ప్రజాభిమానం
Public affection
Date : 24-11-2015
Public affection
Date : 24-11-2015
|
||||||||
|
టీఆర్ఎస్ మెజార్టీ 4,59,092
ఇది అందరు ఊహించినదె , కాని ఇంత మెజారిటి వస్తుందనుకోలేదు . దేశం లో ఎక్కువ మెజారిటి తో గెలిచిన 7 వ అభ్యర్థిగా పసునూరి నిలబడ్డారు.
వరంగల్ ప్రజలు అపూరూపమైన తీర్పు ఇచ్చి తమ టీఆర్‌ఎస్ పార్టీని దీవించారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా బాగా పనిచేస్తామన్నారు. తమ ప్రభుత్వం చేస్తోన్నసంక్షేమకార్యక్రమాలే విజయపథాన నడిపిస్తున్నాయన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలే తమను విజయబాటలో నడిపించాయన్నారు.
ఇన్ని మంచి పనులు చేస్తుంటే గెలిపించక ఏం చేస్తారు , చాలా రోజుల తరువాత మంచి ప్రభుత్వం వచ్చినందులకు ప్రజలు సంతోషం గా ఉన్నారు . గత ఉమ్మడి ప్రభుత్వాలు తెలంగాణా ను అసలు పట్టించుకోలేదు . తెలంగాణా మొదటి ఉద్యమం 1969 లో జరిగిన తరువాత కూడా గత ఉమ్మడి ప్రభుత్వాల కు తెలసిరాలేదు .తెలంగాణా కు ఇంకా అన్యాయం చేశారు
ఆంధ్రా పాలకులు చేసిన అన్యాయాలు తెలంగాణలో ఇంకా సమసిపోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్ పై అని తెలిపారు. ఇవన్నీ ఆంధ్రా పాలకుల హయాంలో జరిగాయని ఈ అన్యాయాలను సరిచేసేందుకు తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు.
ఈనాడు ప్రతిపక్షాలు పెద్దగా తెలంగాణా గురించి ఎన్నికల్లో మాట్లాడారు. మరి అధికారం లో ఉన్నప్పుడు ఏం చేశాయి ?
అప్పుడు తెలంగాణా అని కూడా అననివ్వని వాడు ఒకడు , హరీష్ రావు గారు తెలంగాణా కు నిధులు కేటాయించమని అసెంబ్లీలో అడిగితే ఒక పిచ్చివాడు తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చెసుకుంటావ్ అన్నప్పుడు ఒక్కరు కూడా నోరు విప్పలేదు. అందుకే ప్రజలు ఈనాడు ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు.
కేంద్రం కూడా తెలంగాణా కు అన్యాయం చేస్తుంది . ఆంధ్రా కు 1,93,000 ఇళ్ళను కేటాయిస్తే మనకు 10,000 ఇళ్ళను మాత్రమే కేటాయిస్తుందా ?
హైదరాబాద్ కు ఉమ్మడి రాష్ట్రం లో 3. 9 T M C ల త్రాగునీరు కేటాయించి అమరావతికి 30 T M C ల త్రాగునీరు కావాలని ఎలా అడుగుతారు ? ఏమైనా న్యాయం ఉందా ?
కేసీఆర్ గారు కొత్త రాష్ర్టానికి కావాల్సిన వాటిని అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మాకు తెలంగాణ రాష్ర్టానికి కొత్త పునాదిరాయి వేయమని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గొంతులో ప్రాణం ఉండగా తప్పుచేయమని వాగ్దానం చేశారు.
తెలంగాణలో కరువు శాశ్వతంగా దూరం కావాలని అన్నారు. ఏపీ సీఎంలు తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు నిజమైనవి కావని తెలిపారు. కేవలం కాగితాల మీద ఇచ్చిన ప్రాజెక్టులు మాత్రమేనని వివరించారు. ఆనాడు వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. పొరుగు రాష్ర్టాలు అభ్యంతరం తెలుపుతాయని తెలిసి కూడా వీటిని చేపట్టారని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతదని తెలిసి కూడా ఈ ప్రాజెక్టును చేపట్టారని వివరించారు.
నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాలువలు కూడా తవ్వారని వాటిలో పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ఆరోపణలు మాని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు.
ప్రతిపక్షాలకు ఉప ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలి కానీ కాంగ్రెస్‌కు 7 శాతం ఓట్లు తగ్గాయని వివరించారు. మొన్నటి ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు లక్షా 50 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. బీహార్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులందరూ ఢిల్లీ లో ఉన్నా AAP పార్టి తన చీపురు కట్ట తో అధికార పార్టిని ఊడ్చి పడేసింది.
మన ప్రధాన మంత్రి గారు విదేశాల్లో పర్యటిస్తూ మనం టియర్ గ్యాస్ షెల్ లు కూడా విదేశాలనుండి తెప్పించు కుంటున్నామని గత ప్రభుత్వాలను విమర్శించారు . ఇంతకు ముందు NDA కూడా ప్రభుత్వం చేసింది కదా మరి అప్పుడు గుర్తుకు రాలేదా ? కాని ఈనాడు ఉల్లి గడ్డ లను విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం లేదా?
గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మంది వదులు కున్నారని చెబుతున్నారు , ఈ గ్యాస్ సబ్సిడీ ప్రభుత్వానికి బరువు అయినదా ? మరి కార్పోరేట్ వారికి ఇస్తున్న కోట్ల రూపాయల సబ్సిడీ బరువుగా లేదా ? అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం ధర తగ్గినా ఇక్కడ పెట్రోల్, డీజెల్ మరియు గ్యాస్ ధరలు ఎందుకు తగ్గటం లేదు ? వీటి ధరలు తాగిస్తే ఎవ్వరు గ్యాస్ సబ్సిడీ అడగరు కదా !
ఈ గెలుపుతో మరింత బాధ్యతాయుతంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రియతమ కే సి ఆర్ గారే స్వయంగా తెలిపారు,చాలా సంతోషం .
ప్రతీ మండలంలో రైతులు ధాన్యం నిలువ చేసుకోవడానికి గోడౌన్లు కట్టిస్తున్నామని వెల్లడించారు.
కోసిన పంటను కూడా రక్షించు కోవడానికి పొలాలలో కూడా కొన్ని షెడ్లు నిర్మిస్తే అకాల వర్షం నుండి పంటను రక్షించు కోవచ్చు ,కే సి ఆర్ గారు దీనిపై కూడా దృష్టి సారించాలని కోరుకుందాం . గతంలో సన్నబియ్యం ఆలోచన ఎవరికీ రాలేదని తమ ప్రభుత్వం పేద విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం అందజేస్తోందని వివరించారు.
ఇంకా చాల చాల మంచి పనులు ప్రియతమ కే సి ఆర్ గారు చేయాలని ఆశిస్దాం ! ప్రతి పక్షాలు కూడా మంచి పనులకు సహకరించాలని కూడా కోరుకుందాం .
yours .
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment