అధిక బరువు నేడు సమస్యగా మారింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత నేడు ప్రతి ఒక్కరికీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని నియమాలను పాటిస్తే బరువు తగ్గడం సులభతరమవుతుందని న్యూట్రిషనిస్టులు తెలుపుతున్నారు. వాటి గురించిన వివరాలు...

1. నిత్యం చేసే భోజనానికి వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలి. దీనికి బదులుగా కూరగాయలు, ఆకుకూరల సలాడ్ తీసుకుంటే మంచిది. దీంతో పోషకాలు, విటమిన్లు అధికంగా లభించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

2. హడావిడిగా భోజనం చేయడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని కారణంగా ఎంత తింటున్నామో తెలియదు. సరైన సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. తినేటప్పుడు కేవలం ఆహారంపైనే దృష్టి సారించాలి. దీంతో తిన్నది సరిగా జీర్ణమవుతుంది.

3. చిన్న ప్లేటులో భోజనం చేస్తే మంచిది. దీంతో పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తినేందుకు అవకాశం ఉంటుంది.

4. ఉదయం నిద్ర లేచిన తరువాత గంటలోపే అల్పాహారం తీసుకోవాలి. ఆలస్యంగా టిఫిన్ చేస్తే దానికి, లంచ్‌కు మధ్య సమయం తగ్గుతుంది. దీని ద్వారా కొవ్వు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

5. నిత్యం తీసుకునే ఆహారంలో పాలు, దాని సంబంధిత ఉత్పత్తులను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే కాల్షియం కొవ్వును కొద్ది వరకు తగ్గిస్తుంది.

6. వ్యాయామం చేసిన తరువాత అరగంట నుంచి గంట లోపు భోజనం చేయాలి. దీంతో కొత్తగా చేరే క్యాలరీలు శరీరంలో తొందరగా ఖర్చవుతాయి.

7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మ జాతి పండు సగం తీసుకుంటే బరువు తగ్గుతారు.

8. వారంలో 3 రోజులు గుడ్లు, ఒక రోజు చేపలు తినాలి. ఇది బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

చక్కని ఆరోగ్యానికి ఔషధం... 'యాపిల్ సిడర్ వెనిగర్'...

 'సోర్ వైన్‌'గా పిలవబడే 'వెనిగర్‌'ను క్రీస్తుపూర్వం 5000వ సంవత్సరంలో కనుగొన్నారు. పోషకాలను ఇచ్చే ఆహారంగానే కాక, అనేక ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కొంత మంది వైద్యులు దీన్ని 'ఫాదర్ ఆఫ్ మెడిసిన్' అని కూడా అంటారు. సాధారణంగా గృహాల్లో వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ వెనిగర్ కాకుండా 'యాపిల్ సిడర్ వెనిగర్' అనే మరో వెనిగర్ కూడా పోషక పదార్థంగా, ఔషధంగా కూడా ఉపయోగపడుతోంది. అయితే సాధారణ వెనిగర్‌కు, యాపిల్ సిడర్ వెనిగర్‌కు తేడా ఏముంటుంది?

సాధారణ వెనిగర్‌ను ఈథైల్ ఆల్కహాల్ లేదా గ్రెయిన్ ఆల్కహాల్‌తో తయారుచేస్తారు. పులియబెట్టిన యాపిల్ సిడర్ నుంచి యాపిల్ సిడర్ వెనిగర్‌ను తయారు చేస్తారు. ఈ రెండు రకాల వెనిగర్‌లు అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. అయితే సాధారణ వెనిగర్ కంటే యాపిల్ సిడర్ వెనిగర్‌లోనే పోషకాలు ఎక్కువని, యాంటీ గ్లైకీమిక్, యాంటీ ఒబెసిటీ, యాంటీ కార్సినోజెనిక్, ప్రొ-హార్ట్ హెల్త్ ఏజెంట్‌గా యాపిల్ సిడర్ వెనిగర్ పనిచేయడంతోపాటు యాంటీ బాక్టీరియల్ ధర్మాలను ఇది కలిగి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

పురాతన కాలంలో వైద్యులు యాపిల్ సిడర్ వెనిగర్‌ను గాయాలు కడిగేందుకు ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం దీన్ని ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు సహజ సిద్ధమైన ప్రిజర్వేటివ్‌గా ఉపయోగిస్తున్నారు. దీన్ని నిత్యం వాడడం వల్ల ఇంకా ఏమేం ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. అనేక రకాల పోషక పదార్థాలకు నిలయం యాపిల్ సిడర్ వెనిగర్. సిట్రిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సక్సీనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ వంటివి ఇందులో ఉంటాయి. యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వంటి ఇతర పోషకాలన్నీ దాదాపుగా ఇందులో ఉంటాయి.

2. యాపిల్ సిడర్ వెనిగర్‌ను తీసుకోవడం వల్ల గుండె మంచి కండిషన్‌లో ఆరోగ్యవంతంగా ఉంటుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలోని ట్రైగ్లిజరిడ్స్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ వంటి చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ పెరిగేందుకు దోహదపడుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

3. రక్తంలోని చక్కెర స్థాయిలను యాపిల్ సిడర్ వెనిగర్ గణనీయంగా తగ్గిస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే శాతాన్ని, ఇన్సులిన్ యాక్టివిటీని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్‌ను సేవిస్తే ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ సిడర్ వెనిగర్‌ను తరచూ తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

4. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. యాపిల్ సిడర్ వెనిగర్‌ను తీసుకున్న తరువాత ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. తద్వారా శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు వెళ్లకుండా చేస్తుంది.

5. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో అసాధారణ రీతిలో కణాలు పెరగకుండా నిరోధించడంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో ఏర్పడే ట్యూమర్ల సైజ్‌ను ఇది తగ్గిస్తుంది.

6. హానికరమైన బాక్టీరియాను నిర్మూలించడంతోపాటు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. వెంట్రుకలకు సహజసిద్ధమైన కండిషనర్‌గా, దంతాలను శుభ్రం చేసే ద్రావకంగానూ పనిచేస్తుంది. ఆహార పదార్థాలకు డ్రెస్సింగ్ చేయడంలో, మారినేడ్స్, సాసెస్, గ్రేవీస్, పికిల్స్ తయారీలో దీన్ని వాడుతారు. యాపిల్స్ నుంచి తయారైనప్పటికీ ఇందులో దానికి సంబంధించిన రుచి తక్కువగానే ఉంటుంది. సాధారణ వెనిగర్‌కు ఉండే వాసన దీనికి తక్కువగా ఉంటుంది.


                                                                                                                      yours ,
                                                                                            www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment